ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చిత్ర వధభారతీయ చలన చిత్ర రంగానికి 80 ఏళ్ళు నిండాయి. తెలుగు సినిమా ఎటో వెళ్ళిపోతోంది అని కొందరు పెద్దోళ్ళు చాదస్తం పోతున్నారు. ఇది వరకు లా ఫ్యామిలీ సినిమాలు రావట్లేదని బాధ పడి పోతున్నారు. పండంటి సంసారం,బంగారు కుటుంబం, మంచి కుటుంబం లాంటి సంసార పక్షం సినిమాలు పోయి...ప్రేమించుకుందాం రా..కలిసుందాం రా,పెళ్ళిచేసుకుందాం రా,లేచిపోదాం రా ని దాటి...పోకిరి,ఇడియట్,స్టుపిడ్,
రాస్కెల్,ఆవార,దీవానా లాంటి అన్ని భాషల తిట్లు స్థాయికి వచ్చేసారని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు..కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. "చిత్రం " గా చదువు కు ప్రేమ,కాపురం,కడుపు అడ్డుకావనే సందేశాత్మక చిత్రాలు, భార్యని చంపడం ఎలా లాంటి ఆలోచనాత్మక సినిమాలు, బ్యాంకు దొంగతనాలు, దేవుడి నగలు ఎలా కాజేయ్యచ్చో తెలియ జెప్పే ఎడ్యుకేటి సినిమాలు, హీరో హీరోయిన్   మూడు గుద్దులు  ఆరు ముద్దులు " గా చూపించే చిత్రాలతో.. కాపీ కొట్టడమే కాపీ రైట్ అన్నంత హాయిగా స్వంత ఆలోచనల సినిమాలు, అబ్బో అరువు కధలు, దరువు మ్యూజిక్కులు,బరువు (అందాల )హీరోయిన్ లు, కరువు డ్రస్సులు,  తో మన తెలుగు సినిమా వెలిగిపోతోంటే గుడ్ల గుడ్లగూబల్లా వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటున్నారు.

ఇక ఫ్యామిలీ సినిమాలు రావట్లేదని ఏడ్చే వాళ్ళకి కనువిప్పు కలిగించే విషయమేమిటంటే ఇది వరకటి కన్నా ఇప్పుడే ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి... ఎంటీయార్ ఫ్యామిలీ, ఏ ఎన్ ఆర్ ఫ్యామిలీ, కృష్ణ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, అల్లూ ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ, చాలా ఇంకా కావాలా !


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!