Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, జూన్ 17, 2011

దేవుళ్ళని కాపాడే హీరోలు

దేవుళ్ళని కాపాడే హీరోలు

ఈ మధ్య అన్నీ దేవుళ్లని కాపాడే హీరోలో సినిమాలొస్తున్నాఇ. మొన్నటి దాకా వాళ్ళే దేవుళ్లు గా కనిపించిన హీరోలు ఒక అడుగు ముందుకేసి..దేవుళ్లనీ కాపాడేస్తున్నారు..కానీ ప్రేక్షక దేవుళ్ళని కాపాడే వాళ్లే కనిపించట్లా.

ఇంద్ర,సమర సిమ్హా రెడ్డి,లాంటి సినిమాల్లో హీరోలు..వాళ్ళ ప్రజలకోసం త్యాగం చేసి కాఫీ కప్పులు కడగడానికో టాక్సీ లు నడుపుకోవడానికో వెళ్ళి రాజు వయ్యా మహరాజు వయ్యా అనిపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా అష్టాదశ శక్తి పీఠాలని..బద్రీనాధ్ లాంటి పుణ్య క్షేత్రాలని కాపాడ్డానికి తయారైపోయారు..మొన్నా మధ్య వచ్చిన ఖలేజాలో కూడా ఆల్ మోస్ట్ దేవుడి గానే అవతరించినంత పని చేసాడు మన మహేష్ బాబు.

22 సంవత్సరాల క్రితం గుర్రాలమీద బయలుదేరి ఈజిప్టు నించి వచ్చిన విలన్ హీరో చేతిలో చచ్చిపోతే..అఫ్ కోర్స్ హీరో కూడా చచ్చిపోతాడు ...ఇక్కడ చచ్చిపోయిన వాడి కళ్లు పెట్టుకున్న విలన్ కొడుకు...హీరో కొడుకుని చంపడానికి వచ్చి చచ్చిపోతాడు.. 18 స్థంభాలలో ఉన్న శక్తి పీఠం శక్తులని కాపాడే హీరోచిత విన్యాసాలని చూసి మనకి మతి పోవడం ఖాయం...ఇక బద్రీనాధుణ్ణి కాపాడడానికి ఒక యోధుడు వచాడు. మగధీరలో రాజ్యాన్ని కాపాడడానికి వెళ్ళి ప్రాణం కోల్పోయాడు కానీ అక్కడ కూడా ఏ దేవుణ్ణో పెట్టలేదు మన అదృష్టం కొద్దీ..

దేశం ముందుకెళ్తుంటే సినిమా వెనక్కి వెళ్తున్నట్టుంది .... మళ్లీ పాత ఫాషన్లు.. పాత కధలు..పాత పాటలు ( రీ మిక్స్)..పాత టైటిల్సు.. (టాగ్ లైన్ ఫ్రీ) ... కానీ పాత విలువలు..వలువలు లేవు అంతే..
సూమోలు గాల్లోకి ఎగరడం..మీసం మెలేస్తే రైళ్ళు ఆగిపోవడం నుంచి గుర్రాల ఫైట్లు..కత్తి యుద్ధాలు. వైపు వెళ్తున్నారు..సినీ జనాలు..



ఫన్ కౌంటర్




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

1 కామెంట్‌:

dronamraju చెప్పారు...

బద్రినాథ్ లో మరో విడ్డూరం ఏమిటంటే ఉగ్రవాదులు ఏ.కే.47 గట్రా వాడి హీరోని చంపజూస్తే హీరో ఏమో తాపీగ్గా ఓ పెద్ద కత్తి తో బుల్లెట్స్ ని కట్ చేస్తూ ఉంటాదు కానీ చావడు. తమిళ్ నాడు రజినీకాంత్ నే మించి జిమ్మిక్కులు మన హీరోలు చేస్తున్నారు.

LinkWithin

Related Posts with Thumbnails