Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, ఏప్రిల్ 04, 2011

శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో రాజకీయ రాశి ఫలాలు..2011..

 శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో రాజకీయ రాశి ఫలాలు..2011..


కాంగ్రెస్ రాశి వారు...
ఆదాయం వేల కోట్లు...వ్యయం వందలు
రాజ పూజ్యం జనపధం అవమానం జన సభ
హామీలు బోలెడు అమలు చిప్పెడు

అధిష్టాన దేవత సోనియా ని నమ్ముకుని..బతికేస్తారు. రాహుల్ జపం కైసి వస్తుంది...సోనియా గుడి చుట్టూ ప్రదిక్షణలు..గులాం నబీకి దక్షిణలు..రాజీవ్ బాటలెంబడి పాద యాత్రలు కూడా లాభిస్తాయి. కొత్తగా వచ్చి చేరిన చిరు గ్రహం ప్రారాపా అంతర్దశలో మార్పులుండవచ్చు..ముఖ్య పదవిలో ఉన్న వారికి చికాకులు..పదవి పనిష్మెంటు గా అనిపించవచ్చు..తెలుగుశం  రాశి వారు

ఆదాయం      హెరిటేజ్ గా వచ్చిన అధికారం+హెరిటేజ్ కంపెనీ  వ్యయం : తమ్ముళ్ళ మధ్య లుకలుకలు..అలకలు
రాజ పూజ్యం  గతం        అవమానం వర్తమానం
ఆశలు         అధికారం    నిజం అనుమానం

తెలుగుదేశాధినేత కి గత 7,8 ఏళ్ళుగా అంతగా కలిసి రావట్లేదు. అందునా ఇప్పుడు నాగం చూపు ఏడో ఇంట  ఉన్న టీ ఆర్ ఏస్ వైపు చూస్తుండడం.. ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రులనే కాకుండా.... తెలంగాణా దేవతలని కూడా కొలిస్తే ఫలితముంటుంది.మూడో ఇంట ఉన్న బావ బాలకృష్ణ ...ఎంటీ ఆర్ కలిసి శుభ దృష్టి తో చూడడం వల్ల లాభమే ఐనా..ఆ గ్రహాల్ ఉప గ్రహాలైన అభిమానుల ప్రభావాలు మాత్రం శూన్యం


తెలంగాణా రాష్ట్ర సమితి రాశి వారు

ఆదాయం తెలంగాణా సెంటిమెంటు  
వ్యయం సోనియా అపాయింటుమెంటు
రాజ పూజ్యం  సొంత చానెలు
అవమానం సొంత జనాలు
ఆశ     ప్రత్యేక రాష్ట్రం
నిజం   కేంద్రం పెత్తనం

జే ఏ సీ అధిక ప్రభావం చూపడం  వల్ల పాక్షికంగా బలహీన పడే అవకాశం. విద్యార్ధి గ్రహాలు కలిసిరావటం పై భవిష్యత్తు ఆధారం..సోనియాని కాకుండా...సొంత బలాన్ని నమ్ముకోవడం ఉత్తమం..అనుకోని అభాండాలు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం....ప్రజా రాజ్యం
ఆదాయం : ఎన్నికల సమయం వ్యయం  అభిమానుల ఆశలు
రాజ పూజ్యం : సినిమా తెర అవమానం ఎన్నికల వేళ
ఆశ  ప్రజా జీవితం లో మార్పు నిజం విలీనం కూర్పు

ప్రారాపా మహాదశ ఐపోయి..అంతర్దశగా మారడం వల్ల..కాంగ్రెస్ రాశి ఫలాలే వర్తిస్తాయి..అన్నీ ఉన్నా అల్లు"డి"నోట్లో.....అన్నట్టు...ఇన్నాళ్ళు సంపాదించిన కీర్తి మొత్తం..హారతి కర్పూరం. దశమ గ్రహం వల్ల కూడా చికాకులు.. ఆరెంజ్ రంగు అచ్చిరాదు..తెలంగాణా దేవతల శాపం వల్ల మరిన్ని ఇబ్బందులు..అంతర్దశలో ఉండడం వల్ల పెద్దగా ప్రాధాన్యతలుండవు..మునపటి జీవితం పైకి మనసు లాగుతున్నా..వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి..

వై ఎస్ ఆర్ పార్టీ

ఆదాయం అంతేలేదు వ్యయం  పొంతనలేదు
రాజపూజ్యం సొంత మీడియా అవమానం సొంత బాబాయా.
ఆశ ముఖ్యమంత్రి పోస్ట్ నిజం ప్యారడైజు లాస్టు

గ్రహ మైత్రి కన్నా గృహమైత్రి విషయంలో కొన్ని చికాకులు..సొంతింటిలోనే వైరాలు.. చుట్టూ ఉన్న భజన పరుల వల్ల అసలు నిజం గ్రహించలేరు...వ్యయం పెరిగే అవకాశాలు ఎక్కువ..పెట్టుబడుల ఉపసమ్హరణ..లాంటివి జరిగే అవకాశం..ముఖ్య గ్రహం దూరం అవడం వల్ల..ఉప గ్రహాల ప్రభావం ఎక్కువ

భారతీయ జనతా రాశి వారు

ఆదాయం ఖతం వ్యయం నిత్యం
రాజపూజ్యం గతం అవమానం పత్యం
ఆశ ప్రభుత్వ నిర్వహణ ఆశయం రామాలయ స్థాపన

కమ్యునిస్టు రాశి వారు

ఆదాయం ప్రజల పాట్లు వ్యయం ప్రజా ఆందోళణలు
రాజపూజ్యం కలకత్తా అవమానం మాకేం కొత్తా
ఆశ ప్రజా ప్రభుత్వం నిజం మద్దతులు పొత్తులు

శ్రీ ఖరం శ్రీకరం..శుభకరం కావాలని
ఉగాది శుభాకాంక్షలతోనచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

2 వ్యాఖ్యలు:

Naveen చెప్పారు...

Chaala baavundi phani garu..

Sudha చెప్పారు...

super... chala baundi... praasa toh koodina raasi phalaalu. evari phalitaalelaa unnaa... janaalaki maatram, abhivruddhi... andani phalaale

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa