Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, ఏప్రిల్ 15, 2011

మూడు దెబ్బలు - తీన్ మార్

మూడు దెబ్బలు - తీన్ మార్

మార్చిలో ఇన్ కం టాక్స్ దెబ్బ నుంచి కోలుకోక ముందే ..ఏప్రిల్ సగం కూడా కాకుండానే వడ దెబ్బ కొడుతోంది..నిన్న మూడో దెబ్బ తగిలింది..తీన్ మార్. ఇవ్వాల్ రేప్ ప్రేమల్ అంటే లవ్ ఆజ్ కల్ అనే సినిమాని యధా తధం గా రీ 'మేకూ చేసి మన తల మీద కొట్టారు. ఎలాగూ కధ కొనేశారు కదా..ఆ తీసేదేదో మన తెలుగు పల్లెలో పెట్టకుండా..కాశీయో..ప్రయాగో ఏదో నార్త్ సైడు ఊరు..అందులో తెలుగు హీరో,,,అతని తెలుగు ఫ్రెండ్సు..తెలుగు హీరోయిను..ఖర్మ కాకపోతే..

లవ్ సినిమాలు చెయ్యాలా, యాక్షన్ సినిమాలు చెయ్యాలా, క్యామిడీ సినిమాలు చెయ్యాలా అన్న కంఫ్యూజన్ లో 3 కలిపి కొట్టే ప్రయత్నం లా ఉంది..యవ్వారం. ముకేష్ రుషి, సోనూ సూద్ లాంటి వాళ్ళని పెట్టి కూడా ఫైట్లు లేవు వాళ్ళతో..త్రివిక్రం ఉన్నా డైలాగు చెప్పడానికి అసలు చాన్సుంటే కదా.. ముద్దులు ...కౌగిలింతలు..తోనే సరిపోయింది.. అసలు ఏరకమైన మెసేజ్ ఇద్దామనుకున్నారో అర్ధం కాలేదు..అవునులే సినిమాలో మసాజులు తప్ప మెసేజులు ఆశించడం అత్యాశే..స్కర్టుకి తక్కువ బికినీకెక్కువ లాంటి డ్రెస్సులేసి..పాపం హీరోయిన్ కూడా మూతి ముద్దులతో చాలా నే కష్టపడ్డది. బహుళ ప్రయోగాత్మకమైన ఈ సినిమాని నేను తట్టుకోలేక పోయాను..మరి మిగతా వారి పరిస్థితి ఏమిటో.. మరి.. జై పరాంజీ... The Remaking King 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, ఏప్రిల్ 04, 2011

శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో రాజకీయ రాశి ఫలాలు..2011..

 శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో రాజకీయ రాశి ఫలాలు..2011..


కాంగ్రెస్ రాశి వారు...
ఆదాయం వేల కోట్లు...వ్యయం వందలు
రాజ పూజ్యం జనపధం అవమానం జన సభ
హామీలు బోలెడు అమలు చిప్పెడు

అధిష్టాన దేవత సోనియా ని నమ్ముకుని..బతికేస్తారు. రాహుల్ జపం కైసి వస్తుంది...సోనియా గుడి చుట్టూ ప్రదిక్షణలు..గులాం నబీకి దక్షిణలు..రాజీవ్ బాటలెంబడి పాద యాత్రలు కూడా లాభిస్తాయి. కొత్తగా వచ్చి చేరిన చిరు గ్రహం ప్రారాపా అంతర్దశలో మార్పులుండవచ్చు..ముఖ్య పదవిలో ఉన్న వారికి చికాకులు..పదవి పనిష్మెంటు గా అనిపించవచ్చు..



తెలుగుశం  రాశి వారు

ఆదాయం      హెరిటేజ్ గా వచ్చిన అధికారం+హెరిటేజ్ కంపెనీ  వ్యయం : తమ్ముళ్ళ మధ్య లుకలుకలు..అలకలు
రాజ పూజ్యం  గతం        అవమానం వర్తమానం
ఆశలు         అధికారం    నిజం అనుమానం

తెలుగుదేశాధినేత కి గత 7,8 ఏళ్ళుగా అంతగా కలిసి రావట్లేదు. అందునా ఇప్పుడు నాగం చూపు ఏడో ఇంట  ఉన్న టీ ఆర్ ఏస్ వైపు చూస్తుండడం.. ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రులనే కాకుండా.... తెలంగాణా దేవతలని కూడా కొలిస్తే ఫలితముంటుంది.మూడో ఇంట ఉన్న బావ బాలకృష్ణ ...ఎంటీ ఆర్ కలిసి శుభ దృష్టి తో చూడడం వల్ల లాభమే ఐనా..ఆ గ్రహాల్ ఉప గ్రహాలైన అభిమానుల ప్రభావాలు మాత్రం శూన్యం


తెలంగాణా రాష్ట్ర సమితి రాశి వారు

ఆదాయం తెలంగాణా సెంటిమెంటు  
వ్యయం సోనియా అపాయింటుమెంటు
రాజ పూజ్యం  సొంత చానెలు
అవమానం సొంత జనాలు
ఆశ     ప్రత్యేక రాష్ట్రం
నిజం   కేంద్రం పెత్తనం

జే ఏ సీ అధిక ప్రభావం చూపడం  వల్ల పాక్షికంగా బలహీన పడే అవకాశం. విద్యార్ధి గ్రహాలు కలిసిరావటం పై భవిష్యత్తు ఆధారం..సోనియాని కాకుండా...సొంత బలాన్ని నమ్ముకోవడం ఉత్తమం..అనుకోని అభాండాలు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం....



ప్రజా రాజ్యం
ఆదాయం : ఎన్నికల సమయం వ్యయం  అభిమానుల ఆశలు
రాజ పూజ్యం : సినిమా తెర అవమానం ఎన్నికల వేళ
ఆశ  ప్రజా జీవితం లో మార్పు నిజం విలీనం కూర్పు

ప్రారాపా మహాదశ ఐపోయి..అంతర్దశగా మారడం వల్ల..కాంగ్రెస్ రాశి ఫలాలే వర్తిస్తాయి..అన్నీ ఉన్నా అల్లు"డి"నోట్లో.....అన్నట్టు...ఇన్నాళ్ళు సంపాదించిన కీర్తి మొత్తం..హారతి కర్పూరం. దశమ గ్రహం వల్ల కూడా చికాకులు.. ఆరెంజ్ రంగు అచ్చిరాదు..తెలంగాణా దేవతల శాపం వల్ల మరిన్ని ఇబ్బందులు..అంతర్దశలో ఉండడం వల్ల పెద్దగా ప్రాధాన్యతలుండవు..మునపటి జీవితం పైకి మనసు లాగుతున్నా..వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి..

వై ఎస్ ఆర్ పార్టీ

ఆదాయం అంతేలేదు వ్యయం  పొంతనలేదు
రాజపూజ్యం సొంత మీడియా అవమానం సొంత బాబాయా.
ఆశ ముఖ్యమంత్రి పోస్ట్ నిజం ప్యారడైజు లాస్టు

గ్రహ మైత్రి కన్నా గృహమైత్రి విషయంలో కొన్ని చికాకులు..సొంతింటిలోనే వైరాలు.. చుట్టూ ఉన్న భజన పరుల వల్ల అసలు నిజం గ్రహించలేరు...వ్యయం పెరిగే అవకాశాలు ఎక్కువ..పెట్టుబడుల ఉపసమ్హరణ..లాంటివి జరిగే అవకాశం..ముఖ్య గ్రహం దూరం అవడం వల్ల..ఉప గ్రహాల ప్రభావం ఎక్కువ

భారతీయ జనతా రాశి వారు

ఆదాయం ఖతం వ్యయం నిత్యం
రాజపూజ్యం గతం అవమానం పత్యం
ఆశ ప్రభుత్వ నిర్వహణ ఆశయం రామాలయ స్థాపన

కమ్యునిస్టు రాశి వారు

ఆదాయం ప్రజల పాట్లు వ్యయం ప్రజా ఆందోళణలు
రాజపూజ్యం కలకత్తా అవమానం మాకేం కొత్తా
ఆశ ప్రజా ప్రభుత్వం నిజం మద్దతులు పొత్తులు

శ్రీ ఖరం శ్రీకరం..శుభకరం కావాలని
ఉగాది శుభాకాంక్షలతో







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, ఏప్రిల్ 02, 2011

శక్తి.

 పాటలని రి మిక్స్ చేస్తారని తెలుసు గాని...
సినిమాని కూడా రిమిక్స్ చెయ్యొచ్చని నిరూపించాడు మెహెర్ రమేష్.. పేరు శక్తి...నిజంగా సూటబుల్.తీసే నిర్మాత కి శక్తి కావాలి..ఫ్లాపు తట్టుకునే శక్తి హీరో కి ఉండాలి...చూసే జనాలకి శక్తి కావాలి..ఎన్ టీ ఆర్ వీరాభిమానిని నాకే..విసుగొచ్చింది..ఇందులో యాభైకోట్ల విషయం ఏముందా అని..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails