Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, సెప్టెంబర్ 11, 2010

'గన్'పతి

'గన్'పతి

వినాయక చవితి శుభాకాంక్షలతో


'గన్'పతిఅది కైలాసం....శివుడి మెళ్ళో పాము ఆకలిగా ఉండి ప్రసాదం కోసం చూస్తోంది..ఈలోగా వచ్చిన వినాయకుడి ఎలుక...ఏం మామా భోజనం అయిందా అంటూ పలకరించింది...ఇంకా లేదు...స్వామి తిన్నాకే నాకు..ఆయనకి భోజనం అదీ అక్కర్లేదు...నీ భోజనం అయిందా అంది...దానికి ఎలుక మా స్వామి దగ్గర ఆ ప్రాబ్లం లేదు..ఆయన కి ఆహారం ఇష్టం. అందుకే నాకు ఫుడ్డు కి కొదవ లేదు...అదిగో మాటల్లోనే మా స్వామి వస్తున్నాడు అంది వినాయకుడు రావడం చూసి,,,,,
వినాయకుడు వస్తూనే..తల్లికి, తండ్రికి నమస్కరించి..అమ్మా వినాయక చవితి వస్తోంది..నేను అలా భూలోకం వెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తానమ్మా..అన్నాడు..దానికి పతి సేవలో ఉన్న ఆ పార్వతి ఉలిక్కి పడి..నాయనా వినాయకా..ప్రతి సంవత్సరం వెళ్తూనే వున్నావు కద నాయనా..ఈసారికి వద్దులే...నీ పుట్టిన రోజు ఇక్కడే కైలాసంలో జరుపుకుందాం..నువ్వు ఎక్కడికీ వెళ్ళకు అని కంటనీరు పెట్టుకుంది...
దానికి పశుపతి ..అదేమి పార్వతీ అలా అంటావు...విఘ్నేశ్వరుడు ప్రతి సంవత్సరమూ..తన జన్మదినము భూలోకమునే కదా జరుపుకుంటాడు...మరి ఈ సారి వద్దనెదవేమి.? మరీ అంత దిగులుగా ఉంటే మనమూ వెళ్ళివద్దాం...అన్నాడు శివుడు....
తల్లి ప్రేమ మీకేమి అర్ధం అవుతుంది లేండి...నా కుమారుడు ఏమన్నా రాక్షసులతో యుద్ధానికి వెళతానన్నాడా..లేక తపస్సుకు వెళతానన్నాడు... వెంటనే పంపడానికి..వెళ్ళేది భూలోకానికి..అందుకే నా దిగులు...అంది పార్వతి...
అదేమి పార్వతీ అంత మాట అంటివి..భూలోకమున అందరూ మన భక్తులేగా...పైగా ప్రతి సంవత్సరం మన కుమారుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఊరూరా.... వాడ వాడల జరుపుకుంటారు కూడాను...తిరుపతి లడ్డు వలే మన కుమారుడు ధరించిన లడ్డుకు వేలం పెట్టి - వెల కట్టి మరీ వైభోగాలు జరుపుతారు....
ఏమి చెప్పను స్వామీ..మనవాడి పుట్టిన రోజు జరుపుతామని బలవంతంగా డబ్బులు లాగుతారు కొందరు...ఆ డబ్బుతో అడ్డమైన పనులూ చేస్తారు...కొందరైతే పందిరి వేసి మన కుమారుడి విగ్రహం పెట్టి పూజలు చేసి...అక్కడే సాం'స్క్రుతక' కార్యక్రమాలు జరుపుతారు...అవి ఎంత క్రుతకంగా ఉంటాయో..మనకి అంతుపట్టదు....'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' లు పోయి... అ అంటే అమలా పురం..ఆ అంటే ఆహా పురం అని, ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అర్ధం లేని పాటలు..అర్ధనగ్నపు ఆటలు ఆడతారు,,,,ఇవే కాక రాత్రి కాపలా అని చేసే కార్యకలాపాల చిట్టా నేను చెప్పలేను...చతుర్ముఖ పారాయణం..తీర్ధం....ప్రసాదం పేరుతో పేకాట..మందు..ఇంకా సర్వ పాపాలకూ ఒడిగడతారు...నిజంగా నిష్టగా చేసేవారూ లేకపోలేదు..కానీ ఇలాంటి వారు చేసే పాపం మన వాడికి తగులుతుందేమోనని నా భయం..
దేవీ మానవులు చేసే పాప పుణ్యాలకు - మనకు సంబంధం లేదు...వారి పాపం వారికే తగులుతుంది..నువ్వు భయపడనవసరంలేదు..అని వూరడించాడు పరమేశ్వరుడు...
స్వామీ నా అసలు భయం అది కాదు..స్వామీ....భూలోకమున తీవ్రవాదుల భయం ఎక్కువ అయింది...ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు...అహార స్థలాలు..విహార స్థలాలు ..అని లేకుండా ఎక్కడపడితే అక్కడ బాంబులు పేలుస్తున్నారు..అంతే కాదు ప్రతిసారి విగ్రహ నిమజ్జనం లో ఏదో జరుగుతుందని వినడం రివాజుగా మారింది....ఆ హుస్సేను సాగరంలో నీరు ఇప్పటికే విషతుల్యం అయింది....ఇలా చాలా భయాలున్నాయి స్వామీ...అంది పార్వతి
పార్వతీ ఎందుకు నీకు భయము?...ఆ తీవ్ర వాదులు పూర్వ జన్మలో రావణ..దుర్యోధనాది రాక్షసుల బంటులు..వారి వారి కర్మ ననుసరించి ఇలా జన్మించి పూర్వ జన్మ వాసనల వల్ల 'కలి' ప్రేరేపితులై అలా ప్రవర్తించుచున్నారు...వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి పాపం 'వారిని' కూడా బాంబు రూపమునో, ఎన్ కౌంటర్ రూపమునో వారిని దహించివేస్తుంది..ఇక మన కుమారుడి విషయం అంటావా..అతను పుట్టుకతోనే మ్రుత్యుంజయుడు..నా చేతిలో మరణించి..తిరిగి జన్మ పొందినవాడు...అంతే కాదు చంద్రుడి ద్రుష్టి తగిలి ఉదరం పగిలినా తిరిగి మామూలుగా అయిన మన బిడ్డడు...మూషికాసురుడిని ఒక దంతంతో అణిచి వాహనం చేసుకున్నవాడు...గణాధిపత్యం వహిస్తూ విఘ్నాలకు నాయకుడైనవాడు..అట్టి కుమారుడి గూర్చి ఎట్టి చింతా వలదు..
స్వామీ నా భయము మన కుమారుడి గూర్చి కాదు స్వామి! వినాయకుడి పూజ కోసం తాపత్రయ పడే భక్త జనం గూర్చి...కుమారుడి పట్ల భక్తి పారవస్యం లో, ఆ తీవ్రవాదుల పన్నిన కుట్రకు గురి అవుదురేమో అని నా భయం స్వామీ....అమాయకులైన ఆ ప్రజలు మన వల్ల ఇక్కట్లకు గురికాకూడదు అని నా అభిప్రాయం ప్రభూ..
ఆహా దేవీ నిజం గా .'జగజ్జనని' అనిపించావు...ముల్లోకాలకూ తల్లివైనందుకు నీ పిల్లల గురించిన బాధ్యతకు ముగ్ధుడినైనాను..ఇంత కాలం రాక్షసులు మాత్రమే శత్రువులు అనుకున్నాను......ఇప్పుడు అర్ధమైనది...అసలు పాపాత్ములెవరో...వారి భరతం పట్టుటకు మన పుత్రునికి ఇదిగో అత్యంత ఆధునికమైన ఆయుధం ఇది. దీనిని 'గన్' అందురు ఒలంపిక్ మహాయజ్ఞమున అబినవ 'బింద్రా' కు బంగారు పతకము సాధించిన 'గన్' ఇది. దీనిని ఒక్క సారి మీట నొక్కిన వేలాది గుళ్ళు వర్షంలా కురిసి తీవ్రవాదులు అంతమౌదురు..దీనిని ధరించి భూలోకమునకు వెళ్ళి తన పుట్టిన రోజు ఆనందముగా జరుపుకుని, లోక కళ్యాణము చేకూర్చి తిరిగి వచ్చును మన కుమారుడు...
'గన్' ధరించు వాడు కాబట్టి ఇకనుంచి మన కుమారుడు 'గన్'పతి అని పిలువబడతాడు...సర్వేజనా సుఖినోభవంతు....
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

2 వ్యాఖ్యలు:

కృష్ణశ్రీ చెప్పారు...

నాకు నచ్చింది.

సంతోషం!

JANARDHAN చెప్పారు...

naaku bhale nachchindi

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa