Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, ఆగస్టు 18, 2010

రాఖీ అనబడు సిస్టర్స్ డే

 రాఖీ అనబడు సిస్టర్స్ డే

అవును మరి..
వేలంటైన్స్ డే..మదర్స్ డే ఫాదర్స్ డే.ఫ్రెండ్ షిప్ డే లకు అలవాటు పడి పోయిన మనం, ప్రస్తుత జెనెరేషన్ కి ఇలా చెప్తేనే అర్ధమౌతుందేమో. ప్రేమికుల రోజు గులాబీలు..గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు.. ఫ్రెండ్షిప్ రోజున బ్యాండ్ కట్టుకుంటారు. కానీ ఎంత మంది రాఖీ కట్టించుకుంటున్నారో...సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పిన కమెడియన్ కి హీరోయిన్ కట్టినట్టు చూపించి నవ్వుల పాలు చెయ్యడం కాకుండా నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారో మరి.

ఎవరినైనా ప్రేమించచ్చు..ఎంతమందినైనా ప్రేమించచ్చు..పెళ్ళాడచ్చు..మానవచ్చు..లాంటి అనేక సౌకర్యాలున్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దినాలని మాత్రం మనం తూ చా తప్పకుండా పాటిస్తాము..
ఎవడో రాజుకి పైత్యం కొద్దీ ప్రేమలు పెళ్ళిల్లు నిషేధిస్తే త్యాగం చేసినందుకు గుర్తుగా వేలంటైన్ గారి పుట్టిన రోజో ఇంకోటో తెలీదు కానీ అది ప్రేమికుల దినం

మనకి తరతరాలుగా సంప్రదాయం ప్రకారం వస్తున్న పండుగలు.. వ్రతాలు.. పూజలు మాత్రం మనకి ఓల్డ్ ఫాషన్..చాదస్తం.. బుల్ షిట్టు.. పాతకాలం పద్ధతులూను..

శ్రావణ మాసం వస్తోంది..శుక్రవారం వచ్చిందంటే నిండా పసుపు నలుగు పిండి తో వళ్ళు రుద్దుకుని. తలార స్నానం చేసి వచ్చే వాళ్ళు..అది మనకి చాదస్తం..అదే సినీ తారలు వాడే సబ్బులోనో..కాలేజా నేనా అనే ఇంకో సబ్బులోనో మాత్రం టర్మరిక్ మరియు శాండల్ వుడ్ తో చేసిన సబ్బు అని ...ఆ హీరోయిన్ వాడుతోందని (మేకప్ లేకుండా చూస్తే అలా అనుకోరు) రుద్దుకుంటారు ఈ కాలం ఆడపిల్లలు.

కాళ్లకి పసుపు రాసుకుని..వెళ్ళవే అంటే డ్రస్ పాడైపోతుందమ్మా అని చెప్పి తప్పించుకునే పిల్లలూ..

పసుపు మంచి యాంటీ బయాటిక్కు..యాంటీ ఏజింగు ఏజెంటు..మీ హైటెక్కు ..టెక్కుల కన్నా ఎంతో విలువైన .. సహజమైన దివ్య ఔషధం.
వర్షాకాలం లో మనం తిరిగే చోట వర్షం వల్ల వచ్చే బురద నీరు..వరద నీరు.డ్రైనేజీవనది నీరు ల వల్ల ఇంఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది..కాళ్ళు పగల కుండా కాపాడుతుంది.. మృత చర్మం పోయి మంచి నిగారింపు..సున్నితమైన చర్మాన్నిస్తుంది ( ప్యూబిక్ స్టోన్ల తో రుద్దనక్కరలేదు మీ చర్మాన్ని)

చక్కటి పట్టు పావడాలు..లంగా వోణీలు..చీరలు...మన అందాన్ని ఇంకా పెంచుతాయే తప్ప మిడీలు ..మినీలు లాగా చూపించవు..
అందం పొగడాలనిపించేలా ఉండాలి తప్ప తడమాలనిపించేలా ఉండకూడదు.             (మరీ ఇంత పచ్చిగా చెప్పవలసి వచ్చినందుకు బాధగానూ సిగ్గుగానూ ఉన్నా తప్పలేదు)

ఇప్పటికే మన పండగలు అంటే హాలీ డేస్ గానూ ఆగస్ట్ ఫిఫ్టీంత్..అక్టోబర్ 2 అంటే నాన్ వెజ్ దొరకని రోజులు గా మారుతున్న ఈ తరుణం లో... eజెనెరేషన్ పిల్లలకి మన పండగల పరమార్ధం తెలియజేయకపోతే..కొన్నాళ్ళకి మనకి న్యూ యేర్ తప్ప మరేదీ మిగలదేమోనన్న దిగులుతో.





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Nice post...Krishna

SHANKAR చెప్పారు...

' సిస్టర్స్ డే' మీరు వ్యంగ్యంగా అన్నా కొన్నాళ్ళకి రాఖీ ని ఇలాగే పిలుస్తారేమో. ఇక రాఖీ అంటే ఈ తరానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమానో, స్వయంవర్ "రాఖీ' సావంత్ మాత్రమే గుర్తొస్తే ఆశ్చర్యం లేదు లెండి. ఏదో ఒకరిద్దరికి తెలిసినా అది కూడా ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లాగ సిస్టర్స్ బ్రదర్స్ చేతికి కట్టేవి అని డిఫైన్ చేసేస్తారు.

ఆగస్ట్ ఫిఫ్టీన్, అక్టోబర్ రెండు నాన్ వెజ్ దొరకని రోజులు మాత్రమే కాదండీ పాపం మందు కూడా దొరకదు.( విచ్చల విడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి పాపం అలాంటివి ఖజానాకి గండి కొట్టే రోజులే మరి)

అవునూ న్యూ ఇయర్ అన్నారు ఉగాది గురించా? జనవరి ఫస్ట్ గురించా? :)

Vinay Datta చెప్పారు...

realistic post.

kalyan చెప్పారు...

కొంప ముంచావ్ బాసూ!
అది ప్యూబిక్ స్టోన్ కాదు ........(బూతు....బూతు బూతు)........ప్యూమిస్ స్టోన్

ఆ.సౌమ్య చెప్పారు...

"పసుపు మంచి యాంటీ బయాటిక్కు..యాంటీ ఏజింగు ఏజెంటు..మీ హైటెక్కు ..టెక్కుల కన్నా ఎంతో విలువైన .. సహజమైన దివ్య ఔషధం.
వర్షాకాలం లో మనం తిరిగే చోట వర్షం వల్ల వచ్చే బురద నీరు..వరద నీరు.డ్రైనేజీవనది నీరు ల వల్ల ఇంఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది..కాళ్ళు పగల కుండా కాపాడుతుంది.. మృత చర్మం పోయి మంచి నిగారింపు..సున్నితమైన చర్మాన్నిస్తుంది"

...................


అవును నిజమే, మరి అయితే అమ్మాయిలొక్కరే పసుపు ఎందుకు రాసుకోవాలి, అబ్బాయిలెందుకు రాసుకోకూడదు? ఏం శుభ్రత,సున్నితమైన చర్మం వాళ్లకక్కర్లేదా?

Fun Counter చెప్పారు...

ఏం చేస్తాం అది మంచి హెయిర్ రిమూవర్ కూడా..

Fun Counter చెప్పారు...

oh sorry.. naku antaga telidu eado oka raayi ..

LinkWithin

Related Posts with Thumbnails