Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

గురువారం, జూన్ 17, 2010

ట్రాఫిక్ ఫొటోగ్రాఫర్స్


 ట్రాఫిక్ ఫొటోగ్రాఫర్స్

పెళ్ళి కి ఫొ
టోలు తీస్తారు కాని..మన ట్రాఫిక్ పోలీసోళ్ళు ఫొటోలు తీసి పెళ్ళి చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ చేసి వెళ్ళిపోయే ప్రబుద్దులని పట్టుకోవడానికి చేసే ఈ ప్రయత్నం బాగానే ఉన్నా ఒక్కోసారి నాలాంటి అమాయకులు బలైపోతుంటారు. మొన్న ఖైరతాబాద్ దగ్గర సిగ్నల్ పడిందని ఆగా..గ్రీన్ పడ్డాక ఫ్లై ఓవర్ ఎక్కే ప్రయత్నం చేస్తుండగా..రాజ్భవన్ నుంచి వస్తున్న ఒక బైకర్ అడ్డం గా వచ్చి నన్నూ. బస్సుని..కారుని అడ్డగించి ఈనాడు వైపుకి స్పీడ్ గా వెళ్లాడు తప్పించుకునే ప్రయత్నం లో మేమంతా ఆగిపోయాము.. ఈలోగా రెడ్ పడడమూ అవతల నించీ వెహికిల్స్ రావడం తో ట్రాఫిక్ ఆగడమూ - ఫొటోలు తీయడమూ  జరిగిపోయాయి..వారం తరువాత ఇంటికి శ్రీముఖం ట్రాఫిక్ జంపింగు..100 కట్టుము అని..ఆ హా బైకు వాడు తప్పించుకుని నేను దొరికి పోయా అనుకున్నా...ఆటోల వాళ్ళు అంతే అడ్డదిడ్డంగా వచేసి ఇరికించుతారు..ఎర్ర రంగు వచ్చేసరికి నాలాంటి వళ్ళు ఇరుక్కుంటారు..ఇది ఇప్పటికి ఎన్నో సారో తెలీదు.సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్ పాటించీ ఇలా తప్పు చేసిన వాళ్లా జరిమానా కట్టాల్సి రావడం బాధాకరం. అసలు వాళ్ళు తప్పించుకుంటారు..కనీసం సంజాయిషీ ఇవ్వడానికి కూడా వీలులేని ఈ రూల్ ఎంతవరకూ సమంజసమో ఆ పోలీసు అధికారులకే తెలియాలి. జనవరి 30 ఉదయం 11 గంటలకు గాంధీ గారు పోయిన టైములో వచ్చిన సిగ్నలు ప్రకారం హిమాయత్ నగర్ లో కారాపి మౌనం పాటించి నందుకు...రాంగ్ పార్కింగ్ పేరిట 200 సమర్పించుకున్నా..గాంధీ గారికి  శ్రద్ధాంజలి ఘటించినందుకు జరిమానా.. ఏం చేస్తాం..నీతి పాటించాలి అని చెప్పిన గాంధీ గారి బొమ్మ నోటు మీదున్నా ..లంచం గా ఆయన సాక్షి గా ఆ నొట్లనే జేబుల్లో నెట్టుకుని ..లైసెన్స్ లేని వాళ్ళని ఎంతమందిని వదిలేస్తున్నారో..ఆ గాంధీ గారే సాక్ష్యం..కెమెరాకి కళ్ళుంటాయి కాని మెదడుందదు...నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa