Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

ఆదివారం, జూన్ 13, 2010

కృయాలిటీ షోలు

 బుడి బుడి నడకల వయసులో
అడ్డమైన డ్యాన్సుల మోజు

సిల్కు స్మితలూ జయమాలినీలనిపించుకొన
తలిదండ్రులకెందుకో అంత క్రేజు

ఆటలాడుకునే వయసులో
తీట కార్యక్రమాలు
చిన్నారుల పై వత్తిడి పెంచే
రియాలిటీలనబడే కృయాలిటీ షోలు




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి


naa paata Tapaa:
Apr 19, 2010

కృయాలిటీ షోస్



 ఒక చిన్న పాపాయి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అంతా ఎంతో పాపులర్. ఆమె పాట వింటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది..ఆ పాపని దగ్గరకు తీసుకుని నీ పేరేంటమ్మా అని అడిగా..పాప దిక్కులు చూసింది బహుశా వాళ్ళ అమ్మా నాన్న కోసం అనుకుంటా..వాళ్ళు కనిపించి తలకాయ ఊపాక చిరీచ అంది మొదట్లో అర్ధం కాలే తరువాత శిరీష అని అర్ధం అయింది..నువ్వు ఏం చదువుతున్నావ్ అని అడిగా పీ పీ వన్ అంది నాకర్ధం కాలే ...సరే నీకు ఏ బీ సీ లు వచ్చా అన్న,,ముద్దుగా తల ఊపింది.. చెప్పు అన్నా, మళ్ళీ అమ్మ నాన్న ల వంక చూసి నావేపు తిరిగి ఏ ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ బీ బీ ప్లస్ బీ ప్లస్ ప్లస్ సీ సీ ప్లస్ అంటూ చెప్పింది ..నాకు మతిపోయింది అదేంటమ్మ ఏ ఏప్లస్ ఏంటి అన్నా..దానికి ఆ పాప అమాయకంగా మొహం పెట్టి ఏమో అంకుల్ మా కూల్లొ అవే ఉంటాయి అంది...ఏ స్కూలమ్మ అని అడిగా...ఏమో అంది ...మీ టేచర్లు ఎవరు అని అడిగా ..ఒక సింగరాంటీ, ఒక పాటల తాత, ఒక మ్యూజిక్ అంకుల్ అంది....కాసేపటి తరువాత ఎవరో నీళ్ళు జల్లినట్టున్నారు కొంచెం కొంచెం నా కళ్ళు తెరుచుకుంతున్నాయి..అది ఒక రియాలిటీ షో మహత్యం అదిగో అక్కడ స్టేజి ధగ ధగ లాడిపోతోంది..లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి....కట్టర్లూ, థెర్మోకోల్ షీట్లు, రంగు రంగు దీపాలు చాలా హడావిడిగా ఉంది. టీలు పంచేవాళ్ళూ, టిఫిన్లందించే వాళ్ళూ, ఇలా ఎవరిపనుల్లోవాళ్ళున్నారు...అక్కడ మరో రియాలిటీ షో జరుగుతోంది..ఇంతలో అక్కడ పోటీ పడుతున్న ఒక శృంగార తార..మరో టీవీ తార మధ్యలో సడెన్‌గా గొడవ స్టార్ట్ అయింది..నువ్వు అసలు కొరియోగ్రాఫర్వేనా అని ఆడిగితే మరో ఆయన తిడుతూ మీదకెళ్ళాడు..ఒక అమ్మాయి ఏడుపు లంఘించుకుంది..జడ్జికి కంగారు కలిగింది..అందరూ ఒక్క సారిగా స్టేజిమీద కి జేరారు..నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని అరుచుకుంటున్నారు..ఎదురుగా ఆడియన్స్ మధ్యలో కూర్చున్న ఒక గర్భిణి కి ఈ జగడమంతా ఆటలో భాగమని తెలీదు చాలా టెన్షన్ పడింది..వెంటనే నొప్పులు ప్రారంభమైనాయి..డెలివరీ అయింది పండంటి మగబిడ్డ..అంతా సంతోషించారు టీవీ చరిత్రలోనే ప్రధమంగా జరిగింది అంటూ యాంఖరమ్మ అరిచి చెప్పింది..జడ్జీల ఆసీర్వాదంతో ఆ పిల్లాడికి "స్టూడియో కుమార్ " అని పేరుపెట్టలని నిర్ణయించారు....ఆ పిల్లాడి కాళ్ళు ఊపడం చూసి అప్పుడే వీడికి డాన్స్ అబ్బింది అన్నరు...కెమేరా అటు పాన్ అయింది... ఇది మరో టీవీ...ఏవో రక రకాల్ ప్రోగ్రాములు వస్తున్నాయి..మధ్యలో యాడ్స్ వస్తున్నాయి సడెంగా..ఒక డాన్స్ ప్రోగ్రాం యాడ్ వచ్చింది...ఒక డాన్సర్ని ఒక జడ్జి తిడుతున్నాడు..నువ్వు చేసింది అసలు బాగాలేదు..అసలు నువ్వు ఇక్కడిదాకా ఎలా వచ్చావా అని నాకు అర్ధం కావట్లేదు..అసలు స్టాండర్డ్ లేదు అంటూ తిడుతున్నాడు..ఆ డాన్సర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ..సెట్ అంతా నిశ్శబ్దం..యాంఖరు మఔనంగా చూస్తున్నాడు..జడ్జి తారాస్థాయిలో తిడుతున్నాడు..సడెంగా ఆ డాన్సరు కత్తి తీసుకుని ఆ జడ్జి మీదకి వెళ్ళాడు..అందరూ ఒక్క సారి ఉలిక్కి పడ్డారు...ఆ డాన్సరు పూర్తిగా జడ్జిమీదకెళ్ళాడు...అక్కడ ఫ్రీజ్ అయింది..సీను..... ఆ పార్టిసిపెంట్ ఆ జడ్జిని పొడిచి చంపాడా...లేక పొడుచుకుని చనిపోయే ప్రయత్నం చేశాడా...తప్పక చూడండి రేపటి మా కార్యక్రమంలో ...అంటూ వెనకాల నుంచి గంభీరమైన గొంతు వినిపిస్తోంది.. ఆ యాడ్ మొత్తం మీద ఒక పది ఇరవై సార్లు వచ్చింది...అందరిలో టెన్షన్ ....ఆ సమయం రానే వచ్చింది..అందరూ టీవీలకి అతుక్కుపోయారు..కానీ తొమ్మిదింటికి మొదలైన ఆకార్యక్రమంలో తొమ్మిదీ నలభై వరకూ ఆ సిట్యుయేషన్ రాలేదు కానీ ప్రతీ బ్రేకులో అదే చూపించారు..సమయం తొమ్మిదీ యాభై రెండు...జడ్జి తిట్టడం మొదలెట్టాడు..ఆ సీను మొత్తం రిపీటయింది....చివరకి...అంటే ఆఖరుకు..ప్రోగ్రాం అయిపోయే సమయానికి కత్తి తీసుకుని ఆ డాన్సరు జడ్జి మీదకి ఉరికాడు..తన చేతిలో కత్తి ఆయన కాళ్లదగ్గర పెట్టి ...సార్ ఇంకొక్క చాన్సివ్వండి నన్ను ప్రూవ్ చేసుకుంటా...ఈ సారి చెయ్యలేకపోతే ఇంక డాన్స్ చెయ్యను,,,మీరే ఈ కత్తితో నా కాళ్ళు నరికెయ్యండి..ప్రస్తుతం నేను ఈ కత్తి పాట మీద డాన్స్ చెయ్యండి అంటూ కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు..అందరూ ఊపిరి తీసుకున్నారు మీతో సహా..... ఇవన్నీ కొంచెం అతిగా నేను ఎక్కువ చేసి రాసినా..నిజానికి కొంత నిజం లేకపోలేదు..పాపం అభం శుభం తెలీని పాపాయిలని ఆడుకోవాల్సిన వయసులో ఇలాంటి పోటీ ప్రపంచంలోకి నెట్టి వాళ్ళ బంగారు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ....అసలే ఐదో క్లాసునుంచే ఐ ఐ టీ లాంటి పరీక్షలకి ట్రైనింగు స్టార్ట్ చేస్తున్న ఈ రోజుల్లో..ఐదేళ్ల వయసునుంచే ఇంత పోటీ అవసరమా....మన బలహీనతలని ఆసరా గా తీసుకుని ఎంతటి హీనానికైనా దిగజారుతున్న ఇవి రియాలిటీ షోలా...కృయాలిటీ షోలా అర్ధం కావట్లేదు...కొరియోగ్రాఫర్ తో లేచిపోయిన డాన్సరు..పేరిణి డాన్సు చూసి పూనకం తెచ్చుకున్న మరో నాట్య తార, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే రూపకాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి తెలంగాణా..రాయలసీమ అంటూ ప్రజలని రెచ్చగొట్టే కార్యక్రమలు..ఈ ప్రోగ్రాముల ద్వారా హీరోలైపోయామని కొందరు అనుకుంటే...మేము ఓడిపోయాము ఇక ఎందుకూ పనికిరాము అని డిప్రెస్ అయిపోయే వాళ్ళు కొందరు...ప్రోగ్రాములో జరిగే తంతు చూసి టెన్షన్ పడేది మనం...

6 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా బావుందండీ.

Unknown చెప్పారు...

bagundi

ఆ.సౌమ్య చెప్పారు...

అయ్యబాబోయ్ బాబోయ్ మీదీ విజయనగరమేనా, మోడల్ హై స్కూల్ లో చదివారా, వినాయకుడి గుడి దగ్గర కచేరీ చేసారా, అయితే నేను ఖచ్చితంగా ఆ కచేరీ వినుంటాను. మహారాజా కలేజీలో చదివారా, నేనూ అక్కడే చదివాను. మీరు ఏ బేచ్? మీ కామెంటుతో ఒక్కసారి నన్ను విజయనగరంలో తీసుకెళ్ళి పడేసారు. గురజాడవారి ఇల్లు, నాగభూషణం మసాలా, దేవీ విలాస్, మారితీ కేఫ్....హా అన్నీ కళ్ళముందు ఒక్కసారిగా తిరిగాయి. మారుతీ కేఫ్ రాజుగారు మాకు బాగా పరిచయం. ఎప్పుడూ అక్కడే ఇడ్లీలు తినేవాళ్ళం.

భలే కలిసామండీ, మీ బ్లాగు చూస్తూ ఉంటాను ,కానీ మీది విజయనగరమని తెలీనే తెలీదు. మృదంగం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను కూడా వయొలిన్ నేర్చుకున్నాను సంగీత కాలేజీలో. మీకు ఆలమూరు (మండా) సుధారాణి తెలుసా? ఆవిడ మా అక్కే.

ఇంతకీ మీ పేరేంటి?

ఆ.సౌమ్య చెప్పారు...

ఫణి మాధవ్ గారూ
హ్మ్ అయితే మీరు నాకు చాలా సీనియర్. 89-90 లో మీరు మహరాజా కాలెజిలో ఉంటే నేను దుంపలబడిలో ఐదవతరగతి వెలగబెడుతున్నాను. కాబట్టి చూసే/కలిసే చాన్సు లేదు. ఓహో మీరు మిమిక్రీ ఆర్టిస్టా, భలే భలే. ఈసారి డిల్లీ లో ప్రోగ్రాం పెడితే నాకు తప్పక తెలియజేయండి. నేను వచ్చి కలుస్తాను.

మీరు సుబ్బరాయ శర్మగారి దగ్గర నేర్చుకున్నరా, నేను త్రినాథరావు గారి దగ్గర, అన్నజీరావుగారి దగ్గర కొన్నాళ్లు నేర్చుకున్నాను. సన్యాసిరావుగారు కొన్ని క్లాసులు తీసుకున్నారులెండి.

jeevani చెప్పారు...

సౌమ్య గారూ మొత్తానికి మీరు బ్లాగుల్లో ఉన్న విజీనగరం వాళ్ళందరితో కలిసి ఏదో ఒక రోజు విప్లవం తెచ్చేలా ఉన్నారు. :))

ఆ.సౌమ్య చెప్పారు...

@జీవని గారూ
హి హి హి ఏదో మీ దయవల్ల అలాంటి సంఘం ఏదైనా పెట్టగలిగితే అంతకన్న భాగ్యం ఏముంది :)

LinkWithin

Related Posts with Thumbnails