ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హై క్లూలు - హై డెఫినిషన్స్

 హై క్లూలు - హై డెఫినిషన్స్


జల తారు - "జలం" వస్తే కరిగి పోయే "తారు" రోడ్లు,


నిత్య వైతరిణి - డ్రైనే'జీవ"నది


అల్లు 'అర " విందు - "పార్టీ " ఉంది 'పదార్ధం " లేదు


చి"రంజీ"వి - రాజకీయ రంజీ ప్లేయర్


రో"శయ్య " - శయ్య మీద రెస్ట్ టైములో గెస్ట్ సీ ఎంజే ఏ సీ - జాయింట్ లెస్ యాక్షన్ కమిటీ


ఏ ఆర్ రహ్మాన్ - అవార్డ్స్ రివార్డ్స్ రెహ్మాన్


సన్నాసి - "ఆ" శ్రమ జీవితం లో "నిత్యానందం"


బి కి నీ - బిజినెస్ కి నీచమైన మార్గం


పైరసీ చట్టం - కాపీ కొట్టే హక్కు మాది మాత్రమే అనే పోరాటం


బ్రాడ్ మైండ్ పేరెంట్స్ కి "అబ్రాడ్ " మైండ్ పిల్లలు


ఆహారం రెండు రకాలు - శాకాహారం - మేకాహారం


నిజాన్ని చూపేది అద్దం - నిజాన్ని చంపితే "అబద్దం "


పేవ్ మెంట్ - పేమెంట్ లేని పేదోడి మహల్


నెక్లెస్ రోడ్ - రెక్లెస్ యూత్ కి కేరాఫ్ అడ్రస్


బ్లాక్ లో టికెట్ కొని సినిమాకెళితే - మైండ్ బ్లాంక్ అయింది


"ఉత్తరమో". "దక్షిణో "లేక పోతే - తూర్పే దిక్కు


మళ్ళీ కొట్టుకు పోయింది కంకర రోడ్డు - కాంట్రాక్టరింట్లో మంత్రిగారికి పార్టీ


ఈ నెల మా ఆవిడ మరో వ్రతం - వచ్చే జన్మ లో నైనా మంచి మొగుడి కోసం


పిల్లిని కట్టేసి కొడితే పులౌతుందిట - పులికి పెళ్లి చేసేస్తే పిల్లౌతుంది..


అతను ఫోనెత్తకపోతే - అది "మిసెస్" కాల్


పేదోడి కడుపు నిండడానికి..గొప్పోడి బొజ్జ తగ్గడానికి ఒకే మందు - గంజి


" మని" - "షి" వెనక పడేవాడు -మనిషినచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వ్యాఖ్యలు

SRRao చెప్పారు…
బాగున్నాయి మీ హై - డెఫినిషన్స్.
నాగప్రసాద్ చెప్పారు…
సూపర్. :-))
తెలుగు సినిమాల్లో బూతులూ కుళ్ళు జోకులు రాసే వాళ్ళెవరైనా వీటిని చదివి మీకు చెప్పో కాపీ కొట్టో తమ తదుపరి చిత్రాల్లో వాడుకోవచ్చు అనిపించేంత బావున్నాయి.ఇంకొన్ని వదలండి.కాచుక్కూర్చుని వున్నాం
3g చెప్పారు…
super ga unnay........
రవిచంద్ర్త చెప్పారు…
చాలా బాగున్నాయండీ...
what to say about me !! చెప్పారు…
"అతను ఫోనెత్తకపోతే - అది "మిసెస్" కాల్ " baapre...ilaanti creative ideas elaa vastaayandi meeku...

meeru permission isthe ee line nenu vaadukuntaanu appudappudu friends daggara.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!