ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నంది వ్యర్ధనాలు

నంది వ్యర్ధనాలు
ఉగాది పండుగ రోజున లలిత కళా తోరణంలో  ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నంది అవార్డుల కార్యక్రమం చూస్తే ఎంత ముచ్చటేసిందో..

ముఖ్యంగా మధ్యలో మొదలెట్టిన మాతెలుగు తల్లికి మల్లెపూదండ పాట..ఒక్కళ్ళూ లేవలేదు..ఆ సాంప్రదాయం ఇంకా మొదలవలేదనుకోండి..ఒక పక్క పాడుతుంటే వెనకాలకూర్చున్న నంది విజేతలు చెవుల్లో గుస గుసలు..ముసి ముసి నవ్వులు, సెల్ ఫోనుల్లో ఎస్ ఎం ఎస్ లు...ఆ పాట పాడిన నంది విజేత గాయనీ మణులకు ఆ పాట చూడకుండా రాదు, ఎవరు ఏ భాగం పాడాలో అవగాహన లేదు...ఒక్కొక్కళ్ళు ఒక్కో శృతిలో మొత్తానికి పాడేసి అమ్మయ్య అనుకున్నారు..మనసులో షిట్ అనుకున్నేరేమో కూడా...ఇప్పటికింకా నా వయసు,,రింగ రింగ రింగ రింగా లాంటివి గుర్తున్నప్పుడు ఈ ఒక్క పాట ఎందుకు గుర్తు లేదో..మరి...
ఇక హాస్యం పేరుతో వాళ్ళు చేసిన ఆ ఫీట్లేంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఒకావిడ డాక్టర్ దగ్గరకొచ్చి రెండు వేళ్ళు చూపించి ఒకటి తాను, ఒకటి ఆవిడ లవరు అని...ఇంట్లో అంతా ఒప్పుకున్నా..వాళ్లాయనకి ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు అని ఒక ప్రభుత్వ కార్యక్రమం లో ..ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పే జోకేనా అని ...ఇక అవార్డులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, పాత తరం నిర్మాత శ్రీ తిలక్ గారు మాట్లాడుతుంటే ఒకటే నవ్వులు..వారీ నే చెప్పొచ్చేదేటంటే..ఇప్పటి టెక్నాలజీలు, సదుపాయాలు, లేని రోజుల్లో ఒక తపస్సులా భావించి, ప్రజలకి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలు, తీసిన నిర్మాత ఆయన ,ఎంతో మంది నూతన నటులకు అవకాశాలిచ్చిన మార్గదర్శి, ఇప్పటిలా ఒక్క సినిమా తో హిట్టు డైరెక్టరైపోయి....చిన్న సినిమాలు తీయడం మానేసి,,కొన్ని ఫట్టు సినిమాలు తీసి కనుమరుగైపోయే కొత్త దర్శకుడు కాదు..తల్లా పెళ్ళామా లాంటి చిత్రాలని తీసిన మహానుభావుడాయన.

ఇక కుటుంబ కధా చిత్రాలలో అవార్డు పొందిన రెడీ చిత్రం అద్భుతం..మొదటి సీనే పెళ్ళి లోంచి పెళ్ళి కూతుర్ని ఎత్తుకు పోవడం, ఆవిడ వీళ్ళ గాంగుతో జీపులో  తిరిగి తిరిగి, అడవిలో దారి తప్పి, మేన మామ ల ఇంటికి జేరి....అక్కడ హీరో హీరోయిన్ కలిసి వాళ్ళని వెధవల్ని చేసి అందుకు హీరో తల్లి తండృలని కూడా వాడుకుని పెళ్ళి చేసుకునే అద్భుతమైన కధ ఉన్న కుటుంబ కధా చిత్రం. ఒక వేళ ఆ కాటగిరీలో సినిమాలు ఎంట్రీలు రాకపోతే మిగతా కేటగిరీల్లా వదిలెయ్యచ్చుగా ఏదో ఒకటి ఇచ్చెయ్యాలా...

మంచి సినిమాలు నంది అవార్డు సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి 20 లక్షలు ఇస్తే బాగుంటుంది అని భరద్వాజ గారు కోరారు..అయ్యా మంచి సినిమాలు ఎవరు తీయాలి, జనాలా..మీరా? జనాలు హీరోలు, హీరోయిన్ ల కోసం మాత్రమే కాదు కధ కధనం కోసం కూడా చూస్తారు అని చెప్పడానికి పాపం బంగారు నంది గెలుచుకున్న గమ్యం చాలేమో..పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలకు అవార్డులు రావు మనదగ్గర.

మళయాళం లో సూపర్ స్టారులు మోహన్ లాల్, మముట్టి ఆర్ట్ సినిమాలు అని పిలవబడే కధల సినిమాల్లో నటిస్తారు కాబట్టి వాళ్లకి నేషనల్ లెవల్ అవార్డులు వస్తాయి..అదే మన దగ్గర ?????

ఇమేజి పక్కన పెట్టి రుద్ర వీణ, స్వయం కృషి లాంటివి చేసినప్పుడు చిరంజీవి కి వచ్చింది అవార్డు, ఎంతసేపూ జనం చూస్తారు అందుకే తీస్తున్నాం అనే సినిమాలు ఎన్ని ఆడుతున్నాయి అసలు జనాలని ఎవరు అడుగుతున్నారు..మీరు తీసేసి మా మీదకి తోసేస్తే ...మేము చూస్తే అది హిట్టు లేదా ఫట్టు ...ఈ మధ్య కలెక్షన్ ల కోసం తీసిన బికినీ ల సినిమాల్లో (బిల్ల, ద్రోణ, సాధ్యం )ఎన్ని ఆడాయి నిజంగాఅ....అష్టా చమ్మాలో హీరోయిన్ ఏమి ఎక్ష్పోస్ చేసిందని చూసారు మీరనే ఆ జనం...కాబట్టి మీరు శంకర్ దాదా అయినా శంకరాభరణమైనా కొత్తదనం, కోరుకుంటారు జనం..మున్నాభాయి లో సంజయ్ దత్ చెంప మీద కొడతాడు కాన్సర్ అని అప్పుడే తెలిసిన పేషంటు. అది ఆ పేషంట్ మానసిక పరిస్థితి కి నిజమైన రూపం...మరి అది శంకర్ దాదాలో చూపించగలిగారా? ఇమేజి...అక్కడ ఆ సీను లో చిరంజీవిని ఎవరో అనామకుడు కొడితే జనం ఊరుకోరు అని..అదే హీరో లారీలలో వచ్చే పక్క ప్రొఫెషనల్ రౌడీలౌ వేల మందిని ఒక దుడ్డు కర్రతో బాదేసి చొక్కా నలగకుండా కళ్లజోడు తియ్యకుండా చితక్కొట్టి ఒక పెద్ద డైలాగు కొట్టేసి హీరోయిన్ (వీలైతే ఆ విలన్ చెల్లి) తో పాట పాడుకోవడానికి వెళ్ళిపోతాడు. అదీ మన క్రియేటివిటీ..నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వ్యాఖ్యలు

vasantham చెప్పారు…
akshara satyam.siggu tho thala vanchukunelaa undi a programme tv lo choosam..Intha kangaali ,gandra gola stage circus ee madhya choodaledu.
mnam mnam cheppukovadam.. alamatinchadam.. inko margam unda???

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!