Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, మార్చి 05, 2010

"ఆ" శ్రమ జీవితం

 "ఆ" శ్రమ  జీవితం
 ఒక సారి ఒకతను చెట్టుకింద కాళ్ళు జాపుకుని తాపీగా ఉన్నాట్ట, దారిన పోయే దానయ్య ఏం నాయన అలా ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోరాదా అన్నాట్ట, దానికి ఆ బద్ధకస్తుడు పనిచేసి ఏం సాధించాలి అని అడిగాట్ట, దానికి ఆ దానయ్య అదేంటి నాయనా అలా అంటావ్, పని చేస్తే డబ్బులొస్తాయి, ధనం సంపాదిస్తే సుఖంగా  కాళ్ళు జాపుకుని హాయిగా ఉండొచ్చు అన్నాట్ట దానికి ఆ బద్ధకస్తుడు ఇప్పుడు నేను చేస్తున్నదదే..నీ పని చూసుకో అన్నాట్ట.
ప్రస్తుతం కొన్ని సంఘటనలు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. కష్టపడి చదువుకుని, పోటీలు పడి ఉద్యోగాలు సంపాదించి,,,పని చేసి డబ్బులు సంపాదించి, అన్ని సౌకర్యాలు సమకూర్చుకునే సరికి..వయసు కాస్తా అయిపోయి అవి అనుభవించడానికి సమయం దొరకని పరిస్థితి ఏర్పడుతుందనో ఏమో కొంతమంది హాయిగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని రకరకాల పనులు చేసేస్తున్నారు. అసలు వీటిలో ఎన్ని నిజాలో...ఏవి కావోకూడా ప్రశ్నార్ధకమే. ఎందుకంటే ఈ టీ వీలనీ నమ్మలేము. ఇది వరకు నారదుణ్ణి ఆడిపోసుకునే వాళ్ళు కానీ పాపం ఆయనకి కళ్యాణం కాకపోయినా...లోక కళ్యాణం కోసం ఏవో పనులు చేసేవాడు..కానీ ఈ టీ వీ చానెళ్లు ఒక్క రోజులో ఏదో ఒక సంచలన వార్త అంటూ ప్రసారం చేసి..జనాల జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నారు.

ఏదైనా ఒక ఆధారం దొరికితే సంబంధిత వివరాలు కూడా తెలియక ముందే ప్రత్యక్ష్య ప్రసారమనో,, చర్చ అనో..ఎక్స్క్లూజివ్ అనో ప్రసారం చేసి పారేసి..తరువాత మేమే బయటకు తీసింది అని చంకలు గుద్దుకుంటారు.

ఆ మధ్య ప్రకాష్ రాజ్ కి ఎవరో ఒక రాజకీయ నాయకురాలికి పెళ్లి చేసేసింది ఈ మీడియా. ఒక వేళ వాళ్ళు చేసుకున్నా అది వ్యక్తిగత వ్యవహారం. ఇంతా చేసి ప్రస్తుతం ఆ న్యూసు ఏమైపోయిందో తెలీదు. ఇక మాఫియాలు, తీవ్రవాదులు మరో రకం వాళ్ళు అందరూ ప్రత్యేక ఇంటర్వ్యూలకి వీళ్లకి దొరుకుతారు..పోలీసులకి దొరకరు..మరి వీళ్లకి దొరికిన వాళ్ళని కెమేరాలతో షూట్ చేసి రేటింగు పెంచుకుంటారే తప్ప షూట్ ఎట్ సైట్ ఉన్న వాళ్ళగురించైనా పోలీసులకి చెప్పరు.పొద్దున లేస్తే వీళ్ల చానెళ్ళలో సమాజాన్ని మారుద్దాం రండి అని స్లోగన్ లు..ఈ కామ కేళీలు తప్ప వీళ్ళకి ఇంకేమీ దొరకవా..అని ఓ డౌటు.


అసెంబ్లీ సమావేసాలు జరుగుతున్నాయి. అసలు ప్రజల సమస్యలేమిటి..దాన్ని ప్రజా ప్రతినిధులు ఎలా చర్చిస్తారు/చర్చించాలి, సభా సమయమేంటి. అక్కడ జరుగుతున్నదేమిటి. ప్రజల ప్రయోజనాలకి ...వ్యక్తిగత దూషణలకి వీటిలో దేనికి సమయం కేటాయిస్తున్నారు..ఎందుకిలా జరుగుతోంది..ఒక వేళ అలా జరగకుండా ఉండాలంటే ప్రజలేమి చెయ్యొచ్చు. లాంటి చర్చల్లాంటివి..ప్రజలకి అవగాహన పెంచేవి ఎందుకు ప్రసారం చెయ్యరు.?
మర్డరు ఎలా జరిగిందీ, బ్యాంకు దోపిడీ ఎలా జరిగిందీ, ఇలాంటివి మాత్రం పనికట్టుకుని చూపిస్తారు..
ఇక ఆశ్రమ జీవితాల్లోకొస్తే..
అసలు..అశ్రమం లో ఉన్న స్వామీజీలు,  దైవాంశ సంభూతులని,  వాళ్ళే దేవుళ్ళని వాళ్ల చుట్టూ ఉండే మేనేజర్లు(అనుచరులు అనాలేమో ) ప్రచారం చేస్తుంటే మటుకు ఎందుకు ఆకర్షితులౌతారు. అది బలహీనత,  చేసే తప్పులు, కష్టపడకుండా సంపాదించడానికి దగ్గరి మార్గాలు కావాలని, మనకి చేతకానిది ఏదో పొందాలని స్వార్ధం ....దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు డబ్బులు దండుకుంటుంటే,  కొందరు..రాసలీలలు సాగిస్తున్నారు, కొందరు ఇంకో పని చేస్తున్నారు.

సర్వం పరిత్యాగం చేసే వీళ్ళకి డొనేషన్ లు ఎందుకు?
ఎంత డబ్బు కడితే జబ్బు నయమౌతుంది?
 ఎన్ని లక్షలు ఇస్తే మోక్షం లభిస్తుంది?
ఈ మాత్రం ఆలోచించని అమాయకులున్నన్నాళ్ళూ
అలాంటి వారు "నిత్యానందం "గానే ఉంటారు.
 గంగా జలం పేరుతో గంజాయి తాగిస్తునే ఉంటారు..
ప్రజలారా మారాల్సింది మనం.....




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Good Morning Sar Vadu, chala bhaga rasaru. samajam gurinchi alochiste pichekkutundi.anduke manam tappu cheyakunda vundatam, vilaite manaku telisinavallani aamargamlo nadavakund chuddam.

అక్షర మోహనం చెప్పారు...

nachchindi mahaanubhaavaa..!society
patla aamaatram spandana lekapote etla..?

అక్షర మోహనం చెప్పారు...

nachchindi mahaanubhaava..Society patla aamaatram spandana lekapote etla..? andarikee cheppalsina vishyam idi.

LinkWithin

Related Posts with Thumbnails