అమ్మాయకత్వం
అమ్మాయిల అమాయకత్వం చూస్తుంటే జాలేస్తోంది. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది మగాడిదలు..అచ్చోసిన ఆబోతుల్లా రెచ్చిపోయి..తల్లి - చెల్లి కూడా సిగ్గుపడేలా చేస్తున్నారు. గాడిదలు, ఆబోతులు కూడా అలాటి మగాళ్ళతో పోల్చినందుకు బాధపడతాయేమో..నిన్నా మొన్నా సినిమా థియేటరాయన ఇప్పటికే అష్ట భార్యలని..కష్టాలు పడ్డవాళ్ళలో ఒకామె బయటకి ధైర్యంగా వచ్చి చెబితే తెలిసింది. ఇలాంటి నికృష్టులని బహిరంగంగా రోడ్డు మీదకి తెచ్చి తగిన శాస్తి చెయ్యాలి. అది అన్ని టీవీల్లో లైవ్ చూపించాలి. అప్పటికైనా కొంతమందైనా భయపడో..బుద్ధొచ్చో బాగుపడతారేమో అనిపిస్తోంది.
ఈ మధ్య ఒక ఫంక్షన్ కి వెళ్ళా..అక్కడ ఒక పెద్ద పదవిలో ఉన్న ఒకావిడ గెస్టు,,అది మహిళా కార్యక్రమం....కానీ ఆవిడతో పాటు వాళ్ళాయనా అక్కడ ప్రత్యక్ష్యం. ఆవిడతో పాటు ఆయనా స్టేజి మీద...అఫ్కోర్స్ ఆయనా లీడరే ఏదో ఆ సీటు లేడీస్ కోటా లో ఉండడం వల్ల ఆవిడని నుంచో పెట్టి గెలిపించుకున్నట్టున్నాడు. ఒక వేళ ఆ పదవి లో ఆయనుండి...అదే మహిళా కార్యక్రమానికి ఆయన గెస్ట్ గా వెళితే..మరి వాళ్ళావిణ్ణి కనీసం అక్కడికి తీసుకెళతాడా అని నా అనుమానం. ఏ, ఇంటిని, కుటుంబన్ని నడపగలిగే స్త్రీ సమాజం లో తన ప్రజలని సరిగా నడపలేదా? ఎందుకు ఆ రకమైన వివక్ష చూపిస్తారో అర్ధం కాలేదు.
కానీ ఒక్కోసారి సినిమాలు చూస్తుంటే ఆ హీరోయిన్ ల ని చూస్తోంటే వీళ్లకి ఎందుకీ ఖర్మ అనిపిస్తుంది.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
1 కామెంట్:
sar vadu dabbu evariki chedu?
కామెంట్‌ను పోస్ట్ చేయండి