Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, జనవరి 11, 2010

చిన చేపను పెద చేపా..

 చిన చేపను పెద చేపా..

చిన చేపను పెద చేప..పెద చేపను పెను చేపా..
చిన మాయను పెద మాయ..పెద మాయను పెను మాయా.
చిన న్యూసును పెద న్యూసు..పెద న్యూసును పెను న్యూసుఇది సత్యం..ఇది తధ్యం...ఇది ఖర్మం...


మోహన్ బాబు ఇలా అన్నారు...?, గవర్నర్ గారి రాసలీలలు, రాజశేఖరుని హత్యలో రిలయెన్స్ హస్తం...లగడపాటి కిడ్నాప్...కే సీ ఆర్ పరిస్థితి విషమం..యూనివెర్సిటీ లో పోలీసుల దౌర్జన్యం...

ఏంటో అసలే దొరికింది దొరికినట్టు పగలగొట్టి..విరగ్గొట్టి..గొడవలు చేసి మంచి ఊపు మీదున్న వాళ్లకి
డెన్ గా ఖాళీ వచ్చే సరికి కొంచెం చికాగ్గా ఉన్నారు. ఏదో మీడియా దయ వల్ల రోజుకో దొమ్మీ, గొడవ, బద్దలు కొట్టే కార్యక్రమాలకి ఆటంకం లేకుండా జరిగిపోతోంది. 

మామూలుగా పండగలకి ఆఫీసులకి..స్కూళ్ళకి శెలవులిస్తారు. కానీ మన రాష్ట్రం లో (పేరు చెప్పడానికి భయంగా ఉంది) బందుల మధ్యలో ఆఫీసులు పనిచేస్తున్నాయి. ఏ క్రిస్మస్సో, సంక్రాంతో వస్తే..బందులకి శలవులిస్తున్నారు బడా నాయకులు.
పండక్కి..సినిమాల్లేవు..షికారులు లేవు..షాపింగు లేదు,,ట్రాన్స్పోర్ట్ లేదు..
ఎక్కడ చూసినా ఒకటే మాట ..పాట
బందే మాతరం..బందే మాతరం
తిడతాం కొడతాం..కనిపించిందల్లా పగలగొడతాం
కలిసుంటే కొడతాం..విడిపోతే తిడతాం అంటూ అబ్బో గందరగోళం.

సంక్రాంతి పండగొస్తోందంటే...సందడి గా ఉండే రోజులు పోయాయి.

విదేశీయులతో పోరాడినట్టు..స్వరాష్ట్రీయులతో పోరు అవసరం లేదుకదా..వాళ్ళూ మన భాయిలే కదా.పోరాటం ప్రభుత్వం తో....పక్క జిల్లాలవారితో కాదు.

సంక్రాంతి లక్స్మి కి ముగ్గుతో స్వాగతం...పలుకుదాం...ఆంధ్రప్రదేష్ ముగ్గు మీద...కాలేసి చెరపకుండా..
గంగిరెద్దుల్లా తలలాడించే అమాయక ప్రజలని మోసం చేసే రాజకీయ నాయకుల కుతంత్రాలకు మోసపోకుండా,...
వాళ్ళూ వాళ్ళూ కుమ్మక్కై మనల్ని గొబ్బెమ్మల్ని చేస్తున్నారన్న వాస్తవాల్ని తెలుసుకుందాం.
చరకా సోనియా చేతిలో..ఉన్నదని చెబుతూ ...గాలి పటాల్ల ఎగురుతూ ఏదో ఒక చెట్టుకు తగులుకునే అవకాశవాదుల  మాటలు నమ్మకుండా.
మనకి శుభం కలిగించే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు...
 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

2 కామెంట్‌లు:

Valluri Sudhakar చెప్పారు...

ఈ విషయమ్మిద ఎంతచెప్పుకున్నా చర్వితచరణమే. సామాన్యుడి ఘోష రాజకీయబదిరులకు వినపడదు, అవకాశవాదరాజకీయలకి అమాయుకులు బలికాకతప్పదు.

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

మీ బ్లాగుని ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది మీ బ్లాగు.

LinkWithin

Related Posts with Thumbnails