Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, జులై 20, 2009

గ్రహణం




గ్రహణం

సూర్యుడికి పట్టిన "గ్రహణం" గంటలోనో......... గంటల్లోనో వదిలిపోతుంది. కానీ మన సంస్కృతికి పడుతున్న/ పట్టిన....గ్రహణం మాత్రం ఎన్నాళ్ళకి వదులుతుందో ఏమిటో..

అపోలోలు..రాకెట్టులు పుట్టని,......... కనీసం వాటి ఆలోచనైనా పుట్టని రోజుల నుంచే..
ఏ రోజు..ఎంత సేపు గ్రహణం వస్తుందో..చెప్పే వారు మనవారు...

చంద్రుడో ...సూర్యుడో కనపడకపోతే ప్రళయం వచ్చిందని దాక్కునే 'వాళ్ళు' చెప్పింది విని - 'అవును' అనాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం.


సూర్యుడు........మిగిలిన నవగ్రహాలూ ఇలా ఉంటాయి ..వీళ్ల ప్రభావం ఫలానా అని చెబితే
మూఢ నమ్మకం.......... జాతకాలు లేవు..అని కొట్టి పడేస్తారు...ఆస్ట్రాలజీ ని నమ్మరు..

టెలిస్కోపు లో చూసి గ్రహాలు దగ్గరగా కదులుతున్నాయి.............అందుకు కొన్ని ప్రభావాలుంటాయి అని చెబితే 'ఆస్ట్రానమీ' ని నమ్ముతారు.


'చంద్రుడి' ప్రభావం 'భూమి' మీద, 'సముద్రం' మీదా..'మనసు' మీదా ఉంటుంది అని జ్యోతిష రీత్యా చెబితే చీ చీ చాదస్తం అంటారు...

అదే లూనార్ ఎఫెక్టు ఆన్ హ్యూమన్ సైకాలజీ అని అమెరికా వాడు చెబితే చప్పట్లు కొట్టి అబ్బో చాలా గొప్ప విషయం కనుక్కున్నారు ఎంతైనా అమెరికా వాడు అంటాం.

కాల ఞాన్ని నమ్మని మనం...నోస్ట్రడామస్ ను, సునామీ గురించిన ఈ మైళ్లని నమ్ముతాం.

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను అని వేమన చెబితే మనకి సోది లా అనిపిస్తుంది ...ఎంటీ వెసెల్స్ మేక్ మోర్ నాయిస్ అని ఎంగిలీషు భాషలో అంటే అది మనకి వేదం...

వేప చిగురు చేదు మీద కార్టూన్ లు వేసుకుంటూ మనమున్నాం ఆ చెట్టు పేటెంటు తీసుకుని ప్రయోగాలు చేసి ఆ వనమూలికలని మనకి రేటు కట్టి అమ్ముతుంటే కొంటున్నాం.

కలబంద గురించి చెబితే ఏమిటో నీ బొంద అని కొట్టిపారేసి, ....కొట్టు కి వెళ్లి అలో వేరా మెడిసిన్ తెచ్చుకుని పుచ్చుకుంటారు.

యోగా అంటే అదేదో ముసలాళ్ళు ..మునులు చేసేదని..వేలు ఖర్చు పెట్టి ..జిమ్ములు...ఏరోబిక్సులు జాయిన్ అవుతారు...
రాగి జావ తాగరా నాన్నా అని నానమ్మ చెబితే...చీ చీ రాగీ మాల్టో..ఓట్సో తాగండి బరువు తగ్గుతారు...అని చెప్పే డైటీషియన్ దగ్గర అపాయింటుమెంటు లైనులో నుంచుంటారు...

తేజస్సు నందించే సూర్యుడు కనుమరుగు అవుతాడు..దుష్టశక్తులు(బాక్టీరియా...వైరస్సు) ప్రబలుతుంది అని చెబితే నవ్వుతారు.....గ్రహణం టైముకి మూడు గంటలముందే ఏమన్నా తినండి..అని స్క్రోలింగులు చూసి ఫాలో అవుతారు..
పాజిటివ్ ఎనెర్జీ...............సూర్య తేజస్సు
నెగిటివ్ ఎనెర్జీ...............వైరస్సు...
చంద్రుడి మీదకాలు పెట్టి నలభై ఏళ్ళైనందుకు...ఆం స్ట్రాంగు ను గుర్తుచేసుకుంటున్నారు..కానీ ఆర్యభట్టుని తలుచుకునేంత తీరిక..కోరిక ఉన్నాయా మనకు.











నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

6 కామెంట్‌లు:

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

absolutely. ninna armstrong photochoosi nenu anukonnavi meeru eeroju ave kaakapoyinaa alaamtive chepparu

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్లు అమెరికా వాళ్ళు చెబుతేనే అది సైన్సు.మనం ఎప్పుడో అదే విషయాన్ని చెప్పినా అది చాదస్తం, మూడనమ్మకమూనూ.
వినాయకచవితి రోజున విద్యార్థులు వినాయకున్నికుడిచేత్తో ఎడమచెవిని, ఎడమచేత్తో కుడిచెవిని పట్టుకుని గుంజీలు తీస్తూ ప్రార్థించమని చెప్పేవారు మన పెద్దలు.దాన్ని మూఢనమ్మకమన్నారు. దాన్నే ఇప్పుడు పాశ్చాత్యులు super Brain Yoga అని చెబుతున్నారు చూడండి. ఇక మనవాళ్ళు గుంజీలు మొదలుపెడతారు చూడండి ఎందుకంటే శంఖం నుంచే పోసారు కదా తీర్థాన్ని.

చూడండి ఈ క్రింది విడియోను
http://www.bharatwisdom.com/vdoid/video.aspx?strUrl1=http://www.BharatWisdom.com/vdoid/zsKSwhpF9iJSs

durgeswara చెప్పారు...

అవును కదా ? పాలితులకింత విజ్ఞానముండాలా అని తెల్లోడు వ్రాసిన చదువులు నెత్తికెక్కిన తరం ఇంతకంటే భిన్నంగా ఆలోచించలేరు . ఏదైనా సరే తెల్లోడు నందంటే నందే పందంటే పందే .

durgeswara చెప్పారు...

mI mail adress kaavaali pampamdi vemtane

Fun Counter చెప్పారు...

funcounter@gmail.com

Ramesh చెప్పారు...

chaala baaga raasaaru.

LinkWithin

Related Posts with Thumbnails