Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, మార్చి 30, 2009

పండగ ఆఫర్

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, హుషారుగా పాట వినిపిస్తోంది బాత్రూం లోంచి..ఏంటండీ చాలా హుషారుగా ఉన్నారు..ఈపూట........
వంటింట్లోంచి భార్యామణి కేక..(పాట భరించలేక ఆర్తనాదం అనుకోవచ్చేమో !)

ఇవాళ ఉగాది కదోయ్! ఇవ్వాళ సంతోషంగా ఉంటే, సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చు అందుకని .........నా సమాధానం..
ఇంకా నయం ఇవ్వాళ తింటే సంవత్సరమంతా తిన్నట్టే, అని, ఇంక మాకు కూడు అదీ పెట్టరా ఏంటి భార్యా మణి రుస రుస...
అది కాదోయ్, అది.... చిన్న చిన్న వాటికే.....
రోజూ చేసే పనులకి కాదు, కనీసం ఈ రోజైన ఆనందంగా ఉంటామని.... పెద్దవాళ్ళు పెట్టిన ఒక విధమైన 'ఇది'.... ఏం పేరు పెట్టాలో తెలియక తికమక..
అంతేలేండి ఈ పండక్కి ఒక చీర నామొహం మీద పడేసి, ఇక సంవత్సరమంతా పండగ చేసుకో అనచ్చనేగా మీ ఆలోచన..మళ్ళీ భార్యామణి లా పాయింటు..

అబ్బ అదికాదే..అర్ధం లేకుండా మాట్లాడకు..ప్రతీది రాద్ధాంతం చేస్తావ్ ...పొద్దున్నే తలకాయ నొప్పి..కాస్త కాఫీ నీళ్ళు నా మొహాన కొట్టు, అలా వెళ్ళి వేప పూత, అదీ... తెస్తా..నా నిరసన

అంతే లేండి! పెళ్ళైందగ్గరనుంచీ నేనేమన్నా అడిగానా? నన్ను చూస్తేనే మీకు తలనొప్పి...అందుకే అన్నా, మా నాన్న తో, అబ్బాయి గురించి అన్ని తెలుసుకోండి నాన్నా! అని, ఎప్పుడు చూసినా తలనొప్పి అంటారు ఏం మాయదారి జబ్బో ఏమిటో..?

నాకే జబ్బులు...మాయరోగాలు లేవు, ముందు కాఫీ నీళ్ళు ఇచ్చేదేమన్నా ఉందా ? లేకపోతే అది కూడా బయటే తగలడమంటావా...?

అంటే! నేనిచ్చే కాఫీ నీళ్లన్నమాట బయట అమ్రుతం దొరుకుతుందా ..అట్లాంటప్పుడు నన్ను అడగడం ఎందుకు.?

అబ్బా! కాలికేస్తే వేలికెయ్యకే...ఏదో మాటవరసకి అన్నా..

అంతే లెండి ఎంతసేపూ నన్ను ఏదో ఒకటి ఆడిపోసుకోవడమేకానీ పెళ్ళాన్ని పండక్కి బయటకి తీసుకెళ్ళి ఏదైనా కొనిపెడదాం..హోటల్లో భోజనం చేద్దాం అని ఉండదు కదా ..నా బతుకంతా ఇంతే...ఉగాదైతే ఏంటి ...దీపావళి ఐతే ఏంటి..మళ్ళీ కుళాయి..

ఆపవే..ఆపు..ఆ కుళాయి ఆపు ...నిన్ను గానీ ఆపకపోతే హైదరాబాదులో సునామి అదీ వచ్చేస్తుంది..జనం నమ్మరు కూడాను ...ఇంతకీ బయటకెళ్దాం అంటావ్ అంతే కదా..

ఊ..ఇంద కాఫీ...గోముగా భార్యామణి..

మరీ అంత వంకర తిప్పకు మూతి చూళ్ళేను...

పోదురూ బడాయి ..సర్రున గుండెల మీద బొచ్చు పీకింది...నోరు కాలడం వల్లా..బొచ్చు పీకడం వల్లా ఒక్క సారిగా గుండెల మీద మంట...అర్ధాంగి కొంటె చూపు వల్ల గుండెలోపల మంట,,,మొత్తానికి కారంగా తిన్న ఫీలింగు...

ఒసేయ్ నీ మెలికలాపు..అలా మెలికలు తిరిగి తిరిగి అలానే ఉండిపోతావేమో...కొంచెం బయటకు వెళ్ళి ...ఆ వేప్పూత తెస్తా..కొంచెం ఉగాది ప్రసాదం తిని అలా బయటకెళ్దాం లంచుకి...సరేనా....హుయ్ ఏదో సౌండు పక్కనుండాల్సిన నా భార్యామణి బీరువా మీద...

అదేంటే అక్కడున్నావ్..కావాలంటే బీరువాలో చీరకట్టుకుని రెడీ అవు..అంతేకానీ అలా బీరువా మీద కూర్చోకూడదు..

అది కాదండీ మన పెళ్లైన తరువాత మొట్టమొదటి సారి మీరు నన్ను బయటకు తీసుకెళ్తున్నారన్న ఆనందంలో గాల్లోతేలినట్టై ఇక్కడొచ్చి పడ్డా...కొంచెం నన్ను దింపండి గోము గా అడిగింది కొంచెం సిగ్గుపడుతూ...

సరేలే నిన్ను దింపితే..ఇంక నా నడుము ఉన్నట్టే..మరీ సిగ్గు పడకు..నీకు సూటవదు ..కానీ ఇవ్వాళ పండగ కదా..ఇవ్వాల్టికి ఇంట్లో నే తినేసి వచ్చే ఆదివారం బయటకెళ్దాం సరేనా.....

సుయ్ ఈ సారి సౌండు మారింది..చూస్తే నా పక్కనే మా ఆవిడ...నేను ముందే అనుకున్నాను అడగ్గానే మీరు ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను..ఏదో ఒకటి చెప్పి బయటకెళ్ళే ప్రొగ్రాం మార్చేస్తారని...మళ్ళీ కుళాయి తిప్పింది..

అబ్బ ఆపవే..నీ నస, సందు దొరికితే చాలు కుళాయి తిప్పేస్తావు..దిక్కుమాలిన టీ వీ సీరియల్స్ చూడకే అంటే వినవు..నీ గోల నీదే కాని నన్ను పట్టించుకోవే...ఊరికే, నిన్ను బీరువా మీద నుంచి దింపడానికి అల్ల అన్నానంతే..ఎలా ఉన్నాయి మన తెలివితేటలు..

భలె భలే ...అంటూ గెంతులేస్తుండగా,,,,ఠంగ్ ఠంగ్ మని సౌండు ఏంటా అని చూస్తే ఆ గెంతులకి భార్యా మణి పైకెగిరి రూఫు కి తల తగుల్తోంది..

నీ సంబరం బంగారం కానూ ఆగవే...ఉగాది పచ్చడి కి అన్ని రెడీ చేసుకో...అంటూ బయటకి కదిలా...

-----------

లంచు పూర్తి అవుతుండగా...భార్యామణి విశ్వ రూపం చూపించడం మొదలైంది..

ఏవండీ బల్ల కిందనుంచి నా కాలుని తొక్కింది..(ప్రేమగా)
నోట్లో ఉన్న ఐస్క్రీం కాస్తా బయటకొచ్చి చొక్కా మీదా..కొంచెం బల్లమీదా ,,,కారిపోయి పాంటు మీదా పడ్డది..ఏమైందే...అల్ల టొక్కావు..(ice cream effect) అన్నా గాభరాగా తుడుచుకుంటూ,,

అదికాదండీ ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాం కదా...పక్కనే బొందనా బ్రదర్స్ వాళ్ళు పండగ డిస్కౌంటు ఇస్తున్నారట,,ఒక్క సారి చూసొడ్డామండీ....ఎలాగూ ఎండగా ఉంది కదా..కాస్సేపు ఏ సీ లో తిరిగినట్టూ ఉంటుంది....

ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అనిపించింది..ఏ ఐమాక్సుకో, వెళ్ళి అర్ధం లేని సినిమాకో అర్ధం కాని సినిమాకో, మూడొందలు తగలెయ్యడం కన్నా ఇదే నయమని పించింది..
అంతే కాదు ఐమాక్సు కెళితే క్లైమాక్సులోపల, చిప్ప పాతిక రూపయల చొప్పున, మొక్కజొన్న గింజల్ని నా బుర్రని నంచుకుని తినే బాధ కూడా తప్పుతుంది కదా అని సరే అన్నా..(అదెంత తప్పో తరువాత తెలిసింది)

లోపలకెళుతూనే..ఏసీ గాలి పలకరించింది..కాకపోతే ఎంటో ఊదరగొట్టే సౌండు తో పాటలు వినిపిస్తున్నాయి..పక్క వాళ్లు మాట్లాడేది కూడా వినిపించట్లేదు..

ఈలోగ, ఒకతను బహుశా మేనేజరనుకుంటా నవ్వు తూ వచ్చి సారీసా అమ్మా..అన్నాడు కకపోతే ఇక్కడికెందుకొస్తామని అందామనుకున్నా ..కానీ రెండు గంటలు ఏసీ లో ఉండాలి కదా వాడితో గొడవెందుకులే అని వూరుకున్నా..


..ఎంతలో కావాలమ్మా వెంటనే అతని ప్రశ్న,,,

అది నీకెందుకు నచ్చితే ఎంతైనా కొంటాం మా ఆవిడ కొంచెం గట్టిగానే అంది..నాకూ గర్వం గా అనిపించింది.కాని ఎక్కడో ఒక్కసారి భయం కూడా వేసింది..

అది కాదమ్మా ...పెళ్ళి బట్టలు .డిసైనర్ సారీస్ లాంటి వైతే కొంచెం కాస్టీవి పైన ఉన్నాయి...ఫాన్సీ చీరలు అటు వైపున్నాయి మీరు వెతుక్కోకుండా ఉండాలని ....నసిగాడు (ఇలా అనే కన్నా లౌక్యంగా రేట్ల లిస్టు చెప్పాడు అనొచ్చేమో)

మా పెళ్ళి ఎప్పుడో అయిపోయిందిలే..ఏదో ఆఫరన్నారుకదా....అవి చూద్దామని ఈ సారి మా ఆవిడా నసిగింది,,,

అవా! అక్కడున్నయి రేయ్! ఆఫర్ చీరలంట చూపించండ్రా,,అని నా చెవి దగ్గరే గట్టిగా అరిచి అదో రకంగా చూసుకుంటూ.. రండి రండి చీరలా అమ్మా అంటూ అదే ప్లాస్టిక్ నవ్వు అతికించుకుని అప్పుడే లోపలికొస్తున్న వాళ్ళకెదురెళ్ళడు..
------
అతను చూపించిన వైపుకెళ్ళే సరికి ..దుశ్శాసనుడు లాగిన చీరల్లా ఒక ఎత్తైన చీరల కొండ కదులుతూ కనిపించింది..చీరలు కదులుతున్నాయేంటా అని దగ్గరకెళ్ళి చూస్తే ఆ చీరల్లో ఆల్రేడీ కొంతమంది ఆడవాళ్ళు లోపల తమ కు నచ్చిన కలర్లు..డిసైన్లు వెతికే పనిలో ఉన్నారు..మా ఆవిడా వన్ టూ థ్రీ అంటూ ఆ కుప్ప మీద దాడి చేసింది..

కాసేపు పెనుగులాట తర్వాత ...రెండు , చీరల్తో బయటకొచ్చింది మా ఆవిడ...ఒక్కోచీర గురించి చెబుతూ ఇది ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ వాడిన (సారీ కట్టిన అనాలేమో)

అసలు సినిమాల్లో హీరోయిన్లు చీరలు ఎక్కడ కట్టుకున్నారే అని అమాయకంగా అడిగా..

మీరెప్పుడూ అంతే చిలిపి... తొక్కూడేలా చెంపమీద గిచ్చి...ఫామిలీ ఫొటోలో కట్టుకుందిలెండి...

ఫొటోలో కట్టింది కూడా చూసి గుర్తుంచుకున్న ఆవిడ సునిశిత, సూక్ష్మ,దృష్టి కి ఆశ్చర్యపోయి ...సరే నీకు మరీ నచ్చితే తీసుకో అన్నా..

మళ్ళి ఎగిరి గంతెయ్య బోయి షాపు కదా అని తమాయించుకుంది..

మీరు..... మళ్ళీ ఏదైనా చేసుతందేమో అని నేనే ఒక్క గెంతు పక్కకి గెంతా...మా సర్కస్ ఫీత్లు చూసి ఇందాకటి మేన్నేజర్ లాంటి ఆయన మళ్ళీ వచ్చి నుంచున్నాడు..ఇంతలో మా ఆవిడ ఆ చీర చూసి ఏమండీ దీనికి కన్నం ఉంది ఏంటండీ..... నన్నో, ఆ అమేనేజర్నో , అర్ధం కాలే ..కానీ ఇలాంటి వన్నీ అలవాటైన ఆ మేనేజరు ..ఇవన్నీ కొంచెం పాడైన చీరలమ్మా అందుకనే ఆఫర్లో ఇస్తున్నాం.. సేం ఇలాంటి చీరే మంచివి , కొత్త స్టాకు పైన ఉన్నాయి రండి అంటూ తీసుకెళ్ళాడు..ఐదు నిమిషాల్లో ..ఐదు వేలు బిల్లుతో తిరిగొచ్చిన మా ఆవిడ ఆనందం చూసి....ఐదొందలు అనుకున్న బడ్జెట్ ఐదు వేలు ఐనా , కుళాయి గుర్తొచ్చి వెంటనే క్రెడిట్ కార్డు తీసిచ్చా..దాన్ని అపురూపంగా అందుకుంటూ...మీకు పేంట్ షర్ట్స్ ఏమీ వద్దా సార్ మంచి ఆఫర్ ఉంది... అని కొంటె గా నవ్వాడు....ఆ మేనేజర్...

పబ్లిసిటీ కోసం వాళ్ళు పెట్టిన ఆఫర్ దెబ్బకి...అప్పటికే దిమ్మ తిరిగిన నేను లేవడానికి మరో నెల పట్టొచ్చు..మళ్ళీ వచ్చే నెల కలుద్దాం...అందరికీ ఉగాది శుభాకాంక్షలు...పండగ ఆఫర్ల పట్ల పారా హుషార్....

కామెంట్‌లు లేవు:

LinkWithin

Related Posts with Thumbnails