ఊళ్లో పెళ్ళికి
ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, అని ఒకప్పటి సామెత. అలానే జరిగింది నిన్నటి విషయం. పవన్ కళ్యాణం గురించి హడావిడి చేసిన మీడియాని చూస్తుంటే విసుగేసింది. అదేదో మూడో పెళ్ళన్నట్టు, లేకపోతే ఫస్త్ టైం జరుగుతున్నట్టు హెడ్డింగులెట్టి హడావిడి చేసి కంఫ్యూజ్ చేసారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు సమక్సంలో జరిగిన పెళ్ళికి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు వెళ్ళి ఏమీ దొరకక ఎక్కడినుంచో కవర్ చేసి మాదే స్పెషల్ కవరేజి అన్నట్టు చెప్పి నానా హడావిడి చేసారు.. ఆయన అంతకు ముందునుంచే ఆవిడతో సహజీవనం చేస్తున్నా అని ఎప్పుడో ప్రకటించారు. అంతకుముందావిడతో విడాకులయ్యక ఇప్పుడు వీలు చూసుకుని పెళ్ళి చేసుకున్నాడు.
మొన్నామధ్యా అంతే బాలయ్య కూతురికి..చంద్రబాబు కొడుక్కీ పెళ్ళైతే ఇంటిముందు కెమెరా పెట్టుకుని లోపలకి వెళ్ళే వాళ్ళని..వచ్చేవాళ్ళని చూపిస్తూ వాళ్ళకి తోచిన స్టోరీలలారు. ఎన్ టీ ఆర్ కి అవమానమైందని అందుకే వెళ్ళిపోయాడని..ఇంకెవరో రాలేదని దానికి కారణాలు ఇవి అని..ఇక వాళ్ళిష్టం...
మోహన్ బాంబు ఇంటి విషయం లో కూడా అలానే తలదూర్చి తల వాచేలా తిట్లు తిన్నారు. ఎంత సెలెబ్రిటీలైతే మాత్రం వాళ్ళకి ప్రైవేటు జీవితాలుండవా. వాళ్ళ ప్రతీ విషయం ప్రజలముందుంచాలా ? చూపించడం తప్పో కాదో కానీ..తోచిన కధనాలు అల్లడం..నచ్చిన హెడ్ లైన్లు పెట్టడం ... వీలైనన్ని సార్లు చూపడం రోత..
న్యూసెన్సె టీ వీ లు ఎప్పటికి బాగుపడతాయో ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి