ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వసుం 'ధర' - వెజిటబుల్ లోన్

వెజిటబుల్ లోన్
(వసుంధర అంటే భూమి అని పేరు కానీ ఇప్పుడు భూమి ధర కూడా ఆకాశంలో వుంది..)

నమస్కారం మేము ఏ బీ సీ డీ బాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు కిలో టమాటా కొనడం కోసం అప్లై చేసిన లోన్ ని మీకు అందించలేక పోతున్నందుకు చింతిస్తున్నాం,,,మీ జీతం కేవలం నలభై వేలు కావటం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ చెయ్యడం అయినది..ఎవరైనా అరవై వేలు కన్నా ఎక్కువ జీతం ఉన్న వారు గ్యారంటీ ఇచ్చినట్లైతే మీకు లోను అందజేయబడుతుంది..ధన్యవాదములు.....

ఏమిటీ,,,,ఆ అబ్బాయిని ప్రేమించావా...మన అంతస్థేమిటి ? వాళ్ల అంతస్థేమిటి..? వాళ్లు నెలకి ఒక్క సారి టమటా వేసి చారు పెట్టుకుంటారు...మనం వారానికి ఒకసారి టమాటా పప్పు చేసుకుంటాం...అలాంటి పేద వాడితో ప్రేమ..నో అతన్ని మర్చిపో..ఒక ఇంట్లో పెళ్ళి గోల.....


ట"మాట" మాట తలుచుకోవాలన్నా భయంగా ఉంది..కిడ్నీ లో రాళ్ళొస్తాయట అందుకే మానేసాం అని చెప్పుకుని తిరుగుతున్నా, అసలు కారణం అందరికీ తెలుసు..అదే ..ధరణి దాటిన ధరలు
ఆకాశాన్నంటిన ధరలు అశ్విని-భరణి పక్కన ఫక్కున నవ్వుతున్నాయ్..
షేర్ల ధరలు..రూపాయి విలువలు..పాతాళంలోకి దారులు తవ్వుతున్నాయ్..
స్వాతంత్ర్యం తెచ్చినందుకు నోటుమీద మనం అచ్చేసినందుకు.. బోసినోటి గాంధీ తాత ఇక్కడెందుకున్నానా అని బాధ పడుతున్నాడు పాపం..
గాంధీ పేరు చెప్పుకుని రాజ్యాలేలే నాయకుల నిజాయితీ లాగా అడుగంటుతున్న ఆర్ధిక స్థితి బహుశా ఆ ఆత్మల శాపం..

ఇడుపుల పయలు..ముడుపుల మాయలు..ప్రజల సొమ్ము నాయకుల పాలు..
కూలే గుడిసెలు..కాలే కడుపులు..పోయే ప్రాణాలూ..రాలే బతుకులు..
భరత మాతకు కడుపు కోతలు..చూసినా పట్టించుకోరు నేతలు..
ఎన్నికలొచ్చేదాకా హామీలు..కుమ్మరించి..ఎన్నికయ్యాక అన్నీ విస్మరించే ఈ నాయకులున్నంత కాలం మన బతుకులింతే....

అర్జెంటుగా ఈ పరిస్థితులు మారవు గానీ..త్వరగా వెళ్ళి లోను తీసుకోవాలి..పావుకిలో టమేటా కొనాలి..ఈ మధ్యే నాకు వెజిటబుల్ లోన్ కి ఎలిజిబిలిటీ వచ్చింది..మీకూ కావాలా ? జీతం నలభై వేలు ఉంటే చాలు...నన్ను కలవండి ఇప్పిస్తా..(నాక్కూడా కమీషన్ కింద 3 టమాటాలిస్తారు..మరి).......

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!