Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, సెప్టెంబర్ 17, 2008

హోమం లో మిడతలం మనం

హోమం లో మిడతలం మనం


ప్రేక్షకుల్ని సమిధల్ని చేసి, నిర్మాత పైసల్ని ఆజ్యంగా పోసి తీసిన ఒక సినిమా ఇటీవల వచ్చింది...ఫైటింగు, టేకింగు మాత్రమే కాదు మాత్రు దేవత అదే అమ్మ సెంటిమెంటు కూడా వుంది అంటూ ఆడ ఫాలోయింగు ఉన్న హీరోగారు ..అవును అమ్మ మీద వొట్టు చాలా కష్టపడి తీసాను అంటూ డైరెక్టర్ కం హీరో కం విలన్ గారు నొక్కి వక్కాణించారు, నిజమే నీ అక్క పిసికి చంపుతా అంటూ ఓ స్త్రీ మూర్తి పాడే సాంగు లో కూడా వుంది అక్క సెంటిమెంటు గురించి మర్చిపోయినట్టున్నారు వాళ్ళు, మంచి మహిళా చిత్రం అంటున్నారు..


చాలా కాలం క్రితం ' కత్తుల రత్తయ్య ' అనే సినిమా వచ్చింది..ఎస్ వీ ఆర్ ఖూనీలు చేసే రౌడీ అయితే, సీ. ఐ. డీ. బాలయ్య పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు...తీరా చూస్తే బాలయ్య డాన్, ఎస్ వీ ఆర్ పోలీస్ అని తెలుస్తుంది..అలానే ప్రభాకర్ రెడ్డి పోలీస్ గా చెలామణి అయి క్రిష్ణ ని డాన్ గా చూపించే బాండ్ సినిమాలు వాచ్చాయి..

చాలా కాలం తరువాత నైజాం దాదాలని, రాయలసీమ రుస్తుం లని, గూండాలని, చితకతన్ని 'స్టేట్ రౌడీ' గా అవతరించింది పోలీసు ఇన్స్పెక్టర్ అని మెగా మూవీ కూడా వచ్చింది....ఆ తర్వాత 'పోకిరి'లా కనిపిస్తూ , కనిపించిన వాడినల్లా తంతూ, డాన్ లని వణికించే పండుగాడు వాళ్ళతోనే వుంటూ వాళ్లకి గుండెనొప్పి తెప్పించి 75 ఏళ్ళ సినీ రికార్డులు తిరగరాసింది క్రిష్ణమనోహర్ ఐ పీ ఎస్ అని ఒకటి, అదే 'ఖతర్నాక్' ఐడియాతో ఒక ఇడియట్ లాంటి వాణ్ణి చదివించి పోలీసుల్లో చేర్చి మరో డైరెక్టరూ చేసింది ...ఇప్పుడు మళ్ళీ అదే కొత్త పాయింటు చుట్టు కధ అల్లి హోమం ఎందుకు చేస్తారో అర్ధం కావట్లేదు...
కొసమెరుపు : మమైత్ లేని బాధ మమ(మై)త మోహన్ దాస్ తీర్చింది, ఇక ఐటం సాంగు కు సాక్షి ఎక్స్ట్రా...

3 కామెంట్‌లు:

Kathi Mahesh Kumar చెప్పారు...

నిజానికి ఇది అస్కార్ అవార్డ్ సాధించిన "ది డిపార్టెడ్" సినిమాకు బ్యాడ్ కాపీ అంతే!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

హోమాల్లో మిడతల్ని వెయ్యరు. సమిధల్నే వేస్తారు.

అజ్ఞాత చెప్పారు...

అసందర్భమే అయినా చెప్పక తప్పదు. మీ బ్లాగు బావుటా (బ్యానర్) లో వాడిన "తెలుగు జెండా" అనే మాట నాకు పారవశ్యాన్ని కలిగిస్తోంది. "ఎటో వెళ్ళిపోయింది మనసు..."

LinkWithin

Related Posts with Thumbnails