కొత్త చిరంజీవి(తం)
(నేనేమీ చిరంజీవి ఫానుని కాను అత్లా అని ఇంకెవరికో కాను..ఎలాగూ వచ్చేశాడు కదా అని
ఇలా...)
(నేనేమీ చిరంజీవి ఫానుని కాను అత్లా అని ఇంకెవరికో కాను..ఎలాగూ వచ్చేశాడు కదా అని
ఇలా...)
మొత్తానికి ...చిరంజీవికి కొత్త జీవితం మొదలైంది..చిరంజీవి కొత్త పార్టీ మొదలైంది...ఆంధ్రా
అంతటా కూడా పార్టీలు మొదలయ్యాయి..కొందరు ఆనందం తో, కొందరు టెన్షన్ తో..కొందరు
ఇంకో కారణం తో...
సినీ రంగం లో ఎలాంటి "పునాది రాళ్ళు" లేక పోయినా "స్వయం క్రుషి " తో సినీ రంగంలో
'జగదేక వీరుడు ' అనిపించుక్కున్నాడు..
రాజకీయాలలో 'ప్రాణం ఖరీదు" చాలా తక్కువ..'ఊరికిచ్చిన మాట ' కోసం అభిమానులు
మోస్తున్న 'మంచుపల్లకీ'లో వస్తున్నా..ఈ 'యుద్ధ భూమి ' లో ..'మంచి దొంగ ' లు
ఉండరు..అంతా.. 'రాక్షసులూ,'గూండాలూ, 'కిరాతకులూ, 'యమకింకరులూ
''మరణ మ్రుదంగం' , 'రుద్ర వీణ'లు వాయించే ఈ రాజకీయాలలో 'చంటబ్బాయి' ఎలా
నెట్టుకొస్తాడో ఏమిటో ? చూడాలని ఉంది
'ఆపద్బాంధవుడి' లా రక్త దానాలతో ఎంతో మంది 'పసివాడి ప్రాణా 'లు కాపాడి , ఎప్పటికీ
'చిరంజీవి' గా ఉండేలా నేత్ర దానాలు చేయించి, అందరి ఆశీస్సులు మోస్తున్న ఈ 'ముఠా
మేస్త్రీ', ఎన్నికలలో గెలిచి 'విజేత' కావాలంటే..రిగ్గింగులు చేసే..'స్టేట్ రౌడీ'లని,
పోలీసు మామల తో దోస్తీలుండే 'రౌడీ అల్లుళ్ళ'నీ కూడా ఒక కంట కనిపెట్టాలి...పని పట్టాలి..
తమ్ముళ్ళని జాగ్రత్తగా హాండిల్ చెయ్యడం ఒక 'చాలెంజ్'. మెగా అభిమానం తో వాళ్ళు చేసే కొన్ని
పనులు కొంచెం శ్రుతి మించినా ప్రాబ్లమే! అందుకు, 'అన్నయ్య ' 'హిట్లర్ ' లా
ఉండాలి..మరి దానికి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో ?
చంద్రబాబు, రాజశేఖరుడు, చంద్రశేఖరుడు అనే 'ముగ్గురు మొనగాళ్ళని ' ఎదుర్కొనాలంటే
తమ్ముళ్ళు చాలా గట్టిగా పనిచెయాలి..'బావగారు బాగున్నారు ' కాబట్టి కొన్ని టెన్షన్లు ఆయన
తీసుకుంటాడు..ఈయన 'మంత్రిగారి వియ్యంకుడూ..అక్కడ వదిలేసి ఇక్కడకు వచ్చాడు
అంటూ వచ్చే 'మహానగరంలో మాయగాళ్ళు ' కూడా చాలా మందే వుంటారు..జాగ్రత్తగా
ఉండాలి..
'మనవూరి పాండవులు '..నాగేంద్రబాబు, 'తమ్ముడు ' కళ్యాణ్,అల్లు,మిత్రా తో
కలిసి,,ఆలోచించినా , ఇన్నాళ్ళ 'సంఘర్షణ ' ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి అభిమానుల 'అభిలాష ' తీర్చి 'ఇది కధ కాదు ' అని నిరూపించి ' మగమహరాజు ' గా నిలవాలి 'అందరివాడు ' గా నిలబడాలి అంటే ఈ 'గాంగ్ లీడర్ ' కి ఆ 'మంజునాధుడూ, 'త్రినేత్రుడూ',అంశ ఐన ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉండాలని
కోరుతూ.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి