Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

ఆదివారం, ఆగస్టు 03, 2008

టీవీ మాయ

టీవీ మాయ
సెకండ్ ఎపిసోడ్... ఇది టీవీ మాయ..
ఒక అత్త ఒక కోడలు,,ఒక పనికిరాని మొగుడు...ఒక పనిలేని మావగారు ...అనే నాలుగు కారక్టర్లు నాలుగు సంవత్సారాల కన్నీటి ధారవాహికల మధ్య పోరాటాలు..టీవీ స్పెషల్..పాపం ఆ హీరోయిన్ కి కష్టాలు ఎప్పటికీ తీరవు...ఒక భర్తకి ఇద్దరు భార్యలు....కుళ్లుకునే తోటికోడలు..చిచ్చులుపెట్టే ఆడపడుచు..అవమానించే అత్తగారు..హింసించే మొగుడు...మావగారు మాత్రం సపోర్టుంటాడు..ఇన్ని కష్టాలు భరిస్తూ...ఇంటి మొత్తాన్ని ఉద్ధరిస్తూ ఉంటుంది ఆ కోడలు..ఒక కష్టం తీరిన వెంటనే తలుపు దగ్గర వైట్ చేస్తుంటుంది మరో కష్టం...ఇలా కొన సా ఆ ఆ ఆ ఆ ఆ అగుతూ పోతుంటాయి ఆ సీరియళ్ళు...అందులో వొదినా మరుదులుగా వేసిన వాళ్ళూ అకా తమ్ముళ్ళు గా వేసిన వాళ్ళు నిజ జీవితంలో ప్రేమించేసుకుని పెళ్ళి చేసుకునే అవకాశం కూడా వుంది...
ఇక లైవ్ ప్రఒగ్రాములు...మీరు అడుక్కోండి మేమేస్తాం అని ఫోన్ చేసి అడుక్కునే ప్రోగ్రాములు...వేళ్ళు నెప్పులు పుట్టేల నెల ట్రైచేస్తే....వాళ్ళకు నచ్చిన పాటలు వేస్తారు...
ఇక ఆట పాటల పోటీలు...
వీటికి ఏ ప్రాతిపదికన సెలక్టు చేస్తారో ఆ భగవంతునికే తెలియాలి..మధ్యలో ఏడుపులు..ఆత్మ హత్యా ప్రయత్నాలు..లేచిపోవడాలు..కొట్టుకోవడాలు..ప్రేమలు..యుద్ధాలు....అలకలు..నిందలు...నిష్టూరాలు..ఎస్ ఎం ఎస్ స్కాములు.....పక్షపాతాలు..ప్రాంతీయ తత్వాలు....సెంటిమెంటులు...యాక్సిడెంటులు.....సింపథీలు....జడ్జీల ఇగోలు...యాంఖరు పైత్యాలు...అబ్బో బోల్డంత మసాలా...ప్రేక్షకులతో ఆడుకునే ఇలాంటి ఆటలో ఎప్పుడూ గెలుపు వాళ్ళదే...కాలు జారి కిందపడ్డ ఆ అమ్మాయి మళ్ళీ ఆడిందా లేదా వొచ్చే వారం చూడండి...అంటూ ఉత్ఖంట రేకెత్తించి మధ్య మధ్యలో నేను చచ్చిపోతా అంటూ ఆమె ఏడ్చే సన్నివేశాలతో..యాడ్లు వేసి తరువాత వారం వరకు ప్రేక్షకుల్ని పట్టివుంచే ఎన్నో ట్రిక్కులు...అన్నీ మన ఆనందం కోసమే...ఇక పిల్లల మధ్యలో పోటీ ...వాళ్ళ కెరీర్లు ఏమౌతాయఓ తెలీదు...ప్రతీ పోటీలో ఒక్కరే విజేత...కానీ యాబహి రెండు వారాల వాళ్ళ ఆటలో వోడితే అన్నిరోజుల శ్రమ ఏమౌతుంది...చదువు ? హైదరాబాదులో జరిగే పోటీల కోసం వూర్ల నుంచి వచ్చి ఉండిపోయి చివరకు గెలవక ....బాధపడే ఎందరో అమాయకులకు సానుభూతితో ఈ పోస్టింగు...అంకితం

2 కామెంట్‌లు:

Jagadeesh Reddy చెప్పారు...

టీ.వి. గురించి చాలా బాగా చెప్పారు. సంసారాలు నాశనం అయిపోతున్నాయండి బాబు. ఈ వెధవ సీరియల్స్ గొడవే భరించలేకపోతుంటే కొత్తగా ఈ డాన్స్ ప్రోగ్రాముల గోల ఒకటి. ఈ పీడ విరగడ అవ్వలంటే ఏదోకటి చెయ్యాలి. కాస్సేపు ఇంటిలో ప్రశాంతంగా ఉందామంటే కుదరడం లేదు.

MURALI చెప్పారు...

ఈ డ్యాన్స్ షోల గొడవ ఎక్కువయ్యింది.వీళ్ళ overaction భరించలేకపోతున్నా.

LinkWithin

Related Posts with Thumbnails