ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రబ్బరుకు పూసిన పన్నీరు

చూద్దాం రాద్దాం అనుకుంటుంటే కాలం గడిచిపోతోంది...ఎన్నో రాద్ధాంతాలూ జరిగిపోతున్నాయి..జరిగిపోయాయి..మొన్నా మధ్య దశాపచారం రాస్తే సగమే ఉందన్నారు... సినిమా నే సగం సగం అనిపించింది నాకు..

అసలు నా ద్రుష్టిలో
మైకేల్ మదన కామ రాజు లో 4 కారెక్టరులు, అప్పు 1, భామనే సత్య భామనే 1, సాగర సంగమం 1, అమావాస్య చంద్రుడు 1, ఇంద్రుడు-చంద్రుడు లో రాయుడు 1, తెనాలి లో 1 ...వెరసి 10 వేషాలు వేసి కధ అల్లినా బాగుండేదేమో అని... ఎందుకంటే రబ్బరు తొడుగుల అవసరం లేని ఆర్టిస్టు కమల్...కాలివుడ్డు, బాలివుడ్డు,టాలివుడ్డు,హాలివుడ్డు లోని వుడెన్ ఫేసుల్లా కాదుకదా ..

కాక పోతే ఏ విగ్రహం తో కధ మొదలైందో ఆ విగ్రహాన్ని చివరి వరకు కానీ, చివర్లో కానీ పట్టించుకోక పోవటం బాధ వేసింది,,,,విగ్రహం మీద చారిగిలపడి ప్రేమ వ్యక్తం చేసిన లోక నాయకుడు...తరువాత వేదిక మీద కనిపించాడు..మరి రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు...అని పాడిన పాటలో అర్ధం ఆ దేవుడికే ఎరుక...కాస్త ఆ విగ్రహాన్ని కూడా వొడ్డున పడేస్తే.. అంటే సముద్రం వొడ్డున కాదు...కధలో ప్రాధాన్యతనిచ్చి....

ఇక సంగీతం...ఊ ఊ అంటూ మూలిగే హిమేష్ రేష్మియా కు కాకుండా మన దక్షిణాది వారికిచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో..ఎలాగూ రి రికార్డింగు మన దేవీయే చేశాడు...రహమాను కాకపోతే..జయరాజు..కాకపోతే ప్రకాషు....ఎవరైనా ఒకరు...ఎందుకంటే సింగు గారికి కూడా పంజాబీ శైలి కాకుండా ఆయన స్టైలే పెట్టి...ఉసూరుమనిపించాడు...ఊ ఊ అనిపించి....

బామ్మ గారు చూడండి... ఆ రబ్బరు తొడుగులో అర్ధం కాకుండా..భామనే సత్యభామనే లో మనకి బాగా అనిపిస్తాడు...కనిపిస్తాడు..

ఇక విలను.,జపాను యోఢుడు..లంబూ మనిషి వీళ్ళలో కమల్ని వెతకడం కష్టమే..కష్టపడి నలుగురు కమలులు కలిసి చేసిన పనితనం అంతా వేశ్తే కదా...అన్నిట్లోకి పోలీసు నాడారు అద్భుతం..బాలు గొంతు కూడా.. శైలి కూడా అదిరింది...కాకపోతే దొంగా దొంగాలో బాలూ నే గుర్తుకొచ్చారు....

నా బాధంతా
కష్టమంతా రబ్బరుకు పూసిన పన్నీరైందే అని


వ్యాఖ్యలు

K చెప్పారు…
విగ్రహం గురించి పట్టించుకోనక్కర్లేదనుకుంటా...మీరు వికీపీడియాలోను, గూగుల్ లోను chaos theory and butterfly effect గురించి చదవండి (దశావతారం కి సంబంధించినది). రెహమాను ఎందుకు సంగీతం చెయ్యలేదో కూడా తెలుస్తుంది. నా మటుకు రేషమ్మియ్య బాగానే చేసాడనిపించింది. ఈ సినిమా మొదలుపెట్టేనాటికి (2005) హిమేష్ బాగా హిట్ డైరెక్టరు. అప్పటికింకా దేవిశ్రీ ఇంతగా ఫేమస్ అవలేదు. మీరన్నట్లు కొన్ని పాత్రలు శుద్ధ వేస్టు (దుష్ట సమాసము). మా ఫ్రెండొకడు అంటుండేవాడు (హిందీ డైరెక్టరు రాంసే హారర్ సినిమాల గురించి) - రాంసే సినిమాల్లో క్యారెక్టర్స్ అందరూ మొహానికి డాల్డా పూసుకు తిరుగుతారని. 4 కమల్ పాత్రలు (బుష్, ఫ్లెచర్, బామ్మ, కలీఫుల్లా ఖాన్) అలాగే ఉన్నాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!