Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

ఆదివారం, మే 25, 2008

చీ లీడర్స్...


చీ లీడర్స్...
క్రికెట్ ఆటలో అర్ధ నగ్నంగా ఆడుతున్న చీర్ లీడర్స్ ని ఆడిపోసుకుంతున్నాం కానీ ఎన్నికల సందర్భంగా సిగ్గొదిలేసి నగ్నంగా అంటే అసలు మాకు సిగ్గులేదన్న విధంగా గల్లీలలో నాయకులు చేస్తున్న గెంతులకి యేమనాలి...చీ లీడర్స్ అనేనా...


అసలు ఈ మధ్యంతర ఎన్నికలు ఎందుకొచ్చాయో అర్ధం కావట్లేదు.
నిజంగా ఒక యేడాది పాటు కొన్ని ప్రాంతాలకి నాయకులు అంటే ఎం ఎల్ యే లు లేకపోతే ఏమవుతుంది..,.? అసలు వుంటే మాత్రం, వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళు ఏమన్నా చేస్తారా. ? ఇన్నాళ్ళలో చెయ్యంది ఈ ఒక్క యేడాది లో యేమి చేసేస్తారు? చేసే వాళ్లకి పదవులు అవసరమా.. ఈఖర్చంతా ఎవరి జేబులోంచి పెడుతున్నారు.. పోని ఎన్నికైన వాళ్ళు ఇప్పట్నుంచి ఐదేళ్ళు ఉంటారా?
అసలు పదవి తీసుకోవడమెందుకు? రాజీనామా చెయ్యడమెందుకు..? మళ్ళి ఎలెక్షన్ పెట్టడమెందుకు.. ? ఒకరేమో రెఫరెండం అంటారు ఒకరు కాదంటారు? తెలంగాణా వస్తుందంటారు.. రాదంటారు... నిజంగా ఇది తెలంగాణా మీద భక్తేనా? లేకపోతె ప్రజల సెంటిమెంటు మీద డబ్బు చేసుకోవడమా...తెలంగాణ ప్రజలేమో మండే యెండల్లో.. నాయకులెమో ఏ సీ బస్సుల్లోఅ యాత్రలు..
అసహ్యంగా రోడ్లమీదకొచ్చి.. బట్టలుతుకడం, ఇస్త్రీ చెయ్యడం, మటన్ కొట్టడం, బోరింగ్ కొట్టడం, వీధులూడవడం.. లాంటి అడ్డమైన పనులు చేసి ప్రజలను మభ్యపెట్టే నాయకులారా...ఈ పిచ్చివేషాలు ఇప్పటికైనా ఆపండి.. నిజంగా చిత్తసుద్ధి వుంటే ఎన్నికలయ్యాక మీ నియోజక వర్గం ఒక్క సారి వచ్చి ఈ పనులు చెయాండి తరువాత ఎన్నికల్లో కూడా మీరే గిలుస్తారు.. సడెన్ గా అన్నిమతాల టోపీలు పెట్టుకుని,, ప్రార్ధనా స్థలాలకెళ్ళి, పూజలు చేసేసి,, సహపంక్థి భోజనం చేసేసి.. ఎన్ని వెధవ వేషాలు వేసినా వాళ్ళ వోటేసేది మీ దగ్గరి గూండాలే కదా పాపం వాడి వోటు వాడెక్కడ వేయగలడు...ఇంకా ఆ షాకు లోంచి తేరుకోకముందే ఎన్నికలు అయిపోతాయి.. మీరు వాడితో తిన్నది కఓ నిజమో తెలిసేది మళ్ళీ వాడికి ఆకలేసి కడుపు కాలినప్పుడే .. అప్పటికి తమరు ఈ సభలు చాలించి ఎసెంబ్లీ లోనో పార్లమెంటు సభలోనో మీ నాయకుణ్ణి పేరు పెట్టి పిలిచారనో... పాకిదొడ్డి ప్రారంభోత్సవానికి పిలవలేదనో వాకవుట్ చేసి గెస్ట్ హవుస్ లో మీ సహచరులతో సహపంక్తి భోజనాలు మీ నాయకుల భజనలు చేస్తుంటారు....
పాపం పేదవాడు మాత్రం ఎన్నికలప్పుడు మిగిలిన బానర్లు సాలువగా కప్పుకుని మురిసిపోతుంటాదు...వస్తాడు నారాజు అని ఎదురుచూస్తూ శిలా విగ్రహం లోఅ మరో ఏడాదో ఐదేళ్ళో ఎదురుచూస్తూ ఉంటాదు.. మీరు మాత్రం గాంధీ గారి పేరు చెప్పుకుంటూ వారసులమని చెప్పుకుంటూ గాంధిని ముద్రించిన నోటు తో కొన్న మందుకొత్తి పేదవాడి ఆశలని మంచింగ్ గా నంచుకోండి....ఎంజాయ్

1 వ్యాఖ్య:

krishna rao jallipalli చెప్పారు...

చీర్ లీడర్స్ .. no wrong .. stadium లో ఉన్నవారు .. అందరు పురుషులు స్త్రీలు .. అందరు వారిని ఆమోదిస్తున్నారు. so called sudo మనుషులు మాత్రమె విమర్శించుతున్నారు. నిజం. ఈ సుడో గాళ్ళు కూడా చొంగలు కార్చు కుంటూ వారిని చూసిన వాళ్ళే. ఏదో పైకి .. అసహ్యం.. అది ఇది అని వాగుతారు.. . cheer leaders... its their profession. నిజమైన నిజయితిపరులు.. వీరే..

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa