Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, ఫిబ్రవరి 15, 2008

నంది బహు ' మతులు '

ఈ మధ్య నంది బహుమతులు విడుదల చేసారు..చాలా ఆనందం కలిగింది...కళ్ళు చెమ్మగిల్లాయి....అర్ధంకాక....అదే ఏ ప్రాతిపదికన ఉత్తమ సినిమాలూ, నటులూ వగైరాలు నిర్ణయిస్తారో తెలీక...
ఒక కోటీస్వరుడైన తండ్రి...తన కొడుకు అందంగా ఉండాలనీ।;;తన వ్యాపారం చూసుకోవాలనీ,,,,,అన్నిట్లో గెలవాలనీ...బాగా ఎదగాలనీ పిచ్చి పిచ్చి కలలు కంటాడు...కానీ అప్పుడు ఆ తండ్రి తనని బాగా హింసిస్తున్నాడని....తాగనివ్వట్లేదని.....తాగి ( తన కాబోయే మావగారితో సహా ) ఎవ్వరినీ కొట్టనివ్వట్లేదనీ...తండ్రిని బూతులు తిట్టనివ్వట్లేదని తెగ ఫీలై .........అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకి వచ్చి,,,,,రోడ్డు మీద బండి పై ఐస్క్రీం తినే ఉత్త మ నటిని ప్రేమిస్తాడు...ఆ పిల్లని వారం రోజులు ఇంటికి తీసుకువస్తాడు...డేతింగ్ లా వీకింగ్ అనాలేమో.......ఆ కొత్తింట్లో అదే కాబోయే అత్తింట్లో...ఉండి నచ్చక వెళ్ళిపోతానంటుంది...ఆ ఉత్త మ నటి....చివరకి తను పిచ్చి కలలు కనడం ....( పిల్లల్ని కనాలి కానీ ) తప్పు అని తెలుసుకుని సదరు హీరో గారికి సారీ చెబుతాడు...కానీ అప్పుడు నా చేతులు ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయి నానా అనే ఆ కొడుకు ని చూసి మురిసి మెచ్చి ఇచ్చిన నంది కి ......

ya i am a bubly girl, its an innocent charecter, i love telugu industry, i love telugu audience,
అంటూ గల గలా ఇంగ్లీష్ మాట్లాడే ముద్దు గుమ్మ ఉత్త మ నటి..పాపం రామదాసు భార్యలా యేడవడం రాక యెప్పుడూ నవ్వుతూ ఉండే హాసిని...ఐస్క్రీం నాకుతూ .....గెంతులేసే పదహారణాల తెలుగు జూలియెట్....
మంచి కాఫీ లాంటి కొత్త కధ కధనం తో అమెరికా కలల ( డాలర్ డ్రీంస్) డైరెఖ్టర్....అందించిన మంచి కాపీ లాంటి ( అందాల రాముడు ) చిత్రం మన ఉత్తమ ద్వితీయ చిత్రం....నంది గోదావరి పాలు...
ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అవార్డులు యెందుకు వస్తాయో ? ఎందుకు కొందరికి రావో...? డాక్టరేట్లు ఎవరికి ఇస్తారో...ఎందుకిస్తారో ? పద్మ అవార్డులు ఎలా వస్తాయో...కొందరికి ఎందుకు రావో...? అర్ధం కాదు..... 40 యేళ్ళ నుంచి పాడుతున్న సుశీల కన్నా ముందు ' చిత్రం ' గా 40 ఏళ్ళు కూడా రాని గాత్రానికిచ్చిన ప్రభుత్వాలే చెప్పాలి.....సుశీల తమిల గాయనా ? తెలుగా? మన వాళ్ళకేమన్నా తెగులా..? ఎలాగూ పరభాషా గాయకుల్ని భరిస్తున్నాం...కనీస్మ్ పాత తరానికి విలువిస్తే....పాపం రాకుండానైనా ఉంటుంది....
కమిటీ వాళ్ళు కొంచెం బహుమతులిచ్చేటప్పుడు..మతులు వాడితే బెట్టర్.....

కామెంట్‌లు లేవు:

LinkWithin

Related Posts with Thumbnails