ప్రధాన కంటెంట్‌కు దాటవేయిసంక్రాంతి శుభాకాంక్షలు, మామూలుగా పంట చేతికొచ్చినందుకు చేసుకునే పండుగ ఇది..కానీ ఈసారి జరిగిన పెంటలను తలుచుకుంటే...అసలు పండుగ చేసుకోవాలంటేనే దిగులుగా ఉంది..బాంబుల తో రక్తసిక్తమైన రాజకీయ నాయకుల జీవితాలు...ఎందరినో సోకంలో ముంచి పోయిన జనార్దనులు..లేచిపోయిన పెళ్ళిళ్ళు...బలవంతంగా రాజకీయాలలోకి లాగుతున్న మెగా అభిమానుల తొందరపాట్లు .....పెరిగిపోతున్న ధరలు.....సంచలన వార్తలకోసం ప్రతిదానినీ రచ్చకెక్కిస్తున్న చానెళ్ళ విశ్రుత విక్రుత కార్యక్రమాలూ....కొత్తదనం లేక పోయినా టైముకి వాలిపోయే కొత్త సినిమాలూ......ఇలా చెప్పుకుంటూ పోతే నాలాగా అంతా నెగిటివ్ గా మాట్లాడే కొందరూ....ఇవన్నీ చూసే కాబోలు ఆ గంగిరెద్దు పరిగెడుతోంది...
ఐనా రేపు అనేది ఆశావహం కాబట్టి అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!