ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హాపీడేస్

గెస్ట్ - ది అతిధి లో స్పెషాలిటీ యేమిటీ అని ' జుట్ట్లు ' పీక్కుంటుంటే " జుట్టే " అని తేల్చారు. ఔను ' నిజం ' ...రోజు కి 8 వేలు పోసి పోషించిన జుట్టు కే అర కోటి చమురు వదిలిందిట. కధ లో కొత్తదనం ఎలాగూ ఉండదు కాబట్టి గెటప్ లో కొత్త ఢనం చూఇంచారు మన వాళ్ళు.. సరే యేదో ఒకటి అని సినిమా చూడ్డానికి వెళ్తే ' అతడే ' అతిధి అని తెలిసి ' జుట్టు ' పీక్కోవటం ఇక మన వంతు...


ఇక ' వేప ' గొప్పదనం గురించి మాట్లాడుకుంటే ఇది సరి కొట్ట ? కధ.. అందులో హీరోయి 'నయిన తార ' స్లిమ్మయిందట! అందుకని ద్రాక్ష గుత్తుల మధ్య ఆ అందాలు కరువు తీరా చూసి తరించాల్సిందేనని ఏ టీ వీ లో చూసినా ఏకరువు పెడుతున్నారు...నిజమే! ఫాక్షన్ ( ఇంద్ర ) + ఫారిన్ లో ప్రేమ (జయం మనదేరా) + పిల్లాడితో సహా విడిపోవడం ( యువ రాజు ) + పిల్లాడికి జబ్బు (చూడాలని వుంది ) ఇలాంటి విభిన్నమైన పాయింట్స్ అన్ని కలిపి వచ్చిన ఏకైక చిత్ర రాజం... ఒకరికి నలుగురు విలన్లు + మన భరతం పట్టే హీరో గారి ' వి ' న్యాసాలు చూడాలంటే తప్పక చూడండి ' కరి ' వేప మీ అభిమాన ధియేటర్లలో....తినగ తినగ వేప తియ్య 'గుండు 'ను


చిరంగేట్రం చిత్రం కహోనా ప్యార్ హై రేంజ్ లో దీవిలో ప్రేమ...జైలుకెళ్ళొచ్చిన వాడు విదేశీ గైడుగా చూపిస్తే చిరు అభిమానం తో కళ్ళప్పగించి చూసొస్తున్నాం.......పాపం తిట్లతో సినిమాలు తీసుకునే ' పోకిరి ' డైరెక్టరు పాజిటివ్ టైటిల్ తో సినిమా తియ్యడానికి నాన్నా కష్టాలు పడుంటాదు పాపం...


డాలర్ డ్రీంస్ లా కమ్ముకొచ్చిన శేఖర్ కమ్ముల మంచి కాఫీ లాంటి సినిమాలందించడలో దిట్ట అని తేలింది...కానీ వేసవిని చల్లగా ఉంచడానికి చేసిన ' గోదావరి ' యాత్ర మాత్రం మంచి కాపీ లాంటి సినిమాగా అందాల రాముడిని గుర్తు చేసింది....ఆయన లేటెస్ట్ సినిమా కా ' లేజి ' హాపీడేస్ గుర్తుకు తెస్తున్నా ప్రస్తుతం టీనేజి లవ్వులిస్తున్న ' మెగా ' షాక్ లకు స్ఫూర్తినిస్తుందేమో....


ఎప్పటికైనా తెలుగు సినిమాకు హాపీడేస్ రావాలని కొరుకుందాం ....దసరా శుభాకాంక్షలు.....

వ్యాఖ్యలు

విశ్వనాధ్ చెప్పారు…
విమర్శనాత్మకంగానైనా మీ సమీక్షలు బావున్నాయ్.
సెటైర్లతో బాగా రాస్తున్నారు.
కొనసాగించండి. దశరా శుభాకాంక్షలు
చదువరి చెప్పారు…
"..స్పెషాలిటీ యేమిటీ అని ' జుట్ట్లు ' పీక్కుంటుంటే " జుట్టే " అని తేల్చారు." - నాకు నచ్చిందిది. ఓ కొత్త రకం జుట్టు పెట్టో, బోడి గుండు పెట్టో, మా సినిమా డిఫరెంటు అని చెప్పుకుంటారు మన దర్శకులు. ఇంతకంటే వైవిధ్యంగా తియ్యాలంటే కాస్త బుర్ర వాడాల్సుంటుంది మరి! అదేమో కరువాయె!!
రానారె చెప్పారు…
బాగా 'అతి'థి! అనో థూ అనో రాద్దామనుకున్నాను సినిమా చూస్తున్నంతసేపూ. ఈ సినిమాకు ఒక టపా కూడానా అనిపించి మానేశాను.
radhika చెప్పారు…
adurs

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!