భాగ్యన ''గరం '
రిం ఝిం రిం ఝిం హైదరాబాద్...రిక్షా వాలా జిందాబాద్..బాలు పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తోంది..
హైదరాబాద్ ..హైదరా బ్యాడ్ గాను..హైరానాబాద్ గానూ ఉన్న ఈ రోజుల్లో ఆ పాట ఎందుకో ఎక్కట్లేదు. పైగా పాపం రిక్షావాలాలు ఇప్పుడు జిందాబాదూ కాదు..ఒక్క ఎలక్షన్ టైములో తప్ప.
బయటకెళితే పది నిమిషాల్లో కాకి రంగుకు మారేల ఉన్న ఎండ..ఒకప్పుడు చమట పట్టని నగరం గా ఉన్న భాగ్య నగరం ఇప్పుడు..అన్ని రకాలుగా చమటలు కక్కిస్తున్న భాగ్య న గరం గా మారింది.
అందమైన కట్టడం చార్మినార్ దగ్గర కెళదాం అంటే.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అర్ధం కాని వ్యవహారం
టాంకు బండు...ప్రస్తుతం వేడెక్కి...బందులకి సెంట్రల్ స్పాట్ గా మారింది..
జూ లో జీవాలు ఎలా ఉన్నాయో తలుచుకుంటేనే బాధేస్తోంది..కొండ మీద బిర్లా వెంకటేస్వరుడికి.....జయ విజయుల తో పాటు...పోలీసుల రక్షణ కల్పించాల్సిని పర్స్థితి ..
ఎప్పుడు బందో, ఎప్పుడు గొడవలౌతాయో..ఎక్కడ బాంబు పెట్టారో...అసలే అయోమయం ..ఇక ఆ పైన ఆటో వాళ్ల రేట్లు చూస్తే..ఆస్థులమ్మాల్సిన అవసరం అనిపిస్తుంది..
సినిమా కెళ్దామన్నా భయం..భారం..బోరింగ్..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి....telugu satire for telugu people......
Saturday, May 29, 2010
Saturday, May 08, 2010
మదర్స్ డే -అమ్మ కోసం ఒకరోజు. కనీసం ఒక రోజు..
మదర్స్ డే
ఔను మదర్స్ డే ...అమ్మ కోసం ఒకరోజు. కనీసం ఒక రోజు..
మనం భూమి పైకి రావడానికి 9 నెలల ముందు నుంచే మనల్ని కాపాడ్డం మొదలెడుతుంది..
తాను నొప్పులు భరిస్తూ మనకి జన్మ నిస్తుంది..(మరి భరించే వాడు భర్త అని ఎందుకు అంటారో?)..
మనకి ఆకలి వేయక ముందే పాలిచ్చి..లాలిస్తుంది..
మన కి భాష రాక ముందే అన్నీ తెలుసుకుని ... అందిస్తుంది..
మనకి బడిలో చదువు రాకముందే ఎన్నో నేర్పిస్తుంది..
మనకి స్నేహితులు రాకముందే మనతో స్నేహం చేసి ఆడిస్తుంది....
పొద్దున్న మనం లేచే సరికే ఇల్లు వాకిలీ శుభ్రం చేసి.నీళ్ళు పట్టి, కాఫీ పెట్టి, టిఫిన్ చేసి పెట్టి, క్యారేజీ కట్టి, రెడీ గా ఉంచుతుంది..
మనం జీవితం లో ముందుకెళ్ళడానికి తాను వెనకే ఉండి..పోతుంది...వృద్ధాశ్రమంలో..
అందుకేనేమో మదర్స్ డే..అమ్మ కోసం ఒకరోజు..కనీసం ఒకరోజు..
మనం భూమి పైకి రావడానికి 9 నెలల ముందు నుంచే మనల్ని కాపాడ్డం మొదలెడుతుంది..
తాను నొప్పులు భరిస్తూ మనకి జన్మ నిస్తుంది..(మరి భరించే వాడు భర్త అని ఎందుకు అంటారో?)..
మనకి ఆకలి వేయక ముందే పాలిచ్చి..లాలిస్తుంది..
మన కి భాష రాక ముందే అన్నీ తెలుసుకుని ... అందిస్తుంది..
మనకి బడిలో చదువు రాకముందే ఎన్నో నేర్పిస్తుంది..
మనకి స్నేహితులు రాకముందే మనతో స్నేహం చేసి ఆడిస్తుంది....
పొద్దున్న మనం లేచే సరికే ఇల్లు వాకిలీ శుభ్రం చేసి.నీళ్ళు పట్టి, కాఫీ పెట్టి, టిఫిన్ చేసి పెట్టి, క్యారేజీ కట్టి, రెడీ గా ఉంచుతుంది..
మనం జీవితం లో ముందుకెళ్ళడానికి తాను వెనకే ఉండి..పోతుంది...వృద్ధాశ్రమంలో..
అందుకేనేమో మదర్స్ డే..అమ్మ కోసం ఒకరోజు..కనీసం ఒకరోజు..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Friday, May 07, 2010
రాబోయే కాలం లో కాబోయే ఐటెం సాంగ్
రాబోయే కాలం లో కాబోయే ఐటెం సాంగ్
తలుచుకుంటే ఎక్కిళ్ళు
కలుసుకుంటే వేవిళ్లు
నీ చూపు మహా ఘాటురా
నీ వాటం మహా నాటురా
పరదాలన్నీ మూసేసి
పరువాలన్నీ పరిచేసీ
సరదాకి సరసమాడితే
సరసానికే సరదా పుట్టేనురా
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
తలుచుకుంటే ఎక్కిళ్ళు
కలుసుకుంటే వేవిళ్లు
నీ చూపు మహా ఘాటురా
నీ వాటం మహా నాటురా
పరదాలన్నీ మూసేసి
పరువాలన్నీ పరిచేసీ
సరదాకి సరసమాడితే
సరసానికే సరదా పుట్టేనురా
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Saturday, May 01, 2010
సం'దేశం'
సం'దేశం'
భువన మండలం లో
భరతావనిలో
కష్ట జీవులు
నిష్ఠవీరులు
క్షేత్రాలన్నీ క్షాళణ చేసీ
ధాన్యాలన్నీ రాశులు పోసీ
తిండి పెట్టగా
పస్తులుండగా
పస్తులుండగా
భూస్వాములంతా తింటూ
మీ కష్టాల్ తీరుస్తామంటూ
వారి కష్టం సొమ్ముచేసుకుంటుంటే
వారి కాష్టం గాలికొదిలేస్తుంటే
పేదలందరి కడుపుమండగ
అందరు కలిసి కన్నెర చేయగ
గడగడ లాడగ భువనమండలం
ఏర్పడే ఓ హవన కుండలం..
ఆ 'కాష్టం' ఆర్పే నాధుడు ఏడోయ్
వారి 'కష్టం' తీర్చే యోఢుడు ఏడోయ్
అందుకే ఓ యువతా!
పేదకోసమై పాటు పడు
కనీసం ఆవిధంగానైనా బాగుపడు
మహా కవి శ్రీ శ్రీ కి అంకితం
మహా కవి శ్రీ శ్రీ కి అంకితం
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
కాశీ పట్నం చూడర బాబూ
కాశీ పట్నం చూడర బాబూ | ||
| తెలుగు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...'కొత్త ' ఐడియా లతో వస్తున్న 'చిత్రాలని ' చూడాలంటే భయమేస్తోంది..సినిమాకి ఐతే వెళ్ళడం తప్పించుకోవచ్చు, కానీ,,ట్రైలర్ల పేరుతో ఇంట్లో టీవీల్లోవి ఏం చేద్దాం.ఇదివరకు పండంటి సంసారం, పచ్చని కాపురం, నిండు గౌరవం లాంటి సినిమాలొచ్చాయి, తరవాత సంసారాలు పోయి, రాక్షసుడు, యమకింకరుడు, కిరతకుడులాంటి సినిమాలొచ్చాయి, తరువాత..నువ్వు నాకు నచ్చావ్, ప్రేమించుకుందాం రా , కలిసుందాం రా , ఇంకేదో చేదాం రా లాంటి సినిమాలొచ్చాయి, ఇప్పుడు తిట్ల ట్రెండు అనుకుంటా...ఈడియట్, కంత్రి, పోకిరి, బలాదూర్,దేశ(హ)ముదురు, ఇలా తిట్ల సినిమాలొస్తున్నాయి..సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతోంది...ఎంత పెద్ద "తిట్టో "అంత పెద్ద "హిట్టు".... ఇక ప్రస్తుత జెనెరషన్ బాడీలది..అవును మొహం తో నటించలేం కాబట్టి బాడీ లాంగ్వేజు అంటున్నారు..ఇది ఏమి లాంగ్వేజ్ప మరి, మనమెక్కడ నేర్చుకోవాలో.. సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు (హెరాయిన్ అనాలేమో?)...బలిసిన శరీరాల్ని...సుష్కింపచేసి..కండలు పెంచి..చొక్కాలు చించి..... గడ్డాలు పెంచి...నీరసించి...కనిపిస్తున్న హీరోలు...ఆ సమయాన్ని కాస్త నటననేర్చుకోవడానికి....కాస్త మంచి సబ్జెక్టుల్ని వెతుక్కోవడానికి ఉపయోగిస్తే బాగుంటుందేమో.. ఒక డైరెక్టరు ఒకహిట్టు ఇవ్వగానే వెంటనే ఆయనతో ఒక సినిమా అనేసుకోవడం.హడావిడిగా మొదలెట్టడం..ఒక హీరోయిన్ హిట్టవగానే ఆమెతోనే సినిమాలు చెయ్యడం.. వాళ్ళకి విసుగొచ్చి బాంబేనో, చెన్నయ్యో, కేరళో పారిపోతే..సినిమా ఆపి కోటి పైగా ఇచ్చి ఆ పర భాషాకాంత ని తెచ్చి చెయ్యడం ఫాషన్ అయిపోయింది... జాతీయ అవార్డు అందుకున్న నటి చేస్తున్న చిత్రం అంటూ వచ్చిన ఒక సినిమాలో (అవార్డు వచ్చిన సినిమా కాదు) ఆమె కు నటించాల్సిన అవసరం లేని పాత్ర.. ఒకట్రెండు పాటలు..ప్రేమ, ఇతరత్రా విషయాలు//మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా మీకెలాంటి పాత్రలు ఇష్టం అంటే అన్నీ అలాంటి పవిత్రమైన పాత్రలు పరుత్తివీరన్ పాత్రలే వస్తున్నాయి...నాకు బబ్లీగా ఉండే పత్రలిష్టం ఎక్స్పోజింగు అవసరమైనంత మేరకు చేస్తాను (ఎవరికి అవసరమైనంత వరకో మరి ??) అంటూ "ప్రియం"గా చెప్పింది ఒక భామా "మణి"..... ఇంకా నేను తూనీగ పిల్లనే అనుకుంటున్నారు నేను "పెద్ద" దాన్నాయాను..గుర్తించండి..కావాలంటే ఎక్స్పోజింగు చేస్తా(అప్పటికైనా గుర్తిస్తారనేమో) అని ఈనాడు ఒక బాల వర్ధమాన యువ నటి సెలవిచ్చింది///నేను మాటలు చెప్పను అంతా చేతలే అంటూ 'నయనా' నికి ఆనందం కలిగించే 'తార ', ఇటీవల 'విశాల హృ దయం కల ఒక హీరోకి పోటీగా తన 'కండలని-గుండెలని ' ప్రదర్శించింది....ఆమె స్ఫూర్తికి "సెల్యూట్ " . యోగాభ్యాసం నుంచి హీరోయిన్ "యోగం "పట్టిన మరో చిన్నది కూడా వీలైనంత చిన్న దుస్తులే వేసుకుంటూ ఇటీవల పెంచిన తన పారితోషికానికి న్యాయం చేస్తూ.. కనీసం కాస్ట్యూంస్ విషయంలోనైనా నిర్మాత కి నాలుగు డబ్బులు మిగులుస్తోంది.... ఇక రాబోయే సినిమాల్లో ఎలా వుంటారో..ఏమో? ఈ మధ్య ఒక జోక్ చదివా ఆ సినిమాలో నగ్నంగా ఎలా నటించారు అని ఒక విలేఖరి హీరోయిన్ ని అడిగితే.. ఏం చెయ్యను హీరో అలా కల గన్నాడు మరి అంటూ అమాయకంగా జవాబిచ్చిందిట..కధ డిమాండ్ చేసింది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు.. కానీ నాకు అర్ధంకాని విషయం ఒకటుంది...కధకి మాటలొచ్చా అని..రైటర్ అనుకున్నది తెర మీదకి వస్తుందా అని..మధ్యలో ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో ఇలా తలా ఒక చెయ్యి వేస్తారుకదా....హీరోయిన్ మీద కాదండీ కధ మీద... ఇక రాబోయే సినిమాల టైటిల్సు ఇలా వుంటాయేమో? వె ధ వ - వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు శ్రీ రాముడు - ఈయనకి ఇద్దరు పెళ్ళాలు లేచిపోదాం రా...కట్నాలు మిగులుద్దాం, కళ్యాణం చేసుకుందాం సిక్స్ పాక్ వీరుడు- సెక్సీ లుక్ చిన్నది అదిగో అక్కడ ఏదో సినిమా ప్రా'రంభో'త్సవం మొదలౌతోంది : అక్కడ బాగా హడావిడిగా ఉంది...షామియానాలు, కుర్చ్చీలు, మైకులు, ఒకటే హడావిడి..ఇంతకీ విషయం ఏమిటంటే అక్కడ ప్రెస్ మీట్ జరగబోతోంది.. ఒక సినిమా తాలూకు విశేషాలు చెప్పడానికి...సినిమా అద్భుతంగా వచ్చింది..ఇంత వరకూ తెలుగు తెర మీద ఇలాంటి సినిమా రాలేదు (తాను చూసి ఇన్ స్పైర్ అయి కాపీ కొట్టిన ఇంగ్లీషు సినిమా తలుచుకుంటూ, దాని వసూళ్ళు లెక్కలు కడుతూ ) దర్శకుడి ..తొలి పలుకులు... మ్యూజిక్ చాలా బాగా వచ్చింది హీరో (లావుగా బొజ్జతో కదలలేని)బాడీ లాంగ్వేజ్ దృష్టిలో పెట్టుకుని చేసా...గ్యారంటీగా సూపెర్ హిట్ అవుతుంది.. తాను డైరెక్టుగా డౌన్ లోడ్ చేసిన ఇంగ్లీష్ ఆల్బం మీద నమ్మకంతో) మ్యూజిక్ డైరెక్టరు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ చాలా హాపీ గా ఉంది..మంచి ఎక్స్పోజింగు కి) స్కోప్ ఉన్న సినిమా...హీరో సార్, డైరెక్టర్ సార్, ప్రొద్యూసర్ సార్ చాలా 'కోపరేట్" చేస్తున్నారు... (సబ్బు కంపేనీ యాడ్ నుంచి దిగుమతి ఐన బొంబాయ్ భామ).. సినిమా అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది (అంత చండాలంగా తీద్దామని అనుకోడం ఎందుకు ? బాగా వచ్చిందనడం ఎందుకు ?) బాగా రిచ్ గా తీసాం (తప్పలేదు మరి).హీరో గారు బాగా "కోప"రేట్ చేసారు...(నెక్లెస్ రోడ్లో తీయాల్సిన హీరో నడిచే సీను న్యూజిలాండ్లో చేయించిన సీను గుర్తు చేసుకుంటూ) ప్రొడ్యూసరు.. 100 ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం. (కనీసం ఒక్క రోజు ఆడినా 100 రోజుల ఫంక్షన్ చేసుకోవచ్చు). గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. ఇలా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ రిలీజ్ డేటు అనౌన్స్ చేసారు... సినిమా రిలీజ్ అయింది...ధియేటర్ దగ్గర.. కెవ్వు కేక..మా హీరో సినిమా సూపెర్ హిట్టు,,ఆయన మీద వొట్టు..రికార్డులన్నీ తిరగరాస్తుంది..హండ్రెడ్ డేస్ ఆడేస్తుంది.. (ముందు రోజు నుంచీ తిండీ తిప్పలు లేకుండా కటౌట్లు కట్టి, దండలేసి,,సినిమా హాలుకి రంగులేసి, చొక్కా చిరిగినా టికెట్టు సంపాదించేసి,, పాటలకి ఈల వేసి, ఫైట్లకి కాగితాలెగరేసి ..సినిమా చూసి మెంటలెక్కేసి) అభిమాని ఉవాచ.... కట్ చేస్తీ..సినిమా రెండో రోజే గల్లంతు కానీ మళ్ళీ మనవాళ్ళు సక్సెస్ మీట్ అంటూ తయారు...ఏం చేస్తాం తప్పదు మరి,,,, | ||
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Subscribe to:
Posts (Atom)