Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, డిసెంబర్ 10, 2011

పంజా....

 పంజా....
అరవ డైరెక్టరు + అరువు కధ + దరువు మ్యూజిక్కు + కరువు డ్రస్సు+ బరువు బడ్జెట్టు = పంజా ... లేదా ఒక తెలుగు సినిమా అనొచ్చేమో.. మన సహనం మీద విసిరిన పంజా అనొచ్చేమో..

తల్లీ చెల్లీ విషయం లో చేసిన సాయానికి డాన్ కి కుడి భుజం..కవచం...బ్రైను..హార్టు..కిడ్నీ అన్నీ తానే అయ్యే జై..చంపుకుంటూ పోయే హీరో... హీరోయిన్...ఎంత తక్కువ చెప్తే అంత మంచిదేమో.. క్లబ్బు లో డాన్సరు...అక్కడ డాన్స్ చేసి..అలిసిపోయి..హీరో ఫ్లాట్ కొచ్చి స్నానం చేస్తుంటుంది...హీరో ని ప్రేమిస్తుంటుంది..హీరో మాత్రం ప్రేమించడు..ఆయన సున్నిత మనసుకి మొక్కలు పెంచుతుంటాడు..బహుశా ఎన్ని తలలు కోస్తే అన్ని మొక్కలు పెంచుతాడేమో..అవి పెంచడానికి పేపర్ లో ప్రకటన ఇస్తే ఇంకో హీరోయిన్ వచ్చి నర్సరీని అందంగా తీర్చిదిద్ది... నిమిషానికో బాంబు వేసే హీరోగారిని..కాఫీలకి,టిఫినీలకి..షాపింగులకీ తిప్పుతుంటుంది... ఇంకో విసేషమేంటంటే..కలకత్తాలో ఏ టాఇలెట్ లో చూసినా తెలుగువాళ్ళే ఉంటారు...డాన్ లు..విలన్ లు...డాన్సర్లు... చిన్న ఆంధ్ర ప్రదేశ్ ఇన్ కలకత్తా..

ఇందులో కొత్తగా కనిపించేదేంటయ్యా అంటే హీరో గారి గడ్డం...కధ లో కధనం లో ఇంకేక్కడా కొత్తదనం చూపించలేక...ఇలా చూపించారు దొరవారు..మరో విసేషమేంటంటే ఇందులో హీరో మాటి మాటికీ గడియారం చూసుకుంటుంటాడు.. ప్రేక్షకులూ అంతే ఎప్పుడెప్పుడు ఐపోతుందా అని వాచ్ చూసుకుంటున్నారు... హీరోయిన్ కి నిజం చెప్పినప్పుడు.. ఇప్పుడు ఫైటు అనుకోగానే ఫైటు స్టార్టు..పాటలెందుకో...అర్ధం కాదు ..సినిమా ఐపోయాక టైటిల్ సాంగు..
ఆహా... టైటిల్ చిరిగినట్టే మన బుర్రలు కూడా చిరుగుతాయి... పంజా దెబ్బకి...

ఒకే సారి 2000 ధియేటర్లలో విడుదల.. ఏం చేస్తాం 2 రోజుల్లో తిరిగొచ్చినా డబ్బాలు...అమాయక అభిమానులవల్ల ఆదివారం లోపల వసూళ్ళొచ్చేస్తే 200 కోట్లు వసూలు..300 కోట్లు వసూళ్ళు అని చెప్పుకోవద్దు టీవీల్లో పడి.. అప్పుడెప్పుడో ఆత్రేయగారో ఆరుద్రగారో చెప్పినట్టు... 5 వీక్ సినిమా...కధ వీక్,కధనం వీక్,హీరోయిన్ వీక్,మ్యూజిక్ వీక్,డైరెక్షన్ వీక్...నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

గురువారం, డిసెంబర్ 01, 2011

అసెంబ్లీ శీతాకాల సమావేశం

మేరా భారత్ మహాన్

అసెంబ్లీ మొదటి రోజు
 తె దే పా - తె రా స నిరసన..ప్లే కార్డుల ప్రదర్శన - సభ వాయిదా
రెండో రోజు
అవిశ్వాసం పై రభస - స్పీకర్ తిరస్కరణ - మార్షల్స్ రంగ ప్రవేశం - గాంధీ బొమ్మ దగ్గర నిరసన - సభ వాయిదా
మూడో రోజు
 క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ప్రభుత్వ ఖండన - సభకు అంతరాయం - సభ వాయిదా
నాల్గో రోజు
రాజీనామలపై గొడవ - సభ వాయిదా
ఇతి అసెంబ్లీ శీతాకాల సమావేశం సమాప్తం...

కొంచెం అటూ ఇటూగా ఇదీ రాబోవు వార్తలు...


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa