శనివారం, అక్టోబర్ 01, 2011

అతగాడెవ్వడు?

 తెల్లటి చొక్కా వేసుకుంటాడు కానీ రాజకీయ నాయకుడు కాదు
ముఖానికి క్లినికల్ మాస్క్ వేసుకుంటాడు కానీ డాక్టర్ కాదు
తలకి హెల్మెట్ పెట్టుకుంటాడు కానీ కార్మికుడు కాదు
కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటాడు కానీ కాలేజ్ స్టూడెంట్ కాదు
చేతిలో కెమేరా ఉంటుంది కానీ కెమెరా మేన్ కాదు
మరి అతగాడెవ్వడు?

ఇంకెవరు ట్రాఫిక్ పోలీసు ..

ఏం చేస్తుంటాడు?
వీ ఐ పీలొచ్చినప్పుడు హడావిడి చేస్తాడు
లైసెన్సు వుందా లేదా అని దోచేస్తాడు

 మంత్ ఎండింగ్ వస్తోంది..పండగ దగ్గరైంది...
టార్గెట్స్ పెరిగై..ట్రాఫిక్ పెరిగింది..
చెక్ పోస్టు పెట్టెయ్ -  దొరికినోణ్ణి పట్టేయ్ ...
లేని వన్నీ అడిగేయ్...దొరికినంత నొక్కేయ్..
 ఏ తప్పుకైనా యాభై .. దొరలాగా వదిలెయ్..
పెళ్ళి కి ఫొటోలు తీస్తారు కాని..మన ట్రాఫిక్ పోలీసోళ్ళు ఫొటోలు తీసి పెళ్ళి చేస్తున్నారు.


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ బాబు ఆన అయ్యిందేమో బావ దరిక...