Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, డిసెంబర్ 02, 2016

సమాజం

నగదు రహిత ఐపోయింది - 
ఇక నగ రహిత సమాజం ..



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

ఆదివారం, నవంబర్ 27, 2016

వందా ! బందా !!

వందా ! బందా !!

రేపేది గెలుస్తుందో ?

          www.FunCounter.in





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, నవంబర్ 14, 2016

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, అక్టోబర్ 31, 2016

న్యూనుడి

నానుడి : అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా ?

న్యూనుడి : నోట్ బుక్కులనాడు బిడ్డలు కానీ ఫేసు బుక్కులనాడు బిడ్డలా ??







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, సెప్టెంబర్ 26, 2016

పచ్చదనం

ఈమధ్య సినిమాల్లో, పచ్చదనం ఎక్కువైపోతోంది - అన్నీ గ్రీన్ మాట్ ఎడిటింగ్ లే ...  ;) #FunCounter


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, సెప్టెంబర్ 13, 2016

తమ్ముడూ...

తమ్ముడూ...
బాగా తీయకపోతే 3 గంటల సినిమానే 3 రోజులు కూడా చూడట్లేదు... మన ఫౌజు..
మరి....





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, జూన్ 30, 2016

మేకింగ్

మేకింగ్ - ఇన్స్పైర్ అయి తీసేది
రీ మేకింగ్ - రైట్స్ తీసుకుని తీసేది
ఫ్రీమేకింగ్ - అడక్కుండా చెప్పకుండా తేసేది ....






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, జూన్ 14, 2016

నాలుగు రాళ్లు

ఎనకటి రోజుల్లో తిండానికిచ్చినవి అడ్డదిడ్డంగా వాడకుండా నాలుగు రాళ్లు కిడ్డీ బాంకులో వేసుకునే వాళ్ళు
ఇప్పుడు అడ్డమైనవి తిని నాలుగు రాళ్లు కిడ్నీ బాంకులో వేసుకుంటున్నారు.. అంతే తేడా..మిగతాదంతా సేం 2    సేం..

by Phani Madhav Kasturi





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, మే 21, 2016

బీరకాయ్....

స్టోరీ ఉన్నా లేకపోయినా పెద్ద హీరో ఉంటే, ఆడినా ఆడకపోయినా సూపర్ హిట్టు - బ్లాకు బస్టరు - బాక్సాఫీసు బద్దలు - కలెక్షన్ల వర్షం గట్రా ....
రెండు పెద్ద పేద్ద ఇళ్ళు - ఇంటినిండా జనాలు - నౌకర్లు - చుట్టాలు - గట్రా ఉంటే అది గొప్ప ఫ్యామిలీ సిత్రం - నందులు గట్రా అవార్డులు
ఒక్క మగాడు కొడితే ఎముకలు ఇరిగిపోయి - మెదళ్ళు చిట్లి కపాలాలు పగిలిపోతుంటే - కోమాలోకెళ్ళిపోతుంటే అరుపులు పెడబొబ్బలు తొడ కొడితే రైళ్ళు - మీసం మెలేస్తే సూమోలు గట్రా పేలిపోతుంటే యాక్షన్ సినిమా ఫాక్షన్ సినిమా
కోటలు - కట్టడాలు - గ్రాఫిక్కుల్లో సెట్టింగ్లులు గట్రా వేసేసి - హిస్టరీ లో ఒక పేరు వాడేసుకుని - హీరో గారి కొసం మొత్తం మార్చేసి - అసలు కధని మొలతాడులో తాయెత్తు లా కనపడకుండా చేసేస్తే అవి హిస్టారికల్ - అదే చారిత్రాత్మక సిత్రాలు..
ఆట బొమ్మల్లా గన్నులు పట్టుకు తిరుగుతూ, పాటల మధ్యలో కూడా అడ్డదిడ్డంగా కాలుస్తూ - కావాలంటే సీ ఎం లని మినిస్టర్లని గట్రా ఇరగేస్తూ - అర్ధం లేని మారు వేషాలు - అర్ధం కాని అండర్ కవర్ ఆపరేషాన్ లు గట్రా ఉండేవి పోలీసు సినిమాలు
ఇలా సెప్పుకుంటూ పోతే సానా రకాలు. అందులోనూ మన హీరోలు - పులులు సింహాలు ఏనుగులు ఇంకా ఇంకా కదా..

నీకు సినిమా చూడ్డం రాదురా.. పోనీ నువ్వు తియ్యరా... నీకెందుకురా .... ఐతే మానేయ్ టైపులో ...ఇంక బీరకాయ్ ఫాన్స్ దాడి షురూ...
Like
Comment




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

ఆదివారం, మే 01, 2016

పండగ ఆఫర్

పండగ ఆఫర్

పండగ ఆఫర్
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, హుషారుగా పాట వినిపిస్తోంది బాత్రూం లోంచి..ఏంటండీ చాలా హుషారుగా ఉన్నారు..ఈపూట……..
వంటింట్లోంచి భార్యామణి కేక..(పాట భరించలేక ఆర్తనాదం అనుకోవచ్చేమో !)
ఇవాళ ఉగాది కదోయ్! ఇవ్వాళ సంతోషంగా ఉంటే, సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చు అందుకని ………నా సమాధానం..
ఇంకా నయం ఇవ్వాళ తింటే సంవత్సరమంతా తిన్నట్టే, అని, ఇంక మాకు కూడు అదీ పెట్టరా ఏంటి భార్యా మణి రుస రుస…
అది కాదోయ్, అది…. చిన్న చిన్న వాటికే…..
రోజూ చేసే పనులకి కాదు, కనీసం ఈ రోజైన ఆనందంగా ఉంటామని…. పెద్దవాళ్ళు పెట్టిన ఒక విధమైన ‘ఇది’…. ఏం పేరు పెట్టాలో తెలియక తికమక..
అంతేలేండి ఈ పండక్కి ఒక చీర నామొహం మీద పడేసి, ఇక సంవత్సరమంతా పండగ చేసుకో అనచ్చనేగా మీ ఆలోచన..మళ్ళీ భార్యామణి లా పాయింటు..
అబ్బ అదికాదే..అర్ధం లేకుండా మాట్లాడకు..ప్రతీది రాద్ధాంతం చేస్తావ్ …పొద్దున్నే తలకాయ నొప్పి..కాస్త కాఫీ నీళ్ళు నా మొహాన కొట్టు, అలా వెళ్ళి వేప పూత, అదీ… తెస్తా..నా నిరసన
అంతే లేండి! పెళ్ళైందగ్గరనుంచీ నేనేమన్నా అడిగానా? నన్ను చూస్తేనే మీకు తలనొప్పి…అందుకే అన్నా, మా నాన్న తో, అబ్బాయి గురించి అన్ని తెలుసుకోండి నాన్నా! అని, ఎప్పుడు చూసినా తలనొప్పి అంటారు ఏం మాయదారి జబ్బో ఏమిటో..?
నాకే జబ్బులు…మాయరోగాలు లేవు, ముందు కాఫీ నీళ్ళు ఇచ్చేదేమన్నా ఉందా ? లేకపోతే అది కూడా బయటే తగలడమంటావా…?
అంటే! నేనిచ్చే కాఫీ నీళ్లన్నమాట బయట అమ్రుతం దొరుకుతుందా ..అట్లాంటప్పుడు నన్ను అడగడం ఎందుకు.?
అబ్బా! కాలికేస్తే వేలికెయ్యకే…ఏదో మాటవరసకి అన్నా..
అంతే లెండి ఎంతసేపూ నన్ను ఏదో ఒకటి ఆడిపోసుకోవడమేకానీ పెళ్ళాన్ని పండక్కి బయటకి తీసుకెళ్ళి ఏదైనా కొనిపెడదాం..హోటల్లో భోజనం చేద్దాం అని ఉండదు కదా ..నా బతుకంతా ఇంతే…ఉగాదైతే ఏంటి …దీపావళి ఐతే ఏంటి..మళ్ళీ కుళాయి..
ఆపవే..ఆపు..ఆ కుళాయి ఆపు …నిన్ను గానీ ఆపకపోతే హైదరాబాదులో సునామి అదీ వచ్చేస్తుంది..జనం నమ్మరు కూడాను …ఇంతకీ బయటకెళ్దాం అంటావ్ అంతే కదా..
ఊ..ఇంద కాఫీ…గోముగా భార్యామణి..
మరీ అంత వంకర తిప్పకు మూతి చూళ్ళేను…
పోదురూ బడాయి ..సర్రున గుండెల మీద బొచ్చు పీకింది…నోరు కాలడం వల్లా..బొచ్చు పీకడం వల్లా ఒక్క సారిగా గుండెల మీద మంట…అర్ధాంగి కొంటె చూపు వల్ల గుండెలోపల మంట,,,మొత్తానికి కారంగా తిన్న ఫీలింగు…
ఒసేయ్ నీ మెలికలాపు..అలా మెలికలు తిరిగి తిరిగి అలానే ఉండిపోతావేమో…కొంచెం బయటకు వెళ్ళి …ఆ వేప్పూత తెస్తా..కొంచెం ఉగాది ప్రసాదం తిని అలా బయటకెళ్దాం లంచుకి…సరేనా….హుయ్ ఏదో సౌండు పక్కనుండాల్సిన నా భార్యామణి బీరువా మీద…
అదేంటే అక్కడున్నావ్..కావాలంటే బీరువాలో చీరకట్టుకుని రెడీ అవు..అంతేకానీ అలా బీరువా మీద కూర్చోకూడదు..
అది కాదండీ మన పెళ్లైన తరువాత మొట్టమొదటి సారి మీరు నన్ను బయటకు తీసుకెళ్తున్నారన్న ఆనందంలో గాల్లోతేలినట్టై ఇక్కడొచ్చి పడ్డా…కొంచెం నన్ను దింపండి గోము గా అడిగింది కొంచెం సిగ్గుపడుతూ…
సరేలే నిన్ను దింపితే..ఇంక నా నడుము ఉన్నట్టే..మరీ సిగ్గు పడకు..నీకు సూటవదు ..కానీ ఇవ్వాళ పండగ కదా..ఇవ్వాల్టికి ఇంట్లో నే తినేసి వచ్చే ఆదివారం బయటకెళ్దాం సరేనా…..
సుయ్ ఈ సారి సౌండు మారింది..చూస్తే నా పక్కనే మా ఆవిడ…నేను ముందే అనుకున్నాను అడగ్గానే మీరు ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను..ఏదో ఒకటి చెప్పి బయటకెళ్ళే ప్రొగ్రాం మార్చేస్తారని…మళ్ళీ కుళాయి తిప్పింది..
అబ్బ ఆపవే..నీ నస, సందు దొరికితే చాలు కుళాయి తిప్పేస్తావు..దిక్కుమాలిన టీ వీ సీరియల్స్ చూడకే అంటే వినవు..నీ గోల నీదే కాని నన్ను పట్టించుకోవే…ఊరికే, నిన్ను బీరువా మీద నుంచి దింపడానికి అల్ల అన్నానంతే..ఎలా ఉన్నాయి మన తెలివితేటలు..
భలె భలే …అంటూ గెంతులేస్తుండగా,,,,ఠంగ్ ఠంగ్ మని సౌండు ఏంటా అని చూస్తే ఆ గెంతులకి భార్యా మణి పైకెగిరి రూఫు కి తల తగుల్తోంది..
నీ సంబరం బంగారం కానూ ఆగవే…ఉగాది పచ్చడి కి అన్ని రెడీ చేసుకో…అంటూ బయటకి కదిలా…
———–
లంచు పూర్తి అవుతుండగా…భార్యామణి విశ్వ రూపం చూపించడం మొదలైంది..
ఏవండీ బల్ల కిందనుంచి నా కాలుని తొక్కింది..(ప్రేమగా)
నోట్లో ఉన్న ఐస్క్రీం కాస్తా బయటకొచ్చి చొక్కా మీదా..కొంచెం బల్లమీదా ,,,కారిపోయి పాంటు మీదా పడ్డది..ఏమైందే…అల్ల టొక్కావు..(ice cream effect) అన్నా గాభరాగా తుడుచుకుంటూ,,
అదికాదండీ ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాం కదా…పక్కనే బొందనా బ్రదర్స్ వాళ్ళు పండగ డిస్కౌంటు ఇస్తున్నారట,,ఒక్క సారి చూసొడ్డామండీ….ఎలాగూ ఎండగా ఉంది కదా..కాస్సేపు ఏ సీ లో తిరిగినట్టూ ఉంటుంది….
ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అనిపించింది..ఏ ఐమాక్సుకో, వెళ్ళి అర్ధం లేని సినిమాకో అర్ధం కాని సినిమాకో, మూడొందలు తగలెయ్యడం కన్నా ఇదే నయమని పించింది..
అంతే కాదు ఐమాక్సు కెళితే క్లైమాక్సులోపల, చిప్ప పాతిక రూపయల చొప్పున, మొక్కజొన్న గింజల్ని నా బుర్రని నంచుకుని తినే బాధ కూడా తప్పుతుంది కదా అని సరే అన్నా..(అదెంత తప్పో తరువాత తెలిసింది)
లోపలకెళుతూనే..ఏసీ గాలి పలకరించింది..కాకపోతే ఎంటో ఊదరగొట్టే సౌండు తో పాటలు వినిపిస్తున్నాయి..పక్క వాళ్లు మాట్లాడేది కూడా వినిపించట్లేదు..
ఈలోగ, ఒకతను బహుశా మేనేజరనుకుంటా నవ్వు తూ వచ్చి సారీసా అమ్మా..అన్నాడు కకపోతే ఇక్కడికెందుకొస్తామని అందామనుకున్నా ..కానీ రెండు గంటలు ఏసీ లో ఉండాలి కదా వాడితో గొడవెందుకులే అని వూరుకున్నా..
..ఎంతలో కావాలమ్మా వెంటనే అతని ప్రశ్న,,,
అది నీకెందుకు నచ్చితే ఎంతైనా కొంటాం మా ఆవిడ కొంచెం గట్టిగానే అంది..నాకూ గర్వం గా అనిపించింది.కాని ఎక్కడో ఒక్కసారి భయం కూడా వేసింది..
అది కాదమ్మా …పెళ్ళి బట్టలు .డిసైనర్ సారీస్ లాంటి వైతే కొంచెం కాస్టీవి పైన ఉన్నాయి…ఫాన్సీ చీరలు అటు వైపున్నాయి మీరు వెతుక్కోకుండా ఉండాలని ….నసిగాడు (ఇలా అనే కన్నా లౌక్యంగా రేట్ల లిస్టు చెప్పాడు అనొచ్చేమో)
మా పెళ్ళి ఎప్పుడో అయిపోయిందిలే..ఏదో ఆఫరన్నారుకదా….అవి చూద్దామని ఈ సారి మా ఆవిడా నసిగింది,,,
అవా! అక్కడున్నయి రేయ్! ఆఫర్ చీరలంట చూపించండ్రా,,అని నా చెవి దగ్గరే గట్టిగా అరిచి అదో రకంగా చూసుకుంటూ.. రండి రండి చీరలా అమ్మా అంటూ అదే ప్లాస్టిక్ నవ్వు అతికించుకుని అప్పుడే లోపలికొస్తున్న వాళ్ళకెదురెళ్ళడు..
——
అతను చూపించిన వైపుకెళ్ళే సరికి ..దుశ్శాసనుడు లాగిన చీరల్లా ఒక ఎత్తైన చీరల కొండ కదులుతూ కనిపించింది..చీరలు కదులుతున్నాయేంటా అని దగ్గరకెళ్ళి చూస్తే ఆ చీరల్లో ఆల్రేడీ కొంతమంది ఆడవాళ్ళు లోపల తమ కు నచ్చిన కలర్లు..డిసైన్లు వెతికే పనిలో ఉన్నారు..మా ఆవిడా వన్ టూ థ్రీ అంటూ ఆ కుప్ప మీద దాడి చేసింది..
కాసేపు పెనుగులాట తర్వాత …రెండు , చీరల్తో బయటకొచ్చింది మా ఆవిడ…ఒక్కోచీర గురించి చెబుతూ ఇది ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ వాడిన (సారీ కట్టిన అనాలేమో)
అసలు సినిమాల్లో హీరోయిన్లు చీరలు ఎక్కడ కట్టుకున్నారే అని అమాయకంగా అడిగా..
మీరెప్పుడూ అంతే చిలిపి… తొక్కూడేలా చెంపమీద గిచ్చి…ఫామిలీ ఫొటోలో కట్టుకుందిలెండి…
ఫొటోలో కట్టింది కూడా చూసి గుర్తుంచుకున్న ఆవిడ సునిశిత, సూక్ష్మ,దృష్టి కి ఆశ్చర్యపోయి …సరే నీకు మరీ నచ్చితే తీసుకో అన్నా..
మళ్ళి ఎగిరి గంతెయ్య బోయి షాపు కదా అని తమాయించుకుంది..
మీరు….. మళ్ళీ ఏదైనా చేసుతందేమో అని నేనే ఒక్క గెంతు పక్కకి గెంతా…మా సర్కస్ ఫీత్లు చూసి ఇందాకటి మేన్నేజర్ లాంటి ఆయన మళ్ళీ వచ్చి నుంచున్నాడు..ఇంతలో మా ఆవిడ ఆ చీర చూసి ఏమండీ దీనికి కన్నం ఉంది ఏంటండీ….. నన్నో, ఆ అమేనేజర్నో , అర్ధం కాలే ..కానీ ఇలాంటి వన్నీ అలవాటైన ఆ మేనేజరు ..ఇవన్నీ కొంచెం పాడైన చీరలమ్మా అందుకనే ఆఫర్లో ఇస్తున్నాం.. సేం ఇలాంటి చీరే మంచివి , కొత్త స్టాకు పైన ఉన్నాయి రండి అంటూ తీసుకెళ్ళాడు..ఐదు నిమిషాల్లో ..ఐదు వేలు బిల్లుతో తిరిగొచ్చిన మా ఆవిడ ఆనందం చూసి….ఐదొందలు అనుకున్న బడ్జెట్ ఐదు వేలు ఐనా , కుళాయి గుర్తొచ్చి వెంటనే క్రెడిట్ కార్డు తీసిచ్చా..దాన్ని అపురూపంగా అందుకుంటూ…మీకు పేంట్ షర్ట్స్ ఏమీ వద్దా సార్ మంచి ఆఫర్ ఉంది… అని కొంటె గా నవ్వాడు….ఆ మేనేజర్…
పబ్లిసిటీ కోసం వాళ్ళు పెట్టిన ఆఫర్ దెబ్బకి…అప్పటికే దిమ్మ తిరిగిన నేను లేవడానికి మరో నెల పట్టొచ్చు..మళ్ళీ వచ్చే నెల కలుద్దాం…అందరికీ ఉగాది శుభాకాంక్షలు…పండగ ఆఫర్ల పట్ల పారా హుషార్….

నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

బుధవారం, ఏప్రిల్ 27, 2016

హిస్టరీ

మీ హీరో కోసం
హిస్టరీ ని మిస్టరీ చేయకండర్రా...






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, ఏప్రిల్ 21, 2016

అరుపులు

రేపు రిజల్ట్స్ వస్తాయంట.. ఫెయిల్ అయితే ఇంట్ల అరుస్తారో లేదో కానీ ... ఏ చానల్ పెట్టినా .. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు, రెండు ....మూడు మూడు .. ప్రభంజనం... ప్రకంపనం.. అంటూ టీవీలో అరుపులు ఖాయం. సౌండ్ పొల్యూషన్...
రేపు టీవీలు బంద్ పెట్టడం మంచిది... ;)




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, ఏప్రిల్ 14, 2016

దానికో లెక్కుందమ్మా

కుదిరితే సర్దార్
 కుదరకపోతే సర్కార్ ....
              దానికో లెక్కుందమ్మా.. హ హ హ.... హ..





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, మార్చి 17, 2016

ప్రేమ ఎంత 'మధు 'రం

ప్రేమ ఎంత 'మధు 'రం
మేం మంచోళ్ళం
పేరెంట్స్ పిచ్చోళ్లు
మా ప్రేమ పెర్మినెంటు
పేరెంట్స్ కి పనిష్‌మెంటు


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, మార్చి 11, 2016

దర్శనమ్

కరాగ్రే వసతే మొబైల్ , 
కర మధ్యే న్యూస్ పేపర్, 
కర మూలేతు రిమోటు ,
 ప్రభాతే ఘోర దర్శనమ్ ! 
                                  - ఇతి ఫణి మాధవ్ విరచిత: .



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, ఫిబ్రవరి 18, 2016

బుక్


నోట్ బుక్ లో నోట్స్ అర్ధం కావు !
ఫేస్ బుక్ లో ఫేస్ లు గుర్తుకు రావు ! - Phani Madhav Kasturi​



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

బుధవారం, ఫిబ్రవరి 03, 2016

ప్రస్థానం

మా నాన్న గారు RTC లో పని చేసేటప్పుడు ప్రస్థానం పత్రిక కోసం 1992 లో వ్రాసింది.. ఎందుకో షేర్ చెయ్యాలని పినిచింది.. బస్సుకీ మాట వస్తే
.. ఇలా అనేదేమో ..
ప్రస్థానం
సమయానికి గమ్యం చేర్చడం నా లక్ష్యం
కావాలని చేయను ఏనాడూ ఆలస్యం
నింపుకుంటూ ట్యాంకు నిండా డీజిలు
చేస్తూ పోతా ప్రతి చోటా మజిలీలు
నే తిరుగుతాను ప్రతీ ఊరి మలుపు
నే తడుతుంటాను ప్రతీ గ్రామం తలుపు
నే చేరుకుంటా గమ్యం ఎండా వానా చలులు తట్టుకుని
నే కోరుకుంటా నా పాంథులంతా క్షేమంగా ఉండాలని
ఎక్కడో ఏదో జరిగితే
పగిలేను నా అద్దం
అది ఎనిమిది కుటుంబాల ప్రారబ్ధం
ఎవరో ఎవరిపైనో అలిగితే
రాళ్లు విసిరి చేస్తారు నా ఒళ్ళు హూనం
అది నీకు నాకే కాదు యావజ్జాతికీ అవమానం
 


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, ఫిబ్రవరి 01, 2016

facebook

నోట్ బుక్ లో నోట్స్ అర్ధం కావు !
ఫేస్ బుక్ లో ఫేస్ లు గుర్తుకు రావు !




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

LinkWithin

Related Posts with Thumbnails