Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, నవంబర్ 30, 2015

దేహమును ప్రేమించుమన్న

దేహమును ప్రేమించుమన్న


దేహమును ప్రేమించుమన్న
మంచి సైజులొ ఉంచుమన్నా
దేహమంటె పొట్టకాదోయ్
యోగ చేసి బాగుపడవోయ్




వంటపై మీటింగు కట్టిపెట్టి
గంట వాకింగ్ మొదలెట్టవోయ్ ||దేహమును ప్రేమించుమన్న||

ఆకు కూరన చేవ ఉంది
చూపుకోసం మంచిందంది
రేకు టిన్నులో కోకు కన్నా
బోండమిచ్చే నీరు మిన్నా ||దేహమును ప్రేమించుమన్న||

పిజ్జ బర్గర్ కట్టిపెట్టి
ఆవిరిడ్లీ లాగించవోయ్
మెట్టు మెట్టు ఎక్కిన అందలం
ఆనందం, ఆరోగ్యం పదిలం ||దేహమును ప్రేమించుమన్న||



..........గురుజాడ లో పేరడీ
గురజాడకు నివాళి

నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, నవంబర్ 23, 2015

గడ్డి

గడ్డి తిని ఆవులు పాలిస్తాయి
గడ్ది తినే లాలూలు  పాలిస్తారు...


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, నవంబర్ 21, 2015

ప్రకృతి




 కంటికి రెప్పలా...వనం...
కంటి మంటలా మనం...












నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, నవంబర్ 17, 2015

శుక్రవారం, నవంబర్ 13, 2015

ఆదివారం, నవంబర్ 08, 2015

జరిమానా !

తను నన్నే చూస్తోంది
ఎటు పోయినా చూస్తునే ఉంది
హద్దు మీరుతానేమోనని
ఎదురు చూస్తోంది
నేను ఎటో చూస్తున్నా
తను ఓరకంటితో గమనిస్తూనే ఉంది
గీత దాటబోతే
తన కన్నుల్లో బంధించేసింది
ప్రేమ లేఖ సంధించేసింది
హద్దు దాటినందుకు
ముద్దుగా జరిమానా వేసేసింది
.
.
.
.
.
.
సిగ్నల్స్ దగ్గరి
పాడు సీ సీ కెమెరా..





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

ఆదివారం, జులై 05, 2015

ప్రొఫైల్ పిక్కు

ఫేసు చూపించలేనప్పుడు
ఫేసుబుక్కెందుకో ...
ప్రొఫైల్ పిక్కు

నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, జూన్ 29, 2015

స్మార్ట్

లేస్తూనే
ఊసుపోక నిన్న పెట్టిన
ఫొటొకొచ్చిన లైకులు లెక్కెట్టడం..

అడ్డమైన గ్రూపులనించీ వచ్చిన
గుడ్డు మార్నింగ్ మెసేజిలకి
రిప్లైలు పెట్టడం

పనిలేని డైరెక్టర్లు
పెట్టిన పనికిరాని
ట్వీట్లకు రీ ట్వీట్లు

ఫోన్ స్మార్ట్ ఓకే
మన స్మార్ట్ నెస్ ఏమైపోతొందో..






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, జూన్ 16, 2015

చూస్తునే ఉండండి

మాగ్గీ ఐపోయింది..ఇంక

ఫ్రూటీలు, సెరెలాక్ లు, KFC లు, మెక్ డోనాల్డులు.. అన్ని బ్రాండ్స్ లోనూ ఏదో ఉంది..  అంటూ ఫొటోలు..వీడియోలు...లింకులు...
 ఏపీ సీ ఎం భువనేశ్వరి/బాలకృష్ణ/లోకేష్/అశోక్ గజపతి రాజు అంటూ ప్రెడిక్షన్సు... న్యూసెన్స్ చానెల్స్ కన్నా ఎక్కువ అప్డేట్స్ కోసం చూస్తునే ఉండండి..ఫేస్ బుక్  గోడలు..




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, జూన్ 04, 2015

మాగీ - యాగీ

 2 మినిట్స్ లో అంతా ఐపోయింది.. మీడియా - సోషల్ మీడియా మొత్తం కలిపి వండేసి పిండేసింది... ఇంక ఇంతే సంగతులు - చిత్తగించవలెను.


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, మే 25, 2015

క్రియేటివిటీ

మేము కలిసి ఉంటున్నాం (లివ్ ఇన్ రిలేషన్ షిప్) - ఆ అమ్మాయి టీ బాగా పెడుతుంది, పంచదార ఎంత వెయ్యాలో తెలుసు పైగా ఏ టీ పొడి వాడాలో తెలుసు - మమకారం కలిపిన టీ.......ఒక టీ పొడి యాడ్

స్ప్రే కొట్టుకుంటే అమ్మాయిలు పనులు ఒదిలేసి మరీ అబ్బాయిల వెంట పడతారు పైగా అస్సలు ఆగలేరు - ఒక డియో స్ప్రే యాడ్

కూతురు గదిలో ఒక అబ్బాయి తలుపు వెనకాల దాక్కుంటే... ఫోన్ మోగినప్పుడు చూసిన తండ్రి - ఫోన్ చూసి ముచ్చట పడతాదు. ఫోన్ రేట్ కేవలం 4444 అని తెలుసుకుని ఆనంద పడతాడు..అంటే కూతురు లైఫ్ కనీసం 4444 వేల్యూ కూడా కాదనేమో.............. ఒక సెల్ ఫోన్ యాడ్

ఇంక డ్యూ తాగి కొండల మీదనుంచి దూకడం
థంస్ అప్ తాగడానికి హెలికాప్టర్ తో దిగడం లాంటి పైత్యాలూ మామూలే కానీ ఈ క్రియేటివిటీ ఎక్కడికెళుతోందో... మరి...



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, మే 22, 2015

గోదారి పుష్కారాల లోగో


కిందున్న నీలం గీతలు - నీళ్ళలా ఖర్చుపెట్టబోయే ప్రజా ధనాన్ని - ప్రవాహ గతిని తెలియజేస్తాయి. ఎగువ నున్న గీతల మధ్యలో మంట - మన నెత్తిన పడబోయే ధరల వాతలను గుర్తుచేస్తాయి. ఇంక అన్నీ కాలాక ఆకులు పట్టుకునే చేతులను, తూరుపు తిరిగి దణ్ణం పెట్టమన్న సూచనను , పైనున్న గీతలు సూచిస్తాయి. 144 యేళ్ళకొకసారి మాత్రమే వచ్చే అవకాశం కాబట్టి ఎక్కడా వదలకుండా ప్రతి చోటా డబ్బులు వెనకేసే అవకాశం వదలకూడని గీయించాం.
Like · Comment · 


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, మే 21, 2015

ఎండా కాలం

...వామ్మో....
సన్ డే
'మండే'
జ్యూస్ డే
వెట్ నెస్ డే
థర్స్ట్ డే (Thirstడే)
ఫ్రై డే
వాటర్ డే





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, మే 07, 2015

రూల్

సినిమాల్లో జంతువులని వాడకూడదని రూల్ పెట్టినట్టు
డైలాగుల్లోను - టైటిల్స్ లోనూ వాడకూడదని పెడితే
శానా ప్రాబ్లమవుతుందేమో ?



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, ఏప్రిల్ 28, 2015

రిజల్ట్స్

వామ్మో మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. రాంకులు రాకపోతే ఇంట్లో అరుస్తారో లేదో గానీ - టీ వీ పెడితే మాత్రం అరుపులు ఖాయం. ఒకటి ఒకటి ఒకటి మూడు మూడు మూడు నాలుగు నాలుగు నాలుగు - ఇంటర్ మీడియేట్ పరీక్షల్లో ................ప్రభంజనం... అంటూ పొలికేకలతో యాడ్లు.. 2-3 రోజులు సౌండ్ పొల్యూషన్ ..



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

బొచ్చోపాఖ్యానం

ఫలానా సినిమా కోసం మావోడు గడ్డం పెంచాడు. ఆ సినిమా కోసం పని చేసే వాళ్లంతా పెంచేస్తున్నరు.
సినిమాల్లేక మావోడు గడ్డం పెంచాడు... మేమూ ఫాలో అవుతాం.
సింహం గడ్డం చేస్కోదు - నేనూ చేస్కోను..
.
.
.

కమాన్ ఫోక్స్.. ఎందుకాలస్యం పెంచెయ్యండి గడ్డాలు..




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, ఏప్రిల్ 20, 2015

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ నాడు
బంగారం కొంటే మంచిదట
.
.
.
.
.
.
.
.
బంగారం కొట్ల వాళ్లకి .....




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, ఏప్రిల్ 10, 2015

సింహాలు - పులులు....

తండ్రులు - కొడుకులు, తాతలు-మనవళ్ళు, మావయ్యలు - 'అల్లు 'ళ్ళు, బాబయి లు - అబ్బాయిలు, అంకుల్స్ - కజిన్స్, బావలు - బామ్మర్దులు, బాబులు - పెద బాబులు, చిన బాబులు, బుజ్జి బాబులు, బుల్లి బాబులు, సింహాలు - పులులు....


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

బుధవారం, మార్చి 25, 2015

దేశభక్తి

ఎక్కడ లేని దేశభక్తి - క్రికెట్ మాచ్ టైం లో
ఎప్పుడు లేని దైవభక్తి 
 వినాయక నిమజ్జనం లో 
బయటపడుతుంది .... FunCounter 









నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, మార్చి 07, 2015

ఫొటోగ్రఫీ


ఫొటోగ్రాఫర్లంతా

కెమెరాలతో ఫోజిస్తుంటే

ఫొటోలు తీసేదెవరబ్బా ?






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, ఫిబ్రవరి 17, 2015

ఉపవాసం

శివుడి కోసం అభిషేకానికి  "చెంబెడు " 'నీళ్ళు " రెడీ..
ఇంక నా ఉపవాసానికి ఏదో ఒక డజన్ అరటి పళ్ళు, పుచ్చకాయలు, ద్రాక్ష పళ్ళు, ఉడకపెట్టిన చిలకడ దుంపలు,..యాపిల్సు, ఖర్జూరం, పాలు మాత్రమే.. ఉపవాసం కదా..




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, ఫిబ్రవరి 13, 2015

ఆ సీతాదేవి నవ్వులా

ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావే, ఏంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు - వీడే
అన్న పాట విన్నా ...పాపం లక్ష్మణుడు ఏం చేసాడో ? బహుశా ఆ సినిమాలో రాముళ్ళాటి హీరో గారికి తమ్ముడు లేడేమో.. మనోళ్ళు తలుచుకుంటే రామాయణాన్నే మార్చేస్తారు..





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, ఫిబ్రవరి 02, 2015

బరువు - బాధ్యత

బరువు - బాధ్యత
.
.
.
.
.
.
.

నేను బరువుని
మా ఆవిడ బాధ్యతని పంచుకున్నాం !

ఇప్పుడు నేను 70 కిలోలు .... :)


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, జనవరి 26, 2015

'ఐ'ఫోన్

నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడితే - వెంటనే ఫోన్ చేసి చెబితే
మర్నాడు ఆఫీస్ కెళ్లి వైఫై కనెక్ట్ కాగానే చూసి రిప్లై చేసేస్తా.
3జి ఆన్ చేస్తే అరగంట లో 'ఐ'ఫోన్ బ్యాటరీ 'ఐ' పోతోంది
సగం జీవితం చార్జింగ్ కే సరిపోతోంది.....
Like ·  · 




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

పండగ నాడు

పండగ నాడు పులిహోర లో ఉప్పెక్కువైందా కొంచెం విం సోప్ ముక్కలుగా చేసి వెయ్యండి అందులో నిమ్మకాయ ఉంది.

పాయసం లోకి కొంచెం ఫెయిరెవర్ ట్రై చేయండి ... కుంకుమ పువ్వుంది..

లస్సీలోకి లక్స్ - గులాబీలనుంచి తీసిన రోజ్ వాటర్ ఉంది..


గడపకి విక్కో టెర్మరిక్ - పసుపు చందనం సిద్ధం..





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, జనవరి 22, 2015

గోతికాడ నక్క

ఇది వరకు గోతికాడ నక్కలుండేవి.. ఇప్పుడు కెమెరాలు-మైకులు !!



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

స్వైన్ ఫ్లూ కో నమస్కారం !

స్వైన్ ఫ్లూ కో నమస్కారం !

నిజమే ! స్వైన్ ఫ్లూ కి మందు నమస్కారమే !

స్వైన్ ఫ్లూ వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది కాబట్టి. షేక్ హాండ్ లు ఇవ్వద్దంటున్నారు డాక్టర్లు. తుమ్మినప్పుడు / మూతి,ముక్కు తుడుచుకున్నప్పుడు / మెట్ల రైలింగ్ ల మీద, గోడల మీద చేతులు పెట్టినప్పుడు అంటుకునే వైరస్ లు షేక్ హాండ్ ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయి కాబట్టి షేక్ హాండ్ లు ఇవ్వద్దంటున్నారు. అందుకే మన నమస్కారమే అన్నిటికన్నా బెట్టర్. అందరికీ నమస్కారం. స్వైన్ ఫ్లూ నీకో పెద్ద నమస్కారం !!



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

బుధవారం, జనవరి 21, 2015

గుడ్ మార్నింగ్

ఒకప్పుడు పొద్దున్నే నిద్ర లేవగానే చెంబు పట్టుకుని పొలాల్లోకెళ్ళేవాళ్ళు

తరువాత్తరువాత బాత్రూం లు వచ్చాయి ....వాడుతున్నారు

ఇప్పుడు ఫేస్ బుక్ ..

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్... ;)









నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, జనవరి 16, 2015

సంక్రాంతి పండగంటే

సంక్రాంతి పండగంటే - ముగ్గులు, గొబ్బిళ్ళు, హరిదాసులు, పరవాన్నాలు, డూ డూ బసవన్నలు, పతంగులు, బొమ్మల కొలువులు అనుకున్నా..




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, జనవరి 06, 2015

ఎంత ప్రేమో


ఎంత ప్రేమో
తనెప్పుడూ నా ఒళ్ళోనే
ల్యాప్ టాపు....


ఎంత ప్రేమో
ఎప్పుడూ చెవిలో ఏవో గుసగుసలు
మొబైలు...

ఎంత ప్రేమో
నాతో ఎక్కడికైనా రెడీ
నా బైకు

ఎంత ప్రేమో
బ్రెయిన్ లేకపోయినా రక్షణ
హెల్మెట్టు

ఎంత ప్రేమో
ముక్కూ మొఖం తెలీని ఫ్రెండ్సు
ఫేసుబుక్కు..

ఎంత హాయో
ఎన్ని పిచ్చికూతలైనా కూయచ్చు
ట్విట్టరు




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

LinkWithin

Related Posts with Thumbnails