Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, మే 31, 2014

ఎంత ప్రేమో !...ఎంత హాయో !


http://www.gotelugu.com/issue60/1657/telugu-columns/lot-of-love/


ఎంత ప్రేమో !...ఎంత హాయో ! ఫణి మాధవ్ కస్తూరి

lot of love!
ఎంత ప్రేమో !
తనెప్పుడూ నా ఒళ్ళోనే
ల్యాప్ టాపు....

ఎంత ప్రేమో !
ఎప్పుడూ చెవిలో ఏవో గుసగుసలు
మొబైలు...

ఎంత ప్రేమో !
నాతో ఎక్కడికైనా రెడీ
నా బైకు

ఎంత ప్రేమో !

ఎంత ప్రేమో !
బ్రెయిన్ లేకపోయినా రక్షణ
హెల్మెట్టు

ఎంత ప్రేమో !
ముక్కూ మొఖం తెలీని ఫ్రెండ్సు
ఫేసుబుక్కు..

ఎంత హాయో !
ఎన్ని పిచ్చికూతలైనా కూయచ్చు
ట్విట్టరు
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, మే 26, 2014

సుమతీ!

తన తమ్ముడె తన శత్రువు
తన బావయె తనకు రక్ష, ప్రజ చోద్యంబౌ
తన సంపాదనె సర్వము
తన దుఃఖమె జనులకిచ్చు పత్యము సుమతీ!


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, మే 25, 2014

బస్ .. ప్లీజ్ స్టాప్..!!!

టీవీ చానెల్స్ కి సెన్సార్ ఉండదా ? లేక సెన్సార్ బోర్డ్ పరిధిలోకి రాద ? అర్ధం కావత్లెదు. 

"A" సర్టిఫికట్ సినిమా Bus Stop మూవీ రేపు మధ్యాన్నం జెమిని టీ వీ లో అని ప్రకటన వస్తోంది. ధియేటర్ కి వెళ్ళి చూడడానికి 18 యేళ్ళ లోపు వాళ్లకి పనికిరాదు.. చూడదగ్గ సినిమా కాదు అని "A" సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా ఇంట్లో చూసేందుకు ఎలా పనికొస్తుందో అదీ ఆదివారం మధ్యాన్నం... బోల్డన్ని బూతులు..ద్వందార్ధ డైలాగులు, జుగుప్స కలిగించే సన్నివేశాలు, ప్రేమ అని చూపించే కామకేళీలు,,అన్నీ చూపించి..చివర్లో ఒక స్లైడ్ వేసి ఇలా చేయడం తప్పు అని చెబితే సందేశాత్మక చిత్రాలవుతాయేమో ? 

ఇంకా ఎక్కువ రాస్తే సినిమాకి పబ్లిసిటీ అవుతుందేమో? 

ఇలాటి సినిమాలు బస్ .. 
ప్లీజ్ స్టాప్..
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శనివారం, మే 10, 2014

'సర్వే' జనా సుఖినోభవంతు

'సర్వే' జనా సుఖినోభవంతు... ఈళ్ళందరూ...పోలింగు బూతులో తొంగిజూసినారా ఏంది.. ? ఈళ్ళకి నంబర్లెలా తెలుత్తాయబ్బా ?


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, మే 04, 2014

ఐ పీ ఎల్

రెండు ఐ పీ ఎల్ లు ఒకే లా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ పొలిటికల్ లీగ్.

ఎవరు ఏ టీం లో ఉన్న్నారో.. ఎవరు ఎవరిని కొన్నారో .. కంఫ్యూజన్.
ముందు దుబాయ్ లో తరువాత ఇక్కడ..  ఇక్కడా అంతే..మును కొన్ని ప్లేసుల్లో తరువాత కొన్ని ప్లేసుల్లో

అక్కడా ఫిక్సింగ్ ప్రాబ్లెం..  ఇక్కడా ఫిక్సింగ్ ప్రాబ్లెం..

అక్కడ కింగ్ఫిషర్ స్పాన్సర్..ఇక్కడ స్పాన్సరింగ్ కింగ్ ఫిషర్..

అక్కడా కోట్ల డబ్బు.. ఇక్కడా కోట్ల డబ్బు..

అక్కడ బాటు తో బాలు కొట్టాలి.. ఇక్కడ బాలెట్ తో..


చూద్దాం ఎవరు గెలుస్తారో ?నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa