Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, నవంబర్ 28, 2014

హీరో

మేనరిజం ఎలా ఉన్నా పరవాలేదు మేనరికం ఉంటే హీరో ఐపోవచ్చు !


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, నవంబర్ 25, 2014

భారతి



ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని !



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, నవంబర్ 15, 2014

లైఫ్

ఎక్కడో ఎప్పుడో
తెలీని
జననం మరణం

ఎవరో ఎలానో
తెలీని
ప్రేమ పెళ్లి

ఎంతో ఇంకెంతో
తెలీని
సంసారం సంపాదన


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, నవంబర్ 01, 2014

యాక్టర్స్


పైరసీ మీద పోరాటాలు

స్వచ్ భారత్ ఆర్భాటాలు

వరద బాధితులకు సహాయాలు


వీళ్ళ సినిమాల విడుదలప్పుడే ఎందుకో ?







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, అక్టోబర్ 04, 2014

ఫేస్ బుక్కు

ఐఫోన్ వాడాలంటే చార్జర్ దగ్గరుండాలి

వాట్సాప్ వాడుతుంటే.. అడ్డమైన గ్రూపులకి అలవాటు పడాలి

ఫేస్ బుక్కు ... మన గోడ మీద పరిచయంలేని ఫ్రెండ్స్ పిడకలు - పీడకలలు

ట్విట్టరు : అర్ధం కాకపోయినా స్టేటస్ సింబల్






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

బుధవారం, సెప్టెంబర్ 24, 2014

ఆగద్దు..


మార్చి పోతే సెప్టెంబరొస్తుంది
కానీ ఫావరెట్ హీరో సినిమా
ఇవ్వాళ చూడకపోతే రేపుంటుందో ఉండదో ..

ఆగద్దు..


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, ఆగస్టు 01, 2014

అబద్ధాలు

అబద్ధాలాడితే అమ్మాయిలు పుడతారోలేదో కానీ
అమ్మాయిలకోసం అబద్ధాలు చాలానే పుడతాయి !





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
Share/Save/Bookmark

గురువారం, జూన్ 12, 2014

EAMCET

నేను చదువుకున్న టైం లో ఎం సెట్ రిజల్ట్ వచ్చిన రోజున ఇంటికెళ్లడానికి భయమేసింది. ఈ జెనెరేషన్ లో ఎం సెట్ రిజల్ట్ వచ్చిన రోజున పేరెంట్స్ కి భయమేస్తోందిట.. నిన్న మా ఫ్రెండ్ చెప్పాడు. మా అబ్బాయి లక్షాధికారండి.. లక్షా యాభై వేల రాంక్ వచ్చింది.. ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టి సీట్ కొనాలి అని. కావాలంటే మరో సంవత్సరం ఎం సెట్ కోచింగ్ తీసుకుంటా కానీ.. డిగ్రీ లో చేరడట.. నెక్స్ట్ యియర్ దాకా వెయిట్ చేయడం కన్నా..ఇదే బెటర్ అప్పుడైనా అప్పు చేయక తప్పదని ఫాదర్ నిట్టూర్పు..

EAMCET అంటే Earning Adequate Money by College Education Trustboard ఏమో 




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శనివారం, మే 31, 2014

ఎంత ప్రేమో !...ఎంత హాయో !


http://www.gotelugu.com/issue60/1657/telugu-columns/lot-of-love/


ఎంత ప్రేమో !...ఎంత హాయో ! ఫణి మాధవ్ కస్తూరి

lot of love!
ఎంత ప్రేమో !
తనెప్పుడూ నా ఒళ్ళోనే
ల్యాప్ టాపు....

ఎంత ప్రేమో !
ఎప్పుడూ చెవిలో ఏవో గుసగుసలు
మొబైలు...

ఎంత ప్రేమో !
నాతో ఎక్కడికైనా రెడీ
నా బైకు

ఎంత ప్రేమో !

ఎంత ప్రేమో !
బ్రెయిన్ లేకపోయినా రక్షణ
హెల్మెట్టు

ఎంత ప్రేమో !
ముక్కూ మొఖం తెలీని ఫ్రెండ్సు
ఫేసుబుక్కు..

ఎంత హాయో !
ఎన్ని పిచ్చికూతలైనా కూయచ్చు
ట్విట్టరు
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, మే 26, 2014

సుమతీ!

తన తమ్ముడె తన శత్రువు
తన బావయె తనకు రక్ష, ప్రజ చోద్యంబౌ
తన సంపాదనె సర్వము
తన దుఃఖమె జనులకిచ్చు పత్యము సుమతీ!






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, మే 25, 2014

బస్ .. ప్లీజ్ స్టాప్..!!!

టీవీ చానెల్స్ కి సెన్సార్ ఉండదా ? లేక సెన్సార్ బోర్డ్ పరిధిలోకి రాద ? అర్ధం కావత్లెదు. 

"A" సర్టిఫికట్ సినిమా Bus Stop మూవీ రేపు మధ్యాన్నం జెమిని టీ వీ లో అని ప్రకటన వస్తోంది. ధియేటర్ కి వెళ్ళి చూడడానికి 18 యేళ్ళ లోపు వాళ్లకి పనికిరాదు.. చూడదగ్గ సినిమా కాదు అని "A" సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా ఇంట్లో చూసేందుకు ఎలా పనికొస్తుందో అదీ ఆదివారం మధ్యాన్నం... బోల్డన్ని బూతులు..ద్వందార్ధ డైలాగులు, జుగుప్స కలిగించే సన్నివేశాలు, ప్రేమ అని చూపించే కామకేళీలు,,అన్నీ చూపించి..చివర్లో ఒక స్లైడ్ వేసి ఇలా చేయడం తప్పు అని చెబితే సందేశాత్మక చిత్రాలవుతాయేమో ? 

ఇంకా ఎక్కువ రాస్తే సినిమాకి పబ్లిసిటీ అవుతుందేమో? 

ఇలాటి సినిమాలు బస్ .. 
ప్లీజ్ స్టాప్..




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శనివారం, మే 10, 2014

'సర్వే' జనా సుఖినోభవంతు

'సర్వే' జనా సుఖినోభవంతు... ఈళ్ళందరూ...పోలింగు బూతులో తొంగిజూసినారా ఏంది.. ? ఈళ్ళకి నంబర్లెలా తెలుత్తాయబ్బా ?


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, మే 04, 2014

ఐ పీ ఎల్

రెండు ఐ పీ ఎల్ లు ఒకే లా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ పొలిటికల్ లీగ్.

ఎవరు ఏ టీం లో ఉన్న్నారో.. ఎవరు ఎవరిని కొన్నారో .. కంఫ్యూజన్.
ముందు దుబాయ్ లో తరువాత ఇక్కడ..  ఇక్కడా అంతే..మును కొన్ని ప్లేసుల్లో తరువాత కొన్ని ప్లేసుల్లో

అక్కడా ఫిక్సింగ్ ప్రాబ్లెం..  ఇక్కడా ఫిక్సింగ్ ప్రాబ్లెం..

అక్కడ కింగ్ఫిషర్ స్పాన్సర్..ఇక్కడ స్పాన్సరింగ్ కింగ్ ఫిషర్..

అక్కడా కోట్ల డబ్బు.. ఇక్కడా కోట్ల డబ్బు..

అక్కడ బాటు తో బాలు కొట్టాలి.. ఇక్కడ బాలెట్ తో..


చూద్దాం ఎవరు గెలుస్తారో ?







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

గురువారం, ఏప్రిల్ 17, 2014

ఒక్క సారే !



పవర్ కట్ చేసే అవకాశం మనకి ఒక్క సారే వస్తుంది..! ఓటింగ్ డే..
Don't miss the Power of One Day - The Voting Day !!







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, ఏప్రిల్ 13, 2014

జీను లేని గుర్రాల మధ్య జీన్స్ పాంట్ వేసుకుని పరిగెత్తే కుర్రాడి కధ !

జీను లేని గుర్రాల మధ్య జీన్స్ పాంట్ వేసుకుని పరిగెత్తే కుర్రాడి కధ !

 హీరో ఎంత బేవార్సైతే అంత గొప్ప అని చాటే మరో చిత్రం. పోలీసైన అన్నని లెక్క చెయ్యం, 500 కోట్లకు ఓనరైన హీరోయిన్ తండ్రిని ఎదవని చేస్తాం.. చివరకి కాన్సర్ గురించి చేసిన ఓ ప్రకటనలో ఉన్న చనిపోతూ కాన్సర్ కారణం గుట్కా అని చెప్పే మహేష్ కారెక్టర్ ని కూడా కామెడీ చేసేదాక వదలం. ఎక్కడో ఒక చిన్న సాయం చేసి ..అది కూడా అన్నయ్య కి తెలీకుండా తండ్రి వీసా కోసం ఇచ్చిన పైసలు దానం చేసి.. హీరోయిజం...సంపాదించేస్తాం. అదేంటో చిన్న చిన్న దానికి కూడా ఖూనీలు చేసేలా చూపించే విలన్ లు హీరోని మాత్రం అస్సలు ముట్టుకోరు.. లాస్ట్ దాకా యెదవలైపోవడమే.. ప్రతీ సినిమాలో సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చి బక్రా అయే బ్రహ్మీ కామన్.. దీనికి తోడు.. పాటేదో..అందులో మాటేదో కూడా అర్ధం కాని మ్యూజిక్కు, రణ గొణ ద్వనుల తో బాక్ గ్రౌండ్ రోరింగ్..


ఏంటో నాకీ మధ్య సినిమాలు ఎంజాయ్ చెయ్యడం రావట్లేదు... ఇంక అభిమానులు తిట్టిపొయ్యడానికి రెడీ.. రండి బాబు రండి.. మరో సారి సినిమా చూసి మరీ రండి..







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, మార్చి 31, 2014

జయనామ సంవత్సర రాశి ఫలితాలు :

జయనామ సంవత్సర రాశి ఫలితాలు :
12 రాశులున్నా.. ప్రస్తుతానికి ఇంతటితో సరిపెడుతున్నా..
కేవలం ప్రస్తుత పరిస్థితుల మీద ఓ వ్యంగ్య రచనే.. కానీ సంప్రదాయ పంచాంగ పఠనం/శ్రవణం మీద గౌరవం లేక కాదు. సరదాకి నవ్వుకోవడానికి..

మేష రాశి..
రాజ పూజ్యం : ఎన్నికల ముందు... అవమానం : ఎన్నుకున్నాక
ఆదాయం : బిరియానీ,సారా పాకెట్టు,వంద నోటు వ్యయం : ఐదేళ్ళ భవిష్యత్తు
అంటే పొట్టేలు/మేక .. సాధారణంగా ఓటర్లు ఈ రాశికి చెందిన వారౌతారు. గంభీరంగా కనపడతారు. ఎలక్షన్ టైం లో కొమ్ములు కూడా కనిపిస్తాయి.కానీ ముందు వాడో పక్కవాడినో చూసి గుంపుగా గుడ్డిగా ఫాలో ఐ.. ఫూల్ అవుతుంటారు. ఎవరు సాయం చేద్దామనుకున్నా..మంచి చేద్దామనుకున్నా.. కసాయి వారినే నమ్మి బలౌతుంటారు..
వృషభ రాశి :
రాజపూజ్యం : అక్కర్లేదు                అవమానం :లెక్క చేయరు
ఆదాయం : దొరికినంత                   వ్యయం :
దున్నపోతు అని కూడా అనొచ్చు. దాదాపుగా ముదిరిన రాజకీయనాయకుల రాశి. మీద ఏం పడ్డా చలించరు.. తీరిగ్గా దొర్కింది మేసేసి.. నెమరు వేస్తూ ఉంటారు. లోకులు అరిచినా..కాకులు వాలినా..జోకులు పేలినా తోకతో కూడా అదిలించరు.. ఆవులించరు. చర్మం మందం..  ఏమన్నా పట్టించుకోరు కాబట్టి ఎక్కడున్నా ఒకటే..


కర్కాటకం :
రాజ పూజ్యం :                              అవమానం :  
ఆదాయం :                                   వ్యయం :                      
దీనినే కాన్సర్ అని కూడా అంటారు. కాన్సర్ లాగానే పట్టుకుంటే రూపీ థెరపీలు.. మందులు.. అవసరం. సాధారణంగా దళారులు ఈ రాశి వారుంటారు.


మకరం :
మకర రాశి.. మొసలి లాంటి వాళ్లు. పట్టుకుంటే వదలరు. పదవిలో ఉన్నప్పుడు బలవంతులు. పదవి వదిలితే బలహీనులు. మొండితనం,మూర్ఖత్వం వీరి సొంతం..

సిమ్హం :
రాజ పూజ్యం : సినిమా తెర                అవమానం :  రాజకీయ వేదిక
ఆదాయం :  కోట్లు                           వ్యయం :  అభిమానుల ప్రేమ                    
సాధారణంగా సినీ హీరోలు ఈరాశి వారు. సినిమాల్లో తాము సిమ్హం పై చెప్పిన డైలాగులు నిజమనే భ్రమలో ఉంటారు. వీలైనంత వరకు..సిమ్హం లాగా ఉండడానికి ప్రయత్నిస్తూ... గాండ్రిస్తూ... గంభీరం ఒలకబోస్తూ.. అరుస్తూ ఉంటారు.. జూలు విదిలిస్తూ ఉంటారు.. జూలో పెడితే వినోదం అందిస్తారు..


ధనస్సు :
ఇది మీడియా రాశి. ఎవరిమీదైనా ఎక్కుపెట్టి ప్రశ్న బాణాలు వేస్తారు. తగిలినా తగలకపోయిన పోయేదేమీ లేదు.

మీనం :
వీళ్ళు పదవున్నా లేకున్నా పని చేసుకుపోయే సీనియర్ కార్యకర్తలు..నీళ్ళు వదిలితే ఉండలేని చేపల్లా..పార్టీలని వీడి రాలేరు..అక్కడక్కడే తిరుగుతూ. దొరికింది తింటూ.. గుంపుగా..గుంభనగా బతికేస్తారు.




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

గురువారం, మార్చి 13, 2014

అసెంబ్లీకి దారేది ?


యువత ఆత్మ హత్యలకు పాల్పడుతున్నప్పుడు స్పందించని హృదయాలు...
ఎలక్షన్లు వస్తున్నప్పుడు మాత్రం స్పందించి..
ప్రజా సేవ కై అంకితమౌతాయనుకుంటా... !

జనం కోసం మనం కాదు...
మన కోసం జనం ....

పెజా స్వామ్యమనే మాట పెద్ద జోకైపోయింది..

నచ్చకపోతే సినిమానే మూడోరోజు చూడని అభిమానులు ఐదేళ్లకోసం నాయకుణ్ణి ఎన్నుకోడంలో మాత్రం ఎందుకో ఇంత తికమక పడి... హీరోల్ని తికమక పెడతారు..

అంతగా నమ్మకముంటే మరి మెగా హీరో గారి అభిమానులు అన్ని చోట్లా గెలిపించుండాలె గదా..

ఏంటో.. ఊళ్ళో పార్టీ మీడియా హడావిడి తో అంత గందర  గోళం..

కాంగ్రెసేతర..బీ జేపీయేతర తెలుగుదేశమేతర వై ఎస్సార్ సీ పీయేతర... కొత్త జాతర కి రెడీ గయ్స్....







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, మార్చి 03, 2014

కాటమ రాయుడా కదిరి " నరసింహుడా"!

కాటమ రాయుడా కదిరి " నరసింహుడా"!




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

జబ్బర్దస్త్ - ది శారీ స్టార్స్ Show

జబ్బర్దస్త్ - ది శారీ స్టార్స్

సాధారణం గా ఈ టీవీ అంటే కొద్దో గొప్పో ఫామిలీ చానెల్ గా పేరుంది. కానీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం తో ఎందుకు పాడు చేసుకుంటుందో తెలీట్లేదు. పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ లాంటి బూతు ప్రోగ్రాం లు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో మరి.

కామెడీ అంటే ఒకళ్లనొకళ్లు తన్నుకోవడం.. బూతు మాటలకి జడ్జీలు పగలబడి నవ్వడం..నాలుక కొరుక్కోవడం...లాంటి వెకిలి చేష్టలే అని జస్టిఫై చేసేస్తున్న ముదనష్టపు ప్రోగ్రాం.

ఇక స్త్రీ పాత్రలలో ఆ కమెడియన్లు చేసే వికృత చేష్టలు.. చీర పైదాకా లాగి తన్నుకోవడాలు..భాష, కింద పడి దొర్లడాలు.. మీసాలు గడ్డాలతోనే వేషాలు.. తీసుకునే ఇతివృత్తాలు చూస్తుంటే యత్ర నార్యంతు పూజ్యంతే అనే శ్లోకం పుట్టిన దేశంలోనే ఉన్నామా అనిపిస్తుంది. కామెడీ చేయగలిగే మహిళా కళాకారులే కనపడలేదా..లేకపోతే ఇలాంటి పాత్రలు వాళ్ళకివ్వలేమని వీళ్లే చేసేస్తున్నారా అర్ధం కావట్లేదు.

ప్రోగ్రాం చివర్లఒ మీరూ ఇందులో పాల్గొంటారా ఐతే సంపరదించండి అంటూ ఓ ప్రకటన చేస్తున్నారు. మరి ఇన్నాళ్ళైనా ఒక్క కొత్త కళాకారుడు కనపడలేదు. మరి ఇంత పాపులర్ ప్రోగ్రాం కి ఎవరూ ట్రై చేయట్లేదా..లేదా వీళ్ళ స్టాండర్డ్ అందుకోలేక పోతున్నారా ? ప్రొగ్రాం ఎవరిదైనా వచ్చే చానెల్ మీద ఆ ప్రభావం ఉంటుంది. కేవలం టీ ఆర్ పీ ఆధారంగా ప్రోగ్రాం లు వేసేటట్టైతే ఇంకొన్ని బూతు ప్రోగ్రంలో సినిమాలో వేస్తే కూడా టీ ఆర్ పీ పెరుగుతుంది..మరి.

ఇటీవల ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లో ఇదే కమెడియన్ ల టీం ఒక కామెడీ చేసింది.. జనం లో ఒక్కరికైనా నవ్వు వచ్చిందేమో చూడండి.. బసంతి అంటే షోలే లో గుర్రం అని ఆ కమెడియన్ చెప్తున్నంత సేపూ జనం అసహనం గా చూడడం లైవ్ లోనే వచ్చింది. అలాగే చిరంజీవి,మహేష్ బాబు, రజనీకాంత్ లని ఇమిటేట్ చేస్తూ ఏదో చెబుదామని ప్రయత్నించిన అంశం కూడా ప్రాక్టీస్, ప్రిపరేషన్ లేక పోవడం వల్ల చివరకు అర్ధం లేకుండా అర్ధం కాకుండా మిగిలిపోయింది.

ఈ మధ్య బాపు గారి సన్మానం కార్యక్రమం లో కూడా.. బాపు గారు , బాలు గారు, మనో ,సాయి కుమార్ లాంటి వాళ్ల ముందు ఒక శవం దాని ముందు పేకాడుతూ తాగుతూ పాటలు పాడుతూ చేసిన ఒక కామెడీ యాక్ట్ చూసి జనాలు యాక్ థూ అన్నారు.

ఇక జబర్దస్త్ యాంకర్.. తెలుగు రాకపోవడం.. జబ్బలు కనిపించేలా డ్రెస్సు, లాంటివి మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నరేమో అనిపించే మహాతల్లి.

మరి రోజా - నాగ బాబు ఈ ప్రోగ్రాం ని ఇంట్లో వాళ్లతో కలిసి చూడగలుగుతున్నారా ? ఏమో నేనే ఎదగాలేమో ?

ఆ మధ్య గరికిపాటి వారు చేసిన సంభాషణల్లో కూడా జనం హాయిగా నవ్వుకున్నారు.

ఈ సారీ స్టార్లని ఇంకెన్నాళ్ళు భరించాలో మరి ..





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails