ఆదివారం, మే 26, 2013

త్వరలోమరో ఐ పీ ఎల్

త్వరలోమరో  ఐ పీ ఎల్ - ఇండియన్ పొలిటికల్ లీగ్ ప్రారంభం కాబోతోంది.. అభ్యర్ధుల కొనుగోలు మొదలెట్టే పార్టీ ఫ్రాంచైజీలు..  మూటల బాల్సు, మాటల సిక్సులు, వీధులెంబడి ఓట్ల కోసం పరుగులు, సీటు దొరకని అభ్యర్ధుల వికెట్లు, బిర్యాని పొట్లాల కాచులు,కార్యకర్తలకు కోచులు, నాయకుల స్పీచులు, ఫిక్స్ చేసే మధ్యవర్తులు, మధ్యం మత్తులు, పార్టీలు ,చిందులు ,విందులు,వినోదాలు, లాకర్లు, జోకర్లు, జెండాలు,ఎజండాలు ,స్లెడ్జింగులు,రీప్లేలు,రీ పోల్లు, కాచులు,కోచులు, లైవులిచ్చే న్యూస్ చానెల్సు, ఈలలు,, గోలలు, చీర్స్ - గర్ల్స్ - ఒకటేమిటి లీగ్ నుంచి ప్లేయ్ ఆఫ్ దాకా, క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ దాకా...పోలింగ్ బూత్ నుంచి అసెంబ్లీ పార్లమెంట్ దాకా ఎంటర్ టెయిన్ మెంట్.....     నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర
ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ బాబు ఆన అయ్యిందేమో బావ దరిక...