గురువారం, ఫిబ్రవరి 14, 2013

వేలం వెర్రిడే సందర్భంగా.. ప్రేమ 'గుల ' దినోత్సవ శుభాకాంక్షలు..


ప్రే'మించే' జనాల గురించే తప్ప ప్రేమ గురించి చులకన భావం లేదు . ప్రేమ కి ఆకర్షణ కి తేడా తెలీక .. చూసి ఓ నవ్వు నవ్విందని..ఓ పువ్వు తీసుకుని లవ్వు అని వెంటబడి..పార్కులకో సినిమాలకో తిరిగి..షాపింగులు చేసి..డేటింగులు చేసి.. ముఖం చాటేసే చెవిలో ఫ్లవర్స్ పెట్టే లవర్స్ గురించి..కొంచెం బాధ.. మనది విశాల హృదయం అందుకే ప్రపంచం లో పండుగలు...'దినాలు ' ఏవి ఉన్నా మనవి చేసేసుకుని.. అమ్మకో రోజు..నాన్న కో రోజు..రోజ్ డే..కిస్ డే..లవర్స్ డే ... ఎన్నైనా ఓకే.. జీవితాన్నే గిఫ్ట్ గా ఇచ్చేంత సిన్సియారిటీ ఉన్న వాళ్ళూ ఉన్నారు..గిఫ్ట్ మారినట్టు గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో మార్చే వాళ్ళూ ఉన్నారు..ప్రేమికులందు నిజ ప్రేమికులు వేరయా !
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఆదివారం, ఫిబ్రవరి 10, 2013

చిత్రవధ


చిత్రవధ 


పెద్ద సినిమా అనగా పెద్ద హీరో ఉండును..ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండును బాంబే విలన్లు ఉండును, ఫారిన్ లొకేషన్లు ఉండును.. ఎగిరిపడే సూమోలు..ఎగసి పడే సముద్రపు అలలు,విరిగిపడే విలన్ అసిస్టంట్లూ ఉండును  ... కావాల్సినన్ని థియేటర్లు ఉండును - టీ వీలో యాడ్లు - ఇంటర్వ్యూలు - ఊరినిండా పోస్తర్లు ఉండును


ఇక ఉండనివి : కధ - లాజిక్ - వారం తరువాత ఆడియన్స్ ..

చిన్న సినిమా అనగా - క్రియేటివ్ గా ఉండును...యాక్టర్లు-ఆర్టిస్ట్లు ఉండును - కధ ఉండును - లాజిక్ ఉండును - వారం తరువాత నుంచి ఆడియన్స్ ఉండును -

చిన్న సినిమాకి ఉండనివి : ఎగిరిపడే సూమోలు - హెలికాప్టర్లు - తీవీ లో ప్రోమోలు - ఇంటర్వ్యూలు - రిలీజ్ చేసుకోడానికి థియేటర్లు - సినిమా బయటకు రావడానికి బడ్జెట్టు..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
  Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, ఫిబ్రవరి 08, 2013

డిలే అండ్ రూల్


అధార్ కి కూడా డెడ్ లైన్ లేదట.. గవర్నమెంట్ చెప్పింది..
బ్రిటీషోళ్ళది డివైడ్ అండ్ రూలు ఐతే వీళ్లది డిలే అండ్ రూల్ లా ఉంది..నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ బాబు ఆన అయ్యిందేమో బావ దరిక...