శనివారం, జనవరి 12, 2013

ఒకటి కొంటే 3 ఫ్రీ


ఒకటి కొంటే 3 ఫ్రీ

పండగ సీజన్ కదా బంపర్ ఆఫర్ లు నడుస్తున్నాయి. ఒకటి కొంటే మూడు ఫ్రీ. నిన్న రిలీజైన నాయక్ సినిమా చూస్తే తెలుస్తుంది..అది నిజమేనని. పాపం ఇమేజ్ చట్రం లో ఇరుక్కుని.. చేత్తో కొడితే కపాలం పగిలిపోయి, ఎముకలు నుజ్జు నుజ్జై పోయేంత బలమున్న హీరోలు. ముగ్గురు డైరెక్టర్ల పాత సినిమాలు 3 కలిపి కొడితే తట్టుకోవడం మన వంతు. కాకపోతే హీరోయిన్లు ముగ్గురు ఫ్రీ. ఇద్దరు హీరోలకు ఇద్దరు మధ్యలో ఐటం సాంగు కోసం మరో చార్మింగ్ గాళ్.. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఫ్రీ. లక్కీగా హీరోలిద్దరే అఫ్ కోర్స్ ఒకడే హీరో రెండు పోర్షన్ లు. డబల్ యాక్షన్ అన్నమాట. దసరా పండుగలు, కుంభ మేళాల్లో హత్యలు చేసేంత పవిత్రమైన మనసున్న ఆదర్శవంతమైన హీరోలు.

పేరు వాడుకుంటేనే మనిషిని చంపేసేంత భయంకరమైన విలన్ .. హీరొని మాత్రం తెగ నమ్మేసి బకరా ఐపోతాడు..పొగడ్తలకి పడిపోయి.. చెల్లెల్ని ఏమైనా అన్నా కూడా నమ్మనంతగా హీరోని నమ్ముతాడు..మాస్ మసాలా అంటే ఇలా కొట్టడం..తన్నడం..నాలుగు పాటలు..ఒక ఐటెం సాంగ్ - ఇది ప్రత్యేకంగా ఎందుకు పెడతారో అర్ధం కాదు ...హీరోయిన్లు పాపం వారి వంతు గా ఐటెం సాంగుగా మార్చేస్తుంటే ప్రతీ సాంగుని..
అసలు హీరో వస్తున్నాడని తెలిసి బాత్రూం తలుపు కూడా వేసుకోకుండా ఉండే హీరోయిన్ ఒకళ్ళు.. అడుక్కునే పిల్లల్ని రక్షించినందుకు జిం కి వచ్చి మరీ వగలు పోయేది ఒకళ్ళు..
ఆమధ్య స్రీహరి సినిమాలో ఉన్న రౌడీలకు దేహ శుద్ధి సీన్లు ఇందులోనూ రిపీటు..బహుశా ఆ సినిమా ఈయన  చూడక పోవడం వల్ల..అదే ఐడియా రావడం వల్లనో..లేక ఆ సీన్ నచ్చి పెట్టారో మరి...

పండగ ఆఫర్ మిస్ కాకండి ఇలాటివి బోలెడు... థాంక్స్ టు (ఇవీ మూడే) 'వీ వీ వి '  నాయక్..

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ బాబు ఆన అయ్యిందేమో బావ దరిక...