Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, డిసెంబర్ 06, 2013

కిట్టీ పార్టీ

చిట్టి పాట కిట్టీ పార్టీ గా మారెను
వచ్చిన డబ్బులేమో పార్టీ కే సరిపోయెను

కొత్త షాపుల షాపింగుల వివరాలు తెలిసిపోయెను
కాకర కాయల కబుర్లతో కొత్త వంటల ప్రయోగాలు మొదలాయెను

పేరంటాల విశేషాలు పోయి.. గోరింట దిజైన్ల చర్చలెక్కువాయెను
సీరియళ్ళ గురించి సీరియస్ డిస్కషన్లే మక్కువాయెను...



నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

మంగళవారం, డిసెంబర్ 03, 2013

తన పార్టియె తనకు శతృవు

తన పార్టియె తనకు శతృవు
తన ఇంటిపేరు తనకు రక్ష,  పదవి చుట్టంబౌ
తన సంపాదనె స్వర్గము,
తన విరోధికి నరకము చూపునెవరో తెలుపుడీ





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, డిసెంబర్ 01, 2013

మూగా స్టార్

కాంగ్రెస్ లోకి వెళ్ళాను కాంప్రమైజ్ అయిపోయాను   
హస్తినాపురం వెళ్ళాను హస్తం గుర్తుకు మారాను

నేను యూటీ చెయ్యమని  మేడం తో చెప్పాను
మూసుకుని మీ డ్యూటీ మీరు చెయ్యమని  మేడం చెప్పారు !
చాలా ఇంకేమన్నా కావాలా ??



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, నవంబర్ 25, 2013

పనులు సమకూరు ఒక ధరలోన

అనగ ననగ న్యూసు నిజమనిపించు
తినగ తినగ కోట్లు కరుగుచుండు
సాధారణముగ పనులు సమకూరు ఒక' ధర'లోన
విశ్వ సూత్రమిది వినర ఓటరా !



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

మంగళవారం, నవంబర్ 19, 2013

ఓయమ్మ నీ కుమారుడు


ఓయమ్మ నీ కుమారుడు   
మా ఇండియాన పాడి పంట మననీడమ్మ
పోయెద మిటలీ కైనను
మీయన్నల అసురలాన సోనియా రాణీ .. 





నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

అత్తారింటికి దారేది ?


అత్తారింటికి దారేది ?

త్రివిక్రం గడ్డం గీసుకోడు పవన్ కళ్యాణ్ గీసుకుంటాడు అంతే తేడా !

త్రివిక్రం పంచ్ డైలాగ్స్ పవన్ పవర్ ఫుల్ యాక్షన్ కోసం కాకుండా అదో విధం గా ఉంది. గుండమ్మ కధలో సూర్యాకాంతానికి బుద్ధి చెప్పడానికి బండోడిగా వచ్చిన ఎన్ టీ ఆర్ లా నదియా బుద్ధి మార్చడానికి బండివాడు(డ్రైవర్) గా వచ్చిన లక్షల కోటీశ్వరుడు పవన్ కళ్యాణ్..

అహల్య థీం మీద కామెడీ మాత్రం త్రివిక్రం నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యలేదు..

సిమ్హం పడుకునుంటే జూలుతో జడ వేయడం ..పులి తో ఫొటో తీయించుకోడం లాంటి డైలాగులు ఆల్రెడీ విన్నట్టుగా ఉన్నాయ్..

సినిమా ముందే లీకు -- ఇదివరకటితో పోలిస్తే కొంచెం వీక్  అనిపించింది.. ఏదైనా పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్..




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

సోమవారం, ఆగస్టు 19, 2013

హడావిడి..

భగవంతుడి దయ వల్ల నాస్తిక సభలు బాగా జరిగాయి అర్జెంట్ గా వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టాలన్నాట్ట వెనకటికి ఎవడో...

మళ్ళీ స్టార్ గారింట్లో పెళ్ళి.. ఇక మీడియాదే హడావిడి..

అత్తారింటికి దారేది - రిలీజయ్యే డేటేది ?

గడ్డం పెరగడానికేమో ఈ గ్యాప్..?






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, ఆగస్టు 18, 2013

డాలర్

ఇండియా లో డాలర్ కి విలువ లేదు..!
డాలర్ విలువ ఉల్లిపాయ కన్నా తక్కువే !!


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శనివారం, ఆగస్టు 03, 2013

గడియారం



గడియారం అక్కడే ఉంది.. 

కాలం కదిలిపోతోంది...




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

గురువారం, జూన్ 27, 2013

వరద - బురద

వరద - బురద కాదేదీ రాజకీయానికి అనర్హం!



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

ఆదివారం, మే 26, 2013

త్వరలోమరో ఐ పీ ఎల్

త్వరలోమరో  ఐ పీ ఎల్ - ఇండియన్ పొలిటికల్ లీగ్ ప్రారంభం కాబోతోంది.. అభ్యర్ధుల కొనుగోలు మొదలెట్టే పార్టీ ఫ్రాంచైజీలు..  మూటల బాల్సు, మాటల సిక్సులు, వీధులెంబడి ఓట్ల కోసం పరుగులు, సీటు దొరకని అభ్యర్ధుల వికెట్లు, బిర్యాని పొట్లాల కాచులు,కార్యకర్తలకు కోచులు, నాయకుల స్పీచులు, ఫిక్స్ చేసే మధ్యవర్తులు, మధ్యం మత్తులు, పార్టీలు ,చిందులు ,విందులు,వినోదాలు, లాకర్లు, జోకర్లు, జెండాలు,ఎజండాలు ,స్లెడ్జింగులు,రీప్లేలు,రీ పోల్లు, కాచులు,కోచులు, లైవులిచ్చే న్యూస్ చానెల్సు, ఈలలు,, గోలలు, చీర్స్ - గర్ల్స్ - ఒకటేమిటి లీగ్ నుంచి ప్లేయ్ ఆఫ్ దాకా, క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ దాకా...పోలింగ్ బూత్ నుంచి అసెంబ్లీ పార్లమెంట్ దాకా ఎంటర్ టెయిన్ మెంట్.....     



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శనివారం, మార్చి 30, 2013

జయహో తెలుగు సినిమా

ఒక చానెల్లో మగధీర..ఒక చానేల్లో రచ్చ ....ఒకే టైములో అదే విలన్ అదే హెలికాప్టర్ లో హీరోయిన్(హీరోయిన్ లు వేరు) ని ఎత్తుకు పోయాడు.. అదేంటో అప్పటిదాకా కత్తులతో ఫైట్ చేసిన అదే హీరో కర్ర దెబ్బకి పడిపోతాడు.. ! జయహో తెలుగు సినిమా.. ఇమేజ్ చట్రం లోంచి బయటకి రారు వీళ్లు !! 






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

బుధవారం, మార్చి 27, 2013

ప్రణయ ప్రయాణం..!




నీ కనుల కొలనులో,,,కలల అలలలో 
ప్రణయ ప్రయాణం..!
మునిగినా...తీరం చేరినా ఆనందమే..!!




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

మంగళవారం, మార్చి 26, 2013

రంగు పడుద్ది!


రంగు పడుద్ది!

అబ్బ ఆ పిల్ల చూడండి రంగు మెరిసిపోతోంది, వాణ్ణి నమ్మొద్దురా రంగులు మార్చే ఊసరవెల్లిరా వాడు, అబ్బ ఆకాశం చూడు ఇంద్రధనస్సు ఎన్ని రంగులో, ప్రకృతి రంగు రంగుల పూలతో శోభిల్లుతోంది, బిల్లు చూడంగానే మొహం లో రంగులు మారాయి, తలకు రంగులేసినంత మాత్రాన వయసు దాగుతుందా,రంగుల రాట్నం, రంగుల ప్రపంచం, రంగస్థలం, అబ్బ చెప్పుకుంటూ పోతే మన జీవితమే రంగుల మయం.. కానీ స్వచ్చమైన ప్రకృతి సిద్ధమైన రంగులొదిలేసి..కెమికల్స్ తో నిండిన రంగులతో పండగ చేసుకుని..ఇంకా కాలుష్యం నింపుతూ.. ఆరోగ్యం పాడుచేసుకుంటూ హోలీ పండుగ విశిష్టతని పాడు చేస్తున్నాం. రుతువు మారే సమయం..యెండా కాలం మొదలయ్యే కాలం, వసంతోత్సవం గా మొదలై.. ఎటుపోతోందో అర్ధం కావట్లేదు.. అందరికీ హోళీ పండుగ ఆనందంగా జరగాలని ఆశిస్తూ.. హోళీ శుభాకాంక్షలు.. !!









నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

గురువారం, ఫిబ్రవరి 14, 2013

వేలం వెర్రిడే సందర్భంగా.. ప్రేమ 'గుల ' దినోత్సవ శుభాకాంక్షలు..


ప్రే'మించే' జనాల గురించే తప్ప ప్రేమ గురించి చులకన భావం లేదు . ప్రేమ కి ఆకర్షణ కి తేడా తెలీక .. చూసి ఓ నవ్వు నవ్విందని..ఓ పువ్వు తీసుకుని లవ్వు అని వెంటబడి..పార్కులకో సినిమాలకో తిరిగి..షాపింగులు చేసి..డేటింగులు చేసి.. ముఖం చాటేసే చెవిలో ఫ్లవర్స్ పెట్టే లవర్స్ గురించి..కొంచెం బాధ.. మనది విశాల హృదయం అందుకే ప్రపంచం లో పండుగలు...'దినాలు ' ఏవి ఉన్నా మనవి చేసేసుకుని.. అమ్మకో రోజు..నాన్న కో రోజు..రోజ్ డే..కిస్ డే..లవర్స్ డే ... ఎన్నైనా ఓకే.. జీవితాన్నే గిఫ్ట్ గా ఇచ్చేంత సిన్సియారిటీ ఉన్న వాళ్ళూ ఉన్నారు..గిఫ్ట్ మారినట్టు గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో మార్చే వాళ్ళూ ఉన్నారు..



ప్రేమికులందు నిజ ప్రేమికులు వేరయా !








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఆదివారం, ఫిబ్రవరి 10, 2013

చిత్రవధ


చిత్రవధ 


పెద్ద సినిమా అనగా పెద్ద హీరో ఉండును..ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండును బాంబే విలన్లు ఉండును, ఫారిన్ లొకేషన్లు ఉండును.. ఎగిరిపడే సూమోలు..ఎగసి పడే సముద్రపు అలలు,విరిగిపడే విలన్ అసిస్టంట్లూ ఉండును  ... కావాల్సినన్ని థియేటర్లు ఉండును - టీ వీలో యాడ్లు - ఇంటర్వ్యూలు - ఊరినిండా పోస్తర్లు ఉండును


ఇక ఉండనివి : కధ - లాజిక్ - వారం తరువాత ఆడియన్స్ ..

చిన్న సినిమా అనగా - క్రియేటివ్ గా ఉండును...యాక్టర్లు-ఆర్టిస్ట్లు ఉండును - కధ ఉండును - లాజిక్ ఉండును - వారం తరువాత నుంచి ఆడియన్స్ ఉండును -

చిన్న సినిమాకి ఉండనివి : ఎగిరిపడే సూమోలు - హెలికాప్టర్లు - తీవీ లో ప్రోమోలు - ఇంటర్వ్యూలు - రిలీజ్ చేసుకోడానికి థియేటర్లు - సినిమా బయటకు రావడానికి బడ్జెట్టు..








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
  Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, ఫిబ్రవరి 08, 2013

డిలే అండ్ రూల్


అధార్ కి కూడా డెడ్ లైన్ లేదట.. గవర్నమెంట్ చెప్పింది..
బ్రిటీషోళ్ళది డివైడ్ అండ్ రూలు ఐతే వీళ్లది డిలే అండ్ రూల్ లా ఉంది..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, జనవరి 12, 2013

ఒకటి కొంటే 3 ఫ్రీ


ఒకటి కొంటే 3 ఫ్రీ

పండగ సీజన్ కదా బంపర్ ఆఫర్ లు నడుస్తున్నాయి. ఒకటి కొంటే మూడు ఫ్రీ. నిన్న రిలీజైన నాయక్ సినిమా చూస్తే తెలుస్తుంది..అది నిజమేనని. పాపం ఇమేజ్ చట్రం లో ఇరుక్కుని.. చేత్తో కొడితే కపాలం పగిలిపోయి, ఎముకలు నుజ్జు నుజ్జై పోయేంత బలమున్న హీరోలు. ముగ్గురు డైరెక్టర్ల పాత సినిమాలు 3 కలిపి కొడితే తట్టుకోవడం మన వంతు. కాకపోతే హీరోయిన్లు ముగ్గురు ఫ్రీ. ఇద్దరు హీరోలకు ఇద్దరు మధ్యలో ఐటం సాంగు కోసం మరో చార్మింగ్ గాళ్.. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఫ్రీ. లక్కీగా హీరోలిద్దరే అఫ్ కోర్స్ ఒకడే హీరో రెండు పోర్షన్ లు. డబల్ యాక్షన్ అన్నమాట. దసరా పండుగలు, కుంభ మేళాల్లో హత్యలు చేసేంత పవిత్రమైన మనసున్న ఆదర్శవంతమైన హీరోలు.

పేరు వాడుకుంటేనే మనిషిని చంపేసేంత భయంకరమైన విలన్ .. హీరొని మాత్రం తెగ నమ్మేసి బకరా ఐపోతాడు..పొగడ్తలకి పడిపోయి.. చెల్లెల్ని ఏమైనా అన్నా కూడా నమ్మనంతగా హీరోని నమ్ముతాడు..మాస్ మసాలా అంటే ఇలా కొట్టడం..తన్నడం..నాలుగు పాటలు..ఒక ఐటెం సాంగ్ - ఇది ప్రత్యేకంగా ఎందుకు పెడతారో అర్ధం కాదు ...హీరోయిన్లు పాపం వారి వంతు గా ఐటెం సాంగుగా మార్చేస్తుంటే ప్రతీ సాంగుని..
అసలు హీరో వస్తున్నాడని తెలిసి బాత్రూం తలుపు కూడా వేసుకోకుండా ఉండే హీరోయిన్ ఒకళ్ళు.. అడుక్కునే పిల్లల్ని రక్షించినందుకు జిం కి వచ్చి మరీ వగలు పోయేది ఒకళ్ళు..
ఆమధ్య స్రీహరి సినిమాలో ఉన్న రౌడీలకు దేహ శుద్ధి సీన్లు ఇందులోనూ రిపీటు..బహుశా ఆ సినిమా ఈయన  చూడక పోవడం వల్ల..అదే ఐడియా రావడం వల్లనో..లేక ఆ సీన్ నచ్చి పెట్టారో మరి...

పండగ ఆఫర్ మిస్ కాకండి ఇలాటివి బోలెడు... థాంక్స్ టు (ఇవీ మూడే) 'వీ వీ వి '  నాయక్..





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails