Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, ఏప్రిల్ 14, 2012

నేడే చూడండి.. ! రేపటి దాకా ఉంటుందో లేదో.. !!నేడే చూడండి.. !!

రేపటి దాకా ఉంటుందో లేదో.. !!ఉచ్చలు పోయించే సినిమాలు, పిచ్చ తలకెక్కి రైలు కు ఎదురెళ్ళి రచ్చ చేసే సినిమాలు చూస్తోంటే.. హీరోని దైవాంశ సంభూతుడిగా చూపించే విషయం లో మనం 'తారా ' స్థాయికి వెళ్ళిపోయామనిపిస్తుంది. స్లం లో ఉండే హీరో గారికి ముంబై లోని పోలీసులని ఉచ్చ పోయిస్తాడు... అలాటి హీరో గారే స్పోర్ట్స్ కారులో ఎదురొచ్చే రైలుకి అడ్డంగా వెళ్ళి కార్ రేసులు గెలుస్తారు. తొడలు కొట్టే సినిమాలు,  తలలు ఎగరగొట్టే సినిమాలు, కోసం థియేటర్లు బ్లాకు చేసేసి.. మంచి సినిమాలకు థియేటర్లు లేకుండా చేసి.. వచ్చాయో రాలేదో తెలీకుండా ఇచ్చే లెక్కల వసూళ్లు గురించి ఊదరగొట్టేస్తున్నారు కానీ, రిలీజైన తరువాత వారం నుంచి థియేటర్లలో జనాలు ఉండరు.. మంచి సినిమాలకు ధియేటర్లు ఉండవు.

ఇదివరకు .. 25 వారాలు, 50 వారాలు ఆడేవి సినిమాలు, తరువాత 100 రోజులు, 150, 175 రోజులు వచ్చాయి.. ఇప్పుడు 20-20 మ్యాచుల్లాగా 7-10 రోజులు మాత్రమే ఆడతాయి కాబట్టి ఫ్యాన్స్ కోసం.. వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఉన్న థియేటర్లన్నిటిలో వందలాది ప్రింట్లతో విడుదల చేసేసి.. మొదటి మూడు రోజుల్లో కలెక్షన్లు వసూలు చేసేసి.. మాది గొప్ప వసూళ్ళ్ చిత్రం అని పబ్లిసిటీ చేసేసుకుంటుంటే.. అలా మొదలైంది, ఈ రోజుల్లో లాంటి సినిమాలు ఎక్కువరోజులు ఆడింది హిట్టా .. వారం రోజులు ఆడి, వసూళ్ళు చేసింది హిట్టా..

దేవస్థానం అని ఓ సినిమా వచ్చింది.. మనిషి మంచి మార్గంలో నడవాలి, పుట్టడం, చావడం కాదు, బతికినంత కాలం మంచిగా బతకాలి అన్న సత్యాన్ని,,,, చాటే ప్రయత్నం చేసిన సినిమా అందులోనూ.. మరుగున పడుతున్న హరికధను బతికించుకుందాం అన్న అంతర్లీన సందేశం కూడా ఉంది.. రిలీజు చేద్దామంటే... థియేటర్లు లేవు.. రోజుకి 6-8 షోలు వేసే మల్టీ ప్లెక్సుల్లో ఒక్క షో దొరకడానికి.. దేవస్థానం లోని దేవుడు కనిపించాడు ఆ నిర్మాతకి..

మంచి మనసే దేవస్థానం .. అలాంటి మనసున్న మనిషే దేవుడు అని చెప్పే మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది.. మసాజుల సినిమాలకు అలవాటు పడ్డ మనకి ..ఇలాటి మెసేజు సినిమాలు ఎంతైనా అవసరం. తప్పక చూడండి.. చూపించండి,ఆలోచించండి.. చిన్న నిర్మాతని ఆదుకోండి..

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, ఏప్రిల్ 02, 2012

మిస్సుడ్ కాల్

 మిస్సిచ్చే మిస్సుడ్ కాల్ కోసం
ఎంత టైం ఐనా వైటింగ్ చేస్తాం...
ఇంటినించొచ్చే ఇన్ కమింగ్ కాల్ కి మాత్రం
టైం ఏం ఇస్తాం  ..?

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa