Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

ఆదివారం, నవంబర్ 18, 2012

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

బుధవారం, నవంబర్ 14, 2012

వినురవేమ


కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వధాభిరామ వినురవేమ




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఆదివారం, నవంబర్ 11, 2012

ధన త్రయోదశి



డెవెలప్ మెంట్

పావలా ధర్మం చేయండి బాబయ్యా! పది కాలాలు సుఖంగుంటారు నుంచీ...ఓ పది రూపాయలియ్యండి సారు దాకా వచ్చింది వ్యవహారం.

రెండు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వాధికారి నుంచి.. వేల కోట్లు స్వాహా.. వేల ఎకరాల ప్రభుత్వ సొమ్ము పలహారం దాకా వచ్చాయి హెడ్ లైన్లు

ధన త్రయోదశి కదా..

అందరికీ శుభాకాంక్షలు










నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, సెప్టెంబర్ 22, 2012

దేహమును ప్రేమించుమన్న


దేహమును ప్రేమించుమన్న


దేహమును ప్రేమించుమన్న


మంచి సైజులొ ఉంచుమన్నా






దేహమంటె పొట్టకాదోయ్


యోగ చేసి బాగుపడవోయ్


వంటపై మీటింగు కట్టిపెట్టి


గంట వాకింగ్ మొదలెట్టవోయ్ ||దేహమును ప్రేమించుమన్న||








ఆకు కూరన చేవ ఉంది


చూపుకోసం మంచిందంది


రేకు టిన్నులో కోకు కన్నా


బోండమిచ్చే నీరు మిన్నా ||దేహమును ప్రేమించుమన్న||














పిజ్జ బర్గర్ కట్టిపెట్టి


ఆవిరిడ్లీ లాగించవోయ్


మెట్టు మెట్టు ఎక్కిన అందలం




ఆనందం, ఆరోగ్యం పదిలం ||దేహమును ప్రేమించుమన్న||












..........గురుజాడ లో పేరడీ




గురజాడకు నివాళి



















నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, జులై 26, 2012

మందెక్కువైతే ......!

 నానుడి :
 (మంది)మందెక్కువైతే మజ్జిగ పలుచన
న్యూనుడి:
 (మందు)మందెక్కువైతే నలుగురిలో చులకన....



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఖజానా

 బబ్బర్ సింగ్!

ఖజానాలో పెద్ద బొక్కుంది..కానీ దాని లెక్క ఎక్కడుంది.. ?





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

గురువారం, జూన్ 21, 2012

తెలుగు భాష తీయనిది

తెలుగు భాష తీయనిది అంటే ఏంటో అనుకునేరు.. అది ఎక్కువగా తీయనిది అంటే వాడనిది అని చమత్కరించారు గరికిపాటి వారు ....




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

హై'జ్వరా 'బాద్

 హై'జ్వరా 'బాద్  

 చెడుతున్న రోడ్లకి..పడుతున్న వర్షాలకి.. కుడుతున్న దోమలకి..జోహార్.
హైదరాబాద్ కాస్తా ఔతోంది  హైజ్వరాబాద్ షహర్.
మలేరియా టైఫాయిడు..మరోటీ.... పేరేదైనా.ఊరేదైనా
జనమంతా మాకొకటే అని సర్వ సమానత్వం చూపుతున్నాయి 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

నాలుగు రాళ్లు !


నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దవాళ్లు చెబితే....అపార్ధం చేసుకుని..
కిడ్నీలో వేసుకుంటున్నారు...పాపం... !
వాటర్ తో పోయే మాటర్ ని కిలోమీటర్ సాగదీసి..డాక్టర్ దాకా తెచ్చుకుంటున్నారు,,,.!!
ఆరోగ్యమే మే మహాభాగ్యము..!!



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, మే 25, 2012

ఏంటి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?


ఏంటి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?
ఏం లేదు మా ఇంటినుంచి ఆఫీసుకి బండిమీద వెళదామా,బస్సులో వెళదామా ? అని
ఇందులో ఆలోచించడానికేముంది సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళు
ఆరోగ్యానికి ఆరోగ్యం....ఆదాకి ఆదా..
నిజమే నువ్వు చెప్పినట్టు సైకిల్ మీదే వెళతాను !
.....
ఎలాగూ ప్రభుత్వం పెట్రోలు మండిస్తునే ఉంటుంది
ప్రతిపక్షం ఖండిస్తునే ఉంటుంది 
మనకి తప్పదు.. 
పెంచబోతున్న ముందురోజు టాంకు ఫుల్లు చేయించుకోవడం
రెండో రోజు నాలుగు తిట్టుకోవడం
మళ్ళీ కధ మామూలే.. 
త్వరలోనే సెంచరీ చూస్తామేమో ...!.





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, ఏప్రిల్ 14, 2012

నేడే చూడండి.. ! రేపటి దాకా ఉంటుందో లేదో.. !!



నేడే చూడండి.. !!

రేపటి దాకా ఉంటుందో లేదో.. !!



ఉచ్చలు పోయించే సినిమాలు, పిచ్చ తలకెక్కి రైలు కు ఎదురెళ్ళి రచ్చ చేసే సినిమాలు చూస్తోంటే.. హీరోని దైవాంశ సంభూతుడిగా చూపించే విషయం లో మనం 'తారా ' స్థాయికి వెళ్ళిపోయామనిపిస్తుంది. స్లం లో ఉండే హీరో గారికి ముంబై లోని పోలీసులని ఉచ్చ పోయిస్తాడు... అలాటి హీరో గారే స్పోర్ట్స్ కారులో ఎదురొచ్చే రైలుకి అడ్డంగా వెళ్ళి కార్ రేసులు గెలుస్తారు. తొడలు కొట్టే సినిమాలు,  తలలు ఎగరగొట్టే సినిమాలు, కోసం థియేటర్లు బ్లాకు చేసేసి.. మంచి సినిమాలకు థియేటర్లు లేకుండా చేసి.. వచ్చాయో రాలేదో తెలీకుండా ఇచ్చే లెక్కల వసూళ్లు గురించి ఊదరగొట్టేస్తున్నారు కానీ, రిలీజైన తరువాత వారం నుంచి థియేటర్లలో జనాలు ఉండరు.. మంచి సినిమాలకు ధియేటర్లు ఉండవు.

ఇదివరకు .. 25 వారాలు, 50 వారాలు ఆడేవి సినిమాలు, తరువాత 100 రోజులు, 150, 175 రోజులు వచ్చాయి.. ఇప్పుడు 20-20 మ్యాచుల్లాగా 7-10 రోజులు మాత్రమే ఆడతాయి కాబట్టి ఫ్యాన్స్ కోసం.. వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఉన్న థియేటర్లన్నిటిలో వందలాది ప్రింట్లతో విడుదల చేసేసి.. మొదటి మూడు రోజుల్లో కలెక్షన్లు వసూలు చేసేసి.. మాది గొప్ప వసూళ్ళ్ చిత్రం అని పబ్లిసిటీ చేసేసుకుంటుంటే.. అలా మొదలైంది, ఈ రోజుల్లో లాంటి సినిమాలు ఎక్కువరోజులు ఆడింది హిట్టా .. వారం రోజులు ఆడి, వసూళ్ళు చేసింది హిట్టా..

దేవస్థానం అని ఓ సినిమా వచ్చింది.. మనిషి మంచి మార్గంలో నడవాలి, పుట్టడం, చావడం కాదు, బతికినంత కాలం మంచిగా బతకాలి అన్న సత్యాన్ని,,,, చాటే ప్రయత్నం చేసిన సినిమా అందులోనూ.. మరుగున పడుతున్న హరికధను బతికించుకుందాం అన్న అంతర్లీన సందేశం కూడా ఉంది.. రిలీజు చేద్దామంటే... థియేటర్లు లేవు.. రోజుకి 6-8 షోలు వేసే మల్టీ ప్లెక్సుల్లో ఒక్క షో దొరకడానికి.. దేవస్థానం లోని దేవుడు కనిపించాడు ఆ నిర్మాతకి..

మంచి మనసే దేవస్థానం .. అలాంటి మనసున్న మనిషే దేవుడు అని చెప్పే మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది.. మసాజుల సినిమాలకు అలవాటు పడ్డ మనకి ..ఇలాటి మెసేజు సినిమాలు ఎంతైనా అవసరం. తప్పక చూడండి.. చూపించండి,ఆలోచించండి.. చిన్న నిర్మాతని ఆదుకోండి..









నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, ఏప్రిల్ 02, 2012

మిస్సుడ్ కాల్

 మిస్సిచ్చే మిస్సుడ్ కాల్ కోసం
ఎంత టైం ఐనా వైటింగ్ చేస్తాం...
ఇంటినించొచ్చే ఇన్ కమింగ్ కాల్ కి మాత్రం
టైం ఏం ఇస్తాం  ..?





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, ఫిబ్రవరి 13, 2012

హ్యాపీ వేలంటైన్స్ డే

ప్రేమికుల రోజు..ప్రేమగుల రోజు
అమ్మా నాన్న బర్త్ డేలు గుర్తులేకపోయిన
అక్కా చెల్లీ బర్త్ డే సెలెబ్రేట్ చేయకపోయినా
ఈ రోజు మాత్రం మర్చిపోం
నిన్నో మొన్నో మనవైపు చూసి నవ్విన పిల్లకోసం
ఆ పిల్ల ప్రేమించినా ప్రేమించకపోయినా
గ్రీటింగు కార్డులు..గులాబీ గుత్తులు..గిఫ్టులు
బైకు మీద షికార్లు..ఛీ కొడితే బికార్లు
హ్యాపీ వేలంటైన్స్ డే 






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012

Hykoo








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, జనవరి 27, 2012

టైం




టైం
సోమ మంగళ బుధ ...వారానికి 7 రోజులు..రోజుకి 24 గంటలు
ఐనా మనకి టైం లేదు..

మొగుళ్ళకి..మొగోళ్ళకి :

లేటుగా లేచి..
పరిగెడుతూ బ్రేక్ "ఫాస్టు " చేసి
బ్రేకెయ్యకుండా ఫాస్టుగా డ్రైవ్ చేసి
కరెంటులేని ఆఫీసు లిఫ్ట్ ని తిట్టుకుంటూ
బాస్ ఇచ్చే వార్నింగులు తలుచుకుంటూ
ఆఫీసు చేరి..
మళ్ళీ ట్రాఫిక్కులు దాటుకుంటూ
పాలిటిక్సు మాట్లాడుకుంటూ
ఇల్లు చేరినా సెల్లు వదలక
బరువు పెరిగి వళ్ళు కదలక
ఇంటికాడా ఇంటర్ నెట్టు
ఆఫీసు పనితో ల్యాపుటాపు

పెళ్ళాం కట్టిన చీరని..తెల్ల  చీర కట్టిన పెళ్ళాం పెట్టిన చారుని
చూసే..రుచి చూసే టైం లేదు..

ఆడోళ్ళు : 

తెల్లారే లేచి - పనిమనిషి తో పేచీ
సంపులో నీళ్ళు పంపులో వచ్చేదాక ఎదురుచూపు
క్యారేజీలు-కాపీ తిఫినీల హడావిడిలో మాడిపొయే పోపు
సబ్బు తువ్వాల ఇచ్చిన 'లోపలి ' దేదో బయట మర్చిపోయే పతిదేవునికి సపర్యలు
కాఫీ పంచదారకొచ్చిన పొరుగింటి పుల్లమ్మ తో చిట్టీపాట చర్చలు

బాక్సులు-బజార్లు-పచారి సామాన్లు-జరీ డిజైన్లు
టీవీలు - సీరియళ్ళు - బాధలు - ఏడుపులు
పట్టుకుంటే పట్టుచీరలు - లక్కీ చాన్సులు - బంపర్ భాగ్యలక్ష్మిలు
తిన్నవి కడుక్కోడాలు- మిగిలినవి ఫ్రిజ్జిలో కుక్కడాలు
ఆఫీసు నుంచొచ్చిన మొగుడి కన్నా - ఇనుపరేకుల సీరియల్ మిన్న

టైం లేదు..

పిల్లలు :

క్రచ్చులు - ప్రి నర్సరి - నర్సరి - ప్లే స్కూలు- హై స్కూలు - కాన్సెప్టు స్కూలు - టేక్నో సారు - హైటెక్ స్కూలు - పేరేదైనా - వయసెంతైనా - రెండో యేడు నుంచే  కంప్యూటర్ విజ్ఞానం  కోచింగు - స్లిప్పు టెస్టులు - ఎసైన్మెంటులు - యూనిట్ టెస్టులు - డైలీ టెస్టులు - ఉన్న బ్రైన్ మంచింగు

సైకిళ్ళు - స్కేటింగులు - చాటింగులు - వీడియో గేములు - సెల్ ఫోన్ థీములు
హోం వర్కు కు - కార్టూన్ నెట్ వర్కుకు పోటీలు
హాలిడేసంటే - పరీక్షకి - పరీక్షకి మధ్య వచ్చే గ్యాప్ గా మారిపోయి

ఇంట్లో ఉన్న నానమ్మ తాతయ్య తో మాట్లాడడానికి - ఊళ్ళో ఉన్న అమ్మమ్మ - తాతయ్యల ఊరెళ్ళడానికి అస్సలు టైం లేదు..

మనెవరికీ మనుష్యుల్లా బతకడానికి టైం లేదు..
చచ్చాక కూడా కండోలెన్సు మెసేజులతో బతికేస్తున్నాం కదా..
అలవాటైపోద్ది..





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఆదివారం, జనవరి 22, 2012

సెల్ మోహన రంగా


సెల్ మోహన రంగా




కొత్తగా ఉద్యోగంలో జేరాను..చాలా హాపీగా ఉంది……ఆఫీసు దూరమైనా ఇష్టపడే రంగం అవడంతో …మంచి జీతం కూడా కావడంతో ఎగిరి గంతేసి మరీ చేరిపోయా..జేరిన రెండు రోజులకే అఫీసు వాళ్ళు ఒక ఫోను కూడా ‘ప్రెజెంటు ” చేశారు..(అది నా ఫ్యూచరు తో ఆడుకుంటుందని నాకు తెలీదు).
మనలో మనం మాట్లాడుకోడానికి ఫ్రీ.. అన్నారు..ఆహా కత్తి..మనకి తిరుగు లేదు అనుకున్నా…సిమ్ము మాత్రమే మేమిస్తాం ఫోను మీరు కొనుక్కోవాలి అన్నారు …ఇదెక్కడి అన్యాయం అందామనుకున్నా సిమ్ము కూడా లాక్కుంటారని వూరుకున్నా….సరే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని ఒక వెయ్యి రూపాయలతో ఒక అద్భుతమైన ఫోను కొందామని రోజూ టీవీల్లో కనిపించే అన్ని రకాల ఫోఅనులూ అవి పట్టుకున్న అమ్మాయిల్ని తలుచుకుంటూ బాజారుకు బయలుదేరా…వీధికొక టి వెలిసిన మొబైలు షాపులన్నీ తిరిగా..కలరు మొబైలు..కెమేరా..బ్లూటూతు…నా బొంద టూతు లాంటి ఫీచర్లు చాలా నాకు అర్ధం కానివన్నీ చూపించారు..ఏది ఎందుకు పనికొస్తుందో అసలు అవి ఎందుకు వాడతారో అర్ధం కాలే..ఇంక మొబైలు ని మొబైలుగానే వాడే నా అమాయకత్వానికి ముసి ముసి నవ్వులు నవ్వుతూ రోజులు మారాయి సార్..మీ దగ్గరున్న వెయ్యికి మెమరీ కార్డు మాత్రం వస్తుంది…లేదా మెళ్ళో వేసుకునే మొబైలు గొలుసు..బెల్టుకు పెట్టుకునే పౌచు వస్తాయి….ఎలాగూ కంపెనీ సిమ్మే కద సార్ మొబైల్ మంచిది కొనుక్కోండి…ఆఫీసులో నలుగురిలో దర్జాగా తిర్గండి…అంటూ శ్రీ క్రుష్ణుడి లెవల్లో సెల్లోపదేసం చేశారు….
సెల్లు దాని విశిష్టత…అందులోని ఉప ‘యోగాలూ లాంటి పద్దెనిమిది అధ్యాయలు కల పుస్తకం ఒకటి ఇస్తామనీ అందులో సకల విషయాలూ ఉంటాయనీ..దానికి పెద్దగా బుర్ర ఉండక్కర్లేదనీ..మోటుగా మోటివేషన్ చేసి…నన్నూ ఒక సెల్లు ఓనర్ని చేసేందుకు ఉద్యుక్తుణ్ని చేశారు..
ఎన్ని చెప్పినా నా దగ్గర ఉన్నది వెయ్యి రూపాయలే అన్నా….దానికి మళ్ళీ నామీద తెగ జాలిపడిపోయి..క్రెడిట్ కార్డుమీదైనా ఇచ్చేస్తాం సార్..మీరు మాకు బాగా నచ్చారు…ఈ విషయం ఎవరికి చెప్పకండి మీకు మాత్రమే మేమిస్తున్న అద్భుత అవకాశం…కాక పోతే ఈ పది వేలకి మీరు మరో 3 వేలు ఎక్కువ కట్టాలి అది కూడ వాయిదల పద్ధతిలో….2 ఏళ్ళ పాటు కట్టుకోవచ్చు అని రాయితీలు ప్రకటించి నేను చార్మి ఫొటోలు మరో ఆంగ్లవనిత ఫొటోలు చూసే లోపల నా కార్డుని గీసేసి రసీదులు తెచ్చేసి నా ఆటోగ్రాఫులు తేసేసుకుని..మీరు చాలా అద్రుష్టవంతులు సార్…మీ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే పంపండి అంటూ పళ్ళికిలిస్తూ సాగనంపారు….
అదేంటో సిమ్ము పెట్టగానే నేను ఇంకా నా నంబరు ఏంToa తెలుసుకోలేదు…ఎవరికీ ఇవ్వనూ లేదు.కానీ మొగింది కళ్యాణ వీణ అన్నట్టు ట్రింగు మంటూ మోగింది…సరే ….ఒక వేళ షాపు వాడమైనా చేశాడేమో…వాడికి తెలివి ఎక్కువ కదా,,ఫోను వాడిది కదా…నంబరు తెలిసి పోతుందేమో వాళ్లకి కంగ్రాట్స్ చెబుదామని చేసుంటాడనుకుంటూ హలో అన్నా….నా హలో మొదలవకుండానే …..ఏరా ఎన్నాళ్ళు దాక్కుంటావురా..ఫోను ఆపేస్తే నాలుగుసార్లు ట్రై చేసి వదిలేస్తాననుకున్నావా ? నేనెవరో తెలిసినట్లు లేదు నీ….అంటూ తిట్ల దండకం మొదలైంది….కంగారుగా ఎవరండీ అది నేను ఎవరో తెలుసా…మీకెవరు కావాలి అని అడిగా…ఏర కొత్త నాటకమా…గొంతు మారిస్తే గుర్తు పట్టలేననుకున్నావా……నీ…….మల్లీ సరికొత్త బూతులు…ఏవండోయ్ ఇది ఆఫీసు నంబరు నాపేరు అది కాదు… ఇవ్వాళ్ళే కొత్తగా ఇచ్చారు మీరడిగిన మనిషి ప్రస్తుతం మాదగ్గర పనిచేయడంలేదు….అని గడ గడ (వణుకుతూ) చెప్పేసా ……
మర్నాడు ఉదయమే ఆఫీసులో ఆ సిమ్ము ఇచ్చేసి కొత్తది నేనే కొనుక్కుంటా అని చెప్పేసి మళ్ళీ కొట్టుకొచ్చా ….సార్ బాగున్నారా ఎలా ఉంది కొత్త సెల్లు….కత్తి కదూఉ..అంటూ చిన్నపటినుంచీ పరిచయమైన వాణ్ణి అడిగినట్లు అడిగిన ఆ సేల్స్మాన్ కి జరిగినదంతా (బూతులు మినహాయించి) చెప్పేసా..సహాయం చెయ్యమని అడిగా,,,వెంటనే.. ఆ సేల్సు మాను తిరిగి తన విశ్వ రూపం చూపించి మొదలెట్టాడు….
అర్జునా(ప్రస్తుతానికి నేనే)
కాల్ చేసే దెవరూ. .కాల్ రిసీవ్ చేసుకునేదెవరు అంతా సాటిలైటులో కే వెళ్తుంది..
అన్ని కాల్సు నాలోనే ఇమిడి ఉంటాయి…చాతుర్వర్ణం మయా స్రుష్టం ..నాలుగు ఫోనులూఈ ఎయిర్ టెల్, ఐడియా. వోడా ఫోనూ..రిలయన్సు..టాటా అన్నీ నారూపాలే….యదా యాదాహి కాలస్య తదాత్మానం బిల్లామ్యహంనువ్వు చేసే కాల్ ని బట్టి బిల్లు ఉంటుంది…
ఎప్పుడైతె పుణ్యం లా బాలన్సు ఇపోతుందో అప్పుడు లైఫ్ లా ఫోను కట్ అయిపోతుంది…కాబట్టి కొంచెమైనా నెలకోసారి పుణ్యం రీచారుజు చేసుకుంటూ వుండాలి..
ఎప్పుడూ నాగొంతు వినిపించడానికి రింగుటోనులు,,హెలో ట్యూనులూ ఉంటాయి …
ఇలాంటివి చాలా ఉన్నాయి కమాన్ అర్జునా లే తీసుకో సెల్లు ని స్థాపించు సిమ్ముని సంధించు కాలుని అంటూ కర్తవ్య బోధ చేశాడు…అక్కడ మొదలెట్టిన పరుగుని ఇంటిదాకా ఆపలేదు..బాబోయ్ సెల్లు…







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, జనవరి 17, 2012

స్వామి భక్తి కి పరాకాష్ట బాడీగార్డ్



హీరో బాడీ గార్డ్ కాబట్టి.. హీరో చుట్టూనే తిరుగుతుంటుంది కధ..గవర్నమెంటాఫీసు నుంచి వచ్చే ఉద్యోగం గా ప్రైవేట్ సెక్యూరిటీ సెర్వీసెస్ లోని మహా  బలశాలి బాడీ గార్డు. తను కాపాడిన వాడు ఎవరో తెలీని స్వామికోసం ఏదైనా చేయాలనుకునే నమ్మకమైన బాడీగార్డు..షరా మామూలుగా ఎంగేజ్  మెంట్ ఐపోయిన అమ్మాయిని చేసుకోవడమనే సెంటిమెంట్ నిలబెట్టుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. పలీ బూతు కామెడీకి వేణుమాధవ్ నాటు కామెడీ తోడై..అటు ఆడా..మగా కాని వేషాలేసిన కామెడీతో కలిపి..కడుపు తిప్పుతుంది. కాస్త కామెడీ.కాస్త సెంటిమెంటు.కాస్త రొమాన్సు కలిపి..ముసలి హీరో..పడుచు హీరోయిన్లు..చివరకి హీరో హీరోయిన్ కలవాలి కాబట్టి 10 యేళ్ళ పిల్లాడి మెచ్యూరిటీకి మెచ్చి..పెళ్ళీ పెటాకులు లేకుండానే పట్టుచీర కట్టుకుని బయలుదేరే హీరోయిను..పాపం సినిమా అంతా హీరోయిన్ పక్కనే తిరిగి..ఇద్దరినీ కాపాడడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన రెండో హీరోయిన్ కాన్సర్ తో చచ్చిపోయి బతికిపోతుంది.. అసలు హీరోయిన్ ని చేసుకుందామనుకున్నాయన ఏమైపోయాడో తెలీదు. ఇంట్లో మొగుడికి తెలీకుండా 10 యేళ్ళ పిల్లాడికి డైరీ దొరికేలా ఎలా చేస్తుందో తెలీదు. రైల్లో చదూతూ వస్తుంటే కూడా ఎవరూ ఎందుకు చూడరో తెలీదు. లేడీస్ బాత్ రూంలోకి..హాస్టల్ లోకి వెళ్ళే హీరో గారి కామెడీ..ప్రిన్సిపాల్ అన్నా లెక్చరర్ అన్నా జోకర్ గా చూపించే కామెడీ.  కధ ఎలా ఉంటుందో సింబాలిక్ గా లాస్ట్ సీన్ లో చెత్తబుట్టలోంచి ఏరుకొచ్చిన డైరీ చూపించారు.. మధ్యలో పాటలెన్ర్దుకొస్తాయో సమయం సందర్భం లేకుండా..అర్ధం కాదు. రెండు పాటలమధ్యలో ఫైటు ఉండాలి కాబట్టి ఒక రివెంజు..పార్కులు,,,సినిమాలు..కాలేజీలు తిరుగుతున్నా జరగని గొడవలు...అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటాయి. ఏంటో నాకు సినిమాలు చూడ్డం ఎప్పటికి వస్తుందో..? ఈ మధ్య పంజా గురించి రాస్తే...నాకసలు సినిమా చూడ్డం రాదని..మ్యూజిక్ అద్భుతంగా ఉంటే వినడం చేతకాక బాగాలేదన్నాని నన్ను తిట్టిపోసారు..పవర్ స్టార్ గారి అభిమానులు కొందరు.. వాళ్ళు ఇప్పటికి ఎన్ని సార్లు చూసారో ఆ సినిమాని..పాపం ఆ భగవంతుడికే తెలియాలి. 







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఆదివారం, జనవరి 15, 2012

పింగామా..పొస్టామా...లైకామా..


అందరూ ఫేస్ బుక్ లో బిజీ..
ఫేస్ చూపించే టైం లేదు..
అంతా ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్..
పింగామా..పొస్టామా...లైకామా..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

కప్పల తక్కెడ






కప్పల తక్కెడ అనుకుంటోంది...
మనమే నయం  
రాజకీయాల కన్నా! అని...






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, జనవరి 13, 2012

కంగారూల దాడిలో దెబ్బతిన్న భారతీయ క్రికెట్ పులులు...



కంగారూల దాడిలో దెబ్బతిన్న భారతీయ క్రికెట్ పులులు...

రికార్డు పుస్తకాలలో టన్నుల కొద్దీ  పరుగులు..స్కోర్ బోర్డ్ లలో సున్నాలు..ఒకట్ట్లు.. కావాల్సినన్ని చిరుగులు..

ఒక్కక్కళ్ళు కాదు అందరూ కలిసి సెంచరీ చేయడానికి కూడా ఆపసోపాలు..ఆసీస్ గడ్డ పై బయటపడుతున్న బ్యాటింగ్ లోపాలు

సున్నా కనుక్కున్నది భారతీయుడే అనిచాటిన సెహవాగ్


భారతీయ పునాదులపై నిలిచినా...విదేసాలలో కూలుతున్న గోడ

వెరీవెరీ స్పెషల్ గా వెళ్లి లక్షణంగా తిరిగొస్తున్న సొగసరి హైదరాబాదీ

ఏం పర్లేదు డ్రెస్సింగు రూములో ప్రశాంతం గా ఉందని చాటుతున్న ధోనీ.

ఎక్కువసేపు క్రీజులో కన్నా అక్కడే ఎక్కువ గడుపుతున్నారుగా మరి..





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, జనవరి 03, 2012

బద్ధకం-నిర్లక్ష్యం- చాదస్తం




చేయాల్సిన పని తక్కువై..సమయం ఎక్కువుంటే

చిన్నతనంలో - బద్ధకం
యుక్త వయసులో - నిర్లక్ష్యం
పెద్దవయసులో - చాదస్తం పెరుగుతాయి
అందుకే ఎప్పుడూ ఎదో ఒక పని చేస్తూ ఉండాలంటారు పెద్దలు.
.ఫేస్ బుక్కు చూడ్డమూ పనేగా.. అంటారా ... మీ ఇష్టం!!







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, జనవరి 02, 2012

దేహమును ప్రేమించుమన్న




వంటపై మీటింగు కట్టిపెట్టి 
గంట వాకింగ్ మొదలెట్టవోయ్


దేహమును ప్రేమించుమన్న
మంచి సైజులొ ఉంచుమన్నా  



దేహమంటె పొట్టకాదోయ్
యోగ చేసి బాగుపడవోయ్ 








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails