Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, డిసెంబర్ 10, 2011

పంజా....

 పంజా....
అరవ డైరెక్టరు + అరువు కధ + దరువు మ్యూజిక్కు + కరువు డ్రస్సు+ బరువు బడ్జెట్టు = పంజా ... లేదా ఒక తెలుగు సినిమా అనొచ్చేమో.. మన సహనం మీద విసిరిన పంజా అనొచ్చేమో..

తల్లీ చెల్లీ విషయం లో చేసిన సాయానికి డాన్ కి కుడి భుజం..కవచం...బ్రైను..హార్టు..కిడ్నీ అన్నీ తానే అయ్యే జై..చంపుకుంటూ పోయే హీరో... హీరోయిన్...ఎంత తక్కువ చెప్తే అంత మంచిదేమో.. క్లబ్బు లో డాన్సరు...అక్కడ డాన్స్ చేసి..అలిసిపోయి..హీరో ఫ్లాట్ కొచ్చి స్నానం చేస్తుంటుంది...హీరో ని ప్రేమిస్తుంటుంది..హీరో మాత్రం ప్రేమించడు..ఆయన సున్నిత మనసుకి మొక్కలు పెంచుతుంటాడు..బహుశా ఎన్ని తలలు కోస్తే అన్ని మొక్కలు పెంచుతాడేమో..అవి పెంచడానికి పేపర్ లో ప్రకటన ఇస్తే ఇంకో హీరోయిన్ వచ్చి నర్సరీని అందంగా తీర్చిదిద్ది... నిమిషానికో బాంబు వేసే హీరోగారిని..కాఫీలకి,టిఫినీలకి..షాపింగులకీ తిప్పుతుంటుంది... ఇంకో విసేషమేంటంటే..కలకత్తాలో ఏ టాఇలెట్ లో చూసినా తెలుగువాళ్ళే ఉంటారు...డాన్ లు..విలన్ లు...డాన్సర్లు... చిన్న ఆంధ్ర ప్రదేశ్ ఇన్ కలకత్తా..

ఇందులో కొత్తగా కనిపించేదేంటయ్యా అంటే హీరో గారి గడ్డం...కధ లో కధనం లో ఇంకేక్కడా కొత్తదనం చూపించలేక...ఇలా చూపించారు దొరవారు..మరో విసేషమేంటంటే ఇందులో హీరో మాటి మాటికీ గడియారం చూసుకుంటుంటాడు.. ప్రేక్షకులూ అంతే ఎప్పుడెప్పుడు ఐపోతుందా అని వాచ్ చూసుకుంటున్నారు... హీరోయిన్ కి నిజం చెప్పినప్పుడు.. ఇప్పుడు ఫైటు అనుకోగానే ఫైటు స్టార్టు..పాటలెందుకో...అర్ధం కాదు ..సినిమా ఐపోయాక టైటిల్ సాంగు..
ఆహా... టైటిల్ చిరిగినట్టే మన బుర్రలు కూడా చిరుగుతాయి... పంజా దెబ్బకి...

ఒకే సారి 2000 ధియేటర్లలో విడుదల.. ఏం చేస్తాం 2 రోజుల్లో తిరిగొచ్చినా డబ్బాలు...అమాయక అభిమానులవల్ల ఆదివారం లోపల వసూళ్ళొచ్చేస్తే 200 కోట్లు వసూలు..300 కోట్లు వసూళ్ళు అని చెప్పుకోవద్దు టీవీల్లో పడి.. అప్పుడెప్పుడో ఆత్రేయగారో ఆరుద్రగారో చెప్పినట్టు... 5 వీక్ సినిమా...కధ వీక్,కధనం వీక్,హీరోయిన్ వీక్,మ్యూజిక్ వీక్,డైరెక్షన్ వీక్...







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

గురువారం, డిసెంబర్ 01, 2011

అసెంబ్లీ శీతాకాల సమావేశం

మేరా భారత్ మహాన్

అసెంబ్లీ మొదటి రోజు
 తె దే పా - తె రా స నిరసన..ప్లే కార్డుల ప్రదర్శన - సభ వాయిదా
రెండో రోజు
అవిశ్వాసం పై రభస - స్పీకర్ తిరస్కరణ - మార్షల్స్ రంగ ప్రవేశం - గాంధీ బొమ్మ దగ్గర నిరసన - సభ వాయిదా
మూడో రోజు
 క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ప్రభుత్వ ఖండన - సభకు అంతరాయం - సభ వాయిదా
నాల్గో రోజు
రాజీనామలపై గొడవ - సభ వాయిదా
ఇతి అసెంబ్లీ శీతాకాల సమావేశం సమాప్తం...

కొంచెం అటూ ఇటూగా ఇదీ రాబోవు వార్తలు



...






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, నవంబర్ 08, 2011

మొగుడు

 క్రియే టివ్ టివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమా  - మొగుడు.. భరించే వాడు భర్త కాబట్టి మనం భరిస్తాం కాబట్టి అది మనకూ సరిపోతుందనిపిస్తుంది..

ఆ మధ్య దూకుడు అని ఫక్తు యాక్షన్ పైపెచ్చు పోలీసు సినిమా వచ్చింది కానీ అందులో ఎంతమందిని చంపినా రక్తం చూపించలేదు..ఇది ఫక్తు ఫ్యామిలీ సినిమా ఐన రక్తం హీరోగాఇ నెత్తిమీంచి వరదలై పారుతుంది..

హీరోయిన్ ఇంట్రడక్షనే  తాగేసి రోడ్డు మీద తూలుతూ కనిపిస్తుంది..హీరోగారు రక్షిస్తారు..మళ్ళీ మనం మిస్ అవుతామేమోనని...ఎలా తాగింది...ఎంత తాగింది...అని బ్యాక్ డ్రాపులో చూపిస్తారు.. ఇక హీరోగారు రాత్రి ఇంటికి తీసుకొచ్చినందుకు మంచితనం చూసి హీరోయిన్ను, హీరోయిన్ హోటల్ లో మిగిలిన ఫుడ్డు స్లం లో పంచడం చూసి హీరోగారు (వీరు తండ్రిని పేరు పెట్టి ప్రసాదు అని పిలుస్తుంటారు)... ప్రేమించేసుకుని... పెళ్ళికి హడావిడిగా ఏర్పాటు చేసుకుని అంతే హడావిడిగా విడిపోతారు...

అసలు సినిమా ప్రారంభంలోనే సామూహిక వివాహాలు జరిపించే 'పెద్ద మనిషి ' రాజేంద్ర ప్రసాద్ గారు తాళి కడుతుంటే పెళ్ళీకొడుకులని ఆపి...పెళ్లి యొక్క గొప్పదనాన్ని వివరిస్తారు.. తన కొడుకు పెళ్ళీలో గొడవ చేసి విడాకులిప్పిస్తారు..(సంతకం వరకే) ...మధ్యలో హీరోయిన్ అన్నకి అసలు హీరో అంటే కోపమెందుకో అర్ధం కాదు...కనిపిస్తే బుర్ర బద్దలుకొట్టేస్తుంటాడు..

లక్కీగా డైలాగులు చాలా తక్కువ.. ఎందుకంటే సగానికి పైగా సెన్సారు కత్తెరకి తెగిపోయాయి.. అదేంటో తాగిన విషయం గుర్తొచ్చిన హీరోయిన్ 'ఓహ్ ఫ** ' అనే మాట బూతుగా అనిపించలేదో వినిపించలేదో.. అది మాత్రం ఉండిపోయింది.. తల్లీ కూతుళ్ళు మాట్లాడుకునే సన్నివేసాల్లోఅ ఆవేశంలో అనుకునే మాటల్లోవి కట్ ఐనాయి.. ఏమో రేపు ఉత్తమ కుటుంబ కధా చిత్రం గా నంది వచ్చినా ఆస్చర్యం లేదు...రెండు కుటుంబాల మధ్య కధ కదా.. ఐనా తెలుగు సినిమా చూసి లాజిక్ వెతికే నా అమాయకత్వానికి నేనే జాలిపడుతున్నా..

లండన్ టికెట్టుతో మారిషస్ లో దిగి... విదేశం లో విషం తాగి .... చెప్పుకుంటూ పోతే... ఆహా ఏమి నా భాగ్యమూ ... ఇది వరకూ సినిమా చూస్తే అమృతాంజనం వాడాల్సి వచ్చేది ..ఇప్పుడైతే న్యూజెన్ మాత్రమే గతి..

ఎటూ టీ వీల్లో సూపర్ హిట్టు.. బంపర్ హిట్టు.. మంచి కధా .. అదీ అంటూ




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, అక్టోబర్ 01, 2011

అతగాడెవ్వడు?

 తెల్లటి చొక్కా వేసుకుంటాడు కానీ రాజకీయ నాయకుడు కాదు
ముఖానికి క్లినికల్ మాస్క్ వేసుకుంటాడు కానీ డాక్టర్ కాదు
తలకి హెల్మెట్ పెట్టుకుంటాడు కానీ కార్మికుడు కాదు
కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటాడు కానీ కాలేజ్ స్టూడెంట్ కాదు
చేతిలో కెమేరా ఉంటుంది కానీ కెమెరా మేన్ కాదు
మరి అతగాడెవ్వడు?

ఇంకెవరు ట్రాఫిక్ పోలీసు ..

ఏం చేస్తుంటాడు?
వీ ఐ పీలొచ్చినప్పుడు హడావిడి చేస్తాడు
లైసెన్సు వుందా లేదా అని దోచేస్తాడు

 మంత్ ఎండింగ్ వస్తోంది..పండగ దగ్గరైంది...
టార్గెట్స్ పెరిగై..ట్రాఫిక్ పెరిగింది..
చెక్ పోస్టు పెట్టెయ్ -  దొరికినోణ్ణి పట్టేయ్ ...
లేని వన్నీ అడిగేయ్...దొరికినంత నొక్కేయ్..
 ఏ తప్పుకైనా యాభై .. దొరలాగా వదిలెయ్..
పెళ్ళి కి ఫొటోలు తీస్తారు కాని..మన ట్రాఫిక్ పోలీసోళ్ళు ఫొటోలు తీసి పెళ్ళి చేస్తున్నారు.






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

గురువారం, సెప్టెంబర్ 22, 2011

చిత్ర వధ



భారతీయ చలన చిత్ర రంగానికి 80 ఏళ్ళు నిండాయి. తెలుగు సినిమా ఎటో వెళ్ళిపోతోంది అని కొందరు పెద్దోళ్ళు చాదస్తం పోతున్నారు. ఇది వరకు లా ఫ్యామిలీ సినిమాలు రావట్లేదని బాధ పడి పోతున్నారు. పండంటి సంసారం,బంగారు కుటుంబం, మంచి కుటుంబం లాంటి సంసార పక్షం సినిమాలు పోయి...ప్రేమించుకుందాం రా..కలిసుందాం రా,పెళ్ళిచేసుకుందాం రా,లేచిపోదాం రా ని దాటి...పోకిరి,ఇడియట్,స్టుపిడ్,
రాస్కెల్,ఆవార,దీవానా లాంటి అన్ని భాషల తిట్లు స్థాయికి వచ్చేసారని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు..కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. "చిత్రం " గా చదువు కు ప్రేమ,కాపురం,కడుపు అడ్డుకావనే సందేశాత్మక చిత్రాలు, భార్యని చంపడం ఎలా లాంటి ఆలోచనాత్మక సినిమాలు, బ్యాంకు దొంగతనాలు, దేవుడి నగలు ఎలా కాజేయ్యచ్చో తెలియ జెప్పే ఎడ్యుకేటి సినిమాలు, హీరో హీరోయిన్   మూడు గుద్దులు  ఆరు ముద్దులు " గా చూపించే చిత్రాలతో.. కాపీ కొట్టడమే కాపీ రైట్ అన్నంత హాయిగా స్వంత ఆలోచనల సినిమాలు, అబ్బో అరువు కధలు, దరువు మ్యూజిక్కులు,బరువు (అందాల )హీరోయిన్ లు, కరువు డ్రస్సులు,  తో మన తెలుగు సినిమా వెలిగిపోతోంటే గుడ్ల గుడ్లగూబల్లా వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటున్నారు.

ఇక ఫ్యామిలీ సినిమాలు రావట్లేదని ఏడ్చే వాళ్ళకి కనువిప్పు కలిగించే విషయమేమిటంటే ఇది వరకటి కన్నా ఇప్పుడే ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి... ఎంటీయార్ ఫ్యామిలీ, ఏ ఎన్ ఆర్ ఫ్యామిలీ, కృష్ణ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, అల్లూ ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ, చాలా ఇంకా కావాలా !






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

బుధవారం, సెప్టెంబర్ 21, 2011

జజ్జనకిరి



అదేంటో ..ఈ మధ్య ఒక వైపు 'జ' న లోక్ పాల్ కోసం  అన్నా హా'జా'రే పోరాడుతుంటే 'జ' నం సొమ్ము తో ఆడుకున్న వాళ్ళ 'జా'బితా ఒకటోచ్చింది

సత్యం రామ లింగ రా'జు '
2"జి " రా "జా"
కనుమో'జి ' వాళ్ళు కనుమొళి ని అలానే రాస్తారు మరి
గాలి 'జ ' నార్ధన రెడ్డి
"జ " గన్ మోహన్ రెడ్డి


మరి మన 'జా గ్రత్త లో మనముండాలి 'జ ' ర భద్రం


funcounter@gmail.com

 






Share/Save/BookmarkShare/Save/Bookmarkనచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, సెప్టెంబర్ 01, 2011

గన్'పతి

గన్'పతి


అది కైలాసం....శివుడి మెళ్ళో పాము ఆకలిగా ఉండి ప్రసాదం కోసం చూస్తోంది..ఈలోగా వచ్చిన వినాయకుడి ఎలుక...ఏం మామా భోజనం అయిందా అంటూ పలకరించింది...ఇంకా లేదు...స్వామి తిన్నాకే నాకు..ఆయనకి భోజనం అదీ అక్కర్లేదు...నీ భోజనం అయిందా అంది...దానికి ఎలుక మా స్వామి దగ్గర ఆ ప్రాబ్లం లేదు..ఆయన కి ఆహారం ఇష్టం. అందుకే నాకు ఫుడ్డు కి కొదవ లేదు...అదిగో మాటల్లోనే మా స్వామి వస్తున్నాడు అంది వినాయకుడు రావడం చూసి,,,,,
వినాయకుడు వస్తూనే..తల్లికి, తండ్రికి నమస్కరించి..అమ్మా వినాయక చవితి వస్తోంది..నేను అలా భూలోకం వెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తానమ్మా..అన్నాడు..దానికి పతి సేవలో ఉన్న ఆ పార్వతి ఉలిక్కి పడి..నాయనా వినాయకా..ప్రతి సంవత్సరం వెళ్తూనే వున్నావు కద నాయనా..ఈసారికి వద్దులే...నీ పుట్టిన రోజు ఇక్కడే కైలాసంలో జరుపుకుందాం..నువ్వు ఎక్కడికీ వెళ్ళకు అని కంటనీరు పెట్టుకుంది...
దానికి పశుపతి ..అదేమి పార్వతీ అలా అంటావు...విఘ్నేశ్వరుడు ప్రతి సంవత్సరమూ..తన జన్మదినము భూలోకమునే కదా జరుపుకుంటాడు...మరి ఈ సారి వద్దనెదవేమి.? మరీ అంత దిగులుగా ఉంటే మనమూ వెళ్ళివద్దాం...అన్నాడు శివుడు....
తల్లి ప్రేమ మీకేమి అర్ధం అవుతుంది లేండి...నా కుమారుడు ఏమన్నా రాక్షసులతో యుద్ధానికి వెళతానన్నాడా..లేక తపస్సుకు వెళతానన్నాడు... వెంటనే పంపడానికి..వెళ్ళేది భూలోకానికి..అందుకే నా దిగులు...అంది పార్వతి...
అదేమి పార్వతీ అంత మాట అంటివి..భూలోకమున అందరూ మన భక్తులేగా...పైగా ప్రతి సంవత్సరం మన కుమారుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఊరూరా.... వాడ వాడల జరుపుకుంటారు కూడాను...తిరుపతి లడ్డు వలే మన కుమారుడు ధరించిన లడ్డుకు వేలం పెట్టి - వెల కట్టి మరీ వైభోగాలు జరుపుతారు....
ఏమి చెప్పను స్వామీ..మనవాడి పుట్టిన రోజు జరుపుతామని బలవంతంగా డబ్బులు లాగుతారు కొందరు...ఆ డబ్బుతో అడ్డమైన పనులూ చేస్తారు...కొందరైతే పందిరి వేసి మన కుమారుడి విగ్రహం పెట్టి పూజలు చేసి...అక్కడే సాం'స్క్రుతక' కార్యక్రమాలు జరుపుతారు...అవి ఎంత క్రుతకంగా ఉంటాయో..మనకి అంతుపట్టదు....'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' లు పోయి... అ అంటే అమలా పురం..ఆ అంటే ఆహా పురం అని, ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అర్ధం లేని పాటలు..అర్ధనగ్నపు ఆటలు ఆడతారు,,,,ఇవే కాక రాత్రి కాపలా అని చేసే కార్యకలాపాల చిట్టా నేను చెప్పలేను...చతుర్ముఖ పారాయణం..తీర్ధం....ప్రసాదం పేరుతో పేకాట..మందు..ఇంకా సర్వ పాపాలకూ ఒడిగడతారు...నిజంగా నిష్టగా చేసేవారూ లేకపోలేదు..కానీ ఇలాంటి వారు చేసే పాపం మన వాడికి తగులుతుందేమోనని నా భయం..
దేవీ మానవులు చేసే పాప పుణ్యాలకు - మనకు సంబంధం లేదు...వారి పాపం వారికే తగులుతుంది..నువ్వు భయపడనవసరంలేదు..అని వూరడించాడు పరమేశ్వరుడు...
స్వామీ నా అసలు భయం అది కాదు..స్వామీ....భూలోకమున తీవ్రవాదుల భయం ఎక్కువ అయింది...ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు...అహార స్థలాలు..విహార స్థలాలు ..అని లేకుండా ఎక్కడపడితే అక్కడ బాంబులు పేలుస్తున్నారు..అంతే కాదు ప్రతిసారి విగ్రహ నిమజ్జనం లో ఏదో జరుగుతుందని వినడం రివాజుగా మారింది....ఆ హుస్సేను సాగరంలో నీరు ఇప్పటికే విషతుల్యం అయింది....ఇలా చాలా భయాలున్నాయి స్వామీ...అంది పార్వతి
పార్వతీ ఎందుకు నీకు భయము?...ఆ తీవ్ర వాదులు పూర్వ జన్మలో రావణ..దుర్యోధనాది రాక్షసుల బంటులు..వారి వారి కర్మ ననుసరించి ఇలా జన్మించి పూర్వ జన్మ వాసనల వల్ల 'కలి' ప్రేరేపితులై అలా ప్రవర్తించుచున్నారు...వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి పాపం 'వారిని' కూడా బాంబు రూపమునో, ఎన్ కౌంటర్ రూపమునో వారిని దహించివేస్తుంది..ఇక మన కుమారుడి విషయం అంటావా..అతను పుట్టుకతోనే మ్రుత్యుంజయుడు..నా చేతిలో మరణించి..తిరిగి జన్మ పొందినవాడు...అంతే కాదు చంద్రుడి ద్రుష్టి తగిలి ఉదరం పగిలినా తిరిగి మామూలుగా అయిన మన బిడ్డడు...మూషికాసురుడిని ఒక దంతంతో అణిచి వాహనం చేసుకున్నవాడు...గణాధిపత్యం వహిస్తూ విఘ్నాలకు నాయకుడైనవాడు..అట్టి కుమారుడి గూర్చి ఎట్టి చింతా వలదు..
స్వామీ నా భయము మన కుమారుడి గూర్చి కాదు స్వామి! వినాయకుడి పూజ కోసం తాపత్రయ పడే భక్త జనం గూర్చి...కుమారుడి పట్ల భక్తి పారవస్యం లో, ఆ తీవ్రవాదుల పన్నిన కుట్రకు గురి అవుదురేమో అని నా భయం స్వామీ....అమాయకులైన ఆ ప్రజలు మన వల్ల ఇక్కట్లకు గురికాకూడదు అని నా అభిప్రాయం ప్రభూ..
ఆహా దేవీ నిజం గా .'జగజ్జనని' అనిపించావు...ముల్లోకాలకూ తల్లివైనందుకు నీ పిల్లల గురించిన బాధ్యతకు ముగ్ధుడినైనాను..ఇంత కాలం రాక్షసులు మాత్రమే శత్రువులు అనుకున్నాను......ఇప్పుడు అర్ధమైనది...అసలు పాపాత్ములెవరో...వారి భరతం పట్టుటకు మన పుత్రునికి ఇదిగో అత్యంత ఆధునికమైన ఆయుధం ఇది. దీనిని 'గన్' అందురు ఒలంపిక్ మహాయజ్ఞమున అబినవ 'బింద్రా' కు బంగారు పతకము సాధించిన 'గన్' ఇది. దీనిని ఒక్క సారి మీట నొక్కిన వేలాది గుళ్ళు వర్షంలా కురిసి తీవ్రవాదులు అంతమౌదురు..దీనిని ధరించి భూలోకమునకు వెళ్ళి తన పుట్టిన రోజు ఆనందముగా జరుపుకుని, లోక కళ్యాణము చేకూర్చి తిరిగి వచ్చును మన కుమారుడు...
'గన్' ధరించు వాడు కాబట్టి ఇకనుంచి మన కుమారుడు 'గన్'పతి అని పిలువబడతాడు...సర్వేజనా సుఖినోభవంతు....


 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, ఆగస్టు 13, 2011

అన్నా




 అన్నాహజారే పల్కు నిరాడంబరముగాను
మన్మోహన్ పల్కు మొండిగాను
నీతి గెల్చునపుడు అవినీతి నిల్చునా
విశ్వమెరిగిన నీతిది వినర తమ్ముడా





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి 
Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, ఆగస్టు 12, 2011

ఎప్పుడు పదవులు కల్గిన


ఎప్పుడు పదవులు కల్గిన
అప్పుడు పెట్టుబడులు వచ్చు అది ఎట్లన్నన్
కుప్పలుగ కాంట్రాక్టులిచ్చిన
చప్పున వేలకోట్లు వచ్చు కదరా ఓటరా!!


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, ఆగస్టు 05, 2011

సినీ ఓదార్పు యాత్ర

సినీ ఓదార్పు యాత్ర


ఇదీ ఓ రకం రాజకీయ ఓదార్పు లాటిదే. కాకపోతే ఇక్కడ సినిమా(ఆడక)పోతే, మా సినిమా ఎక్కడికీ పోలేదూ, అభిమానుల గుండెల్లో ఉందీ, జనాలు రాని ధియేటర్లలో ఉంది..ఎలాగైనా రికార్డులు సృషిటిస్తాం సృష్టిసుతున్నాం అంటూ ఓదార్పు సారీ విజయ యాత్రలు సాగిస్తారు(తున్నారు) మన సినీ జనాలు.

రాజకీయాల్లో లాగానే సినిమాల్లోనూ వారసత్వాలే పౌరసత్వాలుగా...అందిపుచ్చేసుకుని..తాత..తండ్రి తరువాత దిగిపోతున్నారు హీరోలు. వాళ్ళకి నటన అలవాటు కాకపోయినా మనం వాళ్ళ నటనకు (ఇది ఫలాన హీరో స్టయిల్) అలవాటుపడీపోతున్నాం ".

హీరో అంటే అన్నిరకాల అవలక్షణాలూ ఉండాలి..ఎంత ఎదవైతే అంత మాసు ... మరి శంకరాభరణం అన్ని క్లాసుల్లోనూ ఆడింది.. ఏదో ఒక ఫార్ములా హిట్టైతే ఇక అదే ఫార్మూలాలు పెట్టేసి సినిమా తీసేసి జనాలమీద తోసేసి ఆడలేక మద్దెల ఓడన్నట్టు..పైరసీనో ఇంకేదోనో అని జనాలమీద పడటం. సినిమా హీరోలో రేట్లు పెంచేయడం..నిర్మాణం కాస్టు పెంచేయడం..తమిళనాడు నించీ డైరెక్టరు, కేరళ నుంచీ స్టోరీ, బాంబేనుంచీ హీరోయిను., విలన్ లని తెచ్చి ... ఏదో ఒకటి తీసేసి..పోనీ అదీ ఏమైనా త్వరగా వస్తుందా అంటే 2 యేళ్ళు, 3 యేళ్ళు...మరి ఖర్చుపెరగక చస్తుందా...ఎలాగూ అభిమానులు మొదటి వారం ఎగబడి చూస్తారు కాబట్టి టికెట్లు రేట్లు పెంచేసి..అటు టిక్కెట్ల కుమ్ములాటలో కాకపోయినా సినిమా చూశాక చొక్కాలు చించేసుకుని.. జుట్లు పీకేసుకుని బయటకు పరుగెత్తుకొచ్చేసి..మళ్ళీ పిచ్చి అభిమానంతో రెండో సారో ...మూడో సారో ఐనా అర్ధమౌతందునుకుని మళ్ళీ మళ్ళీ చూసే  అమాయకులుంటారు కాబట్టి .....తీసేయడం....ఇక అది ఆడదని ఒకటో ఆటకే తెలిసిపోతుంది కాబట్టి ఆరోజు మధ్యాన్నం నుంచే న్యూసు చానెల్సు..ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ అని తేడాలేకుండా గంటకో ఇంటర్వ్యూ...రోజుకో చర్చ...వారోనికో కాంటెస్టూ రన్ చేసి..ఇవీ చాలదన్నట్టు యూనిట్ మొత్తం పొలో మని బస్సు యాత్రలు..ధియేటర్లకి..కనీసం వాళ్లని చూడడానికైనా వస్తారని.

ఇక రోజూ గోడల మీద చూస్తే.. ఎవరో పోయినోళ్ళ పేపర్ అడ్వర్టైజ్ మెంటులాగా ఒకటో "రోజు  " పదో 'రోజు " 13వ 'రోజు " అంటూ పోస్టర్లు.. వాటికి బొట్లు దండలూ బోనస్.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ..సినిమా పోయాక జనాలని పట్టుకునే ప్రయత్నం కన్నా..హీరోలని గాల్లోంచి భూమి దింపిన కధలు..జనాల కు దగ్గరగ ఉండే సినిమాలైతే  చూస్తారేమో




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, జులై 12, 2011

నువ్వు






తూరుపులా నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
నువ్వే చందమామ లా వచ్చి
వెళ్ళిపోతున్నావ్

కొండనై నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
జలపాతమై పారుతూ వచ్చి
ప్రవాహమైపోతున్నావ్

చెట్టులా నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
కోయిలై వచ్చి పాటలా మారి
ఎగిరిపోతున్నావ్

అద్దమై నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
ప్రతిబింబమై కవ్వించి నవ్వుతూ
వెళ్ళిపోతున్నావ్

శిలలా నేనిక్కడే నిలుచుని
ఎదురుచూస్తున్నా
జీవమే నీవై








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, జులై 11, 2011

దారుణా"నిధి"

దారుణా"నిధి"

నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా అని అడిగాడట త్యాగరాజు గారు గారు. పాపం అమాయకుడు...అదే ఈరోజుల్లో అడిగితే 'నిధి 'యే అని  చేప్తారు. 
ఈ మధ్య రెండు నిధుల గురించిన చర్చలు బాగా జరుగుతున్నాయి...రెండూ దక్షిణ దేశంలోవే...
ఒకటి విలువలను పాతరేసిన కరుణా నిధి ఫ్యామిలీ వెనకేసిన నిధి గురించి ఐతే..
నేల మాళిగలో పాతేసిన విలువ కట్టలేని రంగనాధుని నిధి మరోటి.
రెండూ పెట్టెలు తెరవలేదు..లెక్క కట్టలేరు ..

ఒకటి తీగ బంధం - మరోటి నాగబంధం.
ఇక్కడ తీగ లాగితే డొంక కదులుతుందని... మారన్ అని మారాం చేసినా సరే పదవి లాక్కుని పెదవి విరిచేసింది కేంద్ర ప్రభుత్వం.
అక్కడేమో నాగబంధం గురించి వాకబు చేయాల్సిందిగా కోర్టు సెలవిచ్చింది.

2G -  ఒకటి 2 జెనెరేషన్ ల ముందు దాచిపెట్టిన నిధి
         మరోటి 2 జెనెరేషన్ పేరిట దోచున్నది

        ఇంకా బయటకు రాబోయేవి ఎన్నున్నాయో లెక్క తెలీదు... గాలి గనులు, ఇనపగనులు, జ"గనులు " ,
        పుట్టపర్తి ట్రస్టు నిధులు .. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి.. ఎవడన్నాడు ఇండియా పేద దేశమని..
        పేదలున్న దేశం

       funcounter@gmail.com








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, జూన్ 17, 2011

దేవుళ్ళని కాపాడే హీరోలు

దేవుళ్ళని కాపాడే హీరోలు

ఈ మధ్య అన్నీ దేవుళ్లని కాపాడే హీరోలో సినిమాలొస్తున్నాఇ. మొన్నటి దాకా వాళ్ళే దేవుళ్లు గా కనిపించిన హీరోలు ఒక అడుగు ముందుకేసి..దేవుళ్లనీ కాపాడేస్తున్నారు..కానీ ప్రేక్షక దేవుళ్ళని కాపాడే వాళ్లే కనిపించట్లా.

ఇంద్ర,సమర సిమ్హా రెడ్డి,లాంటి సినిమాల్లో హీరోలు..వాళ్ళ ప్రజలకోసం త్యాగం చేసి కాఫీ కప్పులు కడగడానికో టాక్సీ లు నడుపుకోవడానికో వెళ్ళి రాజు వయ్యా మహరాజు వయ్యా అనిపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా అష్టాదశ శక్తి పీఠాలని..బద్రీనాధ్ లాంటి పుణ్య క్షేత్రాలని కాపాడ్డానికి తయారైపోయారు..మొన్నా మధ్య వచ్చిన ఖలేజాలో కూడా ఆల్ మోస్ట్ దేవుడి గానే అవతరించినంత పని చేసాడు మన మహేష్ బాబు.

22 సంవత్సరాల క్రితం గుర్రాలమీద బయలుదేరి ఈజిప్టు నించి వచ్చిన విలన్ హీరో చేతిలో చచ్చిపోతే..అఫ్ కోర్స్ హీరో కూడా చచ్చిపోతాడు ...ఇక్కడ చచ్చిపోయిన వాడి కళ్లు పెట్టుకున్న విలన్ కొడుకు...హీరో కొడుకుని చంపడానికి వచ్చి చచ్చిపోతాడు.. 18 స్థంభాలలో ఉన్న శక్తి పీఠం శక్తులని కాపాడే హీరోచిత విన్యాసాలని చూసి మనకి మతి పోవడం ఖాయం...ఇక బద్రీనాధుణ్ణి కాపాడడానికి ఒక యోధుడు వచాడు. మగధీరలో రాజ్యాన్ని కాపాడడానికి వెళ్ళి ప్రాణం కోల్పోయాడు కానీ అక్కడ కూడా ఏ దేవుణ్ణో పెట్టలేదు మన అదృష్టం కొద్దీ..

దేశం ముందుకెళ్తుంటే సినిమా వెనక్కి వెళ్తున్నట్టుంది .... మళ్లీ పాత ఫాషన్లు.. పాత కధలు..పాత పాటలు ( రీ మిక్స్)..పాత టైటిల్సు.. (టాగ్ లైన్ ఫ్రీ) ... కానీ పాత విలువలు..వలువలు లేవు అంతే..
సూమోలు గాల్లోకి ఎగరడం..మీసం మెలేస్తే రైళ్ళు ఆగిపోవడం నుంచి గుర్రాల ఫైట్లు..కత్తి యుద్ధాలు. వైపు వెళ్తున్నారు..సినీ జనాలు..



ఫన్ కౌంటర్




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

బుధవారం, మే 25, 2011

కోచింగు పేరుతో దోచింగు

డొనేషన్లు..బిల్డింగు ఫండ్లు పేరిట లూటీ
ఆరో క్లాసునుంచే ఎం సెట్టు ఐ ఐ టీ




బాల కార్మికుల కన్నా బరువైన మోతలు
చిన్నతనం నుంచీ సైకలాజికల్ వాతలు






విక్ర 'మార్కుల 'పోటీలో మూర్ఖులౌతున్న తల్లి తండ్రులు
ఒక్క మార్కు తేడాతో నిస్పృహ పాలౌతున్న చిన్నారులు


ఆ చదువుల్లో "వికాస " మెంతో..
"కృష్ణవేణీ " సాక్షిగా గంగ పాలౌతున్న ధనమెంతో
ఆ " నారాయణు " డికే తెలియాలి మరి..









నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, మే 02, 2011

దడ దడ లాడెన్

ఇన్నాళ్ళూ ప్రపంచం దడ దడ లాడెన్
ఇన్నాళ్ళకు నర రూప రాక్షస లాడెన్ ఓడెన్
ఒబామా దేశం  ఒసామా ప్రాణాలు తోడె
న్ 
పాకిస్తాన్ కు కూడా త్వరలో మూడేన్ 


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, ఏప్రిల్ 15, 2011

మూడు దెబ్బలు - తీన్ మార్

మూడు దెబ్బలు - తీన్ మార్

మార్చిలో ఇన్ కం టాక్స్ దెబ్బ నుంచి కోలుకోక ముందే ..ఏప్రిల్ సగం కూడా కాకుండానే వడ దెబ్బ కొడుతోంది..నిన్న మూడో దెబ్బ తగిలింది..తీన్ మార్. ఇవ్వాల్ రేప్ ప్రేమల్ అంటే లవ్ ఆజ్ కల్ అనే సినిమాని యధా తధం గా రీ 'మేకూ చేసి మన తల మీద కొట్టారు. ఎలాగూ కధ కొనేశారు కదా..ఆ తీసేదేదో మన తెలుగు పల్లెలో పెట్టకుండా..కాశీయో..ప్రయాగో ఏదో నార్త్ సైడు ఊరు..అందులో తెలుగు హీరో,,,అతని తెలుగు ఫ్రెండ్సు..తెలుగు హీరోయిను..ఖర్మ కాకపోతే..

లవ్ సినిమాలు చెయ్యాలా, యాక్షన్ సినిమాలు చెయ్యాలా, క్యామిడీ సినిమాలు చెయ్యాలా అన్న కంఫ్యూజన్ లో 3 కలిపి కొట్టే ప్రయత్నం లా ఉంది..యవ్వారం. ముకేష్ రుషి, సోనూ సూద్ లాంటి వాళ్ళని పెట్టి కూడా ఫైట్లు లేవు వాళ్ళతో..త్రివిక్రం ఉన్నా డైలాగు చెప్పడానికి అసలు చాన్సుంటే కదా.. ముద్దులు ...కౌగిలింతలు..తోనే సరిపోయింది.. అసలు ఏరకమైన మెసేజ్ ఇద్దామనుకున్నారో అర్ధం కాలేదు..అవునులే సినిమాలో మసాజులు తప్ప మెసేజులు ఆశించడం అత్యాశే..స్కర్టుకి తక్కువ బికినీకెక్కువ లాంటి డ్రెస్సులేసి..పాపం హీరోయిన్ కూడా మూతి ముద్దులతో చాలా నే కష్టపడ్డది. బహుళ ప్రయోగాత్మకమైన ఈ సినిమాని నేను తట్టుకోలేక పోయాను..మరి మిగతా వారి పరిస్థితి ఏమిటో.. మరి.. జై పరాంజీ... The Remaking King 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

సోమవారం, ఏప్రిల్ 04, 2011

శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో రాజకీయ రాశి ఫలాలు..2011..

 శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో రాజకీయ రాశి ఫలాలు..2011..


కాంగ్రెస్ రాశి వారు...
ఆదాయం వేల కోట్లు...వ్యయం వందలు
రాజ పూజ్యం జనపధం అవమానం జన సభ
హామీలు బోలెడు అమలు చిప్పెడు

అధిష్టాన దేవత సోనియా ని నమ్ముకుని..బతికేస్తారు. రాహుల్ జపం కైసి వస్తుంది...సోనియా గుడి చుట్టూ ప్రదిక్షణలు..గులాం నబీకి దక్షిణలు..రాజీవ్ బాటలెంబడి పాద యాత్రలు కూడా లాభిస్తాయి. కొత్తగా వచ్చి చేరిన చిరు గ్రహం ప్రారాపా అంతర్దశలో మార్పులుండవచ్చు..ముఖ్య పదవిలో ఉన్న వారికి చికాకులు..పదవి పనిష్మెంటు గా అనిపించవచ్చు..



తెలుగుశం  రాశి వారు

ఆదాయం      హెరిటేజ్ గా వచ్చిన అధికారం+హెరిటేజ్ కంపెనీ  వ్యయం : తమ్ముళ్ళ మధ్య లుకలుకలు..అలకలు
రాజ పూజ్యం  గతం        అవమానం వర్తమానం
ఆశలు         అధికారం    నిజం అనుమానం

తెలుగుదేశాధినేత కి గత 7,8 ఏళ్ళుగా అంతగా కలిసి రావట్లేదు. అందునా ఇప్పుడు నాగం చూపు ఏడో ఇంట  ఉన్న టీ ఆర్ ఏస్ వైపు చూస్తుండడం.. ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రులనే కాకుండా.... తెలంగాణా దేవతలని కూడా కొలిస్తే ఫలితముంటుంది.మూడో ఇంట ఉన్న బావ బాలకృష్ణ ...ఎంటీ ఆర్ కలిసి శుభ దృష్టి తో చూడడం వల్ల లాభమే ఐనా..ఆ గ్రహాల్ ఉప గ్రహాలైన అభిమానుల ప్రభావాలు మాత్రం శూన్యం


తెలంగాణా రాష్ట్ర సమితి రాశి వారు

ఆదాయం తెలంగాణా సెంటిమెంటు  
వ్యయం సోనియా అపాయింటుమెంటు
రాజ పూజ్యం  సొంత చానెలు
అవమానం సొంత జనాలు
ఆశ     ప్రత్యేక రాష్ట్రం
నిజం   కేంద్రం పెత్తనం

జే ఏ సీ అధిక ప్రభావం చూపడం  వల్ల పాక్షికంగా బలహీన పడే అవకాశం. విద్యార్ధి గ్రహాలు కలిసిరావటం పై భవిష్యత్తు ఆధారం..సోనియాని కాకుండా...సొంత బలాన్ని నమ్ముకోవడం ఉత్తమం..అనుకోని అభాండాలు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం....



ప్రజా రాజ్యం
ఆదాయం : ఎన్నికల సమయం వ్యయం  అభిమానుల ఆశలు
రాజ పూజ్యం : సినిమా తెర అవమానం ఎన్నికల వేళ
ఆశ  ప్రజా జీవితం లో మార్పు నిజం విలీనం కూర్పు

ప్రారాపా మహాదశ ఐపోయి..అంతర్దశగా మారడం వల్ల..కాంగ్రెస్ రాశి ఫలాలే వర్తిస్తాయి..అన్నీ ఉన్నా అల్లు"డి"నోట్లో.....అన్నట్టు...ఇన్నాళ్ళు సంపాదించిన కీర్తి మొత్తం..హారతి కర్పూరం. దశమ గ్రహం వల్ల కూడా చికాకులు.. ఆరెంజ్ రంగు అచ్చిరాదు..తెలంగాణా దేవతల శాపం వల్ల మరిన్ని ఇబ్బందులు..అంతర్దశలో ఉండడం వల్ల పెద్దగా ప్రాధాన్యతలుండవు..మునపటి జీవితం పైకి మనసు లాగుతున్నా..వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి..

వై ఎస్ ఆర్ పార్టీ

ఆదాయం అంతేలేదు వ్యయం  పొంతనలేదు
రాజపూజ్యం సొంత మీడియా అవమానం సొంత బాబాయా.
ఆశ ముఖ్యమంత్రి పోస్ట్ నిజం ప్యారడైజు లాస్టు

గ్రహ మైత్రి కన్నా గృహమైత్రి విషయంలో కొన్ని చికాకులు..సొంతింటిలోనే వైరాలు.. చుట్టూ ఉన్న భజన పరుల వల్ల అసలు నిజం గ్రహించలేరు...వ్యయం పెరిగే అవకాశాలు ఎక్కువ..పెట్టుబడుల ఉపసమ్హరణ..లాంటివి జరిగే అవకాశం..ముఖ్య గ్రహం దూరం అవడం వల్ల..ఉప గ్రహాల ప్రభావం ఎక్కువ

భారతీయ జనతా రాశి వారు

ఆదాయం ఖతం వ్యయం నిత్యం
రాజపూజ్యం గతం అవమానం పత్యం
ఆశ ప్రభుత్వ నిర్వహణ ఆశయం రామాలయ స్థాపన

కమ్యునిస్టు రాశి వారు

ఆదాయం ప్రజల పాట్లు వ్యయం ప్రజా ఆందోళణలు
రాజపూజ్యం కలకత్తా అవమానం మాకేం కొత్తా
ఆశ ప్రజా ప్రభుత్వం నిజం మద్దతులు పొత్తులు

శ్రీ ఖరం శ్రీకరం..శుభకరం కావాలని
ఉగాది శుభాకాంక్షలతో







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, ఏప్రిల్ 02, 2011

శక్తి.

 పాటలని రి మిక్స్ చేస్తారని తెలుసు గాని...
సినిమాని కూడా రిమిక్స్ చెయ్యొచ్చని నిరూపించాడు మెహెర్ రమేష్.. పేరు శక్తి...నిజంగా సూటబుల్.తీసే నిర్మాత కి శక్తి కావాలి..ఫ్లాపు తట్టుకునే శక్తి హీరో కి ఉండాలి...చూసే జనాలకి శక్తి కావాలి..ఎన్ టీ ఆర్ వీరాభిమానిని నాకే..విసుగొచ్చింది..ఇందులో యాభైకోట్ల విషయం ఏముందా అని..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

గురువారం, మార్చి 24, 2011

మూడు వికెట్ల క్రికెట్

 నాలుగేళ్ళకోసారి జరిగే ప్రపంచ మూడు వికెట్ల క్రికెట్ సంబరాన్ని చూడడానికి వేలమంది స్టేడియాలకి తరలి వస్తారు  ఎక్కడికైనా వెళ్తారు..గెలిస్తే....ఓకే..ఓడితే...గేఅలిచేస్తారు..ఐదేళ్ళ కోసారి జరిగే ఎన్నికల్లో..మనల్ని..సరిగా పాలించే వాళ్ళ కోసం వెయ్యాల్సిన వోటు కి మాత్రం రారు..అందుకే వాళ్ళూ మనతో ఆడుకుంటున్నారు...




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/BookmarkShare/Save/Bookmark

శుక్రవారం, మార్చి 18, 2011

హంగుల ప్రపంచానికి రంగుల పండుగ శుభాకాంక్షలు

వసంతోత్సవం అంటే తిడుతున్నానుకుంటారేమో
అడ్డమైన రంగులూ పూసుకుంటూ కోడిగుడ్లు తలమీద కొడుతూ .. గ్రీజులు..సునీర్ లు నానా చెత్త తీసుకొచ్చి..తలకి..కళ్ళకి..పళ్లకి పూస్తూ పండగ జరుపుకుంటున్న హంగుల ప్రపంచానికి
 రంగుల పండుగ శుభాకాంక్షలు






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

గురువారం, మార్చి 17, 2011

మగానుభావులు

జపాను దేశం లో భూకంపం
భారత దేశం లో భూ పంపకం





పంచ భూతాలనూ కబ్జా చేయగల నాయకులు 
లంచాలతో మాయ చేయ గల మగానుభావులు 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

సోమవారం, మార్చి 14, 2011

చుడీదార్

మొన్నటి అమ్మమ్మ పట్టుచీరే
నేటి మనవరాలి చుడీదార్









నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శుక్రవారం, మార్చి 11, 2011

ట్యాంకు బండు పై కొమరం భీం విగ్రహం

 ట్యాంకు బండు పై కొమరం భీం విగ్రహం  - అమర విగ్రహ స్థూపం


సీ ఎం గారూ..

పగలిన విగ్రహాల గురించిన రిపోర్ట్ కు ఆదేశించారట. మళ్ళీ నిలబెట్టడానికి ఎంతౌతుందో లెక్క కట్టమన్నారట. అయ్యా..ఒక పని చేయండి. ఒక్క కొమరం భీం విగ్రహం వీలైనంత పెద్దది చేయించండి.. అమర వీరుల స్థూపం లా...అమర విగ్రహాల స్థూపం అన్నమాట. ఆ విగ్రహం చుట్టూ ఈ శిధిలాలను నిలబెట్టండి. అప్పుడైనా వాళ్ళ ఆవేశం వల్ల జరిగిన నష్టం వాళ్ళకి తెలుస్తుందేమో..జరిగిన దానికి సాక్షిగా...తరతరాలకూ తెలుస్తుంది.. ప్రభుత్వ వైఫల్యానికీ నిదర్శనంగా నిలుస్తుంది..





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails