Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, డిసెంబర్ 29, 2010

Youth

ఆనాడు రావణాసురుడికి పది తలలు ఇరవై కళ్ళు..చూపు మాత్రం ఒక సీత పైనే
ఈనాటి యువకులకి ఒక తల రెండు కళ్ళు కానీ చూపు మాత్రం అందరు ఆడాళ్ళ పైనా

ఓకే అంటే ప్రొసీడ్
నో అంటే యాసిడ్




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శుక్రవారం, డిసెంబర్ 10, 2010

ఆర్ధిక ప్రగతి



నిజమెంతో...నాకు తెలీదు కానీ..ఉత్తరం వస్తే అందులో గుండు సూది తీసుకుని దాచుకునేవాట్ట గాంధీ గారు.. ఇంటి పనులకు ఆఫీసు కారు వాడేవాడు కాదట లాల్ బహదూర్ శాస్త్రిగారు...రాష్ట్రపతి గా చేసిన తరువాత పిల్లలకి క్లాసులు చెబుతూ స్ఫూర్తినిస్తున్నారు కలాం గారు..అదే దేశం ...కానీ వీళ్ళు ప్రత్యేకం
భారతదేశం ఆర్ధికంగా వెనకబడుతోందని ఎందుకంటారో అర్ధం కావట్లేదు.


బోఫోర్స్ 64,ఊరియా 133,గడ్డి 900,స్టాక్ మార్కెట్ 4000 సత్యం
7000, కామన్ వెల్త్ 70000, జీస్ పెక్ట్రుం 167000, ఫుడ్  సివిల్సుప్లైస్ 200000 అన్నీ కోట్లలో ....ఇవి రాష్ట్ర బడ్జెట్లు కాదు..దేశ బడ్జెట్ కూడా కాదు...కుంభకోణాల్లో ..స్కాముల్లో గల్లంతైన జనం సొమ్ము...ఇదంతా భారతీయ రాజకీయాల స్థిగతులకి అద్దం పట్టే ఒక చిన్న ఉదాహరణ..

ఆర్ధికప్రగతి బాటలో నాయకులు...అధోగతి పడుతున్న  ప్రజలు..జయహో భారత్ 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

గురువారం, డిసెంబర్ 09, 2010

మేరా భారత్ మహాన్

మేరా భారత్ మహాన్


ఒబామా వస్తే చప్పట్లు..ఒసామా గురించి ముచ్చట్లు
కామన్ వెల్తు గేముల్లో కూలిన వంతెనల లెక్కలు
జమా పద్దుల్లో కావాల్సినన్ని బొక్కలు




..సెపరేట్ తెలంగాణా కోసం ప్రజల ఆరాటం
ఏబీ సీ డీ వర్గీకరణ కోసం పొరాటం


రూల్స్ పాటించని మహానుభావులతో ట్రాఫిక్ జాం
ఇరుకు రోడ్లతో ఇంటికెప్పుడు చేరతామో హే  రాం  





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

గురువారం, డిసెంబర్ 02, 2010

నమస్కారం ముక్య మంతిరి గారూ

నమస్కారం ముక్య మంతిరి గారూ...

బాబూ..ఎల్ కం...ఎల్ కం టు ఆందర ప్రదేశ్ ... రాజకీయంగా అంధేరా ప్రదేశ్... సామాజికంగా అందరి ప్రదేశ్.. కొందరి ప్రదేశ్.. కొన్నాళ్ళకి ఎలా ఉంటుందో తెలీని కొశ్శన్ మార్కు ప్రదేశ్.. ఏదో తాగి వాగుతున్నానకోవద్దు సార్ర్ర్ర్ర్..

వై ఎస్ ఆర్ పోయి కే ఆర్ వచ్చె.... కే ఆర్ వెళ్లి పోయి..కే కే ఆర్ వచ్చె..మరి మీరైన మూడేళ్ళు ఉంటారా లేక ఇది కూడా మూన్నాళ్ళ ముచ్చటేనా... ప్రజల కోసం ప్రాణాలిచ్చినోళ్ళు..ప్రాజెక్టులు కట్టినోళ్ళూ..ఫ్యామిలీని కూడా పట్టించుకోనోళ్ళు..ఏలిన రాష్ట్రం మనది..కానీ మీ పార్టీ ని చూస్తే ప్రతీ సారీ ముక్య మంత్రులని మార్చడం అన్నది ఓ వ్రతం లా పెట్టుకున్నట్టుంది..మరి మీకిచ్చిన టైమెంతో..వైటెంతో మరి..

మంతిరి వర్గం ప్రకటించేశావు..ఇంక పాలించడమే లేటు... చెయ్యదలుచుకున్న మంచి పనులేమైనా ఉంటే త్వరగా మొదలెట్టేయ్...లేకపోతే మళ్ళీ ఢిల్లీ నుంచి పిలుపొత్తాది...అమ్మ పలుకుతాది..పదవి ఊడతాది..సానా మంది సీనియర్లు..రాజకీయ కురు వృద్ద్ధులు వైటింగక్కడ... సోనియా మాత ఆశీర్వాదం తో.. ఈ మూడేళ్ళూ నెట్టుకొచ్చావా..ఇక నీకు తిరుగుండదు..

 






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శుక్రవారం, నవంబర్ 26, 2010

ముఖ పుస్తకం

 ముఖ పుస్తక ప్రియులెక్కువైపోయారు..
నచ్చిన ముఖాన్ని...మెచ్చుకుంటారు..
పోనీలేండి. నచ్చకపోతే ...నో అంటే ..యాసిడ్ పోస్తారని
భయం లేదిక్కడ,,,
జయహో ముఖ పుస్తకం....గుడ్ లక్ టు ఫేస్ బుక్..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, నవంబర్ 20, 2010

భారతంలో (ఎం)పిడకలవేట

భారతంలో (ఎం)పిడకలవేట

 
ఎనకటికి
మహాభారతంలో దుర్యోధనుడికి 99 మంది తమ్ముళ్ళట, అందులో దుశ్శాసనుడు, వికర్ణుడు తప్ప వేరే పేర్లు జనాలకి తెలీవు... పనిలేదు..పేరులేదు,,సంపాదన లేదు.. అందుకు అలిగి సమ్మె చేస్తే...సరే వచ్చే జన్మ లో ఆంధ్రా లో పార్లమెంటు మెంబర్లైపోండి...కావాల్సినంత పేరు..డబ్బు అని వరమిచ్చారట..

ఇదేదో కాకమ్మ కధ.. భారతంలో పిడకలవేట..

ఈ మధ్య పార్లమెంటు లో  మన వాళ్ల ప్రతాపం.. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏ ప్రాతిపదికలో ఏ ప్రాంతం నించి గెలుస్తారో తెలీదు..ఒక వేళ స్త్రీకోటా ఉంటే సడెన్ గా వంటింట్లో ఉన్న ఇల్లాలిని నామినేటు చేసేసి..గెలిపించేసి, ఇక చక్రం వీళ్ళు తిప్పుతారు..ఇక కుల,మత, మరికొన్ని కారణాల వల్ల కూడా గెలిచే అవకాశాలున్నాయి..ఎంత సేపూ తమ భత్యాలు పెంచమనో..జీతాలు చాలట్లేదనో తప్ప జనాల బాధల గురించి మనవాళ్లు పట్టించుకునే టైం లేదు..సార్లకి..

రాష్ట్రం తరఫున ఎంత మంది ఎం పీ లున్నారో..రాష్ట్రానికి నిధులు ఎంత తెస్తున్నారో సమస్యలగురించి చర్చిస్తున్నారో తెలీదు..రక రకాల పైరవీలకోసం వచ్చే జనాలతో ఏ పీ భవన్ నిండి పోతోంది కానీ...ఏ పీ కి మాత్రం ఎం పీ ల వల్ల ఒరుగుతున్నది..శూన్యం.

అసలు పార్లమెంటులో మన వాళ్ళ హాజరీ ఎంత? ఫలానా నాయకుడి ఫొటో పెట్టాలనో..మరో నాయకుణ్ని కించ పరిచారనో..గలాభా తప్ప తన నియోజకవర్గ జనాభా గురించి పోరాడే టైము లేదు మనవాళ్ళకి.

మన తెలుగు ఎం.పి వర్యులు ప్రాంతాలగ విడి పోయి, ఒకరి ఫై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, మన తెలుగు ప్రాంతానికి(ఆంధ్ర ప్రదేశ్) అన్యాయం చేస్తున్నారా? అంటే నిజమని అనాలి.
బెదిరించో..బతిమాలో తమిళ రాష్ట్రానికి మాత్రం (కరుణా) నిధులు జేరిపోతున్నాయి..
బెంగాలుపైనా కేంద్రానికి 'మమత ' ఎక్కువే...
ఇక బీహారుకి లాలూ రైళ్ళు  చాలానే చేరాయి..
రాహుల్ దయ వల్ల ఒక రాష్ట్రం బాగు పడ్డది..
శివ సైనికుల రాష్ట్రం లో చవాను పై ఎన్ని కేసులు వున్నా మహా ప్రగతి సాధిస్తోంది...మహ రాష్ట్రం..

మరి మనపై ఏలా దయా రాదూ.....??????

మెంబర్ ఆఫ్ పార్లమెంటు...అంటే పార్లమెంటుకి వెళ్ళి వచ్చే వాళ్ళు కాదు....మెసెంజర్ ఆఫ్ ప్రజలు..అని
తెలుసుకునేదెప్పుడు ?




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

బుధవారం, నవంబర్ 17, 2010

Leaders are Born HERE

 Leaders are not born they are made..............
ఇది ప్రపంచ వ్యాప్తoగా తెలిసిన సూక్తి..

కాని "మేరా భారత్ మహాన్"
ఇక్కడ మాత్రం, "Leaders are born !! ".....
వారసత్వంగా నాయకత్వ లక్షణాలు వచ్చినా రాకున్నా నాయకత్వం మాత్రం "లక్షణo" గా వచ్చేస్తుంది ..వంశపారంపర్యంగా!!

జాతీయ స్థాయిలో చూసినా రాష్త్ర స్థాయిలొ చూసినా ఆయా నాయకుల పిల్లలు వాళ్ళ పిల్లలే రాజ్యమేలుతున్నారు..మంత్రాంగం నడిపిస్తునారు ..మరి ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాజరికమా?

నిజంగా ఇప్పుడొస్తున్న యువ నాయకులకు వారసత్వం కాకుండా మరేదైనా క్వాలిఫికేషన్ ఉందా..వాళ్ళు ఆ నాయకుల పిల్లలు కాకపోతే, ఆ వంశాలకు చెందకపోతే కూడా ఆ పదవులు దొరుకుతాయా...

సినిమాల్లోనూ ఇది కామనే...




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

ఆదివారం, నవంబర్ 07, 2010

బిగ్గు బాసు...

బిగ్గు బాసు...

ఏమిటో ,,,చాలా గందరగోళం గా ఉంది.. అదేమి కాన్సెప్టో..

ఒక చోట చేర్చిన జనాలు కొట్టుకోవడం..తిట్టుకోవడం..ప్రేమించుకోవడం..పెళ్ళి చేసుకోవడం...కండల వీరుడు సల్మాను ఖాను గారి ఆంకరింగు విన్యాసం. కెమెరాలు పెట్టి షూటింగ్ చేయడం..బొగ్గు బాసు..
ఎందుకో ఒకళ్ళని  చూసి వాతలు పెట్టుకోవడం...





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

గురువారం, అక్టోబర్ 28, 2010

ట్రాఫికర్

 మంత్ ఎండింగ్ వస్తోంది..పండగ దగ్గరైంది...
టార్గెట్స్ పెరిగై..ట్రాఫిక్ పెరిగింది..
చెక్ పోస్టు పెట్టెయ్ -  దొరికినోణ్ణి పట్టేయ్ ...
లేని వన్నీ అడిగేయ్...దొరికినంత నొక్కేయ్..
 ఏ తప్పుకైనా యాభై .. దొరలాగా వదిలెయ్..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

సోమవారం, అక్టోబర్ 25, 2010

రకత చరితర...

రకత చరితర...

మనం పుట్టించకపోతే పదాలెలా పుడతాయి...ఆర్ జీ వీ సినిమా తీయకపోతే మనమేం మాట్లాడుకుంటాము. మామూలు మనుష్యులకొచ్చే ఆలోచనలు ఆయనకి రావనుకుంటా. దేవుడంటే నమ్మకం లేదు(ట). దెయ్యాలుంటాయో లేదో తెలీదు(ట). ఇలా చాలా ఉన్నాయి. శివ సినిమాతో ఇండస్ట్రీలోకొచ్చి ...కాల క్రమేణా కొన్ని సినిమాలు తీసి..కొండపై స్వామి వారి కిరీటం కొట్టేసే లెవల్లో అద్భుతమైన సినిమాలు తీసి..అందులో దేవుడున్నాడు అని చెప్పాడో లేదని చెప్పాడో అర్ధం కాలేదు.సడెన్ గా చక్రం అదీ వస్తుంది..మరి.. ఎవరి మీదో అలిగి..తెలుగు సినిమాకు దూరమైనాడు..

తరువాత ఫాక్టరీ ఒకటి పెట్టాడు.. కానీ అందులోంచి పొల్యూషను..వ్యర్ధ పదార్ధాలే ఎక్కువ వచ్చి అసలు ఉపయోగపడే ప్రోడక్ట్లు తక్కువ వచ్చినాయి. అని ఆయనదే ఉవాచ. నాకిష్టమొచ్చినట్టు తీస్తా చూస్తే చూడండి ...లేక పోతే లేదు.. అని ధైర్యంగా చెప్పగల దమ్మున్న ప్రొడ్యూసర్..డైరెక్టర్...ఆయన తీసిన దెయ్యం సినిమాలు...ఒక్కళ్ళే చూడగలిగితే ప్రైజ్ ఇస్తానన్నట్టుగానే ఆయన తీసిన ఆగ్ లాంటి సినిమాలు ఆయనొక్కడే లేదా ధియేటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడే చూసిన సందర్భాలూ ఉన్నాయి.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, అక్టోబర్ 23, 2010

దివాళీ

దివాళీ
హ్యాపీ దివాళి అంకుల్...ఎప్పుడూ పలకరించని మా పక్కింటి అబ్బాయి చెప్పగానే ఒక్క సారి ఆస్చర్యపోయా...క్రికెట్ బంతి మా బాల్కనీ లో పడితే ఇంక తిరిగి ఇవ్వనని నా మీద కోపం వాడికి...ఐనా ఎందుకు చెప్పాడో లే అని నేనూ హ్యాపీ దివాలి అన్నా..'ఢాం' అని పెద్ద శబ్ధం తో నా కాళ్ల దగ్గర పెద్ద శబ్ధం..ఉలిక్కి పడి ఆమడ ఎత్తు పైకెగిరి పడ్డా...పక్కన చూస్తే వాడు లేడు..

టీ వీ లో మంచి సినిమాలొస్తాయి చూద్దామంటే 100000వాలాట ఒకటే సౌండు...అసలే అపార్టుమెంటు...కూలుతుందేమోనని బెంగ.

ఎవడో కావాలని వేసిన రాకెట్టు తో పైన ఆరేసిన బట్టలన్నీ కన్నాలు..

లక్ష్మీ బాంబు పేలడం వల్ల బీటలిచ్చిన కిటికీ అద్దాలు.నానా భీభత్సం..కానీ మరోఅ పక్క మళ్ళీ.హ్యాపీ దివాళీ అంటూ ఒకటే పలకరింపులు...ఎస్ ఎం ఎస్ లు..ఫోన్ కాల్సు..ఆ హా హ్యాపీ గానే ఉంది దివాళీ. ఎందుకంటే క్రాకర్సు కొందామంటే..ఆకాశం లో ఆగిపోయిన చంద్రయాన్ ఉపగ్రహం దగ్గర తచ్చాడుతున్న రేట్లు ...పంచదార దొరక్క చప్పబడిన స్వీట్లు..వరదల వల్ల కరకట్టలకి పడ్డ తూట్లు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విసేషాలు.

ఇది వరకైతే..ఎంచక్కా..కాగితాలు గొట్టాలు చేసి ఎండబెట్టి..బొగ్గు..సురేకారం, ఇంకా కొన్ని..సామాను తెచ్చి కలిపి .తారాజువ్వలు..మతాబులు..పిచ్చికలు..సిసింద్రీలు..సీమ టపాసులు..తాటాకు బాంబులు..వగైరా వగైరా..(వయాగ్రా అని చదవకండే) స్వయంగా తయారు చేసిన.చేసిన దీపావళి సామానుతో పక్కింటోళ్ళతో పోటీ పడుతూ..హాయిగా పాటలు పాడుతూ ..సరదాగా గడిచేది..ఇంట్లో అందరూ పూజ చేసి కొత్తబట్టలు కట్టుకుని ..ఆ రోజులే వేరు.

ఇప్పుడో..అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో కూడా తెలీదు. ప్రజలను కాపాడడానికి భూదేవి దుష్టుడైన తన కుమారుణ్ణి...సత్యభామ అవతారంతో వధించి తద్వారా మనకి ఆనందమయ జీవితాన్ని అందించింది కాబట్టి...అమావాస్య చీకటి వదిలి కాంతులీనే వెలుగు ప్రసరించడానికి ఈ పండగ..ఏర్పాటైందని ఎందరీ తెలుసో...మరి.

మనం మాత్రం..వెలుతురొచ్చేవి వదిలేసి....చెవులు చిల్లులు పడే సౌండొచ్చే బాంబులు..లడీలు...దిక్కుమాలిన పేర్లు గుండెలవిసే సౌండ్లు..ఉన్న వాటితోనే




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, అక్టోబర్ 16, 2010

బిల్"డప్పు

బృందావనం - బావగారూ బాగున్నారా పార్ట్ 2 - ఈ మధ్య రీ మేకులెల్లివైనాయి..ప్రేక్షకుల నెత్తిన కొట్టడానికి.. పాత సినిమా తీసుకుని మసాలా దట్టించి మీదకొదుల్తున్నారు. నిన్న నే బృందావనం చూశా.. ఆ మధ్య వచ్చిన బావగారూ బాగున్నారా గుర్తొచ్చింది. ఒకమ్మాయిని ప్రేమించి..ఇంకో అమ్మాయికి సాయం చేయడానికెళ్లిన హీరో ఇంట్లో అందరినీ (ఏ)మారుస్తాడు. బగీ జంపులు బదులు..సూమో జంపులు ఉన్నాయి...పరేష్ రావల్ బదులు ప్రకాష్ రాజ్ ఉన్నాడు.. సెకండాఫులో బ్రహ్మానందం ఎంట్రీ ఈ మధ్య సెంటిమెంటనుకుంటా. వెనకా ముందూ చూడకుండా ఇరగదీసేవాళ్ళు.. హీరో ఆగమంగానే ఆగి పోయి.. చెప్పే సోదంతా విని..ఫైటింగు చేయకుండా ...తన్నులుతినడం..హీరోయిజం..ఇద్దరు హీరోయిన్ లు కామన్. చివర్లో ఎవరిని చేసుకుంటాడో అని సస్పెన్సు.. పెడ్డెంటీయార్ ఎంట్రీ గ్రాఫిక్స్ ...జనాల కోసం..ఎప్పుడో ఒక సారి బాగుంటుంది కానీ ప్రతీ సారీ అంటే ?? ఒకటో రోజు నుంచే హిట్టైంది బాబూ అంటూ ఆ ప్రెస్సు మీట్లేంటో.. కలెక్షన్ల లెక్కలేంటో.. మరి అన్ని కోట్లకి.. వీళ్ళు టాక్సులు కడుతున్నార ? సినిమా చూసే మంకేమో ఎంటర్టైన్ మెంట్ టాక్స్ .. వాళ్ళకి మాట్రం వుండదేమో..?

మహేష్ ఖలేజా కూడా చూసి దొబ్బించుకున్నా .... సారీ ఆ సినిమాలో ఆ డైలాగు అన్ని సార్లు వినీ వినీ అలా వచ్చేసింది.. అదేంటో హీరోకి ఇంకేదీ దొరకనట్టు అదో ఊతపదం(బూతుపదం) పెట్టారు. చాలా కాలం క్రితం అమితాబ్ బచ్చన్ ది మిస్టర్ నట్వర్ లాల్ అని ఒక సినిమా వచ్చింది.. అందులో దేవుడు వచ్చి పులినుంచి రక్షిస్తాడని ఎదురు చూస్తుంటారు ఒక కొండ మీద జనాలు.. అక్కడకి జేరిన అమితాబ్ నే దేవుడి గా చూస్తారు ఆ ప్రజలు... మొదట ఇష్టం లేక పోయినా వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళని రక్షించే పనిలో పడతాడు అమితాబ్. ఆల్మోస్ట్ గా అదే మూల కధ తో నడిచిన ఈ సినిమాలో మగధీర చాయలు కూడా కనబడతాయి.కనీసం  రావు రమేష్ ప్లేసులో ఇంకెవరినన్నా చూపించినా బాగుండేది. సేం మగధీర లాగానే .. యంత్రాలు..మంత్రాలు వేసి... హీరో కనపడగానే కళ్ళల్లో దుమ్ము పడుతుంది..పక్షులు రెట్ట వేస్తాయి,,,, కుక్కలు మొరుగుతాయి.. అంటూ ఏవేవో చెప్తాడు.. ఇంక అనూష్క తన యాక్షన్ అంతా అరుంధతి లో చూపించేసింది కాబట్టి... మరో కోణం  లో టాలెంట్ చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు.. అసలు త్రివిక్రం సంభాషణలు అంటే పంచ్ కామెడీ కోసం చూస్తారు జనాలు.. కానీ ఇందులో మరో రూపం లో వున్నాయి డైలాగులు.. అమెరికా లో ఈ సినిమా చూసినప్పుడు ధియేటర్ లో ఉన్నది మేమందరం కలిపి 34 మంది..ఇది నిజంగా నిజం.. కానీ మర్నాడు పేపర్లలో..సైట్లలో చూస్తే అమెరికాలోనూ అద్భుతం గా ఆడేస్తోంది..కలెక్షన్ల వర్షం అనీ బిల్"డప్పు " .. ఎంటో.. ఈ లెక్కలు..తొక్కలు కాకుండా సినిమా కధ ..కధనం మీద ఎప్పుడు కాన్సంట్రేట్ చేస్తారో మనవాళ్ళు. వీళ్ళందరూ సినిమాలో కన్నా ఈ ప్రెస్ మీట్ లలో నే ఎక్కువ నటిస్తారేమో... ఆ సీన్ అద్భుతం గా వచ్చింది..జనాలకి ఈ పాట నచ్చింది...చాలా కష్టపడి తీసాం..అంటూ.

మొదటి రెండు రోజులూ ఎలాగూ జనాలు చూస్తారు..అభిమానులు .. ఇంకా యూతు... చాలా మంది చూస్తారు...అందుకు హౌసు ఫుల్లు ఖాయం.. మరి రెండో వారం నుంచీ జనాలు ఎక్కడున్నారో వెతుక్కోవాల్సిందే.. అభిమానులకి కూడా నచ్చట్లేదంటే లోపం ఎక్కడుందో మన హీరోలూ...నిర్మాతలూ..దర్శకులూ ఆలోచించుకోవాల్సిన విషయం..

ఇవాళ పొద్దున హిందీ లో హం అనే సినిమా వచ్చింది.. హీరో తన తమ్ముళ్ళతో ఎక్కడో ఒక మారు మూల గ్రామం లో సాధారణ జీవితం గడుపుతుంటాడు... అనుకోని పరిస్థితులలో తన గతం చెప్తాడు.. ఆ గతం లో అతనో పోర్ట్ కూలీ..అన్యాయం చేసే ఒక ధనికుణ్ణి..అతని సైన్యాన్ని తుదముట్టించే డాన్ రేంజ్... ఫ్లాష్ బాక్ తరువాత ..మళ్ళీ ఆ ప్లేసుకెళ్ళి జనం కోసం విలన్ లని తుద ముట్టిస్తాడు.. ఇదీ స్టోరీ... మీకు ఒక బాషా, ఒక సమర సిమ్హా రెడ్డి, ఒక నరసిమ్హ నాయుడు, ఒక ఇంద్ర, లాంటివన్నీ గుర్తొస్తున్నాయ...గుడ్... వీటన్నిటికీ రచయిత ఒక్కరే.. చిన్ని కృష్ణ..
అదీ మన సత్తా..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మంగళవారం, అక్టోబర్ 05, 2010

కామన్ v/s వెల్త్




 కామన్ వెల్త్ గేములు ఆరంభం అదిరింది . ఆటలకన్నా ముందు పాటల కార్యక్రమం చాలా బాగుందిట..
మన ఆంధ్రుడు పతకం గెలిచేసి..పతాకం పాతేశాదు కూడా..మరి ఆకాశంలో మెరిసే స్టార్లు ఏం తెస్తారో చూడాలి..
కాస్ట్లీ ఆటలు   ఆడేవాళ్లు, కోట్లు సంపాదించే వాళ్ళు, యాడ్లలో కనిపించేవాళ్ళకి ఉండే ఆదాయం..గుర్తింపు ఈ " కామన్ " ఆటగాళ్ళకు ఉంటుందా...
వీళ్ళు ఏకలవ్యులుగా ఉండిపోతారా...అర్జునులుగా గుర్తింపబడాతారా ఎప్పటికైనా ? వైట్ అండ్  సీ ..






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

ఆదివారం, అక్టోబర్ 03, 2010

రూల్స్


 

రూల్స్ 

రూల్స్ అనేవి బ్రేక్ చేయడానికే అని మన ధృఢ అభిప్రాయం.
పాటించడానికే అన్నది పక్క దేశాల ఆచారం 
రోడ్డు సిగ్నళ్ళు పాటిస్తే యాక్సిడెంటులుండవు 
మనం పాడు చేయకపోతే రోడ్లు ఇలా తయారవవు
పక్కదేశాల ఇస్టైళ్ళు-దినాలేకాదు..మంచి పద్ధతులు కూడా అనుకరిస్తే 
మనదేశంలో ఉన్న ప్రతిభకి ప్రతీ వాడూ చేస్తాడు నమస్తే 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

బుధవారం, సెప్టెంబర్ 29, 2010

ఇంజినీరింగ్ సీట్లమ్మా






 ఇంజినీరింగ్ సీట్లమ్మా ..ఇంజినీరింగ్ సీట్లున్నాయి.. మెకానికల్, ఎలెక్ట్రానిక్స్,కంప్యూటర్ సైన్సు..ఏ గ్రూప్ కావాలన్నా ఉన్నాయ్..ఏ కోటాలో కావాలన్నా ఉన్నాయి..రాంక్ తక్కువొచ్చినా ఇస్తాం...ఎక్కువొచ్చినా ఇస్తాం..రాంక్ రాకపోతే ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇస్తాం..
 కొన్నాళ్లైతే ఇలాటి అరుపులు వినాల్సి వస్తుందేమో అని డౌట్ గా ఉంది.. కాలేజీలు ఎక్కువైపోయి..సీట్లు మిగిలిపోతున్నాయట..ఏటా ఎంతమంది ఇంజనీర్లు.డక్తర్లు బయటకొస్తున్నారో గాని..ఇంకా చాలా మంది రావడానికి వీలుగా ఉన్నాయి కాలేజీలు..ఐతే..అంతమంది స్టూడెంట్స్ లేరని వినికిడి..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark
Enhanced by Zemanta

మంగళవారం, సెప్టెంబర్ 28, 2010

ఊడ్చు మిషిన్

 ఊడ్చు మిషిన్



రోడ్లూడ్చు మిషిన్  లు వచ్చాయని రోడ్లు అద్దాల్ల మెరిసిపోతాయని ఓ మురిచిపోయారు.
అవి మునిసిపాలిటీ నిధులు ఊడ్చే మిషిన్ లే కానీ... రోడ్లు ఊడ్చేవి కావని తేలిపోయింది

చెత్తని కిందా మీదా కాకుండా డస్ట్ బిన్ను లో వేసే విదేశాల్లోనో,
మంచు కురిసిన రోడ్ల మీదైతే  ఇవి పని చేస్తాయేమో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే మనం తిరిగే ఈ రోడ్ల మీద, ఎప్పుడూ గుంటలు పడి, రాళ్ళు తేలే మన రహదారులపైనా ఇవి ఎంతవరకు పనితనం చూపిస్తాయో ఆ భగవంతుడికే తెలియాలి.
కాంట్రాక్టరులు కొట్టేసే కమీషన్ లు పోయినా అర్ధరాత్రి నుంచీ తెల్లవారు ఝాము వరకూ రోడ్లూడ్చే వారి కడుపుకొట్టి ఎవరికో దోచిపెట్టే ఈ కొత్త మిషిన్ల కొనుగూలులో ఏదో మతలబు..
ఖచ్చితంగా స్కాములు జరిగి నిధులు ఊడవడానికి ఎంతో ఆస్కారమున్నట్టుగా ....

భవధీయుడి అనుమానం.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

ఆదివారం, సెప్టెంబర్ 26, 2010

ఆదివారం..

 ఆదివారం..
లేటుగా లేచి...ఫూటుగా లాగించి....ఏం చెయ్యాలా అని ఆలోచించి....సాయంత్రం దాకా చించి చించి....  కాసేపు నిద్రించి..టైం వేస్ట్ ఐందని నిందించి...భోంచేసి..పడకేసి...మళ్ళీ మామూలుగా..మూలుగుతూ "మండే " పనికి.......




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, సెప్టెంబర్ 25, 2010

కామన్ వెల్త్ గేంస్

 కామన్ వెల్త్ గేంస్

ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా ఇప్పుడు ఒకటే చర్చ.. రచ్చ..కామన్ వెల్త్ గేంస్ . వరల్డ్ కప్ క్రికెట్ కి ఇప్పట్నుంచే కౌంట్ డౌన్ లు.. రక రకాల చానెల్స్ లో యాడ్లు.. హడావిడి గా ఉంది యవ్వారం.

ప్రపంచ దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక మైన ఆటలు గురించి..మాటలే కానీ పని-పాటలు సరిగా లేవని చాలమంది..అలిగి..తొలిగారని..ఓ భోగట్టా. మనకివి 'కామన్ ' అనీ.. ఐన ' కొందరికి 'వెల్త్  ' పెంచుకునేందుకే ఈ ఆటలనీ... పొలిటికల్ 'గేంస్ ' అనీ గుసగుసలు కూడా వినవస్తున్నాయి.

భారతీయ సినిమాకి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ గెలిచేసిన రహ్మాన్ అనిదించిన సంగీతం కూడా పాశ్చాత్య ధోరణి..రణగొణ ధ్వనులతో ఉందని..వూవూ జలా తో వూది మరీ చెబుతున్నారు..జనాలు.

డోపుల్లో దొరికే తోపులు..కూలిపోయే బ్రిడ్జిలు..సగం పూర్తైన స్టేడియాలు..తో స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే

లేట్  చేయడం  మనకి కామన్.. పెద్దల వెల్త్ బాగుపడడం ఖాయం...పొలిటికల్ గేంస్ లో మనదే విజయం..
 






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మొక్కు

 మొక్కు


మొక్క లేదా ..


ఐతే ఏ దేవుడు వరమిస్తాడు..?


అడగందే అమ్మైనా పెట్టదు
అడిగినా ప్రభుత్వానికి పట్టదు


పుట్టినపుడేసిన ఉయ్యాల నుంచ్చీ ఆఖర్న కాల్చే కట్టెదాక


చదువిచ్చిన పుస్తకం - నిదురిచ్చిన మంచం
పెళ్లి చేసిన మంటపం
వంట చేసే మంట నిచ్చిన అగ్గిపుల్ల
 తినే తిండి - ఉందే ఇల్లు - వాడే వస్తువులన్నీ


ఆ మొక్క వర ప్రసాదాలే


మరి నీ ఇంట మొక్క ఉందా ?


మొక్క లేదా .... ఐతే ఏ దేవుడు వరమిస్తాడు..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మంగళవారం, సెప్టెంబర్ 21, 2010

అయ్యోధ్య

అయ్యోధ్య

రాముల వారు వేటకి వెళ్లినపుడు ఆయన వేసిన బాణం ఓ చిలుక కి తగిలిందట .. ఆ చిలుక ని చేతిలోకి తీసుకుని ఏమ్మా బాణం తగిలినప్పుడు అరవలేదే అన్నాడట.. అప్పుడు ఆ చిలుక -- ఏమని అరవను స్వామీ.. నాకేదైన కష్టం వస్తే..బధ కలిగితే రామా అని నీతో చెప్పుకునే దాన్ని...ఇప్పుడు నువ్వే బాణం వేస్తే నేనెవరికి చెప్పుకోనూ అంటూ ప్రాణం వదిలిందిట అందుకే అప్పటి నుంచి దానిని 'రామ చిలుక ' అన్నారట.. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది..అందరి కష్టం తీర్చే ఆ రాముడికే కష్టం వచ్చింది.. మరి ఆయన ఎవరితో చెప్పుకోవాలో.. ఎవరి పాలన ఐనా రామరాజ్యం లా ఉండాలి అంటుంటారు..మరి ఈ రాజ్యం లో రాముడి స్థానమేంటి ? అయోధ్య రామ జన్మ భూమా ? కాదా ? 
రేపో మాపో తీర్పు వస్తుందిట అయోధ్య గురించి.. తీర్పు ఏం వస్తుందో తెలీదు కాని ..తీర్పు వచ్చిన తరువాత ఏం జరుగుతుందో మాత్రం చెప్పేయ్యచ్చు. ఒకళ్లకి నచ్చిన తీర్పు వస్తే మరొకరు. హింసకు దిగుతారు..మరో కోర్టులో అపీల్ చేస్తారు. గొడవలూ జరుగుతాయి..ఆ విషయం మీద అసెంబ్లీలలో పార్లమెంటులో రభస జరిగి సభలు వాయిదాలు పడతాయి. ఇరువర్గాల మధ్య సయోధ్య లేనంతకాలం అయోధ్య భవిష్యత్తు మిధ్యే..

రాముడు బీజేపీ వాళ్ళకి మాత్రమే దేవుడో..వాళ్ళకి మాత్రమే హక్కు ఉందో తెలీదు కానీ కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చినట్టు... ఎలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తెందుకొస్తాడో తెలీదు, కమలం రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది..వీళ్ళూ అంతే ఎన్నికలప్పుడే వినిపిస్తారు-కనిపిస్తారు. పాపం సాధువులు, సన్యాసులు, మత ప్రచారకులు, వీళ్ళు రాముడి కోసం పోరాడుతున్నారో రాజకీయంలో పావులౌతున్నారో మరి వారి దివ్య దృష్టికే తెలియాలి. ఎందుకంటే.. కల్పాల కాలం కన్నా ముందు..3 యుగాల క్రితం జరిగిన రామాయణం తరువాత వచ్చిన ప్రళయాలతో నిజమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో ? ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ? త్రేతా యుగం - ద్వాపర యుగం దాటినాక కదా కలి యుగం వచ్చేది.

భారతీయులు అందునా హిందువులు శాంతికాముకులు - మన ఇంటికో - మనకో ప్రాబ్లెం వస్తే తప్ప పక్కవాడేమై పోయినా పట్టించుకోడు. చిన్ని నా పొట్టకు శ్రీ రామ రక్ష అన్నట్టు..జీవించేస్తుంటారు.
రాముడు మా గుండెల్లో నే ఉన్నాడు..కాబట్టి మేమిక్కడే పూజించుకుంటామంటారు.

రోడ్డు వైడెనింగు కోసం అడ్డమున్న హిందూ ఆలయాలనైతె పక్కన పెట్టేస్తుంది కాని.. మరో ప్రార్ధనాలయమో..సమాధో ఉంటే మాత్రం  ప్రభుత్వమే టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తుంది..మరి ఇంత పెద్ద విషయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందో..80 శాతం పైగా ఉన్న హిందువుల మనోభావాలు-నమ్మకం-భక్తి-చర్త్ర కన్నా వాళ్ళకి ఓట్లే ముఖ్యం. అణు బిల్లు కోసం ఎవరితోనైనా పోరాడతాం కానీ మహిళా బిల్లుకో-ఈ అయోధ్య విషయానికో అంటే వాళ్ళ దగ్గర టైం లేదు మరి( ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా!)

ఫలానా రామ సేతు ఉంది..అని..ద్వారక సముద్రంలో కనిపిస్తోందని.ఏ నాసా వాడో చెప్తే నమ్ముతాం కానీ.. ఎవరు నస పెడితే మాత్రం నమ్ముతామా..ఇక్కడ కూడా వాళ్ళే కనుక్కుని చెప్పాలేమో.. లేకపోతే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి..ఆ రాముణ్ణే ఇంకెక్కడో పుట్టమని చెప్పాలి. బాబర్ కి చెప్పలేం కదా.. 

చూద్దాం శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష..





 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, సెప్టెంబర్ 18, 2010

అవతార పురుషులు - రాజకీయ నాయకులు

భూకబ్జా చేసి న హిరణ్యాక్షుడు---సీతమ్మవారిని కిడ్నాప్ చేసిన రావణుడు..పక్కవాడి రాజ్యం లాగేసుకునే దుర్యోధనుడూ.. వీళ్లందరి రాక్ష గుణాలు కలగలసిన రాక్షస గణాలు ప్రస్తుత రాజకీయ నాయకులు....

"రా " క్షసత్వంతో
  జ " నాలకి "
  కీ " డుకలిగించే
"యం " త్రాంగం   అని ఎప్పుడో పరుచూరి బ్రదర్స్ అన్నారు. 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, సెప్టెంబర్ 11, 2010

గ్రీన్ గణేశా

సున్ని పిండి తో తయారైన చిన్నారి బాలకుడు
తల్లి మాట కోసం తండ్రి పై దండెత్తిన గడసరి పాలకుడు
మూషిక వాహనం పై వెడలిన గజముఖుడు
విఘ్నాల తొలగించే సకల గణ నాయకుడు
మట్టి ప్రతిమలో ఇమిడిపోయే కొండంత  దేవుడు
పత్రి పూజ తో ఫలమందించే వినాయకుడు

గ్రీన్ గణేశా అనే నినాదం తో సైకత శిల్పి సుదర్షన్ పట్నాయక్ చిత్రించిన సైకత గణపతి...

పే రెంట్స్ :




పే రెంట్స్ :
చదువు"కొనె" ఈ రొజుల్లో ర్యాంక్  ల కోసం బ్యాంక్ బ్యాలెన్స్  లు కరగబెట్టుకుంటున్న నేటి పేరెంట్స్ ,,,,they pay rents for their children education
మొన్న నే  అమ్మాయికి 10 వేల డొనేషన్ తో LKG లొ చేర్చిన ఓ తండ్రి ఆవేదన,,లోంచి వచ్చే ఆక్రందన,,   



ప్రస్తుతం,,lkg  నుంచె "బరువు" బాధ్యతలు పెరిగిపొతున్నై....కేజీల బరువున్న పుస్తకాలు..మూడో క్లాసు నుంచే కంప్యూటర్ పాఠాలు..కలలు రాకపోయినా కళ్ళజోడు ఖాయం..e-chaduvulaki 


  



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

గన్ పతి - 2

గన్ పతి - 2



పరమ శివుడు ఇచ్చిన గన్ను..పార్వతీ దేవి ఇచ్చిన దన్ను కొండంత అండగా....తన వాహనమైన మూషికం మీద భూలోకం బయలుదేరాడు వినాయకుడు...



మూషికా ..ఇంకా భూలోక విషయాలు ఏమిటి?



ఏమి చెప్పమందువు స్వామీ...పూర్వం ప్రతి ఇంట కొలువై..బియ్యం పప్పులు,,ఏవి దొరికితే అవి తిని హాయిగా ఉండేవాళ్ళం..ఇప్పుడు పెరిగిన సాంకేతిక నైపుణ్యాల వల్ల.మా కొరకు బోనులని,,,పిల్లులుని, ఏకంగా రక రకాల విష పదార్ధాలని తయారు చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నారు..కొన్ని చోట్ల ఐతే మాకోసం తయారు చేసిన విష పదార్ధాలను..ఋణ బాధలు భరించలేని రైతన్నలు ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.. ఆ పాపం మాకు తగులుతుందేమోనని భయంతో ప్రాణ రూపం వదిలి..ప్రాణం లేని వస్తు రూపం పొంది..ప్రతి ఇంటా బయటా కంప్యూటర్ అనే యంత్రం మునే మీరుగా భావించి..మౌస్ రూపంలో బతుకీడుస్తున్నాము.....తండ్రీ....



మూషికా బాధ పడకు..అదంతా కలి ప్రభావము... అదిగో భూలోకం దగ్గరకొచ్చింది...అదిఓ భాగ్యనగరం..మాకు అత్యంత ప్రియమైన నగరం..



అవును స్వామీ ప్రస్తుతం భాగ్యనగరం చాలా 'ప్రియమైన ' నగరం..!



అదేమి మూషికా..నీ భావం ,మాకర్ధం కాలేదు..స్వామీ భాగ్యనగరం ప్రస్తుతం మహానగరం గా గుర్తింపు పొదింది..అందుకే అక్కడ ప్రతీ దానీ ధరలు పెరిగి ప్రస్తుతం ప్రియమైననగరంగా గుర్తింపు తెచ్చుకుంది..అంతర్జాతీయ విమానాశ్రయాలూ, ఇంకా వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాక వల్ల భూమి విలువ పెరిగి బాగ ప్రియమైంది స్వామీ భాగ్యనగరం.



మరి బాగా సంపాదిస్తున్నారుగా ప్రజలు హాయిగా ఉన్నారా ? మా మీద భక్తి ప్రపత్తులు పెరిగాయా....
ఎక్కడ స్వామీ..వారికి అంత తీరికేదీ ? వూరు చివర ఉద్యోగాలు..దారి అంతా ట్రాఫిక్ జాములు, కాలుష్యం, రేషన్ కోసం పడిగాపులు, నీటికోసం ఎదురుచూపులు, పిల్లల చదువు కొనుగోలూ, ఇలా బాధలు అధికమై తీరిక ఏదీ మీ గురించి పట్టించుకోవడానికీ ?అదిగో స్వామీ భాగ్యనగరం వచ్చేసాం..జాగ్రత్త స్వామి?



ఇంతలో రవీంద్రభారతి కూడలి దగ్గర పోలీసు ఆపాడు స్వామిని..



ఎమయ్యా ! ఆగాగు.. ఏమిటి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నావ్..ఏమిటి అంత స్పీడు ? హెల్మెట్ట్ ఏది ?
హెల్మెట్టా ? అనగా నేమి..



శిరస్త్రాణం .స్వామీ (ఎలుక చెప్పింది)ఇదిగో ఉందిగా...కిరీటం చూపించి అమాయకంగా చెప్పడు స్వామి.



పోలీసు : అన్నట్టు సీట్ బెల్ట్ ఏది ?



గణపతి : అది ఎందులకు



పోలీసు.: నువ్వు వెళ్తుంది ఫోర్ వీలర్ మీద..అంటే ఇదిగో నాలుగు కాళ్ళున్నాయిగా అందుకు..అంటూ ఎలుక నాలుగు కాళ్ళు చూపించాడు



గణపతి: వీడి అసాధ్యం కూలా.ఇప్పుడేమి దారి మూషికామూషికుడు : స్వామి తమ జంధ్యం చూపండి నాగులే కాబట్టి నల్లగా ఉండి బెల్ట్ అనుకుంటాడు అన్నట్టు మీ బెల్ట్ కూడా నాగులే కదా దెబ్బకి వొదులుతుంది వాడి తిక్క..



గణపతి చూపించిన జంధ్యం చూసి పోలీసు మూర్చిల్లగా...."బతుకు దేవుడా" అనుకుంటూ బయట పడ్డారు..మూషిక, వినాయకులు...



లకడీ కపూల్ మీదుగా ఖైరతా బాదులోని తన భారీ విగ్రహం చూద్దమని వెళ్తున్న స్వామికి అక్కడి ట్రాఫిక్ జాం చూసి మూర్చ వచ్చినంత పనైంది...చిన్న సందు దొరికితే ఇరికించేసే ఆటోలూ, అదే పనిగా హారన్ కొడుతూ రొద చేశే కార్లు...విపరీతమైన జనంతో నిండు గర్భిణిలా తెగ పొగ వుదులుతూ..ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆర్టీచీ బస్సులు, ఆంబులెన్స్ కి కూడా సైడు ఇవ్వకుండా..ఆగిన ట్రాఫిక్ లో ఇరుక్కున్న స్వామికి రెండున్నర గంటల తరువాత కానీ ఖైరతాబాదు జేరలేక పోయాడు... హు మానవుడికి పాప్ పరిహారం కోసం మళ్ళీ నరకం అవసరం లేదనుకుంటా..ఆ యముడు పెట్టే బాధల కన్నా ఈ బాధలు తక్కువేమీ కాదు..మరణించిన తరువాత కంటే మరణానికి ముందే అన్ని శిక్షలు ఇక్కడే అనుభవిస్తున్నాడు పాపం మానవుడు..



స్వామి భావం పసిగట్టిన మూషికం ..మరీ అల ఫిక్స్ ఐపోకండి స్వామీ..ఇంకా చాలా చూడాలి తమరు ఈ పది రోజుల్లో..అంటుండంగానే రైలు గేటు పడింది...మరలా ఆగింది మూషికం..



రైలు కోసం ఆగిన కొన్ని చిన్న వాహనాలు..గేటు కింద నుంచీ దాటుకుని వెళ్తున్నారు..కనుచూపు మేరలోనే రైలున్నా ఒక్క నిమిషంలో నే అది వెళ్ళిపోతుందని తెలిసినా వాళ్ళు చేసే ఆ పని చూసి స్వామ్మికే భయం వేసింది.



ఇంతలో కాలిమీద ఏదో తడి..చూస్తే తన పారాణికన్నా ఎర్రగా మరో డిజైను...అది ఏమా అనుకుంటుండగా..సారీ బాస్ చూసుకోలేదు......అంటూ మరికొంచెం పక్కగా ఊసాడు తన నోట్లోని పాను పరాగ్ ని తన సరాగానికి మురిసిపోతూ... oka maanavuDu



హా! హతవిధీ !! అనుకుంటుండగా ముక్కులదిరే వాసన...అది ఏమి వాసనో స్వామి పొడవాటి ముక్కు కూ అర్ధం కాలేదు..అన్ని వైపులా ఆ వాసన తప్పీంచుకోవడానికి తన తొండాన్ని తిప్పే ప్రయత్నం చేశారు స్వామి....ఎటు తిప్పినా ఏదో ఒకీ వాసన తొండాన్ని తాకుతోంది..మొదటి సారిగా తొండం అంత పొడవుగా ఉన్నందుకు బాధ కలిగింది స్వామికి.....మూషికుడు ఇది పసిగట్టి ..స్వామీ అది ఆ పక్కనుంచి వస్తున్న మూత్ర శాల వాసన..ఈటుపక్కనుంచీ వస్తున్న చైనీసు నూడుల్స్ మసాలా ఘాటు..ఇటు ఆ కోడి మాంసపు దుకాణపు వాసన...అదిగో అక్కడ పొంగి పొర్లుతున్న డ్రైనేజీవనది నుంచి వచ్చే వసన..ఆ పక్కన ఉన్న కుళ్ళిన పళ్ళ వాసనతో కలిసి వస్తున్న కంపు స్వామీ మనం ఈ ప్రాంతం దాటినా ఆ వాసన మనల్ని వదలదు స్వామీ అన్నాడు...
ఆ వాసనలకి కళ్ళు బైర్లు కమ్మిన స్వామి ..మూషికా చీమూ- రక్తం కలిసిన వైతరిణి దాటడం అయినా సులభమేమో కానీ..ఈ భాగ్ య(మ)నగరం లో రహదారి దాటడం చాలా కష్టం,....ఏదో నవరాత్రులు పూజ చేసినారన్న ఆనందంలో కాలుష్య మయమైన టాంకు బండులో ముంచినా భరిస్తున్నా కానీ ఈ భాగ్యమ నగరంలో జీవించడం మనుష్యుల వల్లే కానీ ఇ దేవతల వల్ల కాదు..పద మన భారీ విగ్రహం దగ్గర జనాలని ఆసీర్వదించి మనమూ టాంకు బండు వద్ద వేచి వుందాం ఎలాగు నిమజ్జనం రోజున భక్తజనం వస్తారు కాబట్టి అక్కడనే ఆ ఆనందం పొందుదాం...అంటూ ముందుకు కదిలాడు స్వామి..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

'గన్'పతి

'గన్'పతి

వినాయక చవితి శుభాకాంక్షలతో


'గన్'పతి



అది కైలాసం....శివుడి మెళ్ళో పాము ఆకలిగా ఉండి ప్రసాదం కోసం చూస్తోంది..ఈలోగా వచ్చిన వినాయకుడి ఎలుక...ఏం మామా భోజనం అయిందా అంటూ పలకరించింది...ఇంకా లేదు...స్వామి తిన్నాకే నాకు..ఆయనకి భోజనం అదీ అక్కర్లేదు...నీ భోజనం అయిందా అంది...దానికి ఎలుక మా స్వామి దగ్గర ఆ ప్రాబ్లం లేదు..ఆయన కి ఆహారం ఇష్టం. అందుకే నాకు ఫుడ్డు కి కొదవ లేదు...అదిగో మాటల్లోనే మా స్వామి వస్తున్నాడు అంది వినాయకుడు రావడం చూసి,,,,,
వినాయకుడు వస్తూనే..తల్లికి, తండ్రికి నమస్కరించి..అమ్మా వినాయక చవితి వస్తోంది..నేను అలా భూలోకం వెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తానమ్మా..అన్నాడు..దానికి పతి సేవలో ఉన్న ఆ పార్వతి ఉలిక్కి పడి..నాయనా వినాయకా..ప్రతి సంవత్సరం వెళ్తూనే వున్నావు కద నాయనా..ఈసారికి వద్దులే...నీ పుట్టిన రోజు ఇక్కడే కైలాసంలో జరుపుకుందాం..నువ్వు ఎక్కడికీ వెళ్ళకు అని కంటనీరు పెట్టుకుంది...
దానికి పశుపతి ..అదేమి పార్వతీ అలా అంటావు...విఘ్నేశ్వరుడు ప్రతి సంవత్సరమూ..తన జన్మదినము భూలోకమునే కదా జరుపుకుంటాడు...మరి ఈ సారి వద్దనెదవేమి.? మరీ అంత దిగులుగా ఉంటే మనమూ వెళ్ళివద్దాం...అన్నాడు శివుడు....
తల్లి ప్రేమ మీకేమి అర్ధం అవుతుంది లేండి...నా కుమారుడు ఏమన్నా రాక్షసులతో యుద్ధానికి వెళతానన్నాడా..లేక తపస్సుకు వెళతానన్నాడు... వెంటనే పంపడానికి..వెళ్ళేది భూలోకానికి..అందుకే నా దిగులు...అంది పార్వతి...
అదేమి పార్వతీ అంత మాట అంటివి..భూలోకమున అందరూ మన భక్తులేగా...పైగా ప్రతి సంవత్సరం మన కుమారుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఊరూరా.... వాడ వాడల జరుపుకుంటారు కూడాను...తిరుపతి లడ్డు వలే మన కుమారుడు ధరించిన లడ్డుకు వేలం పెట్టి - వెల కట్టి మరీ వైభోగాలు జరుపుతారు....
ఏమి చెప్పను స్వామీ..మనవాడి పుట్టిన రోజు జరుపుతామని బలవంతంగా డబ్బులు లాగుతారు కొందరు...ఆ డబ్బుతో అడ్డమైన పనులూ చేస్తారు...కొందరైతే పందిరి వేసి మన కుమారుడి విగ్రహం పెట్టి పూజలు చేసి...అక్కడే సాం'స్క్రుతక' కార్యక్రమాలు జరుపుతారు...అవి ఎంత క్రుతకంగా ఉంటాయో..మనకి అంతుపట్టదు....'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' లు పోయి... అ అంటే అమలా పురం..ఆ అంటే ఆహా పురం అని, ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అర్ధం లేని పాటలు..అర్ధనగ్నపు ఆటలు ఆడతారు,,,,ఇవే కాక రాత్రి కాపలా అని చేసే కార్యకలాపాల చిట్టా నేను చెప్పలేను...చతుర్ముఖ పారాయణం..తీర్ధం....ప్రసాదం పేరుతో పేకాట..మందు..ఇంకా సర్వ పాపాలకూ ఒడిగడతారు...నిజంగా నిష్టగా చేసేవారూ లేకపోలేదు..కానీ ఇలాంటి వారు చేసే పాపం మన వాడికి తగులుతుందేమోనని నా భయం..
దేవీ మానవులు చేసే పాప పుణ్యాలకు - మనకు సంబంధం లేదు...వారి పాపం వారికే తగులుతుంది..నువ్వు భయపడనవసరంలేదు..అని వూరడించాడు పరమేశ్వరుడు...
స్వామీ నా అసలు భయం అది కాదు..స్వామీ....భూలోకమున తీవ్రవాదుల భయం ఎక్కువ అయింది...ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు...అహార స్థలాలు..విహార స్థలాలు ..అని లేకుండా ఎక్కడపడితే అక్కడ బాంబులు పేలుస్తున్నారు..అంతే కాదు ప్రతిసారి విగ్రహ నిమజ్జనం లో ఏదో జరుగుతుందని వినడం రివాజుగా మారింది....ఆ హుస్సేను సాగరంలో నీరు ఇప్పటికే విషతుల్యం అయింది....ఇలా చాలా భయాలున్నాయి స్వామీ...అంది పార్వతి
పార్వతీ ఎందుకు నీకు భయము?...ఆ తీవ్ర వాదులు పూర్వ జన్మలో రావణ..దుర్యోధనాది రాక్షసుల బంటులు..వారి వారి కర్మ ననుసరించి ఇలా జన్మించి పూర్వ జన్మ వాసనల వల్ల 'కలి' ప్రేరేపితులై అలా ప్రవర్తించుచున్నారు...వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి పాపం 'వారిని' కూడా బాంబు రూపమునో, ఎన్ కౌంటర్ రూపమునో వారిని దహించివేస్తుంది..ఇక మన కుమారుడి విషయం అంటావా..అతను పుట్టుకతోనే మ్రుత్యుంజయుడు..నా చేతిలో మరణించి..తిరిగి జన్మ పొందినవాడు...అంతే కాదు చంద్రుడి ద్రుష్టి తగిలి ఉదరం పగిలినా తిరిగి మామూలుగా అయిన మన బిడ్డడు...మూషికాసురుడిని ఒక దంతంతో అణిచి వాహనం చేసుకున్నవాడు...గణాధిపత్యం వహిస్తూ విఘ్నాలకు నాయకుడైనవాడు..అట్టి కుమారుడి గూర్చి ఎట్టి చింతా వలదు..
స్వామీ నా భయము మన కుమారుడి గూర్చి కాదు స్వామి! వినాయకుడి పూజ కోసం తాపత్రయ పడే భక్త జనం గూర్చి...కుమారుడి పట్ల భక్తి పారవస్యం లో, ఆ తీవ్రవాదుల పన్నిన కుట్రకు గురి అవుదురేమో అని నా భయం స్వామీ....అమాయకులైన ఆ ప్రజలు మన వల్ల ఇక్కట్లకు గురికాకూడదు అని నా అభిప్రాయం ప్రభూ..
ఆహా దేవీ నిజం గా .'జగజ్జనని' అనిపించావు...ముల్లోకాలకూ తల్లివైనందుకు నీ పిల్లల గురించిన బాధ్యతకు ముగ్ధుడినైనాను..ఇంత కాలం రాక్షసులు మాత్రమే శత్రువులు అనుకున్నాను......ఇప్పుడు అర్ధమైనది...అసలు పాపాత్ములెవరో...వారి భరతం పట్టుటకు మన పుత్రునికి ఇదిగో అత్యంత ఆధునికమైన ఆయుధం ఇది. దీనిని 'గన్' అందురు ఒలంపిక్ మహాయజ్ఞమున అబినవ 'బింద్రా' కు బంగారు పతకము సాధించిన 'గన్' ఇది. దీనిని ఒక్క సారి మీట నొక్కిన వేలాది గుళ్ళు వర్షంలా కురిసి తీవ్రవాదులు అంతమౌదురు..దీనిని ధరించి భూలోకమునకు వెళ్ళి తన పుట్టిన రోజు ఆనందముగా జరుపుకుని, లోక కళ్యాణము చేకూర్చి తిరిగి వచ్చును మన కుమారుడు...
'గన్' ధరించు వాడు కాబట్టి ఇకనుంచి మన కుమారుడు 'గన్'పతి అని పిలువబడతాడు...సర్వేజనా సుఖినోభవంతు....




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

బుధవారం, సెప్టెంబర్ 01, 2010

జగన్నాటక సూత్రధారి

 గోపికల చీరలు దోచిన వాడే...కాపాడమన్న వారికి చీరలిచ్చి కాచాడు..
ధర్మాన్ని బాధించిన వారిని . శిక్షించేది నేనే అని . గీత లో బోధించాడు,,
పదహారు వేలమంది..భార్యలున్న బ్రహ్మచారి..దుష్ట శిక్షణకై వెలసిన చక్రధారి - జగన్నాటక సూత్రధారి




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

మంగళవారం, ఆగస్టు 31, 2010

పక్షపాతం

 పురుషులందరు..స్త్రీ పక్షపాతులే ..ఎప్పుడూ వాళ్ళు .అటు వైపే.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

సోమవారం, ఆగస్టు 23, 2010

హై'జ్వరా 'బాద్

 హై'జ్వరా 'బాద్  


 చెడుతున్న రోడ్లకి..పడుతున్న వర్షాలకి.. కుడుతున్న దోమలకి..జోహార్.
హైదరాబాద్ కాస్తా ఔతోంది  హైజ్వరాబాద్ షహర్.
మలేరియా టైఫాయిడు..మరోటీ.... పేరేదైనా.ఊరేదైనా
జనమంతా మాకొకటే అని సర్వ సమానత్వం చూపుతున్నాయి 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

బుధవారం, ఆగస్టు 18, 2010

రాఖీ అనబడు సిస్టర్స్ డే

 రాఖీ అనబడు సిస్టర్స్ డే

అవును మరి..
వేలంటైన్స్ డే..మదర్స్ డే ఫాదర్స్ డే.ఫ్రెండ్ షిప్ డే లకు అలవాటు పడి పోయిన మనం, ప్రస్తుత జెనెరేషన్ కి ఇలా చెప్తేనే అర్ధమౌతుందేమో. ప్రేమికుల రోజు గులాబీలు..గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు.. ఫ్రెండ్షిప్ రోజున బ్యాండ్ కట్టుకుంటారు. కానీ ఎంత మంది రాఖీ కట్టించుకుంటున్నారో...సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పిన కమెడియన్ కి హీరోయిన్ కట్టినట్టు చూపించి నవ్వుల పాలు చెయ్యడం కాకుండా నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారో మరి.

ఎవరినైనా ప్రేమించచ్చు..ఎంతమందినైనా ప్రేమించచ్చు..పెళ్ళాడచ్చు..మానవచ్చు..లాంటి అనేక సౌకర్యాలున్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దినాలని మాత్రం మనం తూ చా తప్పకుండా పాటిస్తాము..
ఎవడో రాజుకి పైత్యం కొద్దీ ప్రేమలు పెళ్ళిల్లు నిషేధిస్తే త్యాగం చేసినందుకు గుర్తుగా వేలంటైన్ గారి పుట్టిన రోజో ఇంకోటో తెలీదు కానీ అది ప్రేమికుల దినం

మనకి తరతరాలుగా సంప్రదాయం ప్రకారం వస్తున్న పండుగలు.. వ్రతాలు.. పూజలు మాత్రం మనకి ఓల్డ్ ఫాషన్..చాదస్తం.. బుల్ షిట్టు.. పాతకాలం పద్ధతులూను..

శ్రావణ మాసం వస్తోంది..శుక్రవారం వచ్చిందంటే నిండా పసుపు నలుగు పిండి తో వళ్ళు రుద్దుకుని. తలార స్నానం చేసి వచ్చే వాళ్ళు..అది మనకి చాదస్తం..అదే సినీ తారలు వాడే సబ్బులోనో..కాలేజా నేనా అనే ఇంకో సబ్బులోనో మాత్రం టర్మరిక్ మరియు శాండల్ వుడ్ తో చేసిన సబ్బు అని ...ఆ హీరోయిన్ వాడుతోందని (మేకప్ లేకుండా చూస్తే అలా అనుకోరు) రుద్దుకుంటారు ఈ కాలం ఆడపిల్లలు.

కాళ్లకి పసుపు రాసుకుని..వెళ్ళవే అంటే డ్రస్ పాడైపోతుందమ్మా అని చెప్పి తప్పించుకునే పిల్లలూ..

పసుపు మంచి యాంటీ బయాటిక్కు..యాంటీ ఏజింగు ఏజెంటు..మీ హైటెక్కు ..టెక్కుల కన్నా ఎంతో విలువైన .. సహజమైన దివ్య ఔషధం.
వర్షాకాలం లో మనం తిరిగే చోట వర్షం వల్ల వచ్చే బురద నీరు..వరద నీరు.డ్రైనేజీవనది నీరు ల వల్ల ఇంఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది..కాళ్ళు పగల కుండా కాపాడుతుంది.. మృత చర్మం పోయి మంచి నిగారింపు..సున్నితమైన చర్మాన్నిస్తుంది ( ప్యూబిక్ స్టోన్ల తో రుద్దనక్కరలేదు మీ చర్మాన్ని)

చక్కటి పట్టు పావడాలు..లంగా వోణీలు..చీరలు...మన అందాన్ని ఇంకా పెంచుతాయే తప్ప మిడీలు ..మినీలు లాగా చూపించవు..
అందం పొగడాలనిపించేలా ఉండాలి తప్ప తడమాలనిపించేలా ఉండకూడదు.             (మరీ ఇంత పచ్చిగా చెప్పవలసి వచ్చినందుకు బాధగానూ సిగ్గుగానూ ఉన్నా తప్పలేదు)

ఇప్పటికే మన పండగలు అంటే హాలీ డేస్ గానూ ఆగస్ట్ ఫిఫ్టీంత్..అక్టోబర్ 2 అంటే నాన్ వెజ్ దొరకని రోజులు గా మారుతున్న ఈ తరుణం లో... eజెనెరేషన్ పిల్లలకి మన పండగల పరమార్ధం తెలియజేయకపోతే..కొన్నాళ్ళకి మనకి న్యూ యేర్ తప్ప మరేదీ మిగలదేమోనన్న దిగులుతో.





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

గురువారం, ఆగస్టు 12, 2010

నీకేమి తెలుసు..నిమ్మకాయ పులుసు

నీకేమి తెలుసు ..నిమ్మకాయ పులుసు

రక్తం అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారు....జీవితా రాజసేఖర్

రక్త దానం గురించి మాట్లాడితే నాలుక కోస్తా--అల్లు అరవిందు

తెలంగాణా అడ్డుపెట్టుకుని వేల కోట్లు గడించాడు కే సీ ఆర్ - హరికృష్ణ

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.పరువునష్టం దావా వేస్తా - కే సీ ఆర్

తండ్రి వల్ల జగన్ ఆస్తులు కూడబెట్టాడు  --ఈనాడు
ప్రజల ఆస్తి మార్గదర్శిలో పెట్టి మోసం చెసాడు రామోజీ రావు - సాక్షి
శని వారం - భారత్ నంబర్ వన్ క్రికెట్ టీం
మనగళ వారం - 98 పరుగులకే ఆలౌట్ 200 పరుగుల తేడాతో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
హా...కీ...
ఐ హెచ్ ఎఫ్ నే గుర్తిస్తాం..హాకీ ఇండియా నే సరైనది...
కామన్వెల్త్ క్రీడల పై క్రీనీడలు..పూర్తి కాని స్టేడియాలు...కొలిక్కిరాని స్పాన్సర్షిప్పులు
అభివృద్ధి పధం లో ముందుకు పోలేక పోయినా
బెల్టు షాపులతో నడుం బిగించి మందుకు పోదం అంటున్న ప్రభుత్వం
గవర్ణమెంటు ఆసుపత్రి..బడి..ఆఫీసు ఉన్నా లేకపోయినా వీధి వీధి కి....ఇంటి ఇంటి కీ మధ్య మధ్యం దుకాణం మా వరం...

ఇవి రోజూ వారీ హెడ్ లైన్లు.. కాకపోతే ... సగటు ఆంధ్రుడు..రోజూ సీరియల్ లాగా న్యూసు చూసేసి..ట్విస్ట్ లు చూసి..ఇది మామూలే అనుకుని..మళ్ళీ తన పని లోకి తాను...పోనీ ఏదైనా ఎవరినైనా అడుగుదామంటే..అతనికి ఎదురయ్యే ప్రశ్న

నీకేమి తెలుసు..నిమ్మకాయ పులుసు








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

మంగళవారం, ఆగస్టు 10, 2010

గడియారం

టిక్ టిక్ లో ఎంతో అర్ధం దాగుంది క్విక్ క్విక్ అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఇది ముళ్ళ ప్రపంచం కలిసే ప్రయాణం చేస్తున్నా ఎవరి పని వాళ్ళదే

ప్రపంచం ఎటుపోతున్నా..తన మార్గం తప్పకుండా తన పని తను చేసుకుపోయే గడియారం
చిన్న పెద్ద అనేది పని ని బట్టే కానీ పరిమాణం బట్టి కాదు అని తెలిపే చిన్న ముల్లు మనకి ఆదర్శం




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

సోమవారం, ఆగస్టు 09, 2010

ఢాం సీను

 ఢాం సీను


డాన్ సీను పేలింది..
ఉచ్చ పోసే ప్రతీ వాడూ మగాడు కాదురా..శ్రీహరి
కోసి కారం పెడతా -- శ్రియ
ఇల్లాంటి డైలాగులతో డాన్ సీను సినిమా మారుమోగి పోయింది.


మాస్ అంటే బూతు అనో..ఏమిటో మరి ఆవిధం గా శలవిచ్చారు మరి. మొదటి రోజే సినిమా చూసినా ..కోలుకోవడానిక్ రెండు రోజులు పట్టింది రాయడానికి. ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల సిగ్గుతో చితికి పోయి..మళ్ళీ జన జీవన స్రవంతి లోకి రావడానికి కొంచెం టైం పట్టింది.
చిన్నప్పటి నుంచీ సినిమాలు చూసి చూసి  డాన్  అవ్వాలని కోరికతో సినిమా హాలు లో రీళ్ళు చుడుతూ పెరిగిన మనిషి పెద్దయ్యేసరికి నిజం డాన్ లను గడ గడ లాడించేతాడు.


అదేంటో కోన వెంకట్ గారి అన్ని సినిమాలలో డాన్/విలన్ చెల్లెలుని ప్రేమించి వాళ్ళింట్లోనే ఉంటూ డాన్ లని పిచ్చోళ్ళని చేస్తూ ఉండే స్టోరీనే ఉంటుంది..సెకండాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ మామూలే..
దుబాయ్ నుంచీ ఇండియాని గడ గడ లాడిస్తూ..కమీషన్ ఎక్కువడిగాడని దేశాద్యక్ష్యుణ్ణే కాల్చేసిన డాన్ దగ్గర .. ప్రతీ దానికి కంఫ్యూజ్ అయ్యే బ్రహ్మానందం ఎలా బతికి బట్టకట్టి, ఇండియా వచ్చి..అప్డేట్స్ ఇస్తాడో ఆ కోన వెంకటుడిఏ తెలియాలి. చివర్లోనూ డాన్ సీను ఫైట్ చేస్తుంటే..జీపు వెనకాల దాక్కొని భయం భయం గా చూసి..చివరికి దుబాయ్ పారిపోతాడు..


శ్రియ గారు పాపం  ఒళ్ళు దాచుకోకుండా చాలా కష్టపడి ..తన సెకండ్ ఇన్నింగ్సు ప్రారంభించింది..మరో హీరోయిన్ పేరు తెలియలేదు..వీలైనంతవరకు..హీరో హీరోయిన్ లను కలిపే ప్రయత్నం చేసి..మధ్యలో హీరో గారు I love you చెప్పగానే బీచుకెళ్ళి పోయి కిందా మీదా పడుతూ పాటందుకుంటుంది..చివర్లో అడక్కుండానే.. త్యాగం చేసేస్తుంది..


మధ్యలో అమితాబ్ గారు సలహాలిస్తూ కూడా కనిపించారు...పాత సినిమాల్లోని బిట్లు..


గుప్పుమన్నదా మన్మధ గంజ
కోరుకోవే నా కౌగిలి పంజ
వంటి అద్భుత ప్రయోగాలతో మాస్ పాటలు కూడా ఉన్నాయి...


నాకు సినిమా చూడ్డం రాదని తేలిపోయిందోచ్








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

గురువారం, ఆగస్టు 05, 2010

కోడి


తెల్లారగానే కూసిందని
మధ్యాన్నానికి కోసారు
ఉదయం గడియారం  సాయంత్రం పలహారం
పొద్దుటి కోడి రాత్రికి పకోడి



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

శనివారం, జులై 24, 2010

మర్యాద జక్కన్న

మర్యాద రాజన్న..మర్యాద జక్కన్న...మర్యాద రామన్న
 ఏమనాలో తెలీదు కానీ...చాలా కాలం తరువాత ఫ్యామిలీతో అంటే..అమ్మా నాన్నా భార్యా బిడ్డా కలిసి కాసేపు హాయిగా నవ్వుకునే సినిమా చూసిన ఫీలింగు కనిపించింది..అనిపించింది..ఈ సినిమా చూసినంత సేపూ..

మగధీర లేకాదు మర్యాద రామన్ననూ తియ్యగలను అనిపించుకున్నాడు జక్కన్న ఉరఫ్ స్యూర్ సక్సెస్ రాజమౌళి.

ఎంత సేపు కడప లో మొదలయ్యే కధలు..టాటా సూమోలు పేలడం..కత్తులు బాంబులే కాదు గడపలోపల జరిగే మర్యాద..మర్యాదకు..ఆచారానికి వాళ్ళిచ్చే మర్యాద..బాగా చూపించారు.

తెలుగు అమ్మాయి కాకపోయినా రాజమౌళికి చిక్కిన జక్కన్న  చెక్కిన సలఒని బాగానే ఉంది..ఎక్స్పోజింగు కాదు ఎక్స్ప్రెషన్ ముఖ్యం అని గుర్తించిన అతి కొద్ది మంది డైరెక్టర్లలో రాజమౌళి ఒకడు..అతి అనిపించకుండా శృతి మించకుండా,,అందం గా చూపించారు..

ప్రభుదేవాకే డ్యాన్స్ నేర్పిన సునీల్ డ్యాన్సులు బాగా చేశాడు..

పౌరుషాల కోసం చంపుకోవడమే కాదు..ఆచారం కోసం మర్యాద కోసం విలువనిచ్చే కొత్త కడపని చూపించారు..ఏంటో చాలా కాలం తరువాత ఒక సినిమా గురించి పాజిటివ్ గా రాసేస్తున్నా..

ట్రైన్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదనిపించింది...ఈ చిత్ర రచయిత కాంచీ గారు ఉన్న కాసేపూ బాగా నవ్వించారు..

పాపం బ్రహ్మాజీ ఏమయ్యాడో లాస్ట్ లో అర్ధం కాలేదు..చావు వెంటపడుతుంటే ఎక్కడ లేని శక్తి వస్తుందని...టాటా సూమోని డామినేట్ చేసే సైకిల్ చేజ్ చూపించింది..

మొత్తానికి సునీల్ పారిపోవడానికి తిరిగినన్ని మలుపులు లేకుండా..వర్షం పడ్డప్పూడు హైదరాబాదులోని రోడ్లంత గతుకులు అతుకులు లేకుండా..స్ట్రైట్ గా నీట్ గా ఉన్న మర్యాద రామన్న...నాకు నచ్చింది..మా ఇంట్లో నలుగురికీ నచ్చింది.
ఫార్ములా ప్రకారం..ఓ మమైత్ ఖాన్ పాట..రెండు టాటా సూమో బ్లాస్ట్లు..లేకుండా..ప్రశాంతం గా తీసిన ఈ సీమ సినిమా 500 వందల ఏళ్ళు పూర్తి చేసుకున్న "రాయలు "వారు ఏలిన రాయల సీమ పై వచ్చిన ఓ మంచి సినిమా గా చెప్పుకోవచ్చు..ఇంటిల్లిపాదీ చూసెయ్యొచ్చు..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

బుధవారం, జులై 21, 2010

No Leaf - No Life




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails