Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్

 నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్ 

ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, డిసెంబర్ 15, 2009

జై ఆంధ్రా - జై తెలంగాణా

 జై ఆంధ్రా - జై తెలంగాణా  

బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.

ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?

ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?

ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, నవంబర్ 30, 2009

ఆర్యా థూ

 ఆర్యా థూ
దీనికి ఇంతకన్నా మంచి పేరు నాకు తోచలేదు. ఒక అద్భూతమైన  ముక్కోణపు ప్రేమ-స్నేహం-పైత్యం-త్యాగం-మూర్ఖత్వం- ల సమ్మేళణం గా మలచిన విచిత్ర రాజం అనిపించిన సినిమా.

అసలు ఆర్య లోనే ఆ పాయింటు అర్ధం కాక తికమక పడ్డా. ఇప్పుడు ఈ రెండో భాగం చూశాక అసలు వీళ్లకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అని అర్ధం కాలేదు.

ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు.అంటే ఒకళ్లకోసం ఒకళ్లు ప్రాణాలిచ్చేంత అని అపార్ధం చేసుకోకూడదు. వాళ్ల విచిత్ర స్నేహం తో మన ప్రాణం తీస్తారని అర్ధం. హీరో ఎవరికీ తెలీకుండా తాగిన, వాగినా, జనాల్ని కొట్టినా, సైటు తిట్టినా, హీరో కాబట్టి గ్రేటు..ఆయన గ్రేట్ నెస్ చూపాలంటే ఇంకోణ్ని వెధవని చెయ్యాలి. అంత ప్రాణ స్నేహితులు..ఎప్పటికప్పుడు హీరో ఫ్రెండు చెడ్డవాడిగా పనికిరానివాడిగా, చూపిస్తూ హీరోగారు మాత్రం మిస్టర్ పెర్ఫెక్త్ గా నిలుస్తుంటాడు. ఆయనంటే ఎంత గురి అంటే..హీరో లిఫ్టులో ముద్దు పెట్టాడు అని హీరోయిన్ చెప్పినా అదేదో టీ వీ లో టెలి బ్రాండ్ ఎడ్వర్టైజ్ మెంట్ లా చూసి నవ్వుకుని వెళ్లిపొతారు. ఆయన మాత్రం ఎంచక్క లేడీస్ టాయ్లెట్ లోకెళ్ళి మందు కొట్టి, ఆవకాయ నంచుకుని..బయటకొచ్చి బుడ్డిమంతుడు సారీ బుద్ధిమంతుడిలా నుంచుంటాడు..ఇక్కడా హీరోయిన్ పాపం బకరీ అవుతుంది..వీరి పైత్యానికి సపోర్ట్ గా బ్రహ్మానందం బ్యాచి, ఓ ముసుగు కారు,,మరిన్ని వింతలు..

ఇక హీరోగారు, హీరో ఫ్రెండు గారు సిగరెట్ మీద సగం సగం పేరు రాసుకుని..సగం సగం పంచుని, తాగుతూ, ఆ బూడిద మనమీద వేస్తుంటారు. ఒక సిగరెట్ తాగినట్టుగానే ఒక అమ్మాయినే ప్రేమిస్తారు. చివరికంటా సిగరెట్టులానే మార్చి మార్చి పంచుకుంటారు. స్నేహం కోసం ఏమైనా చేసే..మన హీరో గారు హీరోయిన్ ను ఫ్రెండ్ కి అందించడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. మామూలుగానే ఫాక్షన్ లీడర్ గారైన హీరోయిన్ తండ్రిగారు...తాను మీ అమ్మాయి ప్రేమికుడిని అని చెప్పినా హీరోని ఏమీ అనక పోగ..అప్పట్నుంచీ హీరో ఏం చెబితే దానికి తల ఊపి, పెళ్లి చెడిపోయిన తరువాత తన కూతుర్నిచ్చి పెళ్ళికూడా చేస్తాడు.
ఇక ఇక్కడనుంచీ హీరో గారి హీరోయిజం ముందు మన భారత దేశం, మన సంప్రదాయం, పెళ్లి పై ఉన్న అభిప్రాయం, ఇవన్ని చిన్నబోతాయి. పెళ్లి చేసుకున్న తన భార్య ఐన ప్రియురాలిని..ఫ్రెండుకిచ్చి పంపించేసి మామ గారింటికి వెళ్లి పోతాడు మన హీరోగారు. ఫ్రెండుని ప్రియురాలిని అమెరికా పంపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసేసి..పాపం ఫ్రెండు సిగరెట్టు మానెస్తాడేమో అని సగం సిగరెట్ట్లు తాగెసి పోగేసి హీరోయిన్ కం ప్రియురాలికి గిఫ్టు ఇస్తాడు. ఆ త్యాగం, చూసి చెలించిన చెలి అదేనండీ ప్రియురాలు తండ్రికి ఫోను చేసి పిలిపిస్తుంది..ఫ్రెండు ని పొడవబోయి అల్లుణ్ణి పొడుస్తాడు.
హాస్పటల్ లో జ్`నానోదయం అయిన ఫ్రెండు ప్రియురాలిని భర్తకి ఒదిలేసి కధ సుఖాంతం చేస్తాడు. ఆహా ఆక్సిజన్ సిలిండర్ ఆపినా బతికే హీరోగారు..ఎవర్ని ప్రేమించిందో తెలీని హీరోయిన్ కలిసిపోతారు. గ్రేట్ ఐడియా...

రింగ రింగ పాటలో అర్ధం బాగాలేదని గొడవ చేసిన.. వారికి  ..సినిమా చూస్తే ఇంక ఏమనిపిస్తుందో..మరి. అసలు సెన్సార్ అన్నది ఉందా. వారి పనేంటో..సినిమాలో సీనులు చూసి దాని బట్టి సర్టిఫికేట్ ఇవ్వడమేనా..ఇలాంటి అద్భుతాలు కనిపించినప్పుడు పట్టించుకోరా. హీరోలు...దర్శకులు వాళ్లకేది అనిపిస్తే అది తీసేసి జనం మీదకి తోసెయ్యడమేనా..పాట లో మార్పులు చేసారు.సినిమాలో, కానీ అప్పటికే విడుదలైన సీడీల మాటేమిటి..ఇక నుంచీ ఆడియోకి కూడా సెన్సారుండాలా విడుదల కి ముందు ఎవరైనా విని ఓకే చేసే పరిస్థితి వస్తుందా.? అసలు పైత్యానికి పరాక్ష్టగా ఉన్న వీళ్ల ఆలోచనలు ఎప్పుడు మారతాయో..ఎనిమిదేళ్ల అబ్బాయి ఏదో రసాయన చర్యలతో పెద్దగా ఐపఓయి. పెళ్ళి చేసుకుని, ఒక పూట చిన్నగా, ఒక పూట పెద్దగా ఉండే లాంటి కధలల్లే అపర మేధావులు, స్నేహం కోసం భార్యని త్యాగం చేసే మిస్టర్ పెర్ఫక్ట్ గార్లు, అబ్బ తెలుగు సినిమా పతాకం ఎక్కడో రెప రెప లాడుతోంది. రేపటి రోజు సినిమా తలుచుకుంటే భయమేస్తోంది.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఆదివారం, నవంబర్ 15, 2009

పేరంటం



ఆదివారం కదా అని హాయిగా లేటుగా నిద్ర లేచి...వాకిట్లో కూచుని పేపర్ తిరగేస్తున్నా.ఈలోగా..పట్టుచీరలు కట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు పొలో మంటూ పది మంది వచ్చారు. మా ఆవిడ స్నేహితులేమో అనుకుని..లోపలకొచ్చి మా ఆవిణ్ణి పిలిచా. ఆ వచ్చిన వాళ్ళు, మా ఆవిడకి బొట్టుపెట్టి, రవికల గుడ్డ పెట్టి ఇంకేదో చెబుతున్నారు. మా ఆవిడ నన్ను పిలిచింది. ఏంటో అనుకుని నేను బయటకెళ్ళా. వాళ్ళలో ఒకరు..అన్నయ్య గారూ..మీరూ తప్పకుండా రావాలి. వొదిన్ని..బాబాఇగారిని తీసుకురావాలి. మర్చిపోవద్దు. అంటూ పొలోమని వెళ్ళి పోయారు...ఏదో గాలి దుమారం లా. నాకేమీ అర్ధం కాలేదు. ఆడవాళ్ళ ఫంక్షన్ కి నేనేమిటీ అని అడిగా మా ఆవిణ్ణి.కిసుక్కున నవ్వింది మా ఆవిడ.


ఆ వచ్చింది పేరంటానికి పిలవడానికి కాదండీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఓటెయ్యడానికి అని అసలు రహస్యం చెప్పింది. ఔరా అనుకున్నా. ఇంతలో దూరంగా మరో బాచ్ వస్తుంటే .. భయపడి బాత్రూం లో చేరా...


బయటకొచ్చాక మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ..ఆవిడిచ్చిన (అదే పిలుపులకొచ్చిన ఆవిడ) ఫాంప్లేట్ చూశా. ఒక పక్క వాళ్ళాయన ఫొటో ..మరో పక్క ఆవిడ ఫొటో ఉన్నాయి. ఆయన మా కాలనీ చుట్టుపక్కల ఓమాదిరి పేరున్న లీడరే..ఏమైనా గొడవలూ గట్రా ఐతే  ఆయన తప్పకుండా అక్కడుంటాడు..ఐతే గోడవ తీర్చడానికి లేకపోతే గొడవపడుతూనో ఉంటాడు..ఈ మధ్యే ఒక ఆటో డ్రైవర్ ని ఐదు రూపాయలు ఎక్కువడిగినందుకు పళ్ళూడగొట్టి.అవినీతి పై తన ప్రతాపం చూపించిన మహా లీడర్ ఆయన. ఆయనకి మా కాలనీలో ఒకటి బయటింకెక్కడో మూణ్నాలుగు వైన్ షాపులున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. మరి ఏకంగా ఆయనే నుంచోకుండా..వాళ్ళావిణ్ణి ఎందుకు నుంచో పెట్టాడా అనుకున్నా. ఈ నియోజకవర్గం లో స్త్రీల రిజర్వేషన్ ట .. గెలిచేది ఆవిడే అయినా పాలన వారిదేనట..ఇంకొన్ని కాంట్రాక్టులు ఈజీ గా రావడానికి వీలుగా మనమె మెంబరైపోతే ఇంకా హాయి గదా అని.ఇలా.....


సరే ఆ విషయం వదిలేస్తే ఓటెవరికి వెయ్యాలో అర్ధం కావట్లేదు. మొన్నటిదాకా కలిసున్న తెలుగు దేశం. టీ ఆర్ ఎస్ విడిపోయారో కలిసే ఉన్న్నారో అర్ధం కావట్లేదు. చిరంజీవి తప్ప మరెవరు ఆ పార్టీయో అర్ధం కాని ప్రజా రాజ్యం...లోక్ సత్త జయ ప్రకాష్ దీ అదే పరిస్థితి...ఇక వై ఎస్ లేని కాంగ్రెస్. ఎవరు ఎవరితో కలిసున్నారో..కలిసి లేరో..ఏది మిత్ర పక్షమో..ఏది ప్రతిపక్షమో..అసలు తెలీట్లేదు.


పాత బట్టలకి స్టీల్ సామానిస్తాం, సత్తుబిందెలకి మాట్లేస్తాం.,అంటూ అరుస్తూ తిరిగే వాళ్ళలా ఎలక్షనప్పుడు మీ రోడ్లు బాగుచేస్తాం..మంచినీళ్ళిప్పిస్తాం, ప్రాబ్లెంస్ తీరుస్తాం, అంటూ వీధి వీధి..ఇల్లు ఇల్లు తిరిగి చాటింపు వేసే వీళ్ళు గెలిచాక ఎక్కడుంటారో..ఏం చేస్తారో తెలీదు. పెద్ద వాళ్లంతా ఎసెంబ్లీలో కొట్టుకుంటుంటే..వీళ్లంతా ఇక్కడేమో..ఏంటో ఈ ఎలక్షన్ లేమిటో.ఈ గొడవలేమిటో.


ఫ్లై ఓవర్ లు కూలితే తప్పు అవతల వాళ్లది.బాగుంటే ఘనత మనది..మినిస్టర్లు..సినిమా వాళ్ళు తిరిగే రోడ్లు అద్దాల్లా ఉంటాయి..,,మిగతావి అధ్వాన్నం గా ఉంటాఇ.. మళ్లీ విదేశాల్లో సర్వేలు.నివేదికలు..బడ్జెట్లు...గొడవలు..ఓకే అయ్యే నాటికి మళ్ళీ ఎలక్షన్ లు..షరా మామూలే..ఓకే మీరెళ్ళే సరికి మీ ఓటుంటే వేసి రండి...






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, నవంబర్ 14, 2009

యాక్ నిరంజన్

 యాక్ నిరంజన్
ఈ సినిమా మొదటి రోజునే చూసేసా. కానీ తేరుకుని ఈ పోస్టు రాయడానికి ఇన్ని రోజులు పట్టింది. అసలు వీళ్ళేమనుకుంటారో అర్ధం కాదు. బిల్లా సినిమాలో హీరోయిన్ లకి బికినీలేసి సారేమో తెల్ల సూట్లేసుకుని మలేసియానో అదేదో దేశం లో అటూ ఇటూ తిరిగాడు..ఇందులో ఏకంగా బేడీలు బొడ్లో దోపుకుని రౌడీల వెంటబడతాడు. ఏమిటో అంతా జగన్నాధుని మాయ.

నేను బాగా చూసి అర్ధం చేసుకున్న విషయం ఏమిటంటే ,.ఈయన చిన్నప్పుడు అంటే కొంచెం పెద్దయ్యాకే..ఏ పోలీసు ఉద్యోగం కోసమో ట్రై చేశాడు ...కానీ అది రాలేదు..అని. ఎందుకంటే ..ఈయన గారి మొదటి సినిమా..బాచి లో జగపతి బాబు పోలీసు...(అనచ్చోలేదో) అమెరికా స్టైల్లో తెల్లటి డ్రస్సు..చొక్కాకి రెండు తుపాకులు .....ఊ అంటే అది తీసి ఆయన ఫైరింగు. ఇక ఇడియట్ లో ఐతే ఆయన మోటో పోలీసు ఆఫీసర్ అవడమే..పోకిరి డిటో ఆల్రెడీ పోలీసు..కానీ పోకిరి..ఇప్పుడు ఇందులో చిన్నప్పడు ఒకణ్ణి పట్టించి.ఒకరూపాయి అందుకున్న పాపానికి (మన పాపానికే) పెద్దయ్యేసరికి పోలీసు ఇంఫార్మర్ గా(దీనికి సార్ ఇంకేదో పేరు కూడా పెట్టాడు) బేడీలు కూడా వేసే స్థాయిలో  మన హీరోగారు. హీరోయిన్ సరే సరి పాపం గిటారు నేర్పుతూ ఉంటుంది కొంత మంది పిల్లలకి..చాలా పేద పిల్ల కావడం వల్ల పాతిక వేల రూపాయల గిటారు కొనుక్కోవాలి కాబట్టి చిన్నప్పటి గౌన్లు అవీ వేసుకుని..గిరజాల జుట్టూ...కెనెటిక్ బండీ (సుమారు నలభై వేలుండదూ)
అన్నని చితక్కొట్టి జైల్లో పడేసిన హీరోగారి ప్రేమలో పడి..ఇంక ఆ తరువాత ..!!!!

సొంత గాంగులో వాళ్లని కూడా సరదాకో..దురదకో..ప్రాక్టీసుకో..పైత్యానికో చంపేసే విలన్ గారు మన హీరోగారు ఎన్నిసార్లు..ఏమి చేసినా..ఊరుకుని..చివరివరకు  తన్నులు తింటుంటాడు. ఆలి లేని లోటు తీరచాడు సినిమాకి.
తల్లిని ఏదో అనడం...చెయ్యడం..తండ్రిని చంపడం..లాంటివీ షరా మామూలే.వీరి సినిమాలో..
ఇంకో ట్విస్టు...అసలే రకరకాల ప్రాబ్లెంసు..వీసా గొడవలు..విదేశీ ప్రయాణాలూ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో..హీరోగారికి ఫోనొచ్చిన మరుక్షణం పోలీసులకో ఇంటర్పోల్ వాళ్లకో అన్నట్టుగా...మరుక్షణం సార్ బాంకాక్ లో ప్రత్యక్ష్యం. ఆదిత్యరాం టికెట్ పెట్టినా...వీసా పాస్పోర్ట్ ఎవరిచ్చారో ? మరో వింతేమిటంటే బాంకాక్ లో పబ్బులో మైకేలు జాక్సన్ గారికి తెలుగు నివాళి.ధన్య జీవి,,,మన పూరీ గారికి మైకేలంటే చాలా ఇష్టమట..అందుకే వాళ్లింట్లో రెండు కుక్క పిల్లల్లో ఒకటి జాక్సన్ మరోటి మైకేలూను. బాగు బాగు....భౌ భౌ సంగీత సార్వాభౌ ' ముడు కదా.

హీరో అనగా...చింపిరి జుట్టు..మాసిన గడ్డం,,,,చదువు సంధ్య లేకపోవడం...సిగరెట్టు..మందు కొట్టడం..దేవుణ్ని నమ్మకపోవడం..దొరికిన వాణ్ని తన్నడం...వగైరా పూరీ మార్కు హీరో లక్షణాలన్ని ఉన్న యాక్ నిరంజన్ కు జోహార్.



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

బుధవారం, నవంబర్ 11, 2009

షిఫ్ట్ డెలిట్




షిఫ్ట్ డెలిట్
కంప్యూటర్ వాడేవారందరికీ ఇది తెలిసే ఉంటుంది..షిఫ్ట్ డెలిట్ అంటే పెర్మినెంట్ గా తొలగింపు అని...
హస్తినా పురం లో అడ్మినిస్ట్రేటర్  మాత ..ప్రస్తుతం అదే చేసినట్టున్నారు?
వై ఎస్ ప్రోగ్రాం సడెన్ గా క్రాష్ కాగానే...వెంటనే రన్ అవుతుందనుకున్న సబ్ ప్రోగ్రాం జగన్ సాఫ్ట్ వేర్ కి టెస్టింగ్ కాలేదని..ఓల్డ్ వెర్షన్ ఐనా రోశయ్య టూల్ నే ఎంచుకున్నారు.

మాటి మాటికి సీ ఎం వెర్షన్ మార్చే కాంగ్రెస్ లో .. మార్పు అవసరం లేకుండా నెట్టుకొచ్చిన ఆపరేటింగ్ సిస్టం వై ఎస్. కొత్తగా తెచ్చిన..ప్రోగ్రాం లు.. ఇంకా కొన్ని సబ్ ప్రోగ్రాం లు.. ఇందిరా రాజీవ్ ల పేరున తయారు చేసిన స్టైల్ షీట్లు..ఒకటేమిటి..మళ్లీ ఏ ఆపరేటింగ్ సిస్టం అవసరం లేకుండా..నదిపించేసాడు...పాద యాత్రలు అలవాటు కదా.కానీ సడెన్ గా క్రాష్ అవడం తో..ప్రస్తుతం అగమ్యగోచరం అనుకుంటున్న తరుణం లో రోశయ్య రూపంలో ఓల్డ్ వెర్షన్ దొరికింది..కాంగ్రెస్ సెర్వర్ కి.

చూద్దాం  ఏం జరుగుతుందో..



గురువారం, నవంబర్ 05, 2009

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, అక్టోబర్ 30, 2009

రాజీ నామా

 రాజీ నామా
ఏమిటి సీ బ్లాకు దగ్గర హడావిడి..కెమేరాలు..పాత్రికేయులు..న్యూసెన్స్ చానెళ్ళు అంతా విడి విడి గా..కలివిడి గా హడావిడి..మాట్లాడేసుకుంటున్నారు. మళ్ళీ ఏ బిల్డింగైనా కాలిపోయిందా..కూలిపోయిందా అని డౌటొచ్చేసింది..కాదు కొండ గురించిన మాటలు జరుగుతున్నాయక్కడ.

ఇది మార్పుల వేళయనీ..జగనన్న మాసమనీ తొందరపడి ఒక కోయిలా డిజైను చూసింది...రెజైను చేసింది...వెనకాల బాక్ గ్రౌండులో పాట వినిపిస్తోంది.

కానీ,,ముఖ్య మంత్రి గారు మాత్రం...

లేదు..కాదు..తెలీదు..ఇదేలే గవర్నమెంటాఫీసులో రెడీమేడ్ సమాధానం
ఏ ఫైలు ఎక్కడుందో చెప్పడం ఒక పెద్ద అవధానం
సంతకానికీ పంపకానికీ మధ్య ఒఖ్ఖ ఏడాదే వ్యవధానం
వాళ్ళు నిత్యం పాటించే సూక్తి "నిదానమే ప్రధానం "

ఇది మన రోశయ్య గారికి బాగా వొంట పట్టినట్టుంది. ఇనుమైనా వేడిమీద ఉన్నప్పుడు కొడితే పనౌతుంది..చల్లారాక వంచడం కష్టం అని తెలుసు కాబట్టి...నెమ్మదిగా..వేడి తగ్గేదాకా ఆగారు...ఇప్పుడు సోనియా ఆశీస్సులతో నెట్టుకొచ్చేస్తున్నారు.

రాజీనామాల పేరుతో ఎదిరించిన వారూ బెదిరించిన వారూ..కూడా ప్రస్తుతం రాజీ మార్గం పట్టి..సోనియా ఏం చెప్తే అదే అంటున్నారు..కొండకు దారమేస్తే..కొండా సురేఖ రాజీనామా దాకా వచ్చింది..కదా మరి
వై ఎస్ మరణం తరువాత వేడెక్కిన రాజకీయాల మీద వరద పోటు రావడం వల్ల చల్లారిపోయి..జగన్ భవిష్యత్తు సీ ఎం గా మిగిలిపోయాడు..ప్రస్తుత....మౌనమే దానికి 'సాక్షి '.

ఏం మంత్రి గారు,,మీరెటు ? ఆ చేతిలోది ఏమిటి...
ఔను రాజీనామా నే కాకపోతే...రాజీ అని నామానాన నేను పని చేసుకు పోతాను అని రాశా..అంతే...
అవతల ముఖ్యమంత్రిగారి మంత్రివర్గ విస్తరణలోగా ఈ కాగితం అందకపోతే..ఇక నేనూ ఇంటికి మార్గం పట్టాల్సిందే..అనుకుంటూ హడావిడిగా ఎవరికి వారు విడి విడి గా విడిది గృహం బయలుదేరారు.
గవర్నరు గారు రెడీ గా ఉన్నారా ప్రమాణ స్వీకారం చేయించడానికి..మళ్ళీ చానెల్స్ కి బోల్డంత..న్యూసు..మనకి న్యూసెన్సు...చూస్తూనే ఉండండి ,,,మాకు తోచింది చూపిస్తాం...



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, అక్టోబర్ 23, 2009

గెలిచిన వేళనే చూడాలీ

 గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
 
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.

నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.

ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.

ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు.  రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '

జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..

నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, అక్టోబర్ 19, 2009

దివాళీ


 దివాళీ
హ్యాపీ దివాళి అంకుల్...ఎప్పుడూ పలకరించని మా పక్కింటి అబ్బాయి చెప్పగానే ఒక్క సారి ఆస్చర్యపోయా...క్రికెట్ బంతి మా బాల్కనీ లో పడితే ఇంక తిరిగి ఇవ్వనని నా మీద కోపం వాడికి...ఐనా ఎందుకు చెప్పాడో లే అని నేనూ హ్యాపీ దివాలి అన్నా..'ఢాం' అని పెద్ద  శబ్ధం తో నా కాళ్ల దగ్గర పెద్ద శబ్ధం..ఉలిక్కి పడి ఆమడ ఎత్తు పైకెగిరి పడ్డా...పక్కన చూస్తే వాడు లేడు..

టీ వీ లో మంచి సినిమాలొస్తాయి చూద్దామంటే 100000వాలాట ఒకటే సౌండు...అసలే అపార్టుమెంటు...కూలుతుందేమోనని బెంగ.

ఎవడో కావాలని వేసిన రాకెట్టు తో పైన ఆరేసిన బట్టలన్నీ కన్నాలు..

లక్ష్మీ బాంబు పేలడం వల్ల బీటలిచ్చిన కిటికీ అద్దాలు.నానా భీభత్సం..కానీ మరోఅ    పక్క మళ్ళీ.హ్యాపీ దివాళీ అంటూ ఒకటే పలకరింపులు...ఎస్ ఎం ఎస్ లు..ఫోన్ కాల్సు..ఆ హా హ్యాపీ గానే ఉంది దివాళీ. ఎందుకంటే క్రాకర్సు కొందామంటే..ఆకాశం లో ఆగిపోయిన చంద్రయాన్ ఉపగ్రహం దగ్గర తచ్చాడుతున్న రేట్లు ...పంచదార దొరక్క చప్పబడిన స్వీట్లు..వరదల వల్ల కరకట్టలకి పడ్డ తూట్లు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విసేషాలు.

ఇది వరకైతే..ఎంచక్కా..కాగితాలు గొట్టాలు చేసి ఎండబెట్టి..బొగ్గు..సురేకారం, ఇంకా కొన్ని..సామాను తెచ్చి కలిపి  .తారాజువ్వలు..మతాబులు..పిచ్చికలు..సిసింద్రీలు..సీమ టపాసులు..తాటాకు బాంబులు..వగైరా వగైరా..(వయాగ్రా అని చదవకండే) స్వయంగా తయారు చేసిన.చేసిన దీపావళి సామానుతో పక్కింటోళ్ళతో పోటీ పడుతూ..హాయిగా పాటలు పాడుతూ ..సరదాగా గడిచేది..ఇంట్లో అందరూ పూజ చేసి కొత్తబట్టలు కట్టుకుని ..ఆ రోజులే వేరు.

ఇప్పుడో..అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో కూడా తెలీదు. ప్రజలను కాపాడడానికి భూదేవి దుష్టుడైన తన కుమారుణ్ణి...సత్యభామ అవతారంతో వధించి తద్వారా మనకి ఆనందమయ జీవితాన్ని అందించింది కాబట్టి...అమావాస్య చీకటి వదిలి కాంతులీనే వెలుగు ప్రసరించడానికి ఈ పండగ..ఏర్పాటైందని ఎందరీ తెలుసోఅ...మరి.

మనం మాత్రం..వెలుతురొచ్చేవి వదిలేసి....చెవులు చిల్లులు పడే సౌండొచ్చే బాంబులు..లడీలు...దిక్కుమాలిన పేర్లు గుండెలవిసే సౌండ్లు..ఉన్న వాటితోనే మన దివాళీ...
ఎన్ జాయ్...ఎన్ జాయ్


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, అక్టోబర్ 10, 2009

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....


అదే సామెత గుర్తొస్తోంది...ప్రస్తుతం ఆంధ్ర పరిస్థితి చూస్తుంటే..ఒక పక్క ఇళ్ళు మునిగిపోయి జీవనం అస్తవ్యస్తమై పోయి జనం బాధ పడుతుంటే...
టీ వీ చానెళ్ళ వాళ్ళు ---అధికారులు స్పందించలేదు..జనం కష్టాలు పడుతున్నారు..దొంగల భయం..అదీ ఇదీ అంటూ కధనాలు...ఇప్పుడు ఏ ప్రాంతం మునుగుతుంది..ఏది తేలుతుంది..కాంగ్రెస్ వాళ్ల వల్లేనా ఇది అంతా అంటూ చర్చా కార్యక్రమాలు. ఒక్కళ్ళైనా...ఎమెర్జెన్సీ నంబర్లు స్క్రోఅలింగు వెయ్యడం కానీ..ఖాళీ చెయ్యాల్సిన ప్రాంతాల వివరాలు చెప్పడం కానీ జరిగిందా? ఎంతసేపూ జరిగే విషయాన్ని భూతద్దం లో చూపించి..అందరికన్నా ముందు మేము అనిపించుకోవడం తప్ప ..ప్రభుత్వాన్నో ఇంకోళ్ళనో విమర్శించడం తప్ప నిజంగా సామాజిక బాధ్యత తో ప్రవర్తించడం వీళ్లకి ఎప్పుడు వస్తుందో..ఎంతసేపూ మాకు డబ్బులు పంపండి..బట్టలు పంపండి అంటూ విడి విడి గా స్క్రోలింగులు ఇచ్చుకోవడం తప్ప..సరిగ్గా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నేమన్నాయి..దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది..ఇదే చర్చ..చ చ.
టెక్నాలజీ పెరిగినా ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోతున్నామో తెలీదు. ఏమీ లేని ఆ రోజుల్లోనే వరదలో ఇంకో విపత్తో వస్తే, ఆకాశ వాణి ద్వారా...ఎమెర్జెన్సీ సర్వీసుల వివరాలు..సహాయ శిబిరాల వివరాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఎంతో మందికి సాయ పడ్డారు.
మరి ఈ నాటి మీడియా..?????

అటు రాజకీయాలు చూస్తే..ఇంతటి విపత్తు వచ్చినప్పుడు కూడా..కాంగ్రెస్ గవర్నమెంటు అవినీతి జల యజ్ఞ్మ్ వల్లనే ఈ విపత్తుకు కారణం అంటూ ప్రతిపక్షాలు..ఇది వరకు పాలించిన చంద్రబాబు విధానాల వల్ల నే అంటూ పాలక వర్గం ...కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇలాంటి స్మయం లో నైనా కలిసి ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది..కదా. ఇక మన కే సీ ఆర్ గారైతే ఇంకో అడుగు ముందుకేసి..జలయజ్ఞ్మ్ అవినీతి వారం రోజుల్లో బయటపెడతా..లేక పోతే ఉరేసుకు చస్తా అని ప్రకటించారు. సారూ కే సీ ఆరు..జనానికి ఇప్పుడు నిజాలు...అవినీతి గురించిన వివరాలు కాదు కావాల్సింది...తిండి, గుడ్డ ..గూడు...ఆరోగ్యం ...కుదిరితే ఆ విషయం ఆలోచించండి..ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రబ్లెం ఒకటే...'వరద '. ముక్కు నేల కి రాస్తావా ? నేనైతే ఉరేసుకుంటా ...అంటూ చాలెంజ్ ఇప్పటికి ఎన్ని విషయాల్లో ఎన్ని సార్లు చేసారో గుర్తు తెచ్చుకోండి..ఎంత మంది తో ముక్కు రాయించారో..ఎన్ని సార్లు ఉరేసుకున్నారో ?



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

diwali



FUN COUNTER

నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తుమ్మెద


'తుమ్మెద' అంటే .....అదేదో పూల మీద వాలే 'తుమ్మెద' అనుకునేరు. ఇది జలుబు వల్ల వచ్చిన వైరస్ తో కూడిన తుమ్ము...'తుమ్మెద' అంటే...నాలుగు మైళ్లు పరిగెడుతున్నారు..ప్రజలు.

భారత దేశం లో అస్సలు పారిసుద్ధత ఉండదు...అంతా చెత్త...ఇక్కడ జనాలకు ఆరోగ్య సూత్రాలు తెలీదు అనే విదేసీయుల్ని...కొందరు స్వదేశీయులనీ చూస్తుంటే ఆస్చర్యమేస్తుంది. ఎందుకంటే...ఈ మధ్య వచ్చిన జబ్బులు ఐడ్స్, బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ ఇంకా కొన్ని రకాల జబ్బులు..అన్నీ విదేశియులు మనకిచ్చిన కానుకలే..అవి అక్కడ నుంచీ దిగుమతి ఐన మహమ్మారులే.......మనవి కావు అని మనవి చేస్తున్నా.

సుబ్బరంగా వయసు వాచ్చాక పెళ్ళి...ఒకరే పెళ్ళాం,,,,హాయిగా సంసారం...పిల్లలు..ఇదీ మన సంప్రదాయం...కొన్ని రోజులు కలిసుండీ...ఒక్కోసారి ఏళ్ళతరబడి కూడా..నచ్చితే పెళ్ళి...నచ్చకపోతే...చెల్లు..అంటూ వదిలేసే డేటింగు వాళ్ళ విధానం..దేనివల్ల నష్టం....ఐడ్స్ కష్టం..అన్నది జనాలే నిర్ణయించుకోవాలి.

చిన్నప్పటినుంచీ తుమ్మొస్తే..చెయ్యి అడ్డం పెట్టుకోమని మనం పిల్లలకి నేర్పుతాం,..ఇప్పుడూ అదే చెబుతున్నారు...కాకపోతే..చెయ్యి స్థాయి నుంచీ...మాస్కు స్థాయి వరకు వచ్చింది..ఇంకా ఇప్పుడు అవతల వాడు తుమ్ముతుంటే..మనం అడ్డు పెట్టుకోవాల్సి వస్తోంది..దీనికి మందు...మన హోమియోలోనే ఉందిట..ఎప్పుడూ పాస్చాత్యుల్ని చూసి ఇన్ ఫ్లు యెన్స్ అవుతామనఒ ఏంటో దాని పేరు కూడా ఇంఫ్లుయెంజా...ట..అంతే కాదు..తులాసాకు, వేపాకు వేడి నీళ్లలో వేసి వాసన చూసినా తగ్గుతుందట...మరి.

ఈ మధ్య వస్తున్న చాలా జబ్బులు..పేర్లు కూడా కొన్ని తెలీవు..కిడ్నీ లో రాళ్ళు, గాలిబ్లాడర్ లో రాళ్ళు,,.ఊబకాయం వొళ్ళు....ఇంకా చాలా..... కేవలం ఆహార పద్ధతుల వల్లే పెరుగుతున్నాయట. క్యాబేజీ...టమాటా....లాంటివి ఎక్కువేసి చేసిన...సాండు విచ్(ఇసుక దెయ్యం అనొచ్చేమో), చీజ్ వేసిన బర్గర్లు..పిజ్జాలు...లాంటి ఫుడ్డు ఎక్కువయ్యాకనే ...ఇలాంటి జబ్బులూ పెరిగాయి అని చెప్పడానికి సర్వేలు అక్కర్లేదేమో..
లావు తగ్గడానికి ఏమి చెయ్యాలి డాక్టర్ అని పేరొందిన..కార్పొరేట్ హాస్పిటల్ లో ఫారిన్ లో ట్రైన్ అయి ఫ్లైట్ లో వచ్చిన డైటీషన్ ని అడిగితే...ఎల్ డీ ఎల్...వీ డీ ఎల్,,హెచ్ డీ ఎల్...లిపిడ్ ప్రొఫైల్ లాంటి వంద టెస్టులు చేసి..
ఫాట్ ఫూడ్డు తగ్గించండి..ఆయిల్స్ తినకండి...పచ్చి కూర ముక్కలు..కీరా..కారట్ తినండి...మొలకెత్తిన ధాన్యాలు తినండి..రాగి/ఓట్స్, లేక పోతే ఆకుకూరల గంజి తాగండి (ఇంగ్లీసులో సూప్ అంటారు)...రోజూ నడవండి...అంటూ కారులో వచ్చిన వాణ్ణి ఫీజు గుంజి...స్వంత కాళ్ళ మీద నడిపిస్తారు...

సో నే చెప్పొచ్చేదేంటంటే..మన పద్ధతుల్లో మనం ఉంటే.....ఏ ప్రాబ్లెంసూ రావు.
కష్టం లో ఉన్న భూమిని (పంది) వరాహ రూపం లో ఆదుకున్న వేద భూమి మనది...పందుల వల్ల స్వయన్ ఫ్లూ...వ్యాపింపచేసే..విదేశీ అనుకరణలొద్దు మనకి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2009

'జత' దినోత్సవాలు

ఊరంతా ఒకటే హడావిడి..హైదరాబాద్ లో ఆర్ టీ సీ క్రాస్ రోడ్డులో ఒక ధియేటర్ లో అంతా హడావిడి గా ఉంది. బానర్లు రెప రెపలాడుతున్నాయ్. అభిమానులు గోల గోల గా తిరుగుతున్నారు. పూల దండలు.కొబ్బరికాయలు, పాటల సౌండు..ఒకటేమిటి అంతా రచ్చ రచ్చ.
అన్నిటికీ కారణం ఒక పెద్ద హీరోగారి అబ్బాయి మొదటి సినిమా రెండోరోజుకావడమే.

ఇవన్నీ 'జత ' దినోత్సవ వేడుకల హడావిడి. సినిమా రిలేజు కాకముందే..మా సినిమా 100 రోజులు ఆడేస్తుంది..అని 'హ్రుదయం ' ఇంటిపేరుగా మారిపోయిన నిర్మాత గారు ప్రకటించేసారు. ఆయనకి ఇది వరకు డిస్టిబ్యూటర్ గా అనేక సినిమాల 100 రోజుల షీల్డులు అందుకున్న అనుభవం తో...అలా చెప్పారు. ఇండియాలో.ఫారిన్ లో కలిపి ఎన్నో? (వాళ్ళకి కూడ తెలీదు) ప్రింట్లు రిలీజు చేసి...తిరిగొచ్చిన డబ్బాలు..తిరిగి రాని డబ్బాలు(డబ్బులు అనాలేమో?) లెక్క కట్టి మొత్తం వందరోజులు అనుకోవచ్చో? లేక అన్ని ధియేటర్లూ కలిపి..ఆడిన రోజులులెక్క కట్టాలో మరి.
వెనకటికి ఆత్రేయగారు ఒక సినిమా నాలుగు వారాలు ఆడుతుంది అని చెప్పారట! తీరా చూస్తే ఆ సినిమా నాల్రోజుల్లోనే ఎత్తేసారట. అదేంటండీ అంటే నేను చెప్పింది నిజమే నాయనా,,నీకర్ధం కాలేదు...శుక్ర వారం, శని వారం, ఆదివారం, సోమ వారం మొత్తం నాలుగు వారాలు అంటూ 'ముసి ముసి ' నవ్వులు నవాడట మనసు కవి.

ఇహ ఈ సినిమా విషయానికొస్తే,,,,జత దినోత్సవ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి ...కారణం ..సదరు హీరోగారి తండ్రిగారు...హీరోయిన్ గారి తల్లిగారూ, హీరో..హీరోయిన్ను. మ్యూజిక్ ఇచ్చినాయన..ఇలా అందరూ వస్తున్నారట. మర్నాడు విజయ యాత్ర కూడా ఉండడం తో..హడావిడి అలా ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న టైము రానే వచ్చింది..హీరో అండ్ బాచ్ వచ్చేశారు.నడుస్తున్న సినిమ ఆపేసి..దండయాత్ర కార్యక్రమం అదే దండలు వేసే కార్యక్రాం..అయిపోయాక..హీరో గారి తండ్రి గారు..ఇన్నాళ్ళూ నన్ను భరించారు ఇక మా అబ్బాయిని మీ మీదకి వదులుతున్నా . ఇక మీ ఇష్టం అంటూ చేతులూపాడు. హీరోయిన్ తల్లి..మాట్లాడుతూ...హీరోగారి ఫాదర్ తో నేను ఇంతకు ముందు హీరోయిన్ గా చేసా ఇప్పుడు మా పిల్లలు కలిసి చేస్తుంటే 'ఆ ' రోజులు గుర్తొస్తున్నాయి అంటూ తెగ సిగ్గు పడిపోయింది.

హీరోయిన్ స్టేజి మీద కి వచ్చింది..ఆవిడ ఎటు చూస్తోందో కెమెరా వాళ్ళకి కూడా అర్ధం కాలేదు.ఆమె మొదలెట్టింది. అమ్మా వాడు నిండా పెద్ద హీరోయిన్ ఉంది..అప్పుడు. అంకుల్ నాకు హీరోయిన్ చేసినందుకు హాప్య్..అండ్ తాంక్స్..హీరో చాలా కోపరేటివ్....నేను ఒక కన్ను టాలివుడ్..ఒక కన్ను కోలివుడ్(తమిళ సినిమా) మీద పెట్టా అందుకనే ఇలా కనిపిస్తుంది అని మెల్లగా తన మెల్ల రహస్యాన్ని చెప్పింది
ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ,,, when I heard the story , I was inspired and gave music in one day అంటూ హిందీ సినిమా కోసం చేసి హైద్రాబాద్లో తన ఆల్బం మర్చిపోయిన తన పీ యే ని తిట్టుకుంటూ ....చెప్పేసాడు.
ఇక హీరోగారి వంతు...ఈ రోజు కోసమే..ఈ రోజు కోసమే 23 ఏళ్ళు గా ఎదురుచూస్తున్నా..చదువుకుందామనుకున్నా..అబ్బలేదు..స్పోర్ట్స్ మెన్ అవుదామనుకున్నా కష్టపడలేను..బిజినెస్ చేద్దామనుకున్నా చేతకాలేదు...అందుకే ఇక హీరో అవుదామనుకున్నా...అయిపోయా....తాంక్స్ టు తాత,,,,నాన్న...తాంక్స్ టు హృదయం అంకుల్ ....తాంక్స్ తొ మీకందరికి...అంటూ ఇంగ్లీషు..తెలుగు కలిపి అనేసి చెయ్యి చూపించేసి..బయలుదేరాడు.

తనకి సినిమా సినిమాకీ గుండెపోటు వస్తుంది కాబట్టి హృదయం ప్రొడ్యూసర్ అంటారు అనీ...ఆ సినిమా తీసినందుకు కాదని చెబుదామనుకుని...తనకి చాన్స్ రాకపోవడం తో రేపటి విజయ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి బయలుదేరాడు ఆ ప్రొడ్యూసర్.
ఏమో శత దినోత్సవాల రోజులు పోయి ఇలా జత దినోత్సవాలు వస్తాయేమో కూడా
చూశారా మరి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, సెప్టెంబర్ 05, 2009

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, ఆగస్టు 27, 2009

PULLANNA

పుల్లన్న..

పచ్ పచ్ పచ్ పచ్ పచ్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల రీమిక్ష్ పాట ఇది.
కొయ్యడానికి అక్కడ గడ్డీ లేదు...జారడానికి అక్కడ పైటే లేదు.... కానీ పాట మాత్రం ఫ్రీ మిక్స్ ఐపోయింది. మల్లన్న సినిమా లోనిదీ పైత్యం...సారి మహత్యం అనాలేమో..

సినిమా కూడా రీమిక్సే....భారతీయుడు లో ఫ్రీడం స్ట్రగుల్ ఎపిసోడ్ తీసేసి..జెంటిల్ మాన్ లో స్కూలు కట్టించే సీను వదిలేసి...అపరిచితుడులో గరుడ పురాణం శిక్షలు తప్ప మిగిలిన సినిమా అంతా కలిపి కొడితే రీమిక్స్ చేస్తే మూడున్నర ఏళ్ళపాటు శ్రమించి నిర్మించిన మల్లన్న..అవుతుంది

సాలీడు మనిషి..స్పైడర్ మేన్, గబ్బిలం మనిషి బాట్ మాన్, సూపర్ మాన్, ఇలా చాలా మేనుల్ని భరించిన మనకి కోడి మేన్ తోడయ్యాడు.

సినిమా అంతా గందరగోళం...సీ బీ ఐ ఆఫీసర్ ని అరెస్ట్ చెయ్యమని హీరోయిన్ అడగడమేమిటో..గాళ్ళో విమానం లో బాత్ రూం లో సరసాలేంటో...మెక్సికో లాంటి ప్లేస్ కి వెళ్ళే చోట ఇండియన్ రొమాన్స్ చూసి ఫారినర్లు సిగ్గుపడడమేమిటో..హీరోయిన్ కారులో మీ నాన్న కంటే ..ఆ మల్లన్నే బెటర్ అనగానే లవ్ లో పడడమేమిటో.. అంతా మల్లన్న దయ

శంకర్ మొదలెట్టిన కోట్ల రూపాయలు పేదలకి పంచడం అన్న సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చే అలోచన ఏదైనా ఉందో లేదో..జెంటిల్ మేన్ లో మొదలెట్టిన పంపకాలు ఇంకా పూర్తవలేదు. శివాజిలో అంతే...ఇప్పుడు మల్లన్న లో అంతే.. గుళ్ళో కాగితం కడితే పనులు జరుగుతాయి అని ప్రచారం చేసి డబ్బులిస్తూ పోతుంటాడు మల్లన్న. తేడా వస్తే కోడి రూపం లో పని పడతాడు...పొద్దున్నే నిద్ర లేపే కోడి...రాత్రి పూట డబ్బున్న వాళ్ళ పని పడుతుంది.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ఆదివారం, ఆగస్టు 23, 2009

welcome ganapathi

బొజ్జ గణపతి బర్త్ డే సందర్భం గా ఏర్పాటు చేసిన సభలో నారదుడు మాట్లాడుతూ..ప్రతీ బర్త్ డేని పది రోజులు భూలోకం లో జరుపుకునే మన గణపతికి భూలోకానికి బయలుదేరుతున్న సందర్భంగా ఈ సభకి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని కోరాడు.

వరుణ దేవుడు..నీ బర్త్ డేకి ముందు నేను భూలోకం వెళ్ళొచ్చా స్వామీ.అక్కడ అంతా ముష్కరుల గోల...స్వైన్ ఫ్లూ ..రాజకీయ గందరగోళం..శ్రీ రాముల వారి హారాల తాకట్టు వ్యవహారాలు ...అబ్బో తలుచుకుంటేనే నాలో నీరు ఆవిరైపోతోంది స్వామి..సరిగ్గా లేని పూడికలు..అడవులు , చెట్లు కొట్టేయడం, అపరిశుభ్రత, పని చెయ్యని మాన్ హోళ్ళు, పూడుకు పోయిన ఇంకుడు గుంతలు, కబ్జా ఐన చెరువులు , కుంటలు, డ్రైనేజి వ్యవస్థ లేని ఆ భూముల్ని చూడలేక కోపం వచ్చి అటు వెళ్ళటం మానేసిన నాకు మీ పుట్టిన రోజుకి కనీసం కొంచెం ఐనా చల్లదనం కలిగిద్దామని వెళితే ఎదురైన సంఘటనలు..పరిస్తితులూ చూస్తే మీరు వెళ్ళక పోవడమే మంచిది స్వామీ....అంటూ ముగించాడు.

అందుకు స్పందించిన పార్వతీ దేవి..నాయనా అసలే నువ్వు ఆకలికి ఆగలేవు. అక్కడ చూస్తే నిత్యావసర ధరలు మన కైలాసం దాక చేరినై. ప్రజలు నీకు నైవేద్యం అయినా పెడతారో లేదో..ఈసారికి పుట్టిన రోజు మా మధ్యలో జరుపుకోరాదా ..అంటూ బాధ పడింది.

దానికి స్వామి..అమ్మా భూలోకం లో జనాలని మనం కూడా పట్టించుకోక పోతే ఇంకెవరు ఆదుకుంటారు. మనలని నమ్ముకున్న భక్తులని కాపాడాల్సిన బాధ్యత మనదే..అంటూ వినాయక చవితి పండక్కి భూలోకానికి బయలుదేరాడు.

వచ్చాక ఏమేమి జరిగాయో మళ్ళీ చూద్దాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..ఆ స్వామి ఆశీస్సులు మననందరికీ ఉండాలని ఆ ఉండ్రాళ్ళ ప్రియుని ప్రార్ధిస్తూ...మీ ఫన్ కౌంటర్



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, ఆగస్టు 21, 2009

A for ఆంజనేయులు,

ఆంజనేయులు,

అర్ధం కాకుండా మాట్లాడ్డం హీరో స్టైల్ అర్ధం లేకుండా ఉండడం సినిమా స్టైల్. గందరగోళం గా ..ఎక్కడో విన్నట్టుగా ఉండడం మ్యూజిక్ స్పెషల్ ...బూతు మాటలే కామెడీ,,,,కొడితే ఎముకలు బయటకి వచ్చేంత అసహ్యంగా ఉండడం ఫైటింగ్..మొత్తానికి 'అతి ' కి పరాకాష్ట ఈ సినిమా.

ఎ ఫర్ ఆంజనేయులు...అంటే గొప్పోడని కాదు..సెన్సారు సర్టిఫికేట్ మీద ఉన్న 'A" గురించి నేను చెప్పేది. ఈ మధ్య మగధీర అడవి ఇంకా చాలా సినిమాలకి కూడా ఇలా A సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నారు. ఇంకా పైన ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఇచ్చేయొచ్చేమో కూడా.

అమ్మాయిని రక్షించి ప్రేమలో పడి...ఆఫీసుకెళ్ళి ప్రేమ ఒలకబోసి..రచ్చ రచ్చ చేసి...బెదిరించి..భయపెట్టి..కంఫ్యూజ్ చేసి.అమ్మాయిని పట్టుకుని..వెధవ వెధవ వెధవ.దొంగి..కొంటి..బొడ్లో పొడిచేస్తా అని మొత్తానికి పెళ్ళి కి ఒప్పించే అద్భుతమైన ప్రేమ గాధ.

జులాయి గా ... ఏదో ఒకటి చెయ్యటమే కానీ ఏం చేతామో తెలీకుండా..పని ఇచ్చిన వాణ్ణి ఎదవని చేసి.హాయిగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ తిరిగే ఆదర్శ ఉద్యోగి..అతడి పనులంటేఅ వాళ్ళ నాన్న కి ఎంతో గర్వ కారణం తల్లికి ప్రాణం..పిల్లలెలాంటి వాళ్ళైనా పేరెంట్స్ కి ముద్దుగానే ఉంటుంది.

50 కోట్ల కి హత్యలు..చేసే ప్రొఫెషనల్ కిల్లర్స్ ..వాళ్ళదగ్గర పనిచేసే రౌడీల కన్నా..పల్లెలో చదువుకుని(?) టీవీలో పనిచేసే హీరోకే పవర్ ఎక్కువ..కొడితే ఎముకలు బయటకొస్తాయి. అరవై ఏళ్ళ క్రితం వేసిన అణు బాంబుకి నష్టపోయిన హిరోషిమా నాగసాకి ఇంకా కోలుకోలేదనీ..తనకీ అంత పవర్ ఉందని జస్ట్ నేం డిఫరెంట్ అనీ చెప్పగలిగే జనరల్ నాలెడ్జ్ హీరో గారి సొంతం.

కొద్దోగొప్పో మెసేజ్ ఉన్న పాయింటు జయప్రకాష్ ఐ ఏ ఎస్ ఇంటర్వ్యూ అది కూడా హీరో గారి ఇమేజ్ పెంచడానికి మరిన్ని ఎముకలు విరగడానికీ ఉపయోగపడిందే కానీ..

ఇక బ్రహ్మానందం భవానీ ఎపిసోడ్ గుడుంబా శంకర్ నుంచీ కొన సాఆగుతునే ఉంది....

కార్ దగ్గర 2 అమ్మాయిలని పెడతాను..మిస్సైతే లిఫ్ట్ లో నలుగుర్ని పెడతా అక్కడా మిస్సైతే రిసెప్షన్ దగ్గర ఇంకో ముగ్గుర్ని పెడతా..లాంటి కొన్ని డైలాగులు అతడు సినిమానీ..కొన్ని పాటలు..కొన్ని పాటల్నీ గుర్తుకు తెస్తాయి.





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

బుధవారం, ఆగస్టు 19, 2009

ఇన్ ఫ్లూ ఎన్సా


ఇన్ ఫ్లూ ఎన్సా

అ ప్పుడెప్పుడో చాలా యుగాల క్రితం హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రం లో పడేస్తుంటే విష్ణు మూర్తుల వారు వరాహావతారం ఎత్తి భూమిని కోరల మీద నిలబెట్టి కాపాడి,, ఆ రాక్షసుణ్ణి చంపేసాట్ట. ఇది కధగా చిన్నప్పుడు వినా. ఐతే ఇప్పుడు ఆ వరాహాల వల్ల స్వైన్ ఫ్లూ అనే జబ్బు భూమిని గడ గడ లాడిస్తోంది. ఆ జబ్బు చాపలా చుట్టేసి అప్పుడే అంతటా వ్యాపిస్తోందట.

మూతులకి చిక్కాల లాంటి తొడుగులు..మాస్కులతో అందరూ ఆ వరాహ మూర్తుల లానే కనిపిస్తున్నారు. అప్పుల అప్పారావులకి...మాటిచ్చి నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా ఉపయోగ పడుతోందనే చెప్పాలి. ఎందుకంటే ఏ కర్చీఫో..మాస్కో కప్పుకుంటే జనం బారిన పడకుండా పార్పోవచ్చు.

అసలు ఇదివరకూ ఇన్ని మందులు జబ్బులు ఉన్నాయా ఐనా అందరూ హాయిగా వందకి దగ్గరదాకా బతికేసే వాళ్ళు. ఏమిటో సైన్ సు..టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రాబ్లెం స్ ఎక్కువౌవుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో జబ్బులు మందులు...విచ్చలవిడి తనం వల్ల పెరిగిపోతున్న ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పటికైనా మన సంప్రదాయం మన పద్ధతులే కరెక్ట్ అనిపించక మానదు.

ఐడ్స్, బర్డ్ ఫ్లూ..ఆంత్రాక్స్....చికెన్ గున్యా..ఇప్పుడు స్వైన్ ఫ్లూ...ఇలా కొత్త కొత్త జబ్బులు..వాటికి మందులేంతి అంటే వేపలో ఐడ్స్ నిరోధక లక్షణాలున్నాయి అని ప్రకటనలు..తులసి ఆకులు..లవంగాలు తింటే స్వైన్ ఫ్లూ నివారించొచ్చు అని స్టేత్ మెంట్సూ వింటుంటే మనమీద మనకి గౌరవం పెరుగుతుంది.

పక్క దేశాలను చూసి ఇన్ ఫ్లూ ఎన్స్ అవడం మన బలహీనత..వాళ్ళని అనుకరించి తెచ్చుకున్న ప్రేమికుల దినాలు..ఇతర దినాల లాగనే ఈ జబ్బులూ రోగాలూను.
వాళ్ళ జీవన శైలికి వాళ్ళు చేసే పనులు సూటౌతాయేమో కాని మనకి కాదు. అక్కడి పిల్లలు ఎంత షార్పో పుట్టిన దగ్గరనుంచీ ఇంగ్లీషులో మాట్లాడతారు...ఎంతగొప్పో అనుకుంటాం కానీ అది వాళ్ళ మదర్ టంగ్ అని కూడా ఆలోచన రాదు...ఎందుకంటే మనమూ సాధారణ పౌరులమే కదా..మాస్కు కట్టుకోండి ముసుగు అన్నమాట అది మనసు మీద నుంచీ తీసేయండి భారతీయులెంతో గొప్పవారని చాటండి..మేరా భారత్ మహాన్..











నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

బుధవారం, ఆగస్టు 05, 2009

ధర లక్ష్మీ వ్రతం

ధర లక్ష్మీ వ్రతం

సభకి నమస్కారం, ఈరోజు నే చెప్పదలచుకుందేంటంటే...ఒక్క నిమిషం మా ఇంట్లో పూజ మొదలైంది.. మా ఆవిడ వ్రతం మొదలెట్టింది...శ్రవణ మాసం కదా...ధర లక్ష్మీ వ్రతం స్టార్ట్ అయింది.

మంత్రాలు మొదలైనాయి. పూజారిని పిలిపించేంత ధైర్యం చెయ్యలేక ..పూజ కాసెట్ పెట్టింది మా ఆవిడ. కళశం పక్కన కరెంటు కుందులు దాంట్లో led బల్బులు..వెలుగుతున్నాయి. "ఆయిల్ " రేట్లు భగ్గున మండుతున్నాయి కదా మరి. ప్లాస్టిక్ పూలతో ఎంచక్కా అలంకరించింది మందిరాన్నీ..అమ్మవార్నీ కూడాను..అవి పోయిన సంవత్సరం చైనా బజారులో ఏదైనా 49 రూపాయలకి కొన్నవే అనుకుంటా..కానీ అన్ సీజన్ లో మల్లెపూల వాసన. ఒహో ! వాసన కోసం స్ప్రే వాడింది కాబోలు.

పేరంట్టాళ్ళకోసమనుకుంటా ప్రకృతి వైద్యం వాళ్ళ "స్ప్రౌట్స్ పేకెట్లు " రెడీ చేసింది.శానగలూ బంగారు నగలూ ఒకటే రేటున్నాయ్నై ఎవాయిడ్ చేసినట్టుంది.

ప్రకృత్యాఇనమహ ..వికృత్యైనమహ వాస్తవానికి రాజకీయ వాగ్దానికి ఉన్న తేడా గురించా అన్నట్టు అష్టోత్తరం స్టార్ట్ అయింది. పూజయ్యాక "కష్టోత్తరం " స్టార్ట్ చేస్తా ఆ కష్టాలు అన్నీ తీర్చు అనడానికి సంకేతంగా .......

లోనికెళ్ళి చూసా గుండాగినంత పనైంది ....."వెండి పూల " తో పూజ చేస్తోంది మా ఆవిడ.కొంపదీసి "కొంప " అమ్మేసి కొన్నదా అని డౌట్ వచ్చి గావుకేక పెట్టాలనుకున్నా..కానీ నత్తిలా వచ్చింది వె వె వె వె వెండి పూలెక్కడివి అని,,,,,కంగారు పడి క్యాసెట్ ఆపి ..ఏంటండీ ? మీ గోల అంది మా ఆవిడ, వెండి పూలెక్కడివే (ఎప్పటిలా) భయం భయంగా అడిగా.

పోదురూ ...మీరు మరీను అవి ప్లాస్టిక్ పూలు వెండి కలర్లో ఉన్నాయంతే...బర్మా బజారులో కొన్నా..ఎలా ఉన్నాయి ? అని అడిగింది. ఆఖరు శ్వాసలో ఉన్న వారికి ఆక్సిజన్ అందినంత పనైంది నాకు.

అమ్మయ్య..అనుకున్నా..."బంగారం " కలర్ కొనక పోయావా ? నీకు సూట్ అయ్యేది..అన్నా తప్పు కవర్ చేసుకోవడానికి.

"చాల్లెండి " మీరు మరీను.."తొడ పాశం" పెడుతూ అంది. (మా ఆవిడకి "మరి" ప్రేమ కలిగినప్పుడు అలా "ముద్దు " చేస్తుందిలెండి!) కాదే నిజంగానే అన్నా..జోక్ కాదు మూలిగా.

నాకా మాత్రం తెలుసులెండి "వెండి " పూలైతేనే పేరంటాళ్ళు నమ్ముతారు "బంగారం " కలరైతే నిజం కాదని తెలిసిపోతుంది అంది మా ఆవిడ.

మా ఆవిడ తెలివి కి మురిసిపోయా. మళ్ళీ ప్రేమ కురిపిస్తుందేమోనని డౌట్ (నిజం చెప్పాలంటే భయం )తో ఫోన్ నెపం తో ముందు గదిలోకొచ్చిపడ్డా..




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, జులై 21, 2009

కల కలాం

కల కలాం

ప్రపంచమంతా చంద్రుడిమీద కాలు పెట్టి నలభై ఏళ్ళు గడిచిన సంబరాలు జరుపుకుంటూ ఉంటే మన దేశంలో మాత్రం క్షిపణి మాంత్రికుడు.......స్ఫూర్తిప్రదాత....మాజీ రాష్ట్రపతి కి అవమానం జరిగింది.

ముంబాయి పేలుళ్ళలో దొరికిన..కసబ్ మావోడే అంటూ ఒక సారి...కాదు ఎవరో తెలీదు అని ఒకసారి మాట మారుస్తున్న తుపాకిస్తాను....అవును నేనే చేసాను అని ఒప్పుకున్న కసాయి కసబును విచారించడానికి ఎన్నేళ్లు పడుతుందో ఏమిటో.


పొట్ట పోసుకోవడానికి వెళ్ళి ....అతి తెలివికి పోయో...మోస పోయో పరాయి దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న ఎందరు భారతీయులు ఏమేమి కష్టాలు పడుతున్నారో..ఎలాంటి విచారణ ఎదుర్కుంటున్నారో తెలీదు.
మాజీ అధ్యక్షులు....క్లింటనో...బుస్షో వస్తే వాళ్ళని కూడా ఇలానే అవమానిస్తారా? లేక ఆ "సౌకర్యం " మన వాళ్ళకేనా..

ఆ మధ్య మన జార్జి ఫెర్నాండెజ్ గారికి కూడా ఈ రకంగా జరిగిందిట. రక్షణ మంత్రులు.రాష్ట్రపతులకే లేనిది ...ఇక సామాన్య మానవుణ్ణి ఏమి సరిగ్గా చూస్తారు.

బాంబేలో బాంబులేసినది ఎవరో తెలుసు..ఎంత నష్టం.జరిగింది...ఎన్ని ప్రాణాలుపోయాయి తెలుసు..ఎవరికోసం .........ఎవరి మెప్పు కోసం...ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందని...భయపడతారో తెలీదు..కార్గిల్ ఆక్రమించినప్పుడు మనం పోరాడి ....ఎన్నో ప్రాణాలు బలిచ్చి కాపాడుకున్నాం కానీ...ఎవరూ వచ్చి పాకిస్తాను వాడికి ఇది తప్పు నాయనా. అని ఎవరూ రాలేదు...తరువాతైనా మంచి చెడు చెప్పిందీ లేదు....మరి ఈ విధానమేంటో అర్ధం కాదు నా మట్టి బుర్రకి.
మీకెవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.
బాబ్బాబు..........










నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, జులై 20, 2009

గ్రహణం




గ్రహణం

సూర్యుడికి పట్టిన "గ్రహణం" గంటలోనో......... గంటల్లోనో వదిలిపోతుంది. కానీ మన సంస్కృతికి పడుతున్న/ పట్టిన....గ్రహణం మాత్రం ఎన్నాళ్ళకి వదులుతుందో ఏమిటో..

అపోలోలు..రాకెట్టులు పుట్టని,......... కనీసం వాటి ఆలోచనైనా పుట్టని రోజుల నుంచే..
ఏ రోజు..ఎంత సేపు గ్రహణం వస్తుందో..చెప్పే వారు మనవారు...

చంద్రుడో ...సూర్యుడో కనపడకపోతే ప్రళయం వచ్చిందని దాక్కునే 'వాళ్ళు' చెప్పింది విని - 'అవును' అనాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం.


సూర్యుడు........మిగిలిన నవగ్రహాలూ ఇలా ఉంటాయి ..వీళ్ల ప్రభావం ఫలానా అని చెబితే
మూఢ నమ్మకం.......... జాతకాలు లేవు..అని కొట్టి పడేస్తారు...ఆస్ట్రాలజీ ని నమ్మరు..

టెలిస్కోపు లో చూసి గ్రహాలు దగ్గరగా కదులుతున్నాయి.............అందుకు కొన్ని ప్రభావాలుంటాయి అని చెబితే 'ఆస్ట్రానమీ' ని నమ్ముతారు.


'చంద్రుడి' ప్రభావం 'భూమి' మీద, 'సముద్రం' మీదా..'మనసు' మీదా ఉంటుంది అని జ్యోతిష రీత్యా చెబితే చీ చీ చాదస్తం అంటారు...

అదే లూనార్ ఎఫెక్టు ఆన్ హ్యూమన్ సైకాలజీ అని అమెరికా వాడు చెబితే చప్పట్లు కొట్టి అబ్బో చాలా గొప్ప విషయం కనుక్కున్నారు ఎంతైనా అమెరికా వాడు అంటాం.

కాల ఞాన్ని నమ్మని మనం...నోస్ట్రడామస్ ను, సునామీ గురించిన ఈ మైళ్లని నమ్ముతాం.

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను అని వేమన చెబితే మనకి సోది లా అనిపిస్తుంది ...ఎంటీ వెసెల్స్ మేక్ మోర్ నాయిస్ అని ఎంగిలీషు భాషలో అంటే అది మనకి వేదం...

వేప చిగురు చేదు మీద కార్టూన్ లు వేసుకుంటూ మనమున్నాం ఆ చెట్టు పేటెంటు తీసుకుని ప్రయోగాలు చేసి ఆ వనమూలికలని మనకి రేటు కట్టి అమ్ముతుంటే కొంటున్నాం.

కలబంద గురించి చెబితే ఏమిటో నీ బొంద అని కొట్టిపారేసి, ....కొట్టు కి వెళ్లి అలో వేరా మెడిసిన్ తెచ్చుకుని పుచ్చుకుంటారు.

యోగా అంటే అదేదో ముసలాళ్ళు ..మునులు చేసేదని..వేలు ఖర్చు పెట్టి ..జిమ్ములు...ఏరోబిక్సులు జాయిన్ అవుతారు...
రాగి జావ తాగరా నాన్నా అని నానమ్మ చెబితే...చీ చీ రాగీ మాల్టో..ఓట్సో తాగండి బరువు తగ్గుతారు...అని చెప్పే డైటీషియన్ దగ్గర అపాయింటుమెంటు లైనులో నుంచుంటారు...

తేజస్సు నందించే సూర్యుడు కనుమరుగు అవుతాడు..దుష్టశక్తులు(బాక్టీరియా...వైరస్సు) ప్రబలుతుంది అని చెబితే నవ్వుతారు.....గ్రహణం టైముకి మూడు గంటలముందే ఏమన్నా తినండి..అని స్క్రోలింగులు చూసి ఫాలో అవుతారు..
పాజిటివ్ ఎనెర్జీ...............సూర్య తేజస్సు
నెగిటివ్ ఎనెర్జీ...............వైరస్సు...
చంద్రుడి మీదకాలు పెట్టి నలభై ఏళ్ళైనందుకు...ఆం స్ట్రాంగు ను గుర్తుచేసుకుంటున్నారు..కానీ ఆర్యభట్టుని తలుచుకునేంత తీరిక..కోరిక ఉన్నాయా మనకు.











నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, జులై 13, 2009

అప్పుచేసి 'పప్పు ' కూడు



అప్పుచేసి 'పప్పు ' కూడు
మన అంతస్తెక్కడ వాళ్ల అంతస్తెక్కడ...నెలకోసారి పప్పు చారు కాచుకునే వాళ్ళకి, వారానికోసారి పప్పు చేసుకునే మనకీ సంబంధమా...నా కంఠం లో ప్రాణం ఉండగా జరగనివ్వను..ఓ తండ్రి గొప్ప


డియర్ ఈ మేరేజ్ డేకి నాకు కంది గింజతో ముక్కు పుడక చేయిస్తావా? అని అడిగినందుకు కిడ్నీ అమ్మి మరీ చేయించాడు తెలుసా నా లవరు....ఒక ప్రియురాలి ఆశ్చర్యం

కట్నం కింద పది కిలోల కందిపప్పు అడిగిన పెళ్ళికొడుక్కి దేహశుద్ధి..ఒక ఊరిలో నిరసన


దుబాఇ నుంచి అరకిలో కందిపప్పు అక్రమ రవాణా చేస్తూ పట్టు బడ్డ భారతీయునికి కఠినశిక్ష...పేపరులో మొదటిపేజీ న్యూసు...

పురావస్తు తవ్వకాలలో..బయటపడ్డ కందిపప్పు ఆనవాళ్ళు...2008 సంవత్సరం వరకూ ప్రజలు అష్ట ధాన్యాలు కాక నవధాన్యాలు వాడేవారనీ అప్పట్లో కందిపప్పునీ పప్పుగా పచ్చడిగా వాడేవారని అప్పటి పత్రికల్లో వంటల పేజీల ద్వారా గుర్తించినట్టు పురావస్తు శాస్త్రఙులు తెలిపారు......... టీవీలో ఫ్లాష్

నా పేరుకి ఇప్పటికి విలువ పెరిగింది అని స్పీడు పెంచింది 'కంది ' రీగ

గిలిజిబెత్ రాణి కిరీటం నుంచి కందిపప్పు ఆనవాలు చోరీ...ఇది ఖచ్చితంగా చార్లెస్ సోభరాజ్ ముఠా పనే అని ఇంటర్పోల్ అనుమానం

కొన్నాళ్ళు పోతే ఇలాంటి పరిస్థితులు ఎదురౌతాయేమోనని అనుమానం వేస్తోంది...ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బ్లాకు మార్కెట్ విషయం చూడకపొతే రేపు పేపర్లో బంగారం వెండి ధరలతో పాటు కందిపప్పు కూడా తులం వంద ...అని,,,మేకింగు చార్జెస్ ఎక్ష్ట్రా అనీ చూడాల్సొస్తుందేమో..










నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, జూన్ 22, 2009

నా తెలంగాణ కోటి రతనాల వీణ

నా తెలంగాణ కోటి రతనాల వీణ

తె రా స అంటే ఇన్నాళ్ళూ తెలంగాణా రాష్ట్ర సమితి అనుకున్నా …కానీ తె రా స అంటే

తె “ల్లారి “రా”జీనామ “ “మర్పణ -----సాయంత్రం ఉపసం హరణ అని నేడే తెలుసుకున్నా..

కాసేపు ఆయనే నాయకుడు అంటారు..ఆయనకి పూజలు చేస్తారు, స్త్రోత్రాలు చదువుతారు..ఆయనా యాగాలు చేస్తారు..తీరా కాసేపటికే..పచ్చి మోసగాడు..బంధుపక్షపాతి..ఇంకా నానా మాటలు అంటారు..వెంటనే ‘రాజీ నామా చేసేస్తారు…వెంటనే బతిమిలాడతారు..ఆయనా ఒప్పుకుంటాడు..ఇదీ మామూలే అయిపోయింది…

ప్రజలు మాతో ఉన్నారు అంటే మాతో ఉన్నారు అని అంటారు అందరు..ప్రజలు వాళ్ళతో ఉండి పక్క వాళ్ళకి ఎందుకు వేస్తారో మరి ఓట్లు…
విజయం మాదే అన్నారు..తెలంగాణా తధ్యం అన్నారు..తీరా చూస్తే కధ అడ్డం తిరిగింది,

మనం పోరాడాల్సింది..మన హక్కుల కోసమా..బడ్జెట్ కోసమా..ప్రాజెక్టుల కోసమా ప్రతేక రాష్ట్రం కోసమా అన్నది నాకు తెలియట్లేదు.

తెల్ల దొరల పాలన నుంచీ విముక్తి కోసం..స్వరాజ్యం కోసం పోరాడాం ..సాధించాం
నిజాం నిరంకుశ పాలన నుంచీ విముక్తి సాధించాం.
భాషా ప్రాతిపదిక పై తమిళనాడు నించీ విడిపడ్డాం …ఆంధ్రులమయినాం.


ప్రాజెక్టులో..బడ్జెట్టులో..మరో అవసరమైన ఏ విధమైన హక్కైనా పొరాడి సాధించే ప్రజలు తగ్గుతారు….ఆంధ్రులమై ఒక్క తాటిపై నిలిచి పన్నెండు కోట్ల మందీ ఆ ప్రాంత అభివృద్ధి కోరితే..నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే..నిధులు సరిగా పంచి..విధులు సక్రమంగా చేస్తే…నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి పలుకులు అక్షర సత్యమౌతాయి..తెలంగాణ నేల..సశ్య శ్యామలమౌతుంది..

(రాజకీయంగా సరైన అవగాహన లేకపోయినా…ప్రతి రోజూ జరుగుతున్న రాజకీయ్ పరిణామాలు చూసి ఇలా స్పందించా..ఎవరినీ నొప్పించడానికి కాదు..మనమంతా ఒకటే అని ఒప్పించడానికి. మాత్రమే...పూర్వం మనం సాధించిన విజయాలు ఒక పార్టీ వారో..ఒక్క నాయకుడో..ఒక్క సంస్థో సాధించినవి కావు…అవి ప్రజా యుద్ధం తో సాధ్యమైనవి..పార్టీల కి అతీతంగా …లక్ష్య సాధన కోసం పోరాడితే తప్పక విజయం సాధిస్తారు..జయహో…..తెలుగోడా,,,,,,,,,,,,,,,)

తెలంగాణా అభివృద్ధికి నేను సైతం అంటూ మీతోనే మేమూ అంటూ ప్రతి ఒక్కరు ప్రాంతీయ, రాజకీయ, బేధం లేకుండా పోరాడాలని కోరుకునే…ఒక అనామకుడు.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, జూన్ 15, 2009

సం'దేశం'



భువన మండలం
లో
భరతావనిలో

కష్ట జీవులు
నిష్ఠవీరులు


క్షేత్రాలన్నీ క్షాళణ చేసీ
ధాన్యాలన్నీ రాశులు పోసీ
తిండి పెట్టగా
పస్తులుండగా

భూస్వాములంతా తింటూ
మీ కష్టాల్ తీరుస్తామంటూ

వారి కష్టం సొమ్ముచేసుకుంటుంటే
వారి కాష్టం గాలికొదిలేస్తుంటే

పేదలందరి కడుపుమండగ
అందరు కలిసి కన్నెర చేయగ

గడగడ లాడగ భువనమండలం
ఏర్పడే ఓ హవన కుండలం..

ఆ 'కాష్టం' ఆర్పే నాధుడు ఏడోయ్
వారి 'కష్టం' తీర్చే యోఢుడు ఏడోయ్
అందుకే ఓ యువతా!
పేదకోసమై పాటు పడు
కనీసం ఆవిధంగానైనా బాగుపడు

మహా కవి శ్రీ శ్రీ కి అంకితం
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, జూన్ 09, 2009

'ఈక'కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ

'ఈక'కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ

'ఈక'కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ లో పడ్డ పసివాడి ప్రేమ కధ ఈ ప్రయాణం..ఈరోజుల్లో ప్రేమలకు ప్రతిరూపంగా అనిపించింది ....కనిపించింది..నిన్ననే ప్రయాణం సినిమా చూసా..సినిమాని సినిమాగా చూడు లాజిక్కులు వెతక్కు అంటే వదిలేస్తా..కానీ టికెట్టు పెట్టి చూసా కాబట్టి నాకనిపించింది చెప్పే హక్కు ఉందేమో అనిపించి..రాత్రంతా
విలపించి...ఇలా మొదలెట్టా...

సినిమాలో అసలు 'ప్రయాణమే' లేదు...ఐర్పోర్టులో ట్రాలీ మీద తప్ప...ధూమపానాన్ని అసలు సహించని మలేషియాలో కూడా మన హీరొలకి ఐర్పోర్టులో సైతం సిగరెట్టు తాగేంత హీరోయిజం ఉన్నది అన్న సత్యం తెలిసింది..నాకు తెలిసినంత వరకు, అక్కడ స్మోక్ జోన్ లు ఉంటాయి ..కాని మనోడు 'మనోజు' హీరో కాబట్టి నో స్మోకింగు బోర్డు ముందు నుంచుని తాగేస్తూ వాగేస్తూ ఉంటాడు..

థ్రిల్లు కోసం గ్రిల్లు పట్టుకుని కైపెక్కి- పైపెక్కి- పైకెక్కి, పోలీసుల చేతిలో చిక్కి..చచ్చీ చెడీ బయటకొచ్చి...నిమిషం తరువాత ఏమి చేస్తాడో తెలీని "ఉత్తర ధ్రువానికి" అక్కడ "మంచు " ఎక్కువలేండి..
గంటలో ప్రేమ....రోజులో పెళ్ళి,,,,,నెలలో విడాకులు..పాపం హీరోయిన్ పెట్టిన ఎం సెట్ లాంటి పరీక్షా పత్రంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది...ఆ 'మారేజిసెట్లో' ఫైల్ అయినా హీరో ప్రేమ పరీక్షలో పాస్....రెండు గంటల పరిచయం..ఏడుప్రశ్నల కు సమాధానం వెరసి ఒక జీవితకాల 'ప్రయాణం'..

'పాట్లు' గురించి చెప్పాలంటే భయంగా ఉంది 'ప్రింటు మిస్టేకు' కాదు 'పాటలు' అనే కన్నా 'పాట్లు' అనడమే కరెక్టు..అంత ఘోరంగా ఉన్నాయి అవి..సంగీతపు హోరులో 'మాట ' అర్ధం కాదు..రికార్డింగు..మరీ ఘోరం...గొంతుల్లో అపశృతులు..

చంద్రశెఖర్ ఏలేటికి ఐర్పోర్టు సెంటిమెంటో మరోటో తెలీదు కానీ 'ఐతే' ..మాత్రం కొంచెం ఆలోచించుకోవాలేమో...ఏ ఫ్లయిట్ తెలీకుండా ...ఒక వేళ రాత్రి ఫ్లయిట్ ఐతే అన్నిగంటల ముందుగా చెకిన్ ఎలా అవుతారో...అర్ధం కాలే..
బ్రహ్మానందాన్ని 'ఆడుకున్నారు' అనాలో 'వాడుకున్నారు' అనాలో కూడా తెలీదు...పాయింటు చిన్నది కాబట్టి...'బట్ట తలకీ' -మోకాలు కి లింకెట్టి" చాక్లెట్ తిన్నవాణ్ణి వదిలేసి..బ్రహ్మానందం వెంటపడ్డ ఒక ఆధునిక హిడింబాసురుడు..పెళ్ళాం బాధ పడలేక వెంటపడడం...అసహజంగా అనిపిస్తుంది...

మందు కొట్టడం..సిగరెట్ తాగడం..బెట్టు కట్టడం..అమ్మాయి వెంట పడడం..వంటివి హీరోదాత్త లక్షణాలుగా చెలామణి అవుతున్న ఈరోజులకు ప్రతిరూపంగా కనిపించే హీరో...అప్పటిదాకా ప్రాక్టికల్ గా లైఫ్ గురించి ఆలోచించిన అమ్మాయి కన్నుమూస్తే తాజ్మహల్ కట్టిస్తానన్న హీరో మనసుకి ఆకర్షితురాలవడం...పరాయి దేశం లో పోలీసులకి బాంబు విషయం లో ఇరికించినా...ఉత్తరం అందించి సాయం చేసే రైతు బ్రహ్మానందం ఆహా అద్భుతం...చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇంక దీనిగురించి ఇంతకన్నా టైము వేస్టు చెయ్యడం ఎందుకులే అని వదిలేస్తున్నా...
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

గురువారం, మే 21, 2009

ఫీల్డు మారిందా..షీల్డు గోవిందా...

ఫీల్డు మారిందా..షీల్డు గోవిందా...
పుడుతూనే తల్లిని పోగుట్టుకుంటాడు, తండ్రి చీ కొడతాడు,,ఐనా బోరింగు పంపు లో నిళ్ళు తాగి పీదవాడవుతాడు మన హీరో..కోటీస్వరుడి కూతురు ఈ హీరోని చూసి మనసు పారేసుకుంటుంది. ఇంక వెంటనే పాట ఫారిన్ లొకేషన్ లో....ఐన వెంటనే ఒక చేసింగు సీను..ఫైటింగూనూ...కట్ చేస్తే..హీరఓయిన్ ని ఎక్కడికో పంపేస్తారు వాళ్ళ కసాయి తండ్రి.
హీరో అడుక్కుతింటూనే ఐ ఏ ఎస్ పాసయి వాళ్ళ వూరికే కలెక్టర్ గా వస్తాడు..తను అడుక్కుతినే వాడిగా అవడానికి కారణమైన వాళ్ళమీద రివెంజి తీర్చుకుంటాడు..
పోలీసు ఆఫీసరైన మన హీరోగారు..చండ ప్రచండమైన విలన్ గాంగుని నామ రూపాల్లేకుండా కాల్చి అవతల పారేస్తాడు..మిగిలిన వాళ్ళు ఆయన కంట్లోని 'అగ్ని ' కి ఆహుతైపోతారు..
మూటలు మోసే ఒక మేస్త్రీ తన స్వయంకౄషితో ఎంచక్కా లేబర్ మినిస్టరైపోయి చాలా మంది బాక్స్ ఆఫీసులు బద్దలుకొట్టేస్తారు..ఒక ఖాను గారు లగాను రద్దు కోసం ఇంగిలీషు వాళ్ళతో యాభై ఓవర్ల మాచులు పాపం అప్పట్లో అరవై ఓవర్లుండేవని మర్చిపోయి మాచు గెలిపిస్తాడు
మరో ఖాను గారేమో ఏకంగా చెక్క బాటులు పట్టుకున్న అమ్మాయిలకి హాకీ నేర్పించి చక్ దే ఇండియా అని స్ఫూర్తి నింపుతాడు..
పెద్దన్నయ్యలని అదే నండీ బిగ్గు బ్రదర్లని చూసి పొడుగుకాళ్ల సుందరి శిల్పా సెట్టి కూడా ఆ జాబితాలోకి చేరింది...
ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే సినిమాల్లో ఏదైనా చెయ్యగల సమర్ధులైన మన హీరోలు ఇతర రంగాల్లో నెగ్గుకు రావడం కొంచెం కష్టమైన పనే అని అర్ధం అవుతోంది.రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లు..క్రికెట్టు లో డబ్బు పెట్టిన స్టార్లూ పాపం కాలం కలిసి రాక ఇమేజి డామేజి అయి ..........తీసుకున్న నిర్ణయం ...ఫ్లాపు సినిమా అయి ప్రస్తుతం డౌట్ ఆఫ్ ఇండియా తో ఉన్నారు...మన ఫీల్డు ఏల్దాం బాసు మనకెందుకు పక్కోడి గోల..అవన్నీ చూసి ఆనందించాల్సిందే కానీ చేసి కాదు..డబ్బలు తిరిగొచ్చాక క్లైమాక్సు మారిస్తే ఏం లాభం..
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, మే 19, 2009

'రాజ ' కీయాలు

మంత్రాలకు చింతకాయలు రాలతాయా...అన్నది తెలియకపోయినా..సినీ గ్లామరుకు ఓట్లు పడతాయా అన్నది మాత్రం తేలి పోయింది.

బట్టల కొట్లకి ..బహిరంగ సభలకి వచ్చేది పిచ్చి సినీ అభిమానం
అవి ఓట్లుగా లెక్కిస్తే మిగిలేది ఘోర అవమానం అని తేలిపోయింది..

కాక పోతే నాకో డౌటు..అభిమానంతో వందరోఅజులు సినిమానే ఆడించని అభిమానులు ఐదేళ్ల అధికారం ఎలా ఇస్తారనుకున్నారో..? ఎందుకంటే..ఒక వేళ సదరు హీరోగారిమీద అది చిరంజీవైనా బాలకృష్ణ ఐనా వాళ్ల సినిమా బాగలేక పోతే వంద రోజులు ఆడడం గగనం అలాంటిది వాళ్ల గ్లామరుతో ఐదేళ్ల పాలన ఎలా తెద్దామనుకున్నారో అర్ధం కాలేదు. ఆ సినిమా సదరు హీరోగారికి అన్నీ నచ్చి..కధ, కధనం, దర్శకుడు, మ్యూజిక్కు, హీరోయిను, లొకేషన్ లు అన్నీ నచ్చి ఎంతో రిస్కు తీసుకుని చేసిన సినిమా అయినా సరే అందులో వాళ్ళు కోరుకునేది ? ఎదో లేకపోతే ఇక అది ఆడదు అలాంటిది...మొదటి రోజు రష్ చూసి..వంద రోజుల ఫంక్షనుకు మొమెంటోలు ఆర్డరిచ్చినట్టు ....సభలకి వచ్చిన జనాన్ని చూసి ప్రమాణ స్వీకారం ప్రాక్టీసు చేస్తే ఎలా ?

రోడ్డు పక్కన బట్టల కొట్టు ఓపెనింగుకి సినిమా హీరోయిన్ వస్తే చెట్లు ఎక్కి చూసే జనం ఆ హీరోయిన్ చేసిన సినిమా ని వందరోజులు చూస్తారా..ఎన్నికల్లో నుంచుంటే గెలిపించేస్తారా ? అంత భ్రమ ..

సినిమా వేరూ రాజకీయం వేరు...ఎం జీ ఆర్, ఎన్ టీ ఆర్ లాంటి వాళ్ళు మొదటి నుంచీ ప్రజల మధ్య ఉన్నారు..వాళ్ల సినిమాల్లోనూ ప్రజల బాధలు చర్చించారు...ఏదైనా విపత్తు వస్తే జోలె పట్టి జనం ముందుకు వచ్చారు..అప్పటి రాజకీయ పరిస్థితి వేరు..ఇప్పటి రాజకీయాలు వేరు. రెండు రూపాయల కిలో బియ్యం పధకం కన్నా..అప్పటి రాజకీయ అనిస్చితి..ఒక ఐదేళ్ళలో నలుగు రు సీ ఎం లు మారడం...అధిక ధరలు..లాంటి సమస్యలు..కాంగ్రెస్ కు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం లాంటివి ఎన్ టీ ఆర్ కు కలిసివచ్చిన అదృష్టాలు. ఆయనకున్న గ్లామరు వేరు..తెర మీదైనా తెర ముందైనా ఆయన అంటే శ్రీ రాముడు..శ్రీ కృష్ణుడు. అంతే..మరి ఇప్పటి పరిస్థితులు వేరు..బలమైన లాబీతో ఉన్న రాజశేఖరుడు..సోనియా మాత దయ తో పాటు..సొంత మీడియా..సొంత బంధు జనం, సొంత నిర్ణయాధికారం..ఇలా చాలా 'సొంతం ' చేసుకున్న ఆయన చెయ్యి ముందు రైళ్ళు సైకిళ్ళు కార్లు అన్నీ ఆగిపోయినాయి..

ఇంక సొంత 'వర్గం ' లో కుమ్ములాటలు సొంత నియోజక వర్గంలో సాంతం గా ఓడిపోవడాలు సొంత వాళ్లెవరో కానివాళ్ళెవరో తెలియకపోవడం వల్ల ఇన్నాళ్ల పేరూ .......

బావ- బావమరుదుల రెండు జంటలు ఉన్నా...సాధించలేక పోయారు.

ఫైనల్ గా ఏంటంటే
ఈనాటి రాజకీయాల్లో

క్వాలిఫికేషన్ లేకపోయినా క్లారిటీ ఉండాలి..
మీసం మెలెయ్యడం రాకపోయినా మోసం చెయ్యడం రావాలి..
కంటి చూపుతో చంపడాలు రాకపోయినా ..కన్నింగు నేచరు ఉండాలి
డవిలాగులు చెప్పడం రాకపోయినా .. కల్లబొల్లి కబుర్లు చెప్పడం రావాలి

అందుకే ఈ 'రాజ ' కీయాలు మనకెందుకు..హాయిగా మంచి మంచి సినిమాలు చేస్తూ...రక్త దానం నేత్ర దానం గురించి మోటివేట్ చేస్తూ..అన్నయ్య గా ఉండిపోతే ..హాపీ కదా..

ఓకే జనంస్ ఎలాగూ అధికారం వచ్చింది..కాబట్టి మొన్న తగలడిపోయిన జీవోల కాపీలు మళ్లీ రెడీ చేసేద్దామా...లెట్స్ గో....



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, మే 16, 2009

రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా...

రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా...

హస్తం గతం అనుకున్నారంతా..కానీ అధికారం హస్తగతం అయింది. ఏంటో అంతా ఇందిరా మహిమ. రాజశేఖరుని రాజకీయం ముందు అంతా పటాపంచలైపోయాయి. గుండెల్లో 'రైళ్ళు ' పరిగెత్తిస్తారనుకున్నా ప్రజా రాజ్యం ఓనర్లు వాళ్లకే సీట్ కంఫర్మ్ కాలేదు. ఇక మిగిలిన వాళ్లకి ఏం దొరుకుతుంది.మంత్రాలకు చింతకాయలు..గ్లామరుకు ఓట్లు రాలవు అన్నది సత్యం. ఇక సైకిల్ కి కార్ ని కట్టి లాగుదామనుకుని కంకీ కొడవలి జెండా కూడా కట్టి మొదలెడితే క్రాస్ ఓటింగో...మరోటో కానీ అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది..

ప్రజలకి ఆరోగ్యశ్రీ నచ్చిందో...ఇందిరమ్మ ఇళ్ళమీద నమ్మకమో తెలీదు కానీ..పంచె కట్టిన పెద్దాయన అధికారాన్ని వై అనకుండా ఎస్ అని మళ్ళీ ఎసెంబ్లీ కి పంపిస్తున్నారు. రక్తం పంచిన మెగా అభిమానం...ఎన్ టీ ఆర్ వారసుల ప్రచారం ఇవేవీ అడ్డుకోలేక పోయాయి అంటే ఏదో ఉంది. అది ఏంటో తెలుసుకోలేక పోతే మిగతావారికి కష్టం.

విపక్షాలతో గొడవెందుకని వదిలేసిన ప్రధాని పదవి విషయాన్ని త్యాగం గా మార్చి చూపగల చతురత ఉన్న వాళ్ళు కాబట్టి అటు కేంద్ర అధికాన్నీ 'చే ' జిక్కించుకున్నారు. వందేళ్లకోసారి వికసించే కమలం ఈసారీ సగమే విచ్చుకుంది. మతవాద పార్టీగా ముద్రపడడమో..అంతర్గత విబేధాలో..గత వైఫల్యాలో కానీ కర్ణుడి చావుకున్నట్టు చాలా కారణాలు వెతకచ్చు ఇంక ఎంచక్కా మరో ఐదేళ్ళు. అప్పటికి నాయకత్వంలో ఎందరు యువకులు మిగుల్తారో. ?


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

ELECTION RESULT


myspace layouts


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, మే 12, 2009

ఏ పీ ఎల్ 2

ఏ పీ ఎల్ 2

ఒక దశ ఐపోయింది.. ఇక రిజల్టు దశ మిగిలింది..ఏ పీ ఎల్ అంతే..నేను ఇంతకు మునుపు చెప్పినట్టు..

రాయల్ సీమ రాజీవ్స్ ఎంతో ఆత్మ విశ్వాసం తో ఉన్నారు..అన్నిప్లేసులూ మావే.. అన్నట్టుగా ఉన్నారు..ఎలాగూ 'సచివాలయం ' లో (ప్రజల ఖర్మ)కాలిపోయిన ఫైళ్ళు వెనక్కి రావు కాబట్టి జీవోలేవి ఇచ్చారో ఏవి ఇవ్వలేదో ఆ 'పై(సలుతిన్న)  ' వాడికే తెలుసు.

టీ ఆర్ ఎస్ టార్టాయిస్ లు నడక మొదలెట్టాక కొంత సేపు టీ డీ పీ టైగర్స్ దగ్గర ఆగితే మనింటికే అనుకుని సీట్లిచ్చి మరీ ఆతిధ్యం ఇచ్చారు..తెలంగాణ తధ్యము సుమతీ అని శలవిచ్చారు..కానీ మళ్ళీ నడక మొదలెట్టి ఎన్ డీ ఏ దగ్గర ఆగింది..మళ్ళీ నడకమొదలెట్టి కాంగ్రెస్ దగ్గర కెళ్ళినా ఆశ్చర్యం లేదు..

ఇక చిరంజీవి చాలెంజర్స్ ..మాచ్ ఫిక్సింగు జరిగిందా ? జరిగితే దాని పర్యవసానాలేంటి..ఒక వేళ సెమీ ఫైనల్స్ దాకా చేరితే...ఏ 'టీం ' తో టై అప్ అవ్వాలో....లెక్కలు మొదలెట్టారు..

లోక్ సత్తా లయన్స్ ....రేల్లీ గ్రేట్ ఎందుకంటే జంగిల్ కా రాజా లయన్ ఒక్కళ్ళే ఉంటారు..ఆ 'లయన్ ' జే పీ ...

రాజకీయాల్లో నక్కల్లాంటి లయర్ ల కే కానీ లయన్ లకి  పెద్దగా లాభాలుండవ్..

చూద్దాం పదహారు రోజుల పండగ నాడు ఎవరు గెలుస్తారో..ప్రజల అదృష్టం ఎలా ఉందో..

 

 

బుధవారం, మే 06, 2009

ఓటర్ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి....

ఓటర్ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి....

ఓటర్ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి(వొట్టేసి) ఈ ఐదేళ్ళు మీకు కనపడి విసిగించనని,,రఒడ్ షోలు ..ప్రజా సభలూ నిర్వహించనని...మేనిఫెస్టోలు గట్రా పంచనని..ముఖ్య మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను....ఇది మనసులో మాట ఐ వుండొచ్చు కానీ ప్రస్తుతం 16 వ తారీఖు రిజల్టు తరువాత ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారో కానీ...మొత్తం అందరూ మాత్రం ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు...ఎవరికి వారు 160 సీట్లు మావే అంటున్నారు..ఐమాక్సు లో సీట్లకే దిక్కు లేదు అసెంబ్లీ సీట్లగురించి ఎలా చెప్పగలమో కానీ న్యూస్ చానెల్స్ చూస్తే వాళ్ళ వాళ్ళ లెక్కలు వాళ్ళు చూపించేస్తున్నారు..
చిరంజీవి ఐతే నిజాం కాలేజీలోనూ..చంద్రబాబైతే గవర్నర్ హౌసులో/గచ్చిబౌలీ స్టేడియం లో , వై ఎస్ ఐతే ఎల్ బీ స్టేడియం లో ఇలా ప్లాన్ చేస్కుంటున్నారట ? ఇది నేను విన్న మాట ..ఉన్న మాట ఏంటో తెలీదు..ఇంకో విసేషమేమిటంటే..చంద్రబాబు గారేమో మొదటి సంతకం నగదు బదిలీ పధకం మీద చేస్తార్ట....ఇక చిరంజీవి గారు వందరూపాల నోటు మీద సారీ, వందరూపాయల పధకం మీద..వై ఎస్ గారేమో...నాకు తెలీదు..బాబూ సోనియా కే తెలుసు..
సంతకం అయ్తే చేస్తారు మరి పధకాలు పరిస్థితి ఏంటో తెలీదు..ఎందుకంటే ఇదివరకు ఇల్లా సంతకాలు జరిగాయి కానీ అసలు విషయానికి వచ్చేసరికి..కొద్ది రోజుల్లోనే రద్దైపోయాయి..మేనిఫెస్టోల్లో లేని పనుల 'జీ వోలు ' వీజీగా రెడీ ఐపోతాయి కానీ (వోటర్ జీవాలకి )ప్రజలకిచ్చిన మాటల్లో ఎన్ని నిజమౌతాయో మరి...ప్రజలమీద ప్రమాణం చేసారు కదా...పోతే జనం పోతారంతే...

మంగళవారం, ఏప్రిల్ 28, 2009

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ
ఇప్పుడు ఎవరి నోట విన్నా...అఖయ తృతీయ గురించిన మాటలే...బంగారం కొందామంటే షాపులు నేల మీదే ఉన్నా ధరలు మాత్రం ఆకాశంలో వున్నాయి..ఐనా ఏదో ఒక ఆఫర్ పేరుతో జనాన్ని ఆకర్షిస్తునే ఉన్నారు జనం కూడా కొంటూనే వున్నారు. అసలు ఓ పదేళ్ళ క్రితం వరకూ లేని ఈ బంగారం పండగ సడెన్ గా ఎలా డెవెలప్ అయిందో కూడా అర్ధం కావట్లేదు..ఎన్నో శతాబ్దాలుగా ఉన్న, సిమ్హాద్రి అప్పన్న చందనోత్సవం కన్నా పాపులర్ అయిపోయింది..ఆశ్చర్యం కదూ..ఎంతైనా ఈ వ్యాపార అయస్కాంతాల ఆకర్షక పధకాలకు హాట్సాఫ్ అనాలనిపిస్తుంది.ఆరోజు ఎంతో కొంత బంగారం కొంటే మనకు మంచిదా ? లేక ఎక్కువ అమ్మితే వాళ్ళకు లాభమా అన్నది...కొనే వాళ్ళకే తెలియాలి.
సరే ఇక్కడ బంగారానికి సంబంధించిన అక్షయ తృతీయ సంగతి ఇలా ఉంటే..ఇంకొన్ని చోట్లా తృతీయ అనే మాట్లాడుకుంటున్నారు. అదే రాజకీయాల్లో నండీ. ఎవరు పీఠం ఎక్కుతారంటే తృతీయ కూటమి అంటున్నారు. ఎలాగూ ఎవరికీ పూర్తి మెజారిటీ రాదు కాబట్టి ఏదో ఒక మూడో కూటమిగా మారి ఎక్కాల్సిందేనని నిపుణుల భావం...ఏడాది కోసారి చందనం వలిచి నిజరూపం చూపించినట్టు..మనకి కూడా ఐదేళ్ళకోసారి మొహమాటం విడిచి నిజరూపం అంటే ప్రజలు గా (ఇలా అనే కంటే ఓటర్లుగా అంటేనే కరెక్టేమో?) అవకాశం లభిస్తుంది..ఐతే అక్కడి రూపాన్ని చూడడానికీ మనమే లైన్ లో వెళ్ళాలి..ఇక్కడ "కోపాన్ని " చూపించడానికీ మనమే లైన్ లో వెళ్ళాలి. ఏదైతేనేం ఎన్నికల హడావిడి అయిపోయింది..ఇక లెక్కలు తేల్చే పని మిగిలింది..కొనగలిగినవాడిదే బంగారం కూడగట్టకలవాడిదే అధికారం. అక్షయ తృతీయ రోజు బంగారం దొరుకుతుంది కానీ బంగారం లాంటి ప్రభుత్వం దొరుకుతుందా ?లక్ష్మీ దేవీ మాకు కూడా మంచి చెయ్యమ్మా ?

ఆదివారం, ఏప్రిల్ 26, 2009

గ్రాఫికాలయా

గ్రాఫికాలయా

మొన్నీ మధ్య నవతరంగంలో అరుంధతి బాధితుల్ని చూశా (చదివా), ఆ సినిమా గురించి చదివినప్పుడు నవ్వొచ్చింది..ఆంధ్ర అంతటా అత్యంత క్రియేటివ్ సినిమా గా పేరొందిన చిత్రం గురించి వ్రాసిన పోస్టు చూసి చిత్రం అనిపించింది..నిజమే కదా అనీ అనిపించింది..ఐతే, పుర్రెకో బుద్ధి.అన్నట్టు ఎవరికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అన్నది తెలీదు కదా...మన ఆంధ్రా స్పీల్బర్గు అదేనండీ శ్యాం ప్రసాదు రెడ్డి గారు..శబ్దాలయా అని స్టూడియో పెట్టారు
అసలు ఆయన దౄష్టి అంతా దౄశ్యాల మీదే కాబట్టి దౄశ్యాలయా అనో...గ్రాఫికాలయా అనో పెట్టుండాల్సింది....అంకుశం లాంటి పవర్ ఫుల్ మూవీ తీసి..రాజసేఖరుణ్ణి ఆ భ్రమలో పడేసిన తరువాత, ఎందుకో ఆయన దౄష్టి గ్రాఫిక్కుల మీదకి మళ్ళింది...అమ్మోరు..పాపం ఈ సినిమా సౌందర్య మొదటి సినిమా కావాల్సింది..ఆయన పెర్ఫెక్షన్ కోసం చూసేసరికి..పన్నెండోదో ఎంకేదో సినిమా అయ్యింది..అమ్మ వారి మహిమ ముఖ్యమో..గ్రాఫిక్కులు ముఖ్యమో తెలీదు కానీ, బ్లూ మాటు సీన్లలో బ్లూ మాత అంటే రమ్యకృష్ణ బ్లూ గా మనకి కనపడుతుంది...ఏంటో నీలిమేఘ శ్యాముడైన ఆ శ్రీనివాసుడిలా..

ఇక అంజి అని మొదలుపెట్టి మైదా గంజిలా సాగదీసి, చివర్కు జనాలకు కైలాస దర్శనం చేయింది,ఆయన మాత్రం లాసు దర్శనం చేసుకున్నారు..ఇప్పుడు అరుంధతి తీసారు...జనం చూశారు..చూస్తున్నారు...ఐనా అంత మహరాణీ గెటప్పు, భారీ ఆభరణాలు, రాజరికం హోదా ....ఇల్లాంటి కారెక్టర్లేస్తే మళ్ళీ మళ్ళీ అవే వస్తాయని..బిల్లా సినిమా కూడా చేసేసింది కదా..అదేంటో అందమైన కారెక్టర్లంటే అంత ఎలర్జీ....ఈ హీరోయిన్ లకి,


ఇప్పుడు అరుంధతి, హిందీ, తమిళం, మళయాళం ఇలా కావాల్సినన్ని భాషల్లో చూడొచ్చు మనం..ఎందుకంటే గ్రాఫిక్స్ రెడీ కధ రెడీ ఆడియన్సులు రెడీ, గ్రాఫిక్ప్రసాదరెడ్డి రెడీ,
మల్లెమాల బానరు మీద...

కొంత మంది పేర్లు చెబితే వాళ్ల సినిమాలు ఎలావుంటాయో తెలిసిపోతుంది.. బీ గోపాలు..రక్తంచిందించేరెడ్డి సినిమాలు..ఈ వీ వీ నవ్వులు పండించే సినిమాలు, విశ్వనాథ్ కళల్నీ చూపించే సినిమాలు...బాలివుడ్ లో రాంసే అని ఒకాయన ఉన్నాడు ఆయన బానర్ అంటే దెయ్యం సినిమాలే...రాం గోపల్ వర్మ ఇంట్లో మర్డర్ సినిమాలు..ఇలా ఇప్పుడు శ్యాం ప్రసాద్ అంటే గ్రాఫిక్కుల చిత్రాలు అనుకోవచ్చేమో...

గొప్ప సినిమా అంటే చాలా కాలం తీసి, కొన్ని రోజులు ఆడడం కాదు..
కొన్ని రోజుల్లోనే తీసినా...చాలా రోజులు ఆడడం..

ఎలాంటి అమెరికా కంపెనీలు..గ్రాఫిక్ ఇన్స్టిట్యూట్లు లేకుండానే ....మాయా బజార్ ఇప్పటికీ అజరామరం....అదీ సినిమా అంటే..జై
మాయా బజార్..


శుక్రవారం, ఏప్రిల్ 24, 2009

ఖాళీ డేస్

ఖాళీ డేస్

హాలీ డేస్ అనబోయి అలా అన్నా అంతే...పరీక్షలైపోయి మన రాజకీయ నాయకులు శలవలొచ్చిన స్కూలు పిల్లల్లా ఎదురుచూస్తున్నారు..ప్రస్తుతం ఖాళీయే కదా...రిజల్టుకు టైముంది కదా..అందుకే శలవులు ఎంజాయ్ చేస్తునారు..పాస్ ఐతే ఏం చెయ్యాలి (మరి వాగ్దానాలిచ్చేసారు కదా)...ఫెయిల్ ఐతే ఏం చెయ్యాలి....అని ఆలోచిస్తున్నారు..

ద్రవ్యోద్బళణం ఈ ఎన్నికలకి అడ్డం రాలేదెందుకో ? ఎవరికైనా తెలుసా ఆ రహస్యం..కంపెనీ పెట్టి చాలా సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు చేసి....ఒక ఐ టీ రంగం లో గొప్పవాడిగా ఎంతో పేరు తెచ్చుకుని..మరో ఐ టీ(ఇంకమ్మూ..టాక్సులూ) విషయంలో చెడ్డపేరు తెచ్చుకున్న వాళ్ల కన్నా ఎక్కువ ఎలా కూడబెట్టారా అని ఆస్చర్యమేస్తోంది..

ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని..గొడవలు పడిన ఈ నాయకులు ఇప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో...ప్రభుత్వం నడపడానికి స్టీరింగు ఎవరిదో తెలియట్లేదు..ఎవర్ని ఎంత పెట్టి కొనాలో.ఎంతమందిని కొనాలో...లెక్కలు కడుతున్నారు ప్రస్తుతం....


సినిమా ఇండస్ట్రీలోనూ ....రియల్ ఎస్టేట్ రంగంలోనూ కూడా లేనంత డబ్బు ఎలా ఎక్కడినుంచి వస్తోంది..అది ఎవరి డబ్బు...ప్రజలదేనా...ఇప్పుడు వాళ్లమీద అధికారం చెలాయించడానికి మళ్ళీ వాళ్లకే కూలీ ఇస్తున్నారా ? అని ఒక్కోసారి డౌట్ వస్తుంటుంది నాకు..

 

ఇప్పుడు రాజుల్లా కనిపిస్తున్న ప్రజలు..లైన్లలో వెళ్ళి వేసిన ఓటు..ఎలాంటి అధికారాన్ని తెస్తుందో తెలీదు కానీ ...ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఓటర్లు ప్రజలు గా మారిపోయి ... మళ్ళీ పాత పనులే చేసుకుంటూ....'ఖాళీ డేస్ ' గడిపేస్తారు మరో ఐదేళ్ళు...

 


--
REFRESH YOUR MINDS WITH
WWW.FUNCOUNTERBYPHANI.BLOGSPOT.COM

శనివారం, ఏప్రిల్ 18, 2009

ఏ పీ ఎల్ అను ఆంధ్రా పొలిటికల్ లీగ్

ఏ పీ ఎల్ అను ఆంధ్రా పొలిటికల్ లీగ్

16-23 అదేదో '20-20' లాగా 16-23 తేదీల్లో జరిగే 'ఆంధ్రా పొలిటికల్ లీగ్' లో పాల్గొనే జట్లు నాయకులు, కోచులు వివరాలు..

రాయల్ సీమ రాజీవ్స్ --------ఫ్రాంచైజీ ఓనర్ సోనియా గాంధీ...కప్టెన్ కం కోచ్, వై ఎస్ రాజసేఖర్ రెడ్డి...
ఫస్త్ మాచ్ కాగానే కెప్టన్ తెలంగాణా బాల్ ని 'చేత్తో ' పట్టుకుని 'సెల్ఫ్ ఔట్' అయ్యాడు...ఐతే తరువాతి మాచులు ఓన్ పిచ్ లో అవడం వల్ల ... కొంచెం ధైర్యంగా నే ఉన్నాడు.
' సీ ఎం' కప్ మా 'చేతికే ' వస్తుంది అని ఆయన ధైర్యంగా చెబుతున్నాడు.. తన తురుపు ముక్కలైన ఆరోగ్యశ్రీ..ఇందిరా ఇళ్ళు (ఫాస్ట్ బౌలర్లని) ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదని....తను, తన వాళ్ళు వేసే బీమర్లకి ఎదురు లేదని...పావలా వడ్డీ స్పిన్ తిరిగి అవతల వికెట్లని గిరాటేస్తుందని ఆయన విశ్వాసం.. స్వంత చానెల్ ఉండడం కూడా కొంత వరకూ లాభమే...'స్లెడ్జింగ్' చేసినా మంచిగా మార్చి...తిట్లు కూడా 'డింగ్ డాంగ్' అంటూ మార్చి చూపించొచ్చు....ఫ్రాంచైజీ ఓనర్ సోనియా ఇచ్చిన ఫ్రీ డం కూడా ఉపయోగమే....ఈ మధ్యే జట్టులోకొచ్చిన జగన్ లాంటి యువకులు అండగా ఉండడంతో ..ఆశలు అధికమయినాయి...మద్దతిచ్చిన వారికి కాంట్రాక్టులు ఫ్రీ...


తెలుగుదేశం టైగర్స్ :
'బొబ్బిలి పులి' స్ఫూర్తితో ...ఓపెనింగ్ బాట్స్ మెన్ 'బాలయ్య'...జూనియర్ ఎంటీ ఆర్ మీద బాగా ఆధార పడ్డ ఈ టీం ఓనర్..స్వర్గీయ ఎన్ టీ ఆర్ ఐనా...ప్రస్తుతం కోచ్ కం కప్టెన్ చంద్ర బాబే నడిపిస్తున్నాడు...మోనోపలి ఎక్కువ అవడం..ఈ మధ్య వచ్చిన, 'కొత్త టీం' లోకి కొంతమంది దూకడంతో కొంచెం వెనకబడ్డా...ఓపెనింగ్ జంట అదరగొట్టడంతో కొంచెం పుంజుకుంది..కానీ ఎన్ టీ ఆర్ 'రిటైర్ద్ హర్ట్' అవడం తో కొంచెం కుంటు పడింది..
'కమ్యునిస్ట్ కంగరూలు' కూడా కలవడం మంచికో...కాదో అర్ధం చేసుకునే లోపల..కొన్ని బెర్త్లు ఇచ్చేయడం వల్ల కొంచెం నష్టపోయినా...సీనియర్లు ఆదుకుంటారని ఒక ఆశ.....పైకి గంభీరంగా ఉన్నా...కొత్త ఫ్రాంచైజా టీం వల్ల కొంచెం నష్టపోయినట్టే చెప్పుకోవాలి..

' టీ ఆర్ ఎస్ టార్టాయిస్ ": తెలంగాణా టెస్ట్ టీం తెలంగాణా ఇస్తారా ఇవ్వరా అని,
ఫలానా తేదీలోగా 'తెలంగాణా కప్' తెస్తామంటూ ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక తెలంగాణా వైపు నడుస్తున్న టీం, కలవడం వల్ల కూడా కొంతమంది గెలిపించే బాట్స్మెన్ ని కూర్చోబెట్టి వీళ్లకి సర్దుబాటు చెయ్యవలసి రావడంతో..ఏం జరుగుతోందో తెలీక ప్రస్తుతం మహాకూటమి మేనేజర్స్ గా బరిలోకి దిగింది...ప్రస్తుతం మల్టీకప్టన్సీతో పోరులో ఉంది..

నారాచంద్రబాబు నాయుడు అంటే

నారాయణా
రాఘవులు
చంద్ర సేఖర్ రావ్
బాబు నాయుడు గా కలిసి పోయి మాచ్ లోకి దిగారు...

చిరంజీవి చాలెంజర్స్ : కొత్తగా వచ్చిన ఈ ఫ్రాంచజీ ఓనర్ 'అల్లు' అరవింద్...వ్యూహాత్మకంగా నడుపుతున్న ఫ్రాంచైజీ ఇది...అనూహ్యంగా అతి తక్కువ వ్యవధిలో దూసుకు వచ్చిన ఈ ఫ్రాంచైజీ కోచ్ 'మిత్రా'....కెప్టెన్ 'చిరంజీవి'....'అన్న తమ్ములు', ఒకరి కోసం ఒకరు ఆడడానికి, త్యాగం చెయ్యడానికి రెడీ గా ఉన్నారు...'స్టార్లు' ఉండడంతో జనాదరణ ఉంది...ఐతే అందరూ 'టికెట్లు కొంటారా', ఎస్ ఎం ఎస్ తో 'ఓటింగ్ చేస్తారా' అన్నది తెలీదు...సడెంగా కొంత మంది కి టీం లో చోటు దక్కక వెళ్ళిపోవడం కొంచెం నష్టం కలిగించినా, కెప్టెన్ మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు... ముఖ్యంగా ఎనలిస్ట్ 'ప్రభాకర్' ..వల్ల ఎక్కువ నష్టం కలిగింది...ఐన...మా లెక్కలు మాకున్నాయని ధైర్యంగా చెబుతున్నారు....

లోక్సత్త లయన్స్ : అండర్ డాగ్స్ గా బరిలోకి దిగుతున్నా 'సత్తా' చాటగలమని ధైర్యంగా 'విజిలేసి' మరీ చెబుతున్న ఈ ఫ్రాంచైజీ ఓనర్..కోచ్ ..కెప్టెన్ 'జె పీ'....అన్నీ తనే చూసుకోవాల్సి రావడం వల్ల ఎక్కువ సమయం దేనికి కేటాయించాలో తెలీక పోయినా.....తమ నిజాయితీనే తమ టెక్నిక్ అని చాటుతున్నారు.....కొంచెం కూడా భయం లేకుండా పెద్ద జట్లతో తలపడుతున్నారు...చదువుకున్న వారంతా తమవెంటే వున్నారని...వాళ్ళు విశ్వాసంతో చెబుతున్నారు....

ఇంకా కొన్ని టీంస్ ఉన్నా ముఖ్యమైనవి ఇవే...కాబట్టి....ప్రస్తుతానికి మాచ్ చూసి విన్నర్స్ ఎవరో కనుక్కోవడమే...ఎవరు గెలిచినా ఓడినా మాన్ ఆఫ్ ది సీరీస్ మాత్రం 'జే పీ'నే....

బుధవారం, ఏప్రిల్ 15, 2009

ఎలక్షన్ లక్ష్మీ వ్రతం

గస్తీ మే సవాల్
బస్తీ మే గస్తి
బస్తీ మే ఎలెక్షన్ మస్తి
సారా హుషార్
ఎలెక్షన్ కలెక్షన్
పోలింగ్-పోలీసింగ్
వోటుకు నోటు
నాటు సారా...నోటూ, చీరా
మన గుర్తు మందు సీసా..వంద నోటు

ఎలక్షన్ లక్ష్మీ వ్రతం

మా ఇంట్లో వాళ్లు ఎలక్షన్ లక్ష్మీ వ్రతం చేస్తున్నారు...మీ ఇంట్లో పద్దెంది నిండిన వాళ్ళంతా వచ్చి..వేలు మీద చుక్క పూయించుకుని...ఓట్లు జల్లి వెళ్ళండి..అంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు కార్య కర్తలు.....ఓటరు పరిస్థితి చూస్తే .....నామినేషన్ కోసం వెళ్తే...ఓటర్ లిస్టులో పేరు లేదన్నట్టు ఉంది పరిస్థితి...ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో.....ఎన్నికల సీన్....

గస్తీ మే సవాల్ : , పాపం తిండీ నిద్రా వదిలి, ఇంటికి దూరంగా..ఉంటూ రాబోయె ప్రభుత్వం ఎవరిదో తేల్చే....ఎలక్షన్ కోసం గస్తీ తిరుగుతున్న పోలిసులకు సవాల్,.... కాబోయే నాయకులు...వాళ్ళ అనుచరులు మంచోళ్ళైతే వీళ్లకి ఈ తిప్పలెందుకు....
బస్తీ మే గస్తీ : వోట్ల సంగతెలా..ఉన్నా కోట్ల రూపాయలు తరలిపోతున్న సందర్భంగా బస్తీ లన్నిటిలో గస్తీ....ఐనా ఎప్పటికి తగ్గేనో ఈ సుస్తీ....
బస్తీ మే ఎలెక్షన్ మస్తి : కొత్త పార్టీ ఆఫీసు...గది నిండా జనం...రంగు రంగు జెండాలు..బాజా బజంత్రీలూ...పోస్టర్లు...పాంప్లేట్లు..చికెన్ ప్లేట్లు..మందు బాటిళ్ళు...బస్తీ మే ఎలక్షన్ మస్తీ..........

సారా హుషార్ : ఎలక్షన్ లో ఓటెయ్యలంటే హుషార్ ఉండాలి కదా...అందుకే సారా నది పారించేస్తారు...సదరు ...లోకల్ నాయకులు.....సారా తాగేసి పడిపోతే ఓటెవడేస్తాడో మరి...ఒక రోజు సారా మైకం కోసం...ఐదేళ్ళు దాసోహం...అందుకే 'సారా హుషాఋ

ఎలెక్షన్ కలెక్షన్ : ఇలా ఒక్కొక్కళ్ళకి పంచడం కష్టం బాసూ...ఒకేసారి వెయ్యి ఓట్లు వేయించేస్తే ..హాయి...ఐతే...వోటుకో వెయ్యి....జేబులోంచి తియ్యి...అనే లేడర్లు ఉన్నారు...వీళ్లు జనసమీకరణ అనే విషయంలో డాక్టరేట్లు పొందిన లేడరులు......కలెక్షన్ అందజేస్తే...ఎలెక్షన్ జరిపించేస్తారు..అడ్డాలనుంచీ.. జనాన్ని తీసుకొచ్చి...గుద్దించేస్తారు..ఓట్లు....కలెక్షన్ కింగులు..

పోలింగ్-పోలీసింగ్ : జరిగేది చూడడమే తప్ప....యాక్షన్ తీసుకునే రైట్ లేని పోలీసులు...ఎవర్ని ఏమన్నా...పాపం పై నుంచి వెంటనే ఏవో ఆర్డర్లు...మా వాళ్ళని వదిలెయ్యమని...అధికార పక్షం వాళ్ళని పట్టుకుంటే..అక్షింతలు...ప్రతి పక్షం వాళ్లనేమైనా అంటే...బైఠాయింపులు..న్యూసెన్స్ చానెళ్ల షూటింగు చార్జులు....
పాపం పోలింగు లో పోలిసింగు....

వోటుకు నోటు : ఇది పాత స్కీము...సాంప్రదాయంగా వస్తున్న ఎలక్షన్ మహలక్ష్మి వ్రతం...ఆటో ఖర్చులకిచ్చినట్టు...ఏదో ఒక పేరుతో ఇలా నోటిచ్చి ఓటు కొనుక్కునే మహానుభావులున్నారు....వ్రతం చెడ్డా ఫలం దక్కితే చాలనుకునే వీళ్లకి ఓటేస్తే క్షావరమే తప్ప ఇంకేమీ ఉండదు...

నాటు సారా...నోటూ, చీరా : ఇది ప్రచారం హడావిడి ఉన్నప్పుడు జరిగే తంతు...ఇదీ ఒకరకంగా వ్రతం లో భాగమే ఐనా ...కొంచెం ముందుగా చేసేస్తారు....ఎందుకంటే ఎన్నికల రోజున మందు దొరకదు కదా (ఔనా?)

మన గుర్తు మందు సీసా..వంద నోటు ; పాపం కొంతమంది అమాయకుల కొంతమంది ఏం ఖర్మ..చాలా మంది కి కనిపించే గుర్తు ఇదే....అలా ఒక పూట మత్తు కోసం...ఐదేళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకునే వాళ్ళని ఏం చేస్తే బుద్ధొస్తుంది...అఫ్ కోర్స్ మనమేం చెయ్యక్కర్లేదు...వాళ్ళు ఎన్నుకున్న నాయకులే చేస్తారు...*(వాళ్ళకి ఏమీ చెయ్యకుండా...)

అప్పటికైనా ...కళ్ళు తెరుస్తారేమో..అంటే కల్లు కోసమైతే తెరుస్తాం అంటారేమో....




సోమవారం, ఏప్రిల్ 13, 2009

ఎ లక్ష(న్) ప్రశ్నలు

ఎ లక్ష(న్) ప్రశ్నలు

ఎలక్షన్ 2009 స్టార్ట్ అయింది, కానీ ప్రజలకి మాత్రం కన్ఫ్యూజన్ మొదలైంది....ఈ నియోజకవర్గ వి 'భజనల్లో' ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం లోకి వెళ్ళిందో? తెలీదు...ఈ చానెళ్ళ 'భజనల్లో' ఏది ఏపార్టీయో అర్ధం కావట్లేదు...ఎవరు ఏపార్టీ నుంచి ఏ పార్టీలోకి దూకారో...సీటు దొరక్క రెబల్ గా నుంచున్నారో...ఎవరు ఎం ఎల్ ఏ నో...ఎవరు ఎం పీ నో అసలు అర్ధం కావట్లేదు...

ప్రచారానికొచ్చేవాళ్ళంతా ఎలక్షన్లో నుంచున్న వాళ్ళేనా...సభలకొచ్చే వాళ్ళంతా ఓటేసే వాళ్ళేనా...అన్నది లెక్కకందట్లేదు..


------------------------
అయ్యా..మా వూళ్ళో ఒకడు ఉన్నాడండీ ఆడికి సీటు రాకూడదండి..ఎంతయిద్ది.. ఆ సీటు నాకు రావాలండి ఎంతవుద్ది....
ఓస్ అంతేనా...
అంతేనా అంటే ఇంకోటుందండి...మా ఊళ్లో నాకో కీపుందండి ....దానికి ఎం పీ సీటు కావాలండి ...ఎంతవుద్ది ....
ఓస్ అంతేనా..
అంతేనా అంటే ఇంకా చాలా ఉన్నాయండి...ముందు దీని రేటు తేల్చండి ....
ఆడి సీటు చెడగొట్టడానికెంతవుద్ది...నా సీటెంతవుద్ది...ఎంపీ సీటెంతవుద్ది...
ఎంపీ సీటు...నా సీటు ఎంతవుద్ది...
ఉట్టి చెడగొట్టడానికెంతవుద్ది....
మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే..మీకు మా పార్టీ సలహాదారు పోస్ట్ ఇప్పిస్తా....
మీరు నాకు నూటికి రెండు రూపాయల కమీషన్ ఇవ్వాలి....


ఇది అంత అరీ బురీగా తేలే యవ్వారం...కాదు...రేటుల్లిస్టు చూసి చెబ్తా...


ఇదిగో సెగట్రీ...అసలీడెవడు..నిజంగానే సీటుకోసం వచ్చాడా లేక మన యవ్వారం లాగడానికి ఏ టీ వీ చానెల్ నుంచో....వచ్చాడా...బాగా కన్నేసుంచు...తేడా వొచ్చిందో డిక్కీలో తొంగోబెట్టేయ్....ఏ ప్రచారసభలోనో తొక్కిసలాట లెక్కల్లో కలిపేద్దాం....
మా సెగట్రీ మాట్లాడతాడండీ,,,,,,,,,,,

ఆడి సీటు చెడగొడితే చాలు....నా సీటు సంగతి నేను చూసుకుంటా అన్నావు ఏం చూసుకున్నావ్...ఇప్పుడు ఆ సీటు ఆడి బామ్మర్దిని నిలబెట్టాడు....అనుభవించు...

.

ముత్యాల ముగ్గులో రావు గోపాల్రావ్ డవిలాగులు గుర్తొస్తున్నాయి,....ఈ బేరాలు సూత్తుంటే...వీళ్ళా మనల్ని పాలించబోయేది అనిపిస్తోంది...అసలు ఇంత డబ్బు ఎక్కణ్ణుంచి వస్తోంది...ఎక్కడికి పోతోంది...


-----------------------------------------------.

ఎన్నికల ముందు ప్రకటించిందెంత, పంచిన డబ్బులెన్ని, పట్టుబడ్డ డబ్బెంత,,,,,,ప్రచారానికెంతయింది...ప్రజా సభల ఖర్చెవరిది...ప్రకటనల పారితోషికాలెంత....సర్వేలకయిందెంత....నల్ల డబ్బెంత..తెల్ల డబ్బెంత....పారబోయే సారా ఎంత...పారబోసిన సారా ఎక్కడిది....దేశ బడ్జెట్ నే దాటేసిన ఈ డబ్బు ప్రజలదా...నాయకులదా....ఎన్నికలకే ఇంత ఖర్చు పెడితే...గెలిచాక ఎంత సంపాదిస్తారు..ఎంత ఖర్చు పెడతారు..అసలు పంచడానికి ఇచ్చిన డబ్బు ఓటరు దాకా వెళ్తుందా...దళారుల చేతిలో ఆగుతుందా...ఈ ఎలక్షన్ ప్రశ్నలకి జవాబు యక్ష ప్రశ్నలకి జవాబు చెప్పిన ఆ ధర్మ రాజు కూడా చెప్పలేడేమో...

ఆదివారం, ఏప్రిల్ 12, 2009

బి(కిని)ల్లా

బి(కిని)ల్లా
బిల్లా అంటే ఏంటో ఆ దేవుడికే తెలియాలి...తమిళం లో ఉంటే మనం వాతలు పెట్టుకోవడం ఎందుకో అర్ధం కాలేదు..మొన్నీమధ్యే నాగార్జున డాన్ అని తీసారు కాబట్టి వేరే పేరు కోసం చూసి చివరకు ఆ పేరు ఖరారు చేసుకున్నారు కాబోలు..అయిన మళ్ళీ బిల్లా రంగా అంటూ పాత సినిమా లోని పేర్లే వాడుకున్నారు...డాన్ లోనూ యుగంఢర్ లోనూ పేరు తెచ్చిన కిళ్ళీ పాట లేకున్నా బికినీల పాటలు మాత్రం ఉన్నాయి..

ఓపెనింగే అదుర్స్....హెలికాప్టర్ లో వచ్చిన బిల్లా నడక, సూటు,,బూటు...తుపాకీలు తీసుకునే విధానం అన్నీ బాగాతీశారు...హెలికాప్టర్లో వచ్చిన హీరో ని మోసం చెయ్యాలని చూసి ఆ హీరో గారు నోట్లో మందు పోసుకుని మొహం మీద ఊసేదాక మంట తో సహా పాపం ఎవరూ కాలచరు...ఈలోగ హెలికాప్టర్ వచ్చి హీరో గారిని తీసుకెళ్తుంది...తరువాత బుల్డోజర్ లాంటి బుల్ బుల్ బుల్లి బుల్లి డ్రెస్సులతో బిల్లా మీద పడి ....రేపు చేస్తుంటుంది...

ప్రియుణ్ణి కోల్పోయిన హన్సిక మోతవానీ ఒక మేజువాణీ డాన్సు చేసి...బిల్లాను ఇరికించబోయి తనే చనిపోతుంది....ఇక్కడ కూడా బిల్లా వారు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చూపిస్తారు.. ఇక రెబల్ స్టారు కృష్నం రాజు గారు కొడుకులాంటి ప్రభాస్ కోసం చేసిన పాత్ర....ఆయన డ్రెస్సింగు ముఖ్యం గా జెర్కిన్ వగైరా...బ్రహ్మనందం లేని లోటు తీర్చింది..

ఇంక బిల్లా ని చంపడానికి వచ్చిన మరో బికినీ పిల్ల అనుష్క...స్విమ్మింగు పూల్లో తప్ప చంపడానికి ప్లేసు లేనట్టు...బికినీ తప్ప డ్రెస్సు లేనట్టు అన్నను చంపిన వాడిపై ప్రతీకారం అలా తీర్చుకుంది...మొత్తానికి యువకుల హౄదయాలకు బికినీ నాడా వేసి లాగుతున్నారు ధియేటర్లకి.........ఆల్రెడీ మహానటుడు ఎన్ టీ ఆర్ నటించిన సినిమా ఆల్ టైం హిట్టు కొట్టిన అమితాబ్ సినిమా అందరికీ తెలిసిన ఈ సినిమా ఇంకా ఎంత బాగా తీస్తే దాని లెవల్ అవుతుంది ? కధ పరాయి దేశంలో జరగడం తప్ప ఇంకో స్పెషల్ ఏమీ లేదు...ఇంటర్పోల్ ఆఫీసరే విలన్ ఎలా అవుతాడో అర్ధం కాదు..వేల కోట్ల వ్యాపారం చేసే వాడు ఇంటర్ పోల్ ఆఫీసర్ అవుతాడు....మలేషియాలో జరిగే ప్రెస్ మీట్లో తెలుగులో చెప్పిన విషయాలకి ప్రెస్ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, ఎర్ర డైరీ బదులు లేటెస్ట్ పెన్ డ్రైవు వాడారు..అయితే బాంకు లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవడం కూడా ఫ్లాష్ యానిమేషన్ లో చూపిస్తే ...నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు....

పోలీసుల్ని తప్పించుకునే టెన్షన్ లో కూడా బొమ్మాలీ అంటూ పాట పాడుకునేంత గట్స్ ఉన్న బిల్లా చూడాలంటే మనకూ గట్స్ ఉండాలి ముఖ్యంగా ఫామిలీ తో వెళ్ళాలనుకుంటే...బికినీ సైజంతైనా 'బుర్ర ' వాడి, కొత్త కధతో సినిమా తీసే రోజులు ఎప్పుడొస్తాయో....

ఆదివారం, ఏప్రిల్ 05, 2009

ఎన్నికల ఆహ్వాన శుభ పత్రిక

ఎన్నికల ఆహ్వాన శుభ పత్రిక

శ్రీ ఆరామా చంద్రబాబుహ ఆశ్రిత పరాజితహ, ,సమ హస్త కళ్యాణ 'గులాబి' ధారణహ, జామాతా ముఖాం ' బోరు ' హ, తెంచలేక నిరంతర బాలయ్య మాట నోతు..

స్వస్తిశ్రీ 'కాంగ్రెస్ విరోధి' నామ సంవత్సర, చైత్ర(చరిత్ర)మాస, తేదీ 16-4-2009, ఉదయం 9 నుండి సాయంత్రం వరకు

మా ఏకైక కుమారుడు చంద్రబాబు కు.,
తెలంగాణా కాపురస్తులు కె సీ ఆర్...ని
ఇచ్చి వివాహం చేయుటకు సీ పీ ఎం,సీ పీ ఐ పెద్దలు నిర్ణయించినారు ..
కావున , ఏతత్ శుభముహుర్తమునకు తామంతా సకుటుంబసపరివారంగ విచ్చేసి మదర్పిత వంద,,మందూ ఆది స్వీకరించి వధూవరులకు ఓటేసి గెలిపించ ప్రార్ధన

ఎన్నికల్ మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ



రిసెప్షన్ :
గెలిస్తే అసెంబ్లీలో
గలవకపోతే ఎవరి ఇళ్లలో వాళ్ళూ
తెలుగుదేశం పార్టీ

పెద్దెంటీ ఆర్ ఆశీస్సులు...చిన్న ఎన్ టీ ఆర్ అభినందనలతో...
తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలి రా!

గురువారం, ఏప్రిల్ 02, 2009

బిజినెస్ కి నీచమైన మార్గం కానీ ఏం చేస్తాం కధ డిమాండ్ చేస్తది



కధ డిమాండ్ చేస్తది

అదంతే కధ డిమాండ్ చేస్తది...అందుకే అలా జరుగుతది..ఇదీ తెలుగు సినిమా బాసూ
అది గద్వాల కోట అక్కడ రాజు లాంటి రాణి ప్ర్జలని కన్నబిడ్డల్ల చూసుకునే బొమ్మాలీ ....జేజమ్మ...ఆధునిక యువతి... ఐనా ...దుష్ట శక్తులతో పోరాడే అరుంధతి...ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి....ఎంత అద్భుతంగ నటిస్తోంది...స్త్రీ అంటే ఇలా ఉండాలి ....అబ్బ ఎంత ధైర్యమో..ఇవీ ఆ మొదటి ఫొటో కధ...
అబ్బ భలే గుందిరా ఫిగరు...చూడు ఎంతబాగుందో..కుర్ర కారు చొంగ కారుస్తూ ఇంకా రాయలేని భాషలో మాట్లాడుతూ ,,,,రెండో ఫొటో కధ... అదే మనిషి ....కానీ అభిప్రాయాలు వేరు..

ఎందుకంటే కధ డిమాండ్ చేస్తది కాబట్టి...

అదేంటో ...కధలో బికిని ఎందుకో...ఆ బికినీ వేసుకుని ఆవిడ స్నానం చేసి రాకపోతే...కధ నడవదో....గొడవ అవదో అర్ధం కాదు...కేవలం సినిమా కి యువ జనాన్ని రప్పించడానికి తప్ప కధ ఎందుకు డిమాండ్ చేస్తుందో అర్ధం కాదు ..ఒక వేళ కధ డిమాండ్ చేసి ఏ నగ్నంగా ఉండే సీనో ఉంటే అందుకూ సై అంటారా అన్నది నా అనుమానం.. ఎందుకంటే హీరోయిన్ రెడీ అంటే కధకి అలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి మరి....పదహార్రోజుల్లో చచ్చిపోతుంటే కొన్ని మంచి పనులూ చెయ్యొచ్చ్చు..ఈలోగానే జీవితంలోని 'సుఖాలన్నీ ' అనుభవించడమొక్కటే కాదు...
చచ్చాకా బతికుండే ఎన్నో పనులు చెయ్యొచ్చు....

ఇంక ....సినిమాల్లోకొచ్చిన కొత్తలో అమాయకంగా ఐన వాళ్ళ చేతుల్లోనే మోసపోయి...వాళ్ళకే సేవలు చేస్తూ కుమిలిపోయే మరో రాజకుమారి...కానీ అలాంటి నిండు వేషాలంటే మొహం మొత్తి..బికినీ కి జై అండి ...కానీ ఏంలాభం..ఇక్కడా కధ డిమాండ్ చేసిన బికినీ వర్కౌట్ కాలేదు...

మనం ఆదర్శంగా చూసుకునే హీరో ప్రేమించే అమ్మాయిని బికినీల్లోను...బ్రాలతోనూ..ఇంకా అనేక రకాలుగా ప్రదర్శించడం ఎంతవరకూ అవసరమో. అర్ధం కాదు..



స్వచ్చమైన గోదావరిలా ఉంది అనుకునే కలకత్తా సుందరికూడా ఈమధ్య ఇలాంటి వరమే ప్రకటించినట్టుగా విన్నాం....
సినిమా ఆడించే
బిజినెస్ కి నీచమైన మార్గం బి కి నీ అని నా ఉద్దేశ్యం....

ఇదివరకు కొన్ని ఇలాంటి సినిమాలు విడిగా వచ్చేవి దానికివిడిగా ఆడియన్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు మామూలు సినిమాల్లో నే ఇల్లాంటివన్నీ పెట్టి జనం సినిమా చూడట్లేదో అంటే ఎలా వస్తారు....కాలేజి పిల్లలే తప్ప...ఫామిలీలు రావాలంటే కధా బలం ఉండాలి..చక్కని హాస్యం..మంచి సంగీతం వుండాలి అప్పుడు గారంటీగా సినిమా వంద రోజులు ఆడుతుంది...
కోట్లు ఖర్చుపెట్టి తక్కువ బట్టలు కట్టించినంత మాత్రాన సినిమాలు ఆడెయ్యవు...

LinkWithin

Related Posts with Thumbnails