Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, అక్టోబర్ 31, 2008

ఆంధ్ర అవతరణ దినోత్సవ కానుక తెలుగుకు ప్రాచీన భాష హోదా

ఆంధ్ర అవతరణ దినోత్సవ కానుక తెలుగుకు ప్రాచీన భాష హోదా
మొత్తానికి కేంద్రం కరుణించి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించింది..ముఖ్య మంత్రి నుంచి...అధికార భాషా సంఘం దాకా అందరూ ఈ విషయంలో కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు..తెలుగు వారందరికీ శుభాకాంక్షలు...
కానీ..నిజంగా తెలుగు భాష కు ప్రాచీన హోదా ఇవ్వడం ఇప్పటికే ఆలస్యం కాలేదా? తమిళానికి త్వరగా ఇచ్చిన వాళ్ళు తెలుగు కి ఇవ్వడానికి ఆలస్యం చెయ్యడానికి కారణం ఏమిటి..ఇప్పుడు హడావిడిగా ఆంధ్ర అవతరణ దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఇవ్వడానికి కారణం ఏమిటి ? అని ఒక చిన్న అనుమానం...ఇంత కాలం ఎదురు చూసిన మనకి ఈ ప్రభుత్వం చివరి సంవత్సరం కదా..వచ్చే సంవత్సరానికి ఏ పరిస్థితులుంటాయో...తెలంగాణా లాంటి అంశాలు..ఎన్ని అడ్డు వస్తాయో..అప్పటికి ఏ ప్రభుత్వం ఉంటుందో ? తెలీదు కాబట్టి,,,ఇప్పుడిస్తే ఆ క్రెడిట్ తమ ప్రభుత్వానికే దక్కుతుందని అనుకోవచ్చా ? ఎన్నో సభలు ...సమావేశాలూ,,,చర్చలు...రకరకాల విషయాలు....ఎన్నో ఎప్పట్నుంచో జరుగుతున్నా..మొత్తానికి ఇప్పటికి ప్రాచీన హోదా కల్పించారు...లేదా, ఇంత ఆలస్యం చేస్తే గానీ ప్రాచీన హోదా పొందడానికి కావాల్సినంత సమయం సరిపోలేదేమో మరి?
ప్రాచీన హోదా కలగడం వల్ల ఇప్పుడు తెలుగు భాషాభివ్రుద్ధికి సమ్రుద్ధిగా నిధులు వస్తాయా, అవి సక్రమంగా సరైన కార్యక్రమాలకే ఉపయోగపడతాయా..అన్నవి కాలమే తేల్చాలి..
ఐతే తెలుగు వారమందరం..తెలుగు ఎంత వరకు వాడుతున్నాం, తెలుగు ఎంత మాట్లాడుతున్నాం, మన మాటల్లో ఎంత తెలుగు ఉంటోంది..ఇంట్లో, స్కూల్లో.. పిల్లలు తెలుగు ఎంత వరకు మాట్లాడుతున్నారు, ఎంత వ్రాయగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు..? ప్రాచీన కాలం నుంచీ తెలుగు వ్రాస్తూ, చదువుతూ, మాట్లాడుతూ ఉన్నాం కనుక ఇప్పటికీ తెలుగు ఇంకా వుండి ప్రస్తుతం ప్రాచీన భాషగా గుర్తింపు పొందింది...ఇప్పుడు తెలుగు ప్రాచీన భాష గా గుర్తింపు పొందినందుకు పొంగిపోయి, సంబరం జరుపుకోవడం కాదు...రాబోయే తరాలకు తెలుగు ఎలా అందచేయాలో ఆలోచించాలి...మరిన్ని తరాలు తెలుగు భాష నిలిచేల నడుం బిగించాలి..మాత్రు భాష మ్రుత భాష కాకుండా....ఒకప్పుడు తెలుగు ఉండేది అనే రోజు రాకుండా చూడాలి..చంద్రయానం పేరుతో చంద్రుడి మీదకి వెళ్ళడంలో సాధించిన ప్రగతి..ఆచంద్ర తారార్కం తెలుగు భాష నిలిచేలా మనందరం పాటుపడాలి.....అప్ప్డే నిజమైన సార్ధకత....

మంగళవారం, అక్టోబర్ 28, 2008

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...
హౌస్ పెయింటింగ్ ఫెస్టివల్ నాట్...ఇల్లు అలకగానే పండగ కాదు..ఇంగ్లీష్ లో చెప్పమంటారు
...చెబితే అర్ధం కాదు..అని శంకర్ దాదా అన్నట్టు గుర్తు....సినిమా ఓపెనింగ్ కి తిరుపతి చేరిన
అభిమాన 'ప్రజా' వాహిని చూసి ఆనందిస్తున్నారు...
ఇక శ్రీకాకుళ యాత్ర తో రాజకీయ 'రహ దారులు ' ఎలా వుంటాయో కొంచెం అవగతమై
వుంటుంది..ళైట్లలో షూటింగులు,,ఫైట్లలో తగిలే దెబ్బలు..అలవాటైన వాడు కాబట్టి కొంచెం
తట్టుకోగలిగినా..జనం చూపించిన ప్రేమ వల్ల బాగానే నెట్టుకొచ్చారు...యాత్రని..
అయితే రానున్న ఎన్నికలు..పోటీలు..సీట్లు..కేటాయింపులు..లాంటి తలనొప్పులు ఇంకా చాలా
ఉన్నాయి..పండక్కి రిలీజయ్యే పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీలా, ప్రస్తుతం అన్ని రాజకీయ
పార్టీలూ..తమ తమ హీరోలని సినిమా వాళ్ళని దింపే ప్రయత్నాలలో ఉన్నారు..మెగా 'స్టారు ' కన్నా
మా 'సారు ' 'వై ఎస్సారు ' కే పాపులారిటీ ఎక్కువ అని బింకం గా చెబుతున్నా సూపర్ స్టారు క్రిష్ణ,
యువరాజు..మహేషుని,,సహజ నటి 'జయ ' సుధ, యాంగ్రీ యంగ్ మాన్ మరో 'రాజ సేఖర్ ' ఆయన
'జీవిత ' భాగ స్వామి, ధర్మవరపు, లాంటి వారిని తమ బెటాలియన్ లో చేర్చుతున్నారు
(సోనియా)గాంధీ భవన్ నాయకులు..
మరో పక్క తెలుగు దేశం వాళ్ళు నందమూరి సిం హాలు "గర్జించడానికి" గుంటూరు లో సన్నాహాలు
చేబట్టినాయి..కాక పోతే..'కాక ' మీద ఉన్న నందమూరి అభిమానులు 'బాలయ్య 'ను కాబోయే సీ ఎం
గా చూడాలనుకుంటున్నారు..యువ సిమ్హాలు కూదా బాబు గురించి కాక బాబాయి గురించే ఎక్కువ
చెబుతున్నారు.... 'గర్జన ' సంగెతెలా ఉన్నా ఈ విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం
ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం లో
మరో పక్క ఎవరు తమ పార్టీకి ఎక్కువ కోటా సీట్లిస్తారో ఈసారి ఎవరికి మద్దతిస్తారో తెలీక బీపీ పెరిగిన
బీజేపీ తమ వంతుగా కోటా, కృష్ణం రాజు..ని నమ్ముకుంటున్నారు..
టీ ఆర్ ఎస్ లో హీరో ఒకే ఒక్కడు కే సీ ఆర్..ఎన్ టీ ఆర్, వై ఎస్ ఆర్, మెగా స్టార్ ఎవరొచ్చినా సరే,
ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సింగిల్ హాంద్ కే సీ ఆర్..అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నా..తెలంగాణా
కి సై అంటే ఎవరైనా ఓకే అంటున్నారు...
ఇక బరిలో ఉన్న ఏకైక హీరోయిన్ 'విజయ ' శాంతి..తల్లి తెలంగాణా కోసం పోరాడుతోంది..
ఇవన్నీ ఇలా ఉంటే నాకర్ధం కాని విషయం ఒకటుంది..చిన్న గల్లీలోనైనా..చిన్న టీ వీ షూటింగు జరిగినా విరగబడి చూసే జనం,, బట్టల షాపు ఓపెనింగులకి
హీరోయిన్లు వస్తే రోడ్డు నిండా ఆగి చూసే జనం..స్టూడియోల ముందు నిలబడి కారులో ఉన్న తమ
హీరోలని నల్ల అద్దాల్లోంచి చూసి ఆనందించే జనం..హీరో ఇంట్లో పెళ్ళి వేడుకలైతే ఎదురుగా కరెంటు
పోలెక్కి చూసే జనం...(నిజంగా కనపడుతుందా అని కూడా ఒక డౌటు) ...ప్రజా అంకిత సభలకి,,
గర్జనలకి, హాజరయ్యే జనం ..వాళ్ళ అభిమానం వోటుగా మారుతుందా అని? అసలు వాళ్ళు వెళ్ళే
సరికి వాళ్ళ ఓటు ఇంకా ఉంటుందా అని...కాంగ్రెస్స్ లో ఎన్ టీ ఆర్ అభిమానులు, తెలుగు దేశంలో
చిరంజీవి అభిమానులు ఇలా ఉండరా అని...
నిన్నటి దాకా షూటింగు కి కొబ్బరికాయ కొట్టిన దగ్గరనుంచీ గుమ్మడికాయ కొట్టే వరకు హడావిడి
చేసి..ఆడియో రిలేజు నుంచి సినిమా రిలీజు వరకు ఎంజాయ్ చేసి..ధియేటర్ లకి రంగులేసి..కటౌట్లకి
దండలేసి..పోస్టర్ లకి తిలకాలు దిద్ది..టికెట్లకు లైనులో నిలబడి సినిమాలో విజిల్సు వేసి..వంద
రోజుల ఫంక్షను కోసం ఎదురు చూసే అభిమాని రక్తం పంచుకు పుట్టక పోయినా రక్తం పంచే
కార్యక్రమంలో పాల్గొన్న తమ్ముళ్ళ లాంటి అభిమాని ఇప్పుడు సడెన్ గా కార్యకర్తగా మారి..పార్టీ జెండా
పట్టుకుని వొట్లేసే చోట లైనులో నుంచొని..(కటౌట్లు పోస్టర్లు మామూలే) వోట్లేసి గెలిపించే పని ఎంత
త్వరగా నేర్చుకుంటారో మరి...
నిజంగా అభిమానులకి తమ హీరో చేసేవి 'అన్నీ ' నచ్చితే హీరో ఎంతో 'ఇష్టపడి ' కష్టపడి చేసిన ప్రతీ
సినిమా హిట్ అవ్వాలి కదా..ఈ సినిమా ఫ్లాప్ అయితే మరో ఏడాదికి కొత్త సినిమా వస్తుంది..కానీ
రాజకీయాలలో ఎన్నికల సినిమా ఫ్లాప్ అయితే ఐదేళ్ళ వరకూ మరో సినిమా ..కష్టమే..
పార్టీలో కూడా తన అభిమానులు..అభిమాన సంఘం అధ్యక్షుడు, ఇతర పార్టీలనుంచీ జాయిన్ అయ్యే
రాజకీయ నాయకులు,,మేధావులు..బడుగు వర్గాల నాయకులు...లాంటి వారందరిలో ఎవరికి టికెట్టు
ఇవ్వాలో కొంచెం కష్టమైన పనే...

సోమవారం, అక్టోబర్ 20, 2008

వసుం 'ధర' - వెజిటబుల్ లోన్

వెజిటబుల్ లోన్
(వసుంధర అంటే భూమి అని పేరు కానీ ఇప్పుడు భూమి ధర కూడా ఆకాశంలో వుంది..)

నమస్కారం మేము ఏ బీ సీ డీ బాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు కిలో టమాటా కొనడం కోసం అప్లై చేసిన లోన్ ని మీకు అందించలేక పోతున్నందుకు చింతిస్తున్నాం,,,మీ జీతం కేవలం నలభై వేలు కావటం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ చెయ్యడం అయినది..ఎవరైనా అరవై వేలు కన్నా ఎక్కువ జీతం ఉన్న వారు గ్యారంటీ ఇచ్చినట్లైతే మీకు లోను అందజేయబడుతుంది..ధన్యవాదములు.....

ఏమిటీ,,,,ఆ అబ్బాయిని ప్రేమించావా...మన అంతస్థేమిటి ? వాళ్ల అంతస్థేమిటి..? వాళ్లు నెలకి ఒక్క సారి టమటా వేసి చారు పెట్టుకుంటారు...మనం వారానికి ఒకసారి టమాటా పప్పు చేసుకుంటాం...అలాంటి పేద వాడితో ప్రేమ..నో అతన్ని మర్చిపో..ఒక ఇంట్లో పెళ్ళి గోల.....


ట"మాట" మాట తలుచుకోవాలన్నా భయంగా ఉంది..కిడ్నీ లో రాళ్ళొస్తాయట అందుకే మానేసాం అని చెప్పుకుని తిరుగుతున్నా, అసలు కారణం అందరికీ తెలుసు..అదే ..ధరణి దాటిన ధరలు
ఆకాశాన్నంటిన ధరలు అశ్విని-భరణి పక్కన ఫక్కున నవ్వుతున్నాయ్..
షేర్ల ధరలు..రూపాయి విలువలు..పాతాళంలోకి దారులు తవ్వుతున్నాయ్..
స్వాతంత్ర్యం తెచ్చినందుకు నోటుమీద మనం అచ్చేసినందుకు.. బోసినోటి గాంధీ తాత ఇక్కడెందుకున్నానా అని బాధ పడుతున్నాడు పాపం..
గాంధీ పేరు చెప్పుకుని రాజ్యాలేలే నాయకుల నిజాయితీ లాగా అడుగంటుతున్న ఆర్ధిక స్థితి బహుశా ఆ ఆత్మల శాపం..

ఇడుపుల పయలు..ముడుపుల మాయలు..ప్రజల సొమ్ము నాయకుల పాలు..
కూలే గుడిసెలు..కాలే కడుపులు..పోయే ప్రాణాలూ..రాలే బతుకులు..
భరత మాతకు కడుపు కోతలు..చూసినా పట్టించుకోరు నేతలు..
ఎన్నికలొచ్చేదాకా హామీలు..కుమ్మరించి..ఎన్నికయ్యాక అన్నీ విస్మరించే ఈ నాయకులున్నంత కాలం మన బతుకులింతే....

అర్జెంటుగా ఈ పరిస్థితులు మారవు గానీ..త్వరగా వెళ్ళి లోను తీసుకోవాలి..పావుకిలో టమేటా కొనాలి..ఈ మధ్యే నాకు వెజిటబుల్ లోన్ కి ఎలిజిబిలిటీ వచ్చింది..మీకూ కావాలా ? జీతం నలభై వేలు ఉంటే చాలు...నన్ను కలవండి ఇప్పిస్తా..(నాక్కూడా కమీషన్ కింద 3 టమాటాలిస్తారు..మరి).......

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అమ్మఅమ్మభగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కాబట్టి అమ్మని శ్రుష్టించాడంటారు పెద్దలు..నిజమే.ఆమె చేసే పనులు ఆ దేవుడు కూడా చెయ్యలేడేమో..పుట్టించేసి చేతులు దులిపేసుకుంటాడు డేవుడు..అందుకేనేమో భర్త ని కూడా దేవుడు తో పోలుస్తారు పెద్దలు..తొమ్మిది నెలలు గర్భం లో జాగ్రత్తగా పెంచి..ఉమ్మ నీరు పరుపులా గుండె చప్పుడు లాలిపాటకు చిచ్చిగా..నిద్ర పుచ్చినట్టుగా కాలం గడిపి...లోపల తంతున్నా...అందులోనూ ఆనందం వెతుక్కుని...ఎన్నో శ్రమలొకోర్చి....నొప్పులు పడి..ఆపరేషన్ పేరుతో కోత కోసినా మనల్ని కని..భూమిపైన కాక తన పై వేసుకుని పెంచే 'స్థన్య ' జీవి 'అమ్మ '....'అమ్మతనం ' లోని కమ్మతనం మనకు పంచుతూ..శ్రమలకోర్చి పెంచుతూ..తను తిన్నా తినక పోయినా..నిద్ర పోయినా లేచి వున్నా పాలకి ఏడ్చినప్పుడల్లా పాలిచ్చి..అన్నం తినిపించి..ఉచ్చ--పియ్య అన్ని శుభ్రం చేసి..మంచి చెడు అన్ని చూసి..అనారొగ్యం వస్తే తాను తిండి మానేసి..కంటి కునుకు వదిలేసి..క్షణ క్షణం కళ్ళల్లో వత్తులేసుకుని..మనల్ని కాపాడే దేవత అమ్మ..చిన్న చిన్న విషయాలకు కూడా పొంగిపోతూ మనగురించి నిత్యం ఆలోచించి..ప్రతి క్షణం మన ప్రగతి గూర్చి అలోచిస్తూ..అ ఆ లు నేర్పే తొలి గురువు అమ్మ..విద్య..వైద్యం..మార్గదర్శకత్వం అందిచే అమ్మ ఆల్ రౌండర్...మనకి ఇప్పుడు తెలిసినవన్నీ అమ్మకు ఎప్పుడో తెలిసినా..కొత్తగా విన్నట్టు నటిస్తూ మనల్ని గొప్పోళ్ళని చేసే అమాయకురాలు అమ్మ..
చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తుంటే దగ్గరుండి ప్రోత్సహించి..తప్పొప్పులు చెప్పి..నన్ను సరైన దిశ లో నడిపించి..ఒక కళాకారుడిగా తీర్చిదిద్దింది మా అమ్మ..నేను ఏది రాసినా మొదట చూసి/విని సరి చేసే ఎడిటర్ మా అమ్మ..అలా నన్ను అన్ని విధాలుగా ప్రభావితం చేసిన మా 'అమ్మ ' సడెంగా నన్ను వంటరిని చేసి, తనకి నేను సేవ చేయాల్సిన సమయం వచ్చేసరికి ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది...అవును దేవుదికి కూడా అమ్మ అవసరమైందనుకుంటా...అవును తల్లి లేని వాడు కదా..ముచ్చటపడి తీసుకెళ్ళిపోయాడు....కనీసం తనైనా పూర్తిగా సేవ చేస్తాడేమో.....
ప్రపంచంలో ఎవరినైనా 'అమ్మా అనొచ్చు..అందరిలోనూ అమ్మ తనం వుంది..నాన్న అని అందరినీ అనలేం..అమ్మతనం అంత గొప్పది..మమ్మీ సంస్క్రుతిలో ఆ విలువలూ తెలియవు..ఆ బంధం ఏర్పడదు..ఎందుకంటే మమ్మీ లలో "లైఫ్" ఉండదు..శవ పేటికలని మమ్మీలంటారట కొన్ని ప్రాంతాలలో...మన అమ్మ ప్రాణ రూపంలో ఉన్న దేవత....అమ్మ కి మొక్కితే ఆ దేవుడికి మొక్కినట్టే...
దసరా పర్వదినాలలో కనకదుర్గలో ఐక్యం అయిపోయిన అమ్మ (మా అమ్మ పేరు కనకదుర్గ )కి అంకితం....

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa