Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

మంగళవారం, డిసెంబర్ 30, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు..




నూతన సంవత్సర శుభాకాంక్షలు..

..ఒక రూపాయికి నలభై డాలర్లు వచ్చే రోజులు రావాలని..అన్నీ మంచి సినిమాలు రావాలని..
మనకి నిజంగా సేవ చేసే నాయకులు రావాలని,,
హీరోయిన్లు వంటినిండా బట్టలు తొడిగి నటన నేర్చుకుని నటించాలని,,,
వెధవ పనులు చేసి జైలుకెళ్ళిన వాళ్ళకి త్వరగా శిక్ష పడాలని..
ఇలా చాలా పిచ్చి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నా...
ఇవన్నీ జరగక పోయినా కనీసం ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని..కోరుతూ
అందరకీ శుభాకాంక్షలు....



































































మంగళవారం, డిసెంబర్ 23, 2008

వేశ్యాగ్రుహాల పై దాడి మంత్రుల నిరాహార దీక్ష..

వేశ్యాగ్రుహాల పై దాడి మంత్రుల నిరాహార దీక్ష..
కంగారు పడకండి..మధ్యలో గీత ఉంది..రెండూ వేర్వేరు న్యూస్..చాలా కాలం క్రింద తనికెళ్ళ భరణి వ్రాసిన సినిమా డైలాగు ఇది..ఒక చిన్న కామా తో, గ్యాపుతో,,గీతతో అర్ధం మారిపోతుంది అని ఆయన భావం..అయితే ఈ మధ్య పత్రికలు చదివితే ఒకే న్యూస్ని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా వ్రాస్తున్నారు..అది పత్రికలకి తగునా అని నా ప్రశ్న....
అసలే టీ వీ చానెల్స్ చూపించే సోది వల్ల కంఫ్యూసన్లో ఉన్న ప్రజలకి ..కాస్తో కూస్తో నమ్మదగిన సమాచారం ఇచ్చేవి పత్రికలే...ఈ మధ్య ఒకాయన చేపల శాఖలో ఉన్నా చేవగలవాడవడంతో కావాల్సిన శాఖలలో పనులు చేయించుకుంటూ కావాల్సినంత సంపాదించుకుంటూ..పంచుతూ..సాఖోపశాఖలుగా ఎదిగిన అవినీతి వ్రుక్షంగా పెరిగిన మీదట ఏ సీ బీ కి పట్టుబడ్డాడట...ఇది ఒక పత్రిక లో వచ్చిన విషయం...ఆ మనిషి (అలా అనొచ్చో లేదో..) ఎల్లో ఫిష్ అంటే తెలుగు దేశానికి చెందినవాడు అని అదే రోజు మరో పత్రిక లో మరో కధనం....డంబెల్తో మోది మొద్దు లాంటి హంతకుణ్ణి చంపిన ఒక రామ భక్తుడు..జైలులో ఉండగా చూడ్డనికి వచ్చిన వారిని ఫలానా పెద్దాయన బాగున్నాడా అని అడిగాడనీ...అంటే ఆ పార్టీకి అతనికి సంబంధం ఉన్నట్టేనని..ఇటీవలే ఉరిశిక్షనుంచి విడుదలైన ఒకాయన చాలా మంచివాడని మరో కధనం....
అసలు స్వతంత్ర్యం తెచ్చిన గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ పార్టీ వారని...గాంధీని చంపిన గాడ్సే ఆర్ ఎస్ ఎస్ వాడని..ఇంకేదో రాముడు గిరించి మాట్లాడిన ఆయన మరో వర్గానికి చెందిన వాడని అతణ్ణి తూలనాలడం ఆ వర్గాన్ని కించపరచడమేనని..ఇలా ప్రతీ దానికీ సంబంధం ఉన్నా లేకున్నా ఏదో ఒకదానితో ముడిపెట్టి..వ్రాయడం..ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళ సామాజిక వర్గానికి మొత్తానికి జరిగినట్టు మిగతా వాళ్ళ వల్ల వాళ్ళకి ఏదో కీడు ఉన్నట్టు....కొన్ని పార్టీలు ..నాయకులే జనానికి మేలు చేసే వారు...మిగిలిన వారు దేశాన్ని అమ్ముకుతినే వారు అంటూ పక్షపాత ధోరణితో వ్రాయాల్సిన పని ఏంటో నాకు అర్ధం కాదు...
చిరంజీవి ఒక చోట ఎక్కువసేపు మాట్లాడారని..కేసు పెట్టి మరో చోట సీ ఎం అల్లుడు మాట్లాడినా కేసు పెట్టలేదని, తాము చేసిన ఫిర్యాదువల్ల కేవలం మైకు వాళ్ళని పట్టుకున్నారని...ఒక చోట వ్రాస్తే...చిరంజీవి రాజకీయాలు మాట్లాడారు..ఈయన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడారు అని చెప్పడానికి ప్రభుత్వ ప్రతినిధుల వత్తిళ్ళు ఎదుర్కునే పోలీసు ఉద్యోగాలు కావు కదా పత్రికలవి..వాళ్ళు నిజం వ్రాస్తేనే జనం కి అసలు విషయాలు తెలిసేవి..
కాబట్టి అసలే టీవీలు, ఇంటర్నెట్టు తో కొట్టుకుపోతున్న పత్రికల భవిష్యట్టు వాళ్ళ నిజాయితీ..నిజమైన వార్తలందించే స్థయీలమీదే అధారపడి ఉందని భావిస్తూ...
నిజాన్ని అందించే జర్నలిజాన్ని కోరుతూ

శుక్రవారం, డిసెంబర్ 19, 2008

ప్రేమైక(ం) జీవితం

ప్రేమైక() జీవితం

"suicide is a permenant solution for a temporary problem" అని ఎక్కడో చదివినట్టు గుర్తు....ఈ రోజుల్లో ప్రేమ జంటలని చూస్తుంటే మెంటలెక్కుతోంది...

ప్రేమించ లేదని గొడ్డళ్లతో నరికే వాళ్ళూ.,యాసిడ్ దాడులు చేసే వాళ్ళూ ఒక రకం సైకోలైతే..

చంపి తాము చచ్చిపోయే వాళ్ళూ అదే కోవలోకి వస్తారేమో..

ఇక కలిసి చచ్చిపోయే వాళ్లు చావడానికున్న ధైర్యం బతకడానికి లేని పిరికి వాళ్ళు..

వీళ్ళ ప్రేమ లో నిజమెంత..బలమెంత...భవిష్యత్తు పట్ల వీరికున్న అవగాహన ఎంత అన్నది అర్ధం కాని విషయం,...వాళ్ళకైనా మనకైనా...


పదో క్లాసుదాకా ఒక రకంగా ఆటలు..చదువు..ఇంట్లో వాళ్ళ అజమాయిషి..కొంచెం బిడియం,,లాంటి వాటిల్తో సరిపోతుంది..ఇక కాలేజి అనే రాజ్యం లోకి అడుగుపెట్టగానే అదేదో చాలా పెద్ద వాళ్లమైపోయామని,,చాలా విషయాలు తెలిసిపోయాయని..కొత్త పరిచయాలు..కొత్త ప్రాంతాలు ,, ఆ పరిచయస్తులు చెప్పే కల్లబొల్లి మాటలు..నిజంగా వాళ్ళు అవి సాధించారేమోనన్న భ్రమలో అలాంటివి కాపీ చెయ్యడాలూ..బైకులు 120 పైన నడిపాను అన్న సీనియర్ మాటలు విని నిజం అనుకుని తానూ నడిపి అవిటివాడైన కధ కళ్ళ ముందే జరిగింది..ఇక కొత్తగా పరిచయమైన అమ్మాయి తను ఫ్రెండు,,గర్ల్ ఫ్రెండు అంటే అర్ధం కూడా తెలీదు..ఆ అమ్మాయి హలో అంటే ఒక రకమైన ఫీలింగ్..అది ఫ్రెండ్స్ తో చెపితే వాళ్ళు అది ప్రేమే అని నిర్ధారణ చెయ్యడం..వీళ్ళు అది నిజమే అని నమ్మేయడం..ప్రేమ అంటే సినిమాల్లో లాగా..కలిసి తిరగడం..పాటలు పాడుకోవడం అనుకుంటారు..హీరో హీరోయిన్ కూడా సినిమా అంతా ప్రేమించుకుని చివరకు పెళ్ళి చేసుకుంటారు...కానీ పెళ్ళి తరువాత ఎంత భవిష్యత్తు ఉందో చూపించరు కాబట్టి వీళ్ళకీ అంతవరకే ఆదర్శం......

ఇంట్లో చెబితే ఒప్పుకోరు కాబట్టి సినిమాల్లోలా లేచి పోవడం లాంటివి చెయ్యడం...బతకలేక ఏదో ఒకటి చేసెయ్యడం,,,,తమ పరీక్ష ఫీసులు కట్టడానికి అమ్మా నాన్నల మీద ఆధార పడ్డ వాళ్ళు ..ఫ్యూతర్ గురించి ఆలోచన లేకుండా తీసుకునే తెలివితక్కువ, చిన్నతనపు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తు కోల్పోతున్నారు...

తమ జీవితాలే కాకుండా తమని నమ్మిన వాళ్ళ జీవితాలూ, కన్న వారి జీవితాలు నాశనం చేస్తున్నారు..

యువతీ యువకుల్లారా...పదో క్లాసు పాసయ్యాక ఏ కాలేజీ లో జేరాలి..ఏ గ్రూపు తీసుకోవాలి అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు.పేరెంట్స్, ఫ్రెండ్స్, పెద్ద వాళ్ళు, తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తారు..ఇంటర్ అయ్యాక ఇంజినీరింగు, డాక్టర్ కోర్సుల గురించి వాకబు చేస్తారు...కోచింగు తీసుకుంటారు..మంచి కోర్సేదో మంచి కాలేజి ఏదో తెలుసుకుని జాయిన్ అవుతారు..కోర్సు అయ్యాక మంచి కంపెనీ వెతికి ఇంటర్వ్యూ ఎటెండు అయ్యి మరీ జాయిన్ అవుతారు..ఏ క్షణాన్నైనా మారడానికి వీలుండే ఈ విషయాలకే ఇంత చేస్తే ...జీవితంలో ఒక సారి ఒకరితో మాత్రమే జరిగి జీవితమంతా సుఖ సంతోషాలివ్వాల్సిన భాగస్వామి విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ఒక్క సారి ఆలోచించండి...ప్రేమ -- పెళ్ళి దాకా వచ్చినా ఇగోప్రబ్లెం స్ తో ..ఇతర కారణాలవల్ల విడిపోయే పరిస్థితులు కూడా ఇలానే వస్తున్నాయి..మన అమ్మా నాన్న లకి మనకి మధ్య జెనెరేషన్ గ్యాప్ ఉండి ఉండొచ్చు కానీ మన పేరెంట్స్ ఎప్పుడూ మన మంచి గురుంచి మాత్రమే ఆలోచిస్తారు..మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళు విలన్లుగా కనిపించినా..కనిపెంచిన వాళ్ళు మన భవిష్యత్తుని..వాళ్ళ అనుభవ రీత్యా ఆలోచించి చెబుతారు..
ప్రాణం విలువైనది అది ప్రేమ కన్నా ప్రేమించిన వాళ్ళ కన్నా................

మంగళవారం, డిసెంబర్ 16, 2008

న్యూసెన్స్ చానెల్స్ - చూస్తూనే ఉండండి మాకిష్టమొచ్చింది చూపిస్తాం

న్యూసెన్స్ చానెల్స్
చూస్తూనే ఉండండి మాకిష్టమొచ్చింది చూపిస్తాం
న్యూస్ పేరుతో న్యూసెన్స్ అందిస్తున్న చానెల్స్ ని చూస్తుంటే రోత పుడుతోంది..ఒక పక్క పక్షపాత ధోరణితో రాజకీయాల విషయాలలో ఎలాగూ నిజాలు చెప్పట్లేదు..జరిగే దారుణాలు..ఇతర విషయాలు కూడా పక్క దారి పట్టిస్తే ఎలా?
పక్క చానెల్ కన్నా మనమే ముందు చెప్పాలని...వాళ్లకి ఏది తోస్తే అది చెప్పేస్తారు..చూపిస్తారు..అది ప్రజలని తప్పుదోవ పట్టించినా వాళ్ళకి అనవసరం ఎందుకంటే అది వాళ్ళ టీ ఆర్ పీ ని పెంచుతాయి కాబట్టి..
ఈ మధ్య బాంబే ఘాతుకాన్ని ప్రసారం చెయ్యడం వల్ల లోపల తీవ్రవాదులకి కూడా తెలిసి ఎంత నష్టం వాటిల్లిందో చూసాం కదా.. ఆ మధ్య హైదరాబాద్ లో పంజాగుట్ట వద్ద ఫ్లై ఓవర్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా అంతే మొత్తం ఫ్లై ఓవర్ కూలిపోయిందని..దానికింద వందలాదిమంది వర్షం తల దాచుకున్నవాళ్ళు, చాలా వాహనాలు ఇరుక్కున్నారనీ ఒకటే హడావిడి చేసారు..ఇళ్ళలో వున్న వాళ్ళకి తమ వాళ్ళు రోజూ అక్కడినించే కదా వచ్చేదని ఎంతమంది ఎంత టెన్షన్ అనుభవించారో నాకూ స్వీయ అనుభవమే...ప్రమాదంలో ఇరుక్కున్న వాళ్ళని రక్షించడానికి వచ్చిన వాళ్ళకి..వీళ్ళు అడ్డేఅ..అసలెలా జరిగింది..కారణాలేంటి..ఎవరు బాధ్యులు అంటూ సర్వే ఒకటి మొదలెడతారు..దీనికి ప్రభుత్వం ఎలా స్పందించాలి అంటూ ఎస్ ఎం ఎస్ కాంటెస్ట్ ఒకటి మొదలెడతారు..వాళ్ళు అక్కడ తీసుకోవాల్సిన చర్యలకి అడ్డం రావడమే కాకుండా మీడియా పై దౌర్జన్యం చేసిన అధికారులు అంటూ మరో కధనం ...
ఇవన్ని ఎందుకు చెబుతున్నానంటే..పాపం ఇప్పుడిప్పుడే హీరోయిన్ అవుతున్న భార్గవి అనే అమ్మాయి అనుమాస్పద స్థితి లో మరణించింది..ఇది హత్యా...ఆత్మ హత్యా? ఎవరు చేసారు..అక్కడ జనం గుమిగూడారు అంటూ స్క్రోలింగులు..ఆ అమ్మాయికి నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది ..ఒక బాబు ఉన్నాడు అని మరో స్క్రోలింగు..ఈ లోగ వార్తలు చదివే మనిషి ఆమె ఆత్మ హత్యకు పాల్పడింది అని చెబుతూ సదరు సంఘటనా స్థలంలో ఉన్న మరో రిపోర్టర్ని అడిగితే ఆయన ఇక్కడ ఆ అమ్మాయి మరో వ్యక్తితో బెడ్ పైన పడి వుంది..అతను ఆమె కాబోయే భర్త అని చెప్పాడు..ఈలోగా..వాళ్ళ అమ్మా వాళ్ళని మాట్లాడిస్తే (పాపం వాళ్ళు ఏడిచే టైము కూడా ఇవ్వకుండా, )అసలు మా అమ్మాయికి పెళ్ళే కాలేదు..అతను మాకు తెలిసిన అబ్బాయి మాత్రమే అని వాళ్ళ సమాధానం..ఈ మధ్యే ఒక మంచి క్యారెక్టర్ పోషించిన అమ్మాయి కదాని చూస్తున్న వాళ్ళకి అసలు ఏమీ అర్ధం కాలేదు..అసలు పోలీసులు, డాక్టర్లు కూడా ఇంకా ఏమీ చెప్పకుండానే..తల్లి దండ్రులు..కూడా రెస్పాండ్ కాకుండానే వీళ్ళ హడావిడి ఏమిటో..
యాసిడ్ దాడికి గురైన వాళ్ల సంగతీ అంతే..అందరికన్నా ముందు మాతో మాట్లాడినప్పుడు అంటూ కధనాలు..దానికి ఒక హీరో..వారి జీవిత భాగస్వామితో చర్చ..ఆ సదరు హీరో గారు నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కాదంటే చంపేద్దామనుకున్నా...కానీ ఆగిపోయా అంటూ విచిత్రంగా చెప్పడం...ఎందుకు ఇలాంటివన్నీ//రామోజీ రావ్ సుమన్ గొడవపడితే ఉండవల్లితో చర్చ...అసలు సంబంధం ఉందా అని?
ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి న్యూస్ చానెల్స్ లో మెమే నంబర్ వన్ అనిపించుకోవడం ఎంతవరకు సమంజసమో ?

సోమవారం, డిసెంబర్ 15, 2008

ని(ల్)ర్మాత

ని(ల్)ర్మాత


వెనకటికి, ఎన్ టీ ఆర్ సినిమాల్లో చేసేటప్పుడు..వాళ్ళమ్మాయికి చెప్పులు కొనడానికి లంచ్ బ్రేక్ లో వెళ్ళి రావడానికి కూడా నిర్మాత పర్మిషన్ తీసుకుని..భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళి కొనుక్కొచ్చారట...
ఈమధ్య ఆసిన్ కోసం ఒక నిర్మాత చెప్పులకి మూడు లక్షలు పోసి కొన్నాడట...ఆసినీ సోద్యం బంగారం కానూ అనుకున్నా.. ఆ మధ్య ఐస్వర్యా రాయి కీ ఒక నిర్మాత 10 లక్షలు పోసి కళ్ళ జోడు కొనాల్సి వచ్చిందట..సినిమా కోసం..ఈ మధ్య నిర్మాత అంటే పొలాలమ్మి డబ్బు తెచ్చి హీరో హీరోయిన్ లకి కళ్ళ జోళ్ల నించీ కాలి జోళ్ళ వరకూ....కొని అవసరమున్నా లేకున్నా ఫారిన్ లొకేషన్లకి తిప్పి...తరువాత ప్రింట్లకి డబ్బుల్లేక తిప్పలు పడేవాడు గా కనిపితోంది యవ్వారం...
ఈ మధ్య చిన్న నిర్మాతలు పాపం చాలా ప్రాబ్లెంస్ ఫేస్ చేస్తున్నారని రోజూ చూస్తున్నాం..ఇన్నాళ్ళూ ప్రొద్యూసర్ అంటే అబ్బో సినిమాల్లో చాలా మిగిల్చుకుంటాడు అనుకున్నా..
సినిమా కి ప్రొద్యూసర్ అవడం అంత వీజీ కాదు అన్నమాట..సినిమా మొదలెడదాము అనుకోగానే ఒక ఆఫీసు తియ్యాలి అదీ ఫిల్ము నగరులోనే ఉండాలి..దానికి ఒక గుమాస్తా..అకౌంటంటు..ప్రొడక్షన్ మేనేజరు..అటెండరు..రోజూ మందు..విందు అన్నీ తప్పని రోజూ వారి ఖర్చు..ఇక దర్శకుణ్ణి అనుకోగానే ఆయనా, ఆయన సిబ్బంది కూడా తోడవుతారు..ఇక కధలు చెప్పడానికి డైరెక్టరుగారి మంద,,ఇంకా కొంత మంది కొత్త ఔత్సాహిక రచయితలు..గట్రా వచ్చిపోతూ ఉంటారు..కధ ఒక కొలిక్కి రాగానే ఏ హీరోకి బాగుంటుందో అనుకుని వారిని కలవడానికి తిరగడానికి, సిఫారసు చెయ్యించుకోవడానికి వారి బంధువులో..ఫ్రెండ్సో, పాత చిత్ర దర్శకులో ..లేక ఆయన గారి ఆస్థాన జ్యోతిష్కుడినో పట్టుకొని కధ వినిపిస్తే ఆయన గారి పైత్యం కూడా కొంచెం తోడయి మొత్తానికి ప్రాజెక్టు రెడీ అవుతుంది..
ఇక హీరోగారితో అంతకు ముందు చేసిన జీరోయిన్ గారిదో కొత్తగా బాలివుడ్డు నుంచి వచ్చిన మరో చెక్క బొమ్మదో (చక్కని బొమ్మ అని వాళ్ల ఫీలింగు) డేటు దొరికి రేటు ఫిక్ష్ అవడానికి కొంత ...ఇక మ్యూసిక్ చెయ్యడానికి ఇట్టే కాపీ కొట్టి హిట్ కొట్టెయ్యగల మ్యూసిక్ డైరెక్టరు..మోకాళ్ళు వంగిపొయ్యినట్టు డాన్సు చేయించే డాన్సు మాస్టరు వంటి హీరోగారి హిట్ కాంబినేషన్ కం సెంటిమెంట్ కం సెటిలెమెంట్ మంద కొందరు వెరసి టీం రెడీ...
ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక పెద్ద స్టూడియోలో పెద్ద సెటప్పు,.,దానికి సినిమాలు లేని అగ్ర దర్శకులు క్లాపు, స్విచాను..గౌరవ దర్శకత్వం...పనిలేని మరో కొంత మంది అనుకోని అతిధుల తో హడావిడి...ఆ తర్వాత షరా మామూలుగా రొటీనుకి భిన్నం గా మా సినిమా ఉంటుంది అని రొటీన్ గా ఊక దంపుడు ఉపన్యాసాలు...
అసలు షూటింగు మొదలయ్యాక అడుక్కుతినేదో ఆటో నడుపుకునేదో క్యారెక్టరు చేస్తున్న హీరోగారు...అమెరికాలో ఇంట్రడక్షను సాంగు...కొంత మంది సహాయకుల తో సహా పయనం..
జీరోయిన్ గారు బాంబే నుంచీ రావడానికి మధ్యలో వెళ్ళిరావడానికి..వారి అమ్మగారికి..మేనేజర్ గారికి..తెలుగు నేర్పే గురువు గారికి ఇలా వారి ఖర్చు వారిది..ఇక కాల్షీట్ ఇచ్చి టైముకి రాని కమెడియన్లు..ఇంప్రువైసేషన్ పేరుతో టేకులు తినే తిర్టీ యేర్స్ ఇండుస్ట్రీ మేధావులు..మొత్తనికి సినిమా దాదాపు పూర్తయ్యే టైము... ఈ లోగా ఆడియో రిలీజు అంటూ మళ్ళీ కొత్త ఫిట్టింగు మళ్ళీ ఒక పెద్ద సెట్టింగు..టీ వీలో యాంఖరు గారి నేత్రుత్వంలో ఒక ఫంక్షను..అందులో కామెడీ పేరుతో హింస..తరువాత..సినిమా పెద్దల సమక్షంలో సీడీలు విడుదల...మ్యూసిక్ అదిరింది..చిరిగింది..రికార్డు విరిగింది అంటూ ఒకరినొకరు పొగుడుకున్నాక..తలో సీడీ ఇచ్చి పంపుతారు..
ఇక సినిమా విడుదల హీరోగారి ఇమేజిని బట్టి అంతకు ముందు సినిమా వీర ఫ్లాపు కాబట్టి ఒకే సారి 200 ప్రింట్లతో విడుదల కనీసం ఒక్క రోజు ఆడినా 200 రోజుల ఫంక్షన్ చేసుకునే అభిమానుల కోసం...(ఎందుకంటే మొదటి రోజు చొక్కాలు చించుకుని టికెట్ సంపాదించి చూసిన అభిమాని ఆ తరువాత తెరని చించడానికి సిద్ధంగా వుంటాడు కాబట్టి)
ఎలాగూ సినిమా ఆడదు కాబట్టి టీవీల్లో ఊదరగొట్టే కార్యక్రామాలు..లైవులు...తరువాత సక్సెస్ టూర్లు..టికెట్ కొన్న వారికి సినిమా చూసి ఆరోగ్యంగా బయటకి వచ్చిన వాళ్ళకి బంగారు గొలుసు బహుమానాలు లాంటివి చేసీ చేసీ పాపం నిర్మాత సినిమా అయ్యేసరికి నిల్ మాత (చివరకు ఏమి మిగలని అమ్మ )గా మిగిలిపోతున్నాడు
నిజా నిజాలేంటొఈ తెలీక పోయినా ఇంతకాలం మనల్ని నవ్వించిన బాబూ మోహన్ నిర్మాత గా మారి నష్టపోయానంటూ బాధ పడడం, చిన్న నిర్మాతలు నిరాహార దీక్ష చెయ్యడం చూసి బాధతో...వారికి మంచి జరగాలని ఆసిస్తూ...

శనివారం, డిసెంబర్ 06, 2008

సినిమా(య) లోకం

సినిమా(య) లోకం


చాలా సంతోషం అనిపించింది..నాకు వచ్చిన కామెంట్స్ చూసాక..బాలివుడ్ తోనో హాలివుడ్ తోనో పోలిస్తే కొంచెం నయమే అయినా..ఆ విషయానికి సంత్రుప్తి పడడం తప్ప మరొకటి కాదు..

అత్యధిక సినిమాలు నిర్మించే విషయంలో పడే పోటీ అర్థవంతమైన సినిమాలు నిర్మించడంలో ఉండదు..యేడాదికి 200 పైగా సినిమాలు నిర్మించే మన రాష్ట్రం నుంచీ ఇంతవరకూ జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డు సినిమాలు వచ్చాయి..?

సినిమా వ్యాపారం అనే వాళ్ళూ ఉన్నారు..నేనూ ఆ మాట ఒప్పుకుంటా..కానీ ప్రతీ వ్యాపారానికీ కొన్ని కట్టుబాట్లుంటాయి..ఉదాహరణకి ఫుడ్ కి సంబంధించిన వ్యాపారం అయితే ప్రజల ప్రాణానికి హాని కలిగించని విధంగా తయారుచేయాలి..ఎక్ష్పైరీ డేట్ లాటివి వేస్తారు...కల్లు లో డైజపాం కలిపి కల్తీ చేసినట్టు మనవాళ్ళు సినిమల్లో ఏవో కలిపి కల్తీ చేసి ఆ మత్తుకి యువతని అలవాటు చేస్తున్నారు...తమ వ్యాపారానికి వేరే వాళ్ళని బలి చెయ్యడం ఎంతవరకు సమంజసం...

ఎంతసేపూ పెద్ద హీరోల ఇమేజ్ తగ్గ కూడదు అంటూ అర్ధం లేకుండా విలన్లని స్రుష్టించి..వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి హీరోలు కత్తి పట్టి చంపడాలు,,,పిల్లల పెళ్ళిళ్ళు చేసిన హీరోలకు పదహారేళ్ల పడుచు హీరోయిన్లు.....ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా సంభాషణలు...పిచ్చి పుట్టేలా వెకిలి గంతులు...చివర్లో శ్రీరంగ నీతులు..,,,తప్ప మరో విధం గా అలోచించలేరు...అటు అభిమానులు..ఇటు దర్శక నిర్మాతలు..

మళయాలం నుంచీ తమిళం నుంచీ కధలు...కధానాయకలని అరువుతెచ్చుకుంటున్నప్పుడు..మరి అక్కడి హీరోల లా వయసుకు తగ్గ పాత్రలు..ప్రయోగాత్మక సినిమాలు ఎందుకు చెయ్యరో అర్ధం కాదు...ప్రయోగం అనగానే చీకట్లో ...అడవుల్లో,,భయపెట్టే విధంగా తప్ప ఆలోచించలేరు...

సినిమా అనేది ఒక బలమైన వినోద సాధనం..ప్రజలని ముఖ్యంగా యువతని ప్రభావితం చేసే ఈ మాధ్యమానికి చెందిన వారికి..దాని వల్ల సంపాదిస్తున్న వారికి సమాజం పట్ల బాధ్యత కూడా వుండాలి..రేపటి జెనరేషన్లో వాళ్ళ పిల్లలు కూడా వున్నారని గుర్తించాలి..అప్పుడైనా కొంచెం మంచి సినిమాలొస్తాయని ఆశ.....

శుక్రవారం, డిసెంబర్ 05, 2008

తెలుగు సినిమా చూడడం ఆహా(ని)కరం

తెలుగు సినిమా చూడడం ఆహా(ని)కరం
ఈ మధ్య కొన్ని సినిమాల్లో టీవీ ప్రకటనల్లో చూసా సిగరెట్ సీన్లు మందు సీన్లు వస్తే ధూమపానం హానికరం, మధ్య పానం హానికరం అని సీన్ కింద ప్రకటనలు కనిపించాయి..ఆహా సమాజం పట్ల ఎంత బాధ్యత..? అనుకున్నా...అది గవర్నమెంట్ పెట్టిన రూలో మరోటో నాకు తెలీదు కానీ..బాగుంది అనిపించింది..కానీ ఇంతలో అదే సినిమాలో హీరోయిన్ అతి కొద్ది బట్టలేసుకుని వంగుని..కూర్చుని ...పడుకుని..దొర్లి నానా హైరాన పడే పాట ఒకటి వచ్చింది..అదేదో శ్రుంగార నాయక కాదు..ఐటం సాంగు అంతకన్నా కాదు..హీరయినే...ఆపని చేసింది..
కాసేపట్లో విలన్ మహాశేయుడు...ఒక అమ్మాయిని కారులోకి లాక్కుని...నోరు నొక్కి...వళ్ళంతా తడిమి..బట్టలు చించి రేప్ చేశాడు....మరికాసేపట్లో ఒక వర్షం పాట..అందులో నిండా చీర కట్టుకున్నా వళ్ళంతా కనపడేలా మరో సారి హీరోయిన్ విజ్రుంభణ....కాసేపయ్యాక విలన్ గాంగ్ జనాల మీద పడి కొట్టటం, కాల్పులు,, బాంబులు వగైరా విధ్వన్సాలు..వాళ్ళని చంపడానికి హీరో చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని..హతమార్చి..ఆ కేసు కొట్టేయడం...చివర్లో హీరో గారిని చేసుకోవడానికి ఇద్దరు హీరోయిన్లు పోటీ పడడం అక్కడ తాతగారిగా ఉన్న సీనీర్ ఆర్టిస్ట్ గారు..చెవిలో ఏదో చెప్పగానే సదరు ఇద్దరు హీరోయిన్ల పై చెయ్యి వేసి మన హీరో గారు ఫోసు ఇవ్వడం శుభం కార్డు......
ఇంతకీ నా డౌట్ ఏంటంటే సినిమాలో సిగరెట్/మందు తాగుతున్నట్లు కనిపిస్తే తప్పుగా కినిపించినప్పుడు (రోడ్డు మీద ఎంతో మంది సిగరెట్ / మందు తాగిన వాళ్ళని చూస్తాం కానీ, రేపులు, మర్డర్లు చేసేవాళ్ళని చూడం) హత్యలు, మానభంగాలు, ఎక్ష్పోసింగులు, శ్రుంగార సన్నివేసాలు కీడు చెయ్యవా అని...అవన్నీ లేకుండా వూరికే సందేశాలిస్తే చూస్తారా అని కొంతమంది అడగొచ్చు..సినిమా అన్నది ఒక బలమైన మాధ్యమం దాని ద్వారా వినోదం. విఙానం అందించాలి గాని చౌకబారు విషయాలు కాదు..ఇదివరకు సినిమాల్లో మాన భంగం సీనుకి లేడిని వేటాడుతున్న పులి,, ముద్దు సన్నివేసాలకి చెట్లు వూపడం., ఇక శ్రుంగార విషాయలకు ప్రక్రుతినో ..చిన్న పిల్లల ఫొటోలనో సింబాలిక్ గా చూపించేవాళ్ళు..ఇప్పుడు ఇంకా క్రియేటివ్ గా మరేవైనా చూపించొచ్చు...కధలో బలం వుండి..నటన అర్ధవంతం గా వుండి..హాస్యం కూడా తోడైతే...అద్భుతమైన హిట్ అందిస్తారు ప్రేక్షకులు...ఆహా కరం కి హానికరం కి తేడా తెలుసుకుని. (సామాజిక బాధ్యత గుర్తెరి) మనవాళ్ళు సినిమాలు తీస్తే భావి తరాలకి మంచిది..
కేసు విషయం లో నిజానిజాలు తెలీకపోయినా ఇటీవల జరిగిన సంచలన కేసులో ఒక ముద్దాయి చెప్పినట్టు టీవీల్లో వచ్చే క్రైం ప్రోగ్రాములు చూసి చూసి నాకూ అలా చెయ్యాలనిపించి మర్డర్ చేసి రేప్ చేసా అన్నాడు..ఇది నిజంగా అలోచించాల్సిన విషయం...సిగ్గుపడాల్సిన దారుణం..
మన తరువాత తరం ..టీనేజి వయసుకి కూడా రాకుండానే పాడవకుండా వుండాలంటే సినిమాల్లోనూ రూల్స్ అవసరం....ఎక్కడా కధ డిమాండు చెయ్యదు బికినీలని. ముద్దు సీన్లని..(కధకి నోరులేదు) పైకం ఈకువ తీసుకున్న మైకంలో ముంబాయి మూదు గుమ్మల పైత్యం తప్ప...జనాల వీక్నెస్స్ ని సొమ్ము చేసుకోవడానికి దర్శక నిర్మాతల స్వార్ధం తప్ప..

మంగళవారం, డిసెంబర్ 02, 2008

జీరోయిన్లు ...

జీరోయిన్లు ...
ఏంటో..అందంగా...కంటికి ఇంపుగా..చక్కని మేకప్పులో బ్లాక్ అండ్ వైట్ అయినా..ఎంతో హాయిగా...చూడముచ్చటైన దుస్తులతో ఉండే హీరోయిన్లని చూసి ఎన్నాళ్లయిందో..
అదేంటో సినిమా హాళ్ళలో ఆడకో యేమిటో గానీ ఈమధ్య కొత్త సినిమాలు తెగ వచ్చేస్తున్నాయి టీ వీల్లో..అందులో ఒక్క సినిమాలోనూ మన తెలుగు హీరోయిన్లు కనిపించరు..
చూడముచ్చటగా ఉండే ఆ రోజుల్లో హీరోయిన్లలో సావిత్రి, దేవిక, రాజసులోచన లాంటి వాళ్ళు అందంగా ఉండడమే కాక అభినయం కూడా ఎంతోబాగుండేది అందుకే కధలో కూడా వాళ్ళకి మంచి ఇంపార్టెన్సు ఉండేది..ఇప్పుడు కధానాయకలకి భాష రాదు..వాంపు లాంటి డ్రస్సులు వేసుకుని రాంపుల మీద పిల్లి నడకలు నడవడం తప్ప ఇంపుగా నాలుగు ముక్కలు మాట్లాడడం రాదు కాబట్టి..ఏదో గుడ్డ పీలికలు తగిలించి..పళ్ళు బిగబట్టి చిన్న చిన్న సీన్లు తీసేసి...ఆపైన వళ్ళంతా వూగిపోయే పాటలు ఆటలు తో సరిపెట్టేస్తున్నారు..ఇక మిగిలిన టైము అంటే హీరోయిన్ గారు చెయ్యాల్సిన టైముని అటు హీరో గారి లాగుడు డైలాగులకో...లేకపోతే..హీరోయిన్ చుట్టూ వుండే ఆమె వదినల బ్రుందానికో..హీరో చుట్టు వుండే కమెడియన్ మూక కో పెట్టి మన ప్రాణాలు తీస్తారు..ఇదీ కాక పోతే ఏ సూమోల చేసింగ్ సీన్లతో నో మన బుర్ర రామకీర్తన పాడిస్తారు...
అంతే తప్ప హీరోయిన్ కి తెలుగు నేర్పించరు..తెలుగు హీరోయిన్లని తీసుకోరు..ఎందుకంటే స్టార్టింగ్లోనే మనవాళ్ళు బరి తెగించరు కాబట్టి..
ఇంక ఈ మధ్య ఫాషన్ విషయానికి వస్తే హీరోలు..సిక్ష్ పేక్ అని కండలు పెంచేస్తున్నట్ట్లు..హీరోయిన్లు అదేదో జీరో సైజుట అలా తయారు అవుతున్నారు..అసలే సినిమాలో పాత్ర అంతంత మాత్రం కనపడుతుంది..హీరొ..ఆయన కామెడీ మిత్రులు..హీరోయిన్ చుట్టు వుండే బంధు మిత్రులు మధ్యలో హీరోయిన్ ని వెతుక్కోవడం కష్టం ఇంక ఈ జీరో సైజుకూడా ఐతే ఇంక తెలుగు సినిమాలో ఆమె పాత్ర జీరోయినే....
నాన్నా అతిగా కండలు పెంచిన హీరో అతిగా సన్నబడిన హీరోయిన్ సినిమాలు ఆడినట్ట్లు చరిత్రలో లేదు..హ హా హా అదుర్స్ కదూ...

ఆదివారం, నవంబర్ 30, 2008

థూ పాకీయులు

తు "పాకీయులు"
థూ పాకీయులు అనికూడా అనొచ్చేమో ?

మత వాదం మితి మీరి తీవ్రవాదంగా మారి...మానవత్వం మరచి...పైసాచికంగా వ్యవహరించినా ....ము(ల )ష్కర తోయిబాల ఆగడాలు ఎప్పటికి అంతమౌతాయో ?


శాంతి అహింస అంటూ స్వతంత్రం తేగలిగాము కానీ,,, హింస.. రక్తపాతం అంటూ తిరిగే పాకీయుల నుంచి మనల్ని కాపాడుకోగలమా...

పార్లమెంటు మీద బాంబు వేసిన వాళ్లని..ఇంకా జైల్లో మేపుతుంటే..అలాంటి వాళ్లని విడిపించుకోవడానికి ఇల్లాంటి దాడులు చేస్తునే వుంటారు...కాల్చిపారేయక...ఎవరో ఏదో అనుకుంటారనుకుని..వదిలేస్తే...,మొదతికే మోసం వస్తోంది..

ఎంతో మంది విదేశీ పర్యాటకులు, జవాన్లు, అధికారులు,,అమాయక ప్రజలు బలైపోతున్నారు...

ఎక్కడ ఎవరు ఏం చేసినా..ఏదో ఒక దానికి భయపడి..రాజకీయ వత్తిళ్ళకి భయపడి..ఐక్యరాజ్య సమితి అనో..అమెరికా అనో ఏదో ఒక కారణానికి భయపడి సైనిక చర్య చేపట్టకుండా వుంటుంటే వాళ్ళు అలా రెచ్చిపోతునే వుంటారు.. ఏదో సినిమాలో చెప్పినట్టు వంద కోట్లమంది భారతీయులు..ఒక్క సారి ఉమ్మేస్తే ఆ ప్రవాహానికి కొట్టుకుపోయే వాళ్ళు సముద్రం ద్వారా వచ్చి..మన పరువు ని అదే సముద్రం లో కలిపేసారు..
ఇంకా సంప్రదింపులు..సమాలోచనలు ఎందుకో అర్ధం కావట్లేదు..వాళ్లు బలి తీసుకుంటుంటే ఐక్యరాజ్య సమితులు..అమెరికాలు అడ్డుకుంటున్నాయా..వాళ్లని ప్రశ్నిస్తున్నాయా..? అన్ని ప్రశ్నలూ..ప్రతిబంధకాలు మనకేనా..మంచితనానికి పోతే చేతకాని తనం అనుకుంటున్నారు..ఇంక నైనా సద్భావన యాత్రలు. సంకల్ప యాత్రలూ కట్టిపెట్టి..చచ్చిన టెర్రరిస్టుల శవ యాత్రలు చేపడితే అప్పటికైనా..వాళ్లకి బుద్ధొస్తుందేమో....అంత బహిరంగంగా మేమే చేసాం అని చెపుతుంటే ఇంకా మొహమాటం ఎందుకో...?

మతం మానవత్వాన్ని కోరుకుంటుంది కానీ...మనవ రక్తాన్ని కాదు...

ప్రాణాలు అర్పించిన సైనిక వీరులకి జోహార్లు......ప్రాణాలకు తెగించి పోరాడిన వీర సైనికులకు...శభాషీలు కాదు...వాళ్ళ పిరికి చర్యకు సరైన సమాధానం ఇచ్చినప్పుడే వాళ్ళ త్యాగానికి అర్ధం...

సోమవారం, నవంబర్ 24, 2008

సినిమాల పండగ

ఈమధ్య గోవా లో సినిమాల పండగ స్టార్ట్ అయింది..గోవా భామ
టెన్ మిలియానా అదే 'ఇలియానా.' కొవ్వొత్తి ఇస్తే సౌత్ ఇండియా నుంచి బాలివుడ్ వెళ్ళి గొప్ప పేరు సంపాదించిన ఎవర్ గ్రీను 'రేఖ ' దీపం వెలిగించింది..అయితే ..తెలుగు సినిమాల్లో వెలుగుతున్న గోవా పిల్ల, దక్షిణ భారతం నుంచి వెళ్ళిన రేఖ ఉన్నారు అని తప్ప ఆ పండగలో తెలుగు సినిమాలు ?


అల్లాంటి పండగల్లో మన సినిమాలు ఎప్పుడు చూస్తామో ఏంటో? బాలివుడ్ నుంచి మూతి ముద్దులు, బికినీలు, స్టూరీలు, హీరోయిన్ లు, శ్రుంగార నాయకలు, విలన్ క్యారక్టర్లని వేసే వాళ్ళు ఇలా టివన్నీ అరువు తెచ్చుకుంటాము కదా..మరి అక్కడిలా మల్టీ స్టారర్ చిత్రాలు ఎందుకు రావు..అక్కడిలా పెద్ద హీరోలు కలిసి ఎందుకు చెయ్యరో అర్ధం కాదు..కొత్త కధలు..రొటీన్ కి భిన్నం గా అనడం కూడా రొటీన్ అయిపోయింది తప్ప నిజంగా లగాన్, చక్దే ఇండియా, తారే జమీన్ పర్ లాంటి అలోచనలు ఎందుకు చెయ్యరో...?

ఒక హీరో మరో హీరో సినిమాకి వాయిస్ వోవర్ ఇవ్వడం, రో చింతకాయల రవి పాటలో ఒక యువ హీరో డాన్స్ చెయ్యడం లాంటి వింతలు అప్పుడప్పుడూ జరుగుతున్నా హీరొలు కలిసి చెయ్యడం మాత్రం ఎన్ టీ ఆర్- ఏ ఎన్ ఆర్, క్రిష్ణ - సోభన్ లాంటి వాళ్ళతో నే ఆగి పోయాయి...? అభిమానుల పోరూ ఇందుకు ఒక కారణమే..తమ అభిమాన హీరోకి తక్కువ సీన్ లు వున్నాయి ..హీరో చచ్చిపోయాడు అని సినిమాలు ఆడని సందర్భాలూ ఉన్నాయి...ఇక సూపర్ స్టార్ క్రిష్ణ నెగిటివ్ రోల్ వేసినందుకు వారసుడు సినిమా టైములో ధియేటర్లు పగిలాయి...ఇక మళ్ళి అలాంటి ఆలోచనలు చెయ్యలేదు..లేరు ఇంకెవ్వరు....

అరవ సినిమాలు అరువు
హీరోయిన్ కి బట్టలు కరువు
సంగీతం పేరుతో దరువు
ఫిల్మ్ ఫెస్టివల్ లో పోతోంది మన పరువు

పోతే పోయింది మన అభిమాన హీరో ఆరు సాంగులు, 4 ఫైట్లు, ఒక ఐటం సాంగు, తొడ గొట్టే సీన్లు, కత్తిపట్టే డైలాగులు వుంటే చాలు..మనమే పండగ చేసుకుందాం

శనివారం, నవంబర్ 15, 2008

కాంగ్రెస్ " గర్జన "

కాంగ్రెస్ "గర్జన"

ఇన్నాళ్ళు పడ్డ టెన్షన్ కి ఒక ఊరట లభించింది..చాలా కాలం సస్పెన్స్ పెట్టిన మన మెగాస్టారు

తిరుపతిలో 'ప్రజా అంకిత సభ ' పెట్టి రాజకీయ ప్రవేశం చేశాడు...
కొంచెం గ్యాపుతో తెలుగు
దేశం బాలయ్య తో గర్జన కార్యక్రం నిర్వహించి..గున్ "టూరు " విజయవంతం చేసుకున్నారు...
తరువాత బీ జే పీ పెరేడు గ్రౌండులో "విజయ సంకల్ప యాత్ర " పేరిట అద్వానీ గారి సభ

నిర్వహించి...కమలం విలువ చాటింది..
ఇక తె రా సా, నవ తెలంగాణా లు కూడా తమ గర్జన లు


గాండ్రింపులు చాటేసారు..
మరి కాంగ్రెస్ ఏం చేస్తుందా అని రోజూ ఆలోచిస్తున్నా..
"ప్రజా అంకిత-
విజయ సంకల్ప- గర్జన " లాంటి పేర్లూ అనుకున్నా ఐతే వాళ్ళు నా అంచనాలని తల కిందులు చేస్తూ

తమ సభ పేరు ఈ మధ్య అనౌన్స్ చేసారు..అదే .......' నంది " అవార్డు కార్యక్రమం....
(ఇంకా ఈ
అవార్డు పేరు ఇందిరా అవార్డు గానో ..రాజీవ్ అవార్డు గానో మారక పోవడం ఆ నంది ఎన్నో జన్మలుగా ఆ కైలాసంలో పరమశివుణ్ణి సేవకు ఫలమేమో!!)


ఇదేదో...నాకు వాళ్ళంటే పడక,,లేక సరదాకో అంటున్న మాటలు కాదు..అక్కడి ఏర్పాట్లు చూస్తే అర్ధం అవుతుంది..ఎన్నడూ లేని విధంగా "ఉత్తమ నటుడు"
కోసం వూరంతా పోస్టర్లు, జెండాలు, జనంకోసం ప్రత్యేక బస్సులు, రైళ్ళూ, ఇంకా అనేక ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి..ఇంతకు ముందు కూడా ఈ నటుడుకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చినట్టు గుర్తు కానీ అప్పుడు ఎజెండాలో ఇన్ని జెండాలు లేవు..ఆహ్వాన పత్రంలో తప్ప..పోస్టర్లు

లేవు..అవార్డు ప్రకటన తప్ప ..పత్రికల్లో ప్రకటనలు లేవు..మరి ఈ సారి ఇవన్నీ స్పెషల్..

నంది బహుమతుల కార్యక్రమాలు సాధారణంగా లలిత కళా తోరణం లో జరుగుతాయి..కానీ ఎన్నేళ్ళకి

ఒక సారి జరుగుతాయో //ఆ ఇచ్చే అవార్డులు ఏ సంవత్సరం వో కూడా ఆయా నటులు....దర్శకులు..అభిమానులు ...ప్రేక్షకులు మర్చిపోయి వుంటారు...అవార్డులు స్వీకరించడానికి ఆయా నటులు కూడా చాలా సార్లు సమయం కుదరక రాని సందర్భాలూ లేక పోలేదు....
ఐతే ఈ సారి తప్పక వస్తున్నట్టు సమాచారం...(అసలు కార్యక్రమమే అందుకు) అందుకే
ఈ ఏర్పాట్లు....




గురువారం, నవంబర్ 13, 2008

నందీ గే్‌ం స్ nandi games

నందీ గే్‌ం స్

హైదరాబద్ లోని లాల్ బహ 'దూర్ ' స్టేడియం లో నందీ గేంస్ జరగనున్నాయి..అయితే పోటీ ముందే అయిపోయి గెలిచిన జట్టు ప్రదర్శన 16వ తారీఖున ఉంటుంది..

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ లో ఐ సీ ఎల్ మాచులు జరుగుతున్నాయ్ ఎల్ బీ స్టేడియం లో..ఫైనల్స్ కి జేరింది లాహోరు వాళ్ళు హైదరాబాదు వాళ్ళు కానీ సడెన్ గా బరిలోకి దిగింది పీ సీ సీ అదేనండీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క బాలుతో ఐ సీ ఎల్ ని ఆల్ ఔట్ చేసేసి..ఒక్క సారిగా ఫైనల్ డెసిషన్ మార్చేసి నందీ గేం లు మొదలెట్టింది...అసలే 'విజయ సంకల్ప ప్రజా అంకిత గర్జనలు ' జరుగుతున్న సమయం కాబట్టి ' క్రిష్ణ ' సారధ్యం కోసం ' రాజకుమారుడి " సేన కోసం లక్షలు అద్దెవచ్చే ఐ సీ ఎల్ మాచులని తోసి రాజని లక్షణంగా నంది అవార్డుల కార్యక్రమం పెట్టింది.. అభిమానుల కోసం ఈ ఇందిరా సారీ అలవాటైపోయిని నందీ ఎవార్డులు కార్యక్రమం ఇక్కడ పెట్టింది..

'రాజ (సేఖరుడు) " తలుచుకుంటే (ఇలాంటి) దెబ్బలు కొదవా..

ఇక ఐ సీ ఎల్ లాంటి వారు మళ్ళీ మన పేరెత్తుతారా ఎన్ని గుండెలు వాళ్ళకి..

శభాష్ ...అనుకోవాలికదా మనకి మనం...

ఇక నంది ఆటలు చూడడానికి పదండి తోసుకు పదండి పాసుకు పోదాం పోదాం (సోనియా)గాంధీ భవన్ కి...




మంగళవారం, నవంబర్ 11, 2008

బికినీప్రియ....



బికినీప్రియ....

అదేంటో..తెలుగు సినిమాల్లో..కొద్దో గొప్పో బాగా చేస్తున్నారు అనుకోగానే..మాయరోగాలు పుట్టుకొస్తాయి..అదేదో సినిమాలో మళయాలం లో లేండి..జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిన నటీ 'మణి '..మళ్ళీ అన్నీ అల్లంటి సినిమాలు..అలాంటి వేషాలు వెయ్యాల్సొస్తోందని..నేను బికినీ కైనా రెడీ...అవసరమైతే ఈ సదుపాయం ఉపయోగించుకోండి అంటోందని వినికిడి..అంతటి సదుపాయాన్ని ఉప 'యోగించుకోక ' పోవడానికి మన వాళ్ళేమన్న పిచ్చోళ్ళా..వెంటనే బీచులో సీను పెట్టేసారట,.,,

ఆ మధ్య బిల్లా లో ఓ పిల్ల ఇలానే బికినీలో నటించిందిట..నటనలో పోటీ పడక పోయినా..ఈ విషయాల్లోనూ..రెమ్యునరేషన్ విషయంలోనూ మాత్రం వీళ్ళ మధ్య పోటీ బాగానే ఉంటుందనుకుంటా..

కళ్ళ తో నటించడం చేతకాక...వళ్ళు తో నటించేసి..సంపాదించేస్తున్నారు..ఇక ఫ్యామిలీతో సినిమాకి రమ్మంటే ఏమి వస్తారు..జనాలు..

శాఖినీ..ఢాకినీకి విరుగుడుందేమో గానీ..బికినీ కి లేదేమో.?

సోమవారం, నవంబర్ 03, 2008

చంద్ర యానం....

చంద్ర యానం....

శ్రీహరి కోట నుంచి మన శాస్త్రఙులు చేసిన ప్రయోగం ఫలించింది...చంద్రయానం సక్సెస్ అయింది..కానీ ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం నుంచి గుంటూరు బయలుదేరుతున్న 'చంద్ర ' యానం ఎలా జరగనుందో తెలియాల్సి వుంది...

బాబు - బాబాయ్ మధ్య 'జూనియర్లు ' తేల్చుకోలేక పోతున్నారు.. బాబాయ్ తోనే మేమందరం...అంటున్నా..సభలో ఏం జరుగుతుందోనని ఇప్పటికే టెన్షన్ మొదలయ్యింది...తన వాడికి 'సీటు ' రిజర్వ్ చెయ్యలేదని.. ఒక జూనియర్ ఇప్పటికే రాను అని చెప్పేసాట్ట..ఇక హరి గారి మరో (కళ్యాణ)రాముడు సంగతేంటో..ఇంకా తెలీదు...యాతా వాతా గుం 'టూరు ' చంద్ర యానం సక్సెసా కాదా అన్నది త్వరలో నే తేలనుంది...

శుక్రవారం, అక్టోబర్ 31, 2008

ఆంధ్ర అవతరణ దినోత్సవ కానుక తెలుగుకు ప్రాచీన భాష హోదా

ఆంధ్ర అవతరణ దినోత్సవ కానుక తెలుగుకు ప్రాచీన భాష హోదా
మొత్తానికి కేంద్రం కరుణించి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించింది..ముఖ్య మంత్రి నుంచి...అధికార భాషా సంఘం దాకా అందరూ ఈ విషయంలో కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు..తెలుగు వారందరికీ శుభాకాంక్షలు...
కానీ..నిజంగా తెలుగు భాష కు ప్రాచీన హోదా ఇవ్వడం ఇప్పటికే ఆలస్యం కాలేదా? తమిళానికి త్వరగా ఇచ్చిన వాళ్ళు తెలుగు కి ఇవ్వడానికి ఆలస్యం చెయ్యడానికి కారణం ఏమిటి..ఇప్పుడు హడావిడిగా ఆంధ్ర అవతరణ దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఇవ్వడానికి కారణం ఏమిటి ? అని ఒక చిన్న అనుమానం...ఇంత కాలం ఎదురు చూసిన మనకి ఈ ప్రభుత్వం చివరి సంవత్సరం కదా..వచ్చే సంవత్సరానికి ఏ పరిస్థితులుంటాయో...తెలంగాణా లాంటి అంశాలు..ఎన్ని అడ్డు వస్తాయో..అప్పటికి ఏ ప్రభుత్వం ఉంటుందో ? తెలీదు కాబట్టి,,,ఇప్పుడిస్తే ఆ క్రెడిట్ తమ ప్రభుత్వానికే దక్కుతుందని అనుకోవచ్చా ? ఎన్నో సభలు ...సమావేశాలూ,,,చర్చలు...రకరకాల విషయాలు....ఎన్నో ఎప్పట్నుంచో జరుగుతున్నా..మొత్తానికి ఇప్పటికి ప్రాచీన హోదా కల్పించారు...లేదా, ఇంత ఆలస్యం చేస్తే గానీ ప్రాచీన హోదా పొందడానికి కావాల్సినంత సమయం సరిపోలేదేమో మరి?
ప్రాచీన హోదా కలగడం వల్ల ఇప్పుడు తెలుగు భాషాభివ్రుద్ధికి సమ్రుద్ధిగా నిధులు వస్తాయా, అవి సక్రమంగా సరైన కార్యక్రమాలకే ఉపయోగపడతాయా..అన్నవి కాలమే తేల్చాలి..
ఐతే తెలుగు వారమందరం..తెలుగు ఎంత వరకు వాడుతున్నాం, తెలుగు ఎంత మాట్లాడుతున్నాం, మన మాటల్లో ఎంత తెలుగు ఉంటోంది..ఇంట్లో, స్కూల్లో.. పిల్లలు తెలుగు ఎంత వరకు మాట్లాడుతున్నారు, ఎంత వ్రాయగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు..? ప్రాచీన కాలం నుంచీ తెలుగు వ్రాస్తూ, చదువుతూ, మాట్లాడుతూ ఉన్నాం కనుక ఇప్పటికీ తెలుగు ఇంకా వుండి ప్రస్తుతం ప్రాచీన భాషగా గుర్తింపు పొందింది...ఇప్పుడు తెలుగు ప్రాచీన భాష గా గుర్తింపు పొందినందుకు పొంగిపోయి, సంబరం జరుపుకోవడం కాదు...రాబోయే తరాలకు తెలుగు ఎలా అందచేయాలో ఆలోచించాలి...మరిన్ని తరాలు తెలుగు భాష నిలిచేల నడుం బిగించాలి..మాత్రు భాష మ్రుత భాష కాకుండా....ఒకప్పుడు తెలుగు ఉండేది అనే రోజు రాకుండా చూడాలి..చంద్రయానం పేరుతో చంద్రుడి మీదకి వెళ్ళడంలో సాధించిన ప్రగతి..ఆచంద్ర తారార్కం తెలుగు భాష నిలిచేలా మనందరం పాటుపడాలి.....అప్ప్డే నిజమైన సార్ధకత....

మంగళవారం, అక్టోబర్ 28, 2008

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...
హౌస్ పెయింటింగ్ ఫెస్టివల్ నాట్...ఇల్లు అలకగానే పండగ కాదు..ఇంగ్లీష్ లో చెప్పమంటారు
...చెబితే అర్ధం కాదు..అని శంకర్ దాదా అన్నట్టు గుర్తు....సినిమా ఓపెనింగ్ కి తిరుపతి చేరిన
అభిమాన 'ప్రజా' వాహిని చూసి ఆనందిస్తున్నారు...
ఇక శ్రీకాకుళ యాత్ర తో రాజకీయ 'రహ దారులు ' ఎలా వుంటాయో కొంచెం అవగతమై
వుంటుంది..ళైట్లలో షూటింగులు,,ఫైట్లలో తగిలే దెబ్బలు..అలవాటైన వాడు కాబట్టి కొంచెం
తట్టుకోగలిగినా..జనం చూపించిన ప్రేమ వల్ల బాగానే నెట్టుకొచ్చారు...యాత్రని..
అయితే రానున్న ఎన్నికలు..పోటీలు..సీట్లు..కేటాయింపులు..లాంటి తలనొప్పులు ఇంకా చాలా
ఉన్నాయి..పండక్కి రిలీజయ్యే పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీలా, ప్రస్తుతం అన్ని రాజకీయ
పార్టీలూ..తమ తమ హీరోలని సినిమా వాళ్ళని దింపే ప్రయత్నాలలో ఉన్నారు..మెగా 'స్టారు ' కన్నా
మా 'సారు ' 'వై ఎస్సారు ' కే పాపులారిటీ ఎక్కువ అని బింకం గా చెబుతున్నా సూపర్ స్టారు క్రిష్ణ,
యువరాజు..మహేషుని,,సహజ నటి 'జయ ' సుధ, యాంగ్రీ యంగ్ మాన్ మరో 'రాజ సేఖర్ ' ఆయన
'జీవిత ' భాగ స్వామి, ధర్మవరపు, లాంటి వారిని తమ బెటాలియన్ లో చేర్చుతున్నారు
(సోనియా)గాంధీ భవన్ నాయకులు..
మరో పక్క తెలుగు దేశం వాళ్ళు నందమూరి సిం హాలు "గర్జించడానికి" గుంటూరు లో సన్నాహాలు
చేబట్టినాయి..కాక పోతే..'కాక ' మీద ఉన్న నందమూరి అభిమానులు 'బాలయ్య 'ను కాబోయే సీ ఎం
గా చూడాలనుకుంటున్నారు..యువ సిమ్హాలు కూదా బాబు గురించి కాక బాబాయి గురించే ఎక్కువ
చెబుతున్నారు.... 'గర్జన ' సంగెతెలా ఉన్నా ఈ విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం
ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం లో
మరో పక్క ఎవరు తమ పార్టీకి ఎక్కువ కోటా సీట్లిస్తారో ఈసారి ఎవరికి మద్దతిస్తారో తెలీక బీపీ పెరిగిన
బీజేపీ తమ వంతుగా కోటా, కృష్ణం రాజు..ని నమ్ముకుంటున్నారు..
టీ ఆర్ ఎస్ లో హీరో ఒకే ఒక్కడు కే సీ ఆర్..ఎన్ టీ ఆర్, వై ఎస్ ఆర్, మెగా స్టార్ ఎవరొచ్చినా సరే,
ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సింగిల్ హాంద్ కే సీ ఆర్..అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నా..తెలంగాణా
కి సై అంటే ఎవరైనా ఓకే అంటున్నారు...
ఇక బరిలో ఉన్న ఏకైక హీరోయిన్ 'విజయ ' శాంతి..తల్లి తెలంగాణా కోసం పోరాడుతోంది..
ఇవన్నీ ఇలా ఉంటే నాకర్ధం కాని విషయం ఒకటుంది..చిన్న గల్లీలోనైనా..చిన్న టీ వీ షూటింగు జరిగినా విరగబడి చూసే జనం,, బట్టల షాపు ఓపెనింగులకి
హీరోయిన్లు వస్తే రోడ్డు నిండా ఆగి చూసే జనం..స్టూడియోల ముందు నిలబడి కారులో ఉన్న తమ
హీరోలని నల్ల అద్దాల్లోంచి చూసి ఆనందించే జనం..హీరో ఇంట్లో పెళ్ళి వేడుకలైతే ఎదురుగా కరెంటు
పోలెక్కి చూసే జనం...(నిజంగా కనపడుతుందా అని కూడా ఒక డౌటు) ...ప్రజా అంకిత సభలకి,,
గర్జనలకి, హాజరయ్యే జనం ..వాళ్ళ అభిమానం వోటుగా మారుతుందా అని? అసలు వాళ్ళు వెళ్ళే
సరికి వాళ్ళ ఓటు ఇంకా ఉంటుందా అని...కాంగ్రెస్స్ లో ఎన్ టీ ఆర్ అభిమానులు, తెలుగు దేశంలో
చిరంజీవి అభిమానులు ఇలా ఉండరా అని...
నిన్నటి దాకా షూటింగు కి కొబ్బరికాయ కొట్టిన దగ్గరనుంచీ గుమ్మడికాయ కొట్టే వరకు హడావిడి
చేసి..ఆడియో రిలేజు నుంచి సినిమా రిలీజు వరకు ఎంజాయ్ చేసి..ధియేటర్ లకి రంగులేసి..కటౌట్లకి
దండలేసి..పోస్టర్ లకి తిలకాలు దిద్ది..టికెట్లకు లైనులో నిలబడి సినిమాలో విజిల్సు వేసి..వంద
రోజుల ఫంక్షను కోసం ఎదురు చూసే అభిమాని రక్తం పంచుకు పుట్టక పోయినా రక్తం పంచే
కార్యక్రమంలో పాల్గొన్న తమ్ముళ్ళ లాంటి అభిమాని ఇప్పుడు సడెన్ గా కార్యకర్తగా మారి..పార్టీ జెండా
పట్టుకుని వొట్లేసే చోట లైనులో నుంచొని..(కటౌట్లు పోస్టర్లు మామూలే) వోట్లేసి గెలిపించే పని ఎంత
త్వరగా నేర్చుకుంటారో మరి...
నిజంగా అభిమానులకి తమ హీరో చేసేవి 'అన్నీ ' నచ్చితే హీరో ఎంతో 'ఇష్టపడి ' కష్టపడి చేసిన ప్రతీ
సినిమా హిట్ అవ్వాలి కదా..ఈ సినిమా ఫ్లాప్ అయితే మరో ఏడాదికి కొత్త సినిమా వస్తుంది..కానీ
రాజకీయాలలో ఎన్నికల సినిమా ఫ్లాప్ అయితే ఐదేళ్ళ వరకూ మరో సినిమా ..కష్టమే..
పార్టీలో కూడా తన అభిమానులు..అభిమాన సంఘం అధ్యక్షుడు, ఇతర పార్టీలనుంచీ జాయిన్ అయ్యే
రాజకీయ నాయకులు,,మేధావులు..బడుగు వర్గాల నాయకులు...లాంటి వారందరిలో ఎవరికి టికెట్టు
ఇవ్వాలో కొంచెం కష్టమైన పనే...

సోమవారం, అక్టోబర్ 20, 2008

వసుం 'ధర' - వెజిటబుల్ లోన్

వెజిటబుల్ లోన్
(వసుంధర అంటే భూమి అని పేరు కానీ ఇప్పుడు భూమి ధర కూడా ఆకాశంలో వుంది..)

నమస్కారం మేము ఏ బీ సీ డీ బాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు కిలో టమాటా కొనడం కోసం అప్లై చేసిన లోన్ ని మీకు అందించలేక పోతున్నందుకు చింతిస్తున్నాం,,,మీ జీతం కేవలం నలభై వేలు కావటం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ చెయ్యడం అయినది..ఎవరైనా అరవై వేలు కన్నా ఎక్కువ జీతం ఉన్న వారు గ్యారంటీ ఇచ్చినట్లైతే మీకు లోను అందజేయబడుతుంది..ధన్యవాదములు.....

ఏమిటీ,,,,ఆ అబ్బాయిని ప్రేమించావా...మన అంతస్థేమిటి ? వాళ్ల అంతస్థేమిటి..? వాళ్లు నెలకి ఒక్క సారి టమటా వేసి చారు పెట్టుకుంటారు...మనం వారానికి ఒకసారి టమాటా పప్పు చేసుకుంటాం...అలాంటి పేద వాడితో ప్రేమ..నో అతన్ని మర్చిపో..ఒక ఇంట్లో పెళ్ళి గోల.....


ట"మాట" మాట తలుచుకోవాలన్నా భయంగా ఉంది..కిడ్నీ లో రాళ్ళొస్తాయట అందుకే మానేసాం అని చెప్పుకుని తిరుగుతున్నా, అసలు కారణం అందరికీ తెలుసు..అదే ..ధరణి దాటిన ధరలు
ఆకాశాన్నంటిన ధరలు అశ్విని-భరణి పక్కన ఫక్కున నవ్వుతున్నాయ్..
షేర్ల ధరలు..రూపాయి విలువలు..పాతాళంలోకి దారులు తవ్వుతున్నాయ్..
స్వాతంత్ర్యం తెచ్చినందుకు నోటుమీద మనం అచ్చేసినందుకు.. బోసినోటి గాంధీ తాత ఇక్కడెందుకున్నానా అని బాధ పడుతున్నాడు పాపం..
గాంధీ పేరు చెప్పుకుని రాజ్యాలేలే నాయకుల నిజాయితీ లాగా అడుగంటుతున్న ఆర్ధిక స్థితి బహుశా ఆ ఆత్మల శాపం..

ఇడుపుల పయలు..ముడుపుల మాయలు..ప్రజల సొమ్ము నాయకుల పాలు..
కూలే గుడిసెలు..కాలే కడుపులు..పోయే ప్రాణాలూ..రాలే బతుకులు..
భరత మాతకు కడుపు కోతలు..చూసినా పట్టించుకోరు నేతలు..
ఎన్నికలొచ్చేదాకా హామీలు..కుమ్మరించి..ఎన్నికయ్యాక అన్నీ విస్మరించే ఈ నాయకులున్నంత కాలం మన బతుకులింతే....

అర్జెంటుగా ఈ పరిస్థితులు మారవు గానీ..త్వరగా వెళ్ళి లోను తీసుకోవాలి..పావుకిలో టమేటా కొనాలి..ఈ మధ్యే నాకు వెజిటబుల్ లోన్ కి ఎలిజిబిలిటీ వచ్చింది..మీకూ కావాలా ? జీతం నలభై వేలు ఉంటే చాలు...నన్ను కలవండి ఇప్పిస్తా..(నాక్కూడా కమీషన్ కింద 3 టమాటాలిస్తారు..మరి).......

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అమ్మ



అమ్మ







భగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కాబట్టి అమ్మని శ్రుష్టించాడంటారు పెద్దలు..నిజమే.ఆమె చేసే పనులు ఆ దేవుడు కూడా చెయ్యలేడేమో..పుట్టించేసి చేతులు దులిపేసుకుంటాడు డేవుడు..అందుకేనేమో భర్త ని కూడా దేవుడు తో పోలుస్తారు పెద్దలు..తొమ్మిది నెలలు గర్భం లో జాగ్రత్తగా పెంచి..ఉమ్మ నీరు పరుపులా గుండె చప్పుడు లాలిపాటకు చిచ్చిగా..నిద్ర పుచ్చినట్టుగా కాలం గడిపి...లోపల తంతున్నా...అందులోనూ ఆనందం వెతుక్కుని...ఎన్నో శ్రమలొకోర్చి....నొప్పులు పడి..ఆపరేషన్ పేరుతో కోత కోసినా మనల్ని కని..భూమిపైన కాక తన పై వేసుకుని పెంచే 'స్థన్య ' జీవి 'అమ్మ '....'అమ్మతనం ' లోని కమ్మతనం మనకు పంచుతూ..శ్రమలకోర్చి పెంచుతూ..తను తిన్నా తినక పోయినా..నిద్ర పోయినా లేచి వున్నా పాలకి ఏడ్చినప్పుడల్లా పాలిచ్చి..అన్నం తినిపించి..ఉచ్చ--పియ్య అన్ని శుభ్రం చేసి..మంచి చెడు అన్ని చూసి..అనారొగ్యం వస్తే తాను తిండి మానేసి..కంటి కునుకు వదిలేసి..క్షణ క్షణం కళ్ళల్లో వత్తులేసుకుని..మనల్ని కాపాడే దేవత అమ్మ..చిన్న చిన్న విషయాలకు కూడా పొంగిపోతూ మనగురించి నిత్యం ఆలోచించి..ప్రతి క్షణం మన ప్రగతి గూర్చి అలోచిస్తూ..అ ఆ లు నేర్పే తొలి గురువు అమ్మ..విద్య..వైద్యం..మార్గదర్శకత్వం అందిచే అమ్మ ఆల్ రౌండర్...మనకి ఇప్పుడు తెలిసినవన్నీ అమ్మకు ఎప్పుడో తెలిసినా..కొత్తగా విన్నట్టు నటిస్తూ మనల్ని గొప్పోళ్ళని చేసే అమాయకురాలు అమ్మ..
చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తుంటే దగ్గరుండి ప్రోత్సహించి..తప్పొప్పులు చెప్పి..నన్ను సరైన దిశ లో నడిపించి..ఒక కళాకారుడిగా తీర్చిదిద్దింది మా అమ్మ..నేను ఏది రాసినా మొదట చూసి/విని సరి చేసే ఎడిటర్ మా అమ్మ..అలా నన్ను అన్ని విధాలుగా ప్రభావితం చేసిన మా 'అమ్మ ' సడెంగా నన్ను వంటరిని చేసి, తనకి నేను సేవ చేయాల్సిన సమయం వచ్చేసరికి ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది...అవును దేవుదికి కూడా అమ్మ అవసరమైందనుకుంటా...అవును తల్లి లేని వాడు కదా..ముచ్చటపడి తీసుకెళ్ళిపోయాడు....కనీసం తనైనా పూర్తిగా సేవ చేస్తాడేమో.....
ప్రపంచంలో ఎవరినైనా 'అమ్మా అనొచ్చు..అందరిలోనూ అమ్మ తనం వుంది..నాన్న అని అందరినీ అనలేం..అమ్మతనం అంత గొప్పది..మమ్మీ సంస్క్రుతిలో ఆ విలువలూ తెలియవు..ఆ బంధం ఏర్పడదు..ఎందుకంటే మమ్మీ లలో "లైఫ్" ఉండదు..శవ పేటికలని మమ్మీలంటారట కొన్ని ప్రాంతాలలో...మన అమ్మ ప్రాణ రూపంలో ఉన్న దేవత....అమ్మ కి మొక్కితే ఆ దేవుడికి మొక్కినట్టే...
దసరా పర్వదినాలలో కనకదుర్గలో ఐక్యం అయిపోయిన అమ్మ (మా అమ్మ పేరు కనకదుర్గ )కి అంకితం....

ఆదివారం, సెప్టెంబర్ 28, 2008

ఇం 'ప్రెస్ మీట్ '

ఇం 'ప్రెస్ మీట్ '

అక్కడ బాగా హడావిడిగా ఉంది...షామియానాలు, కుర్చ్చీలు, మైకులు, ఒకటే హడావిడి..ఇంతకీ విషయం ఏమిటంటే అక్కడ ప్రెస్ మీట్ జరగబోతోంది..ఒక సినిమా తాలూకు విశేషాలు చెప్పడానికి...
సినిమా అద్భుతంగా వచ్చింది..ఇంత వరకూ తెలుగు తెర మీద ఇలాంటి సినిమా రాలేదు (తాను చూసి ఇన్ స్పైర్ ఐన కాపీ కొట్టిన ఇంగ్లీషు సినిమా తలుచుకుంటూ, దాని వసూళ్ళు లెక్కలు కడుతూ ) దర్శకుడు..తొలి పలుకులు...
మ్యూసిక్ చాలా బాగా వచ్చింది హీరో (లావుగా బొజ్జతో కదలలేని)బాడీ లాంగ్వేజ్ ద్రుష్టిలో పెట్టుకుని చేసా...గ్యారంటీగా సూపెర్ హిట్ అవుతుంది..(తాను డైరెక్టుగా దౌన్ లోడ్ చేసిన ఇంగ్లీష్ ఆల్బం మీద నమ్మకంతో) మ్యూసిక్ డైరెక్టరు



దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ చాలా హాపీ గా ఉంది..మంచి (ఎక్ష్పోజింగ్ కి) స్కోప్ ఉన్న సినిమా...హీరో సార్, డైరెక్టర్ సార్, ప్రొద్యూసర్ సార్ చాలా 'కోపరేట్" చేస్తున్నారు...(సబ్బు కంపేనీ ఆద్ నుంచి దిగుమతి ఐన బొంబాయ్ భామ)..
సినిమా అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది (అంత చండాలంగా తీద్దామని అనుకోడం ఎందుకు ? బాగా వచ్చిందండం ఎందుకు ?) బాగా రిచ్ గా తీసాం (తప్పలేదు మరి). 100 ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం. (కనీసం ఒక్క రోజు ఆడినా 100 రోజుల ఫంక్షన్ చేసుకోవచ్చు). గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. హీరో గారు బాగా "కోప"రేట్ చేసారు...(నెక్లెస్ రోడ్లో తీయాల్సిన హీరో నడిచే సీను న్యూజిలాండ్లో చేయించిన సీను గుర్తు చేసుకుంటూ) ప్రొడ్యూసరు..
ఇలా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ రిలీజ్ డేటు అనౌన్స్ చేసారు...
సినిమా రిలీజ్ అయింది...ధియేటర్ దగ్గర..
కెవ్వు కేక..మా హీరో సినిమా సూపెర్ హిట్టు,,ఆయన మీద వొట్టు..రికార్డులన్నీ తిరగరాస్తుంది..హండ్రెడ్ డేస్ ఆడేస్తుంది..(ముందు రోజు నుంచీ తిండీ తిప్పలు లేకుండా కటౌట్లు కట్టి, దండలేసి,,సినిమా హాలుకి రంగులేసి, చొక్కా చిరిగినా టికెట్టు సంపాదించేసి,,పాటలకి ఈల వేసి, ఫైట్లకి కాగితాలెగరేసి ..సినిమా చూసి మెంటలెక్కేసి) అభిమాని ఉవాచ.... కట్ చేస్తీ..సినిమా రెండో రోజే గల్లంతు కానీ మళ్ళీ మనవాళ్ళు సక్సెస్ మీట్ అంటూ తయారు...ఏం చేస్తాం తప్పదు మరి,,,,

శనివారం, సెప్టెంబర్ 20, 2008

..సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు

..సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు ....
తెలుగు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...'కొత్త ' ఐడియా లతో వస్తున్న 'చిత్రాలని ' చూడాలంటే భయమేస్తోంది..సినిమాకి ఐతే వెళ్ళడం తప్పించుకోవచ్చు, కానీ,,ట్రైలర్ల పేరుతో ఇంట్లో టీవీల్లోవి ఏం చేద్దాం.
ఇదివరకు పండంటి సంసారం, పచ్చని కాపురం, నిండు గౌరవం లాంటి సినిమాలొచ్చాయి, తరవాత సంసారాలు పోయి, రాక్షసుడు, యమకింకరుడు, కిరతకుడులాంటి సినిమాలొచ్చాయి, తరువాత..నువ్వు నాకు నచ్చావ్, ప్రేమించుకుందామ్రా, కలిసుందామ్రా, ఇంకేదో చేద్దామ్రా లాంటి సినిమాలొచ్చాయి, ఇప్పుడు తిట్ల ట్రెండు అనుకుంటా...ఈడియట్, కంత్రి, పోకిరి, బలాదూర్,దేశ(హ)ముదురు, ఇలా తిట్ల సినిమాలొస్తున్నాయి..సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతోంది...ఎంత పెద్ద తిట్టో అంత పెద్ద హిట్టు....
ఇక ప్రస్తుత జెనెరషన్ బాడీలది..అవును మొహం తో నటించలేం కాబట్టి బాడీ లాంగ్వేజు అంటున్నారు..ఇది ఏమి లాంగ్వేజ్ప మరి, మనమెక్కడ నేర్చుకోవాలో..సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు (హెరాయిన్ అనాలేమో?)...బలిసిన శరీరాల్ని...సుష్కింపచేసి..కండలు పెంచి..చొక్కాలు చించి.....గడ్డలు పెంచి...నీరసించి...కనిపిస్తున్న హీరోలు...ఆ సమయాన్ని కాస్త నటననేర్చుకోవడానికి....కాస్త మంచి సబ్జెక్టుల్ని వెతుక్కోవడానికి ఉపయోగిస్తే బాగుంటుందేమో..ఒక డైరెక్టరు ఒకహిట్టు ఇవ్వగానే వెంటనే ఆయనతో ఒక సినిమా అనేసుకోవడం.హడావిడిగా మొదలెట్టడం..ఒక హీరోయిన్ హిట్టవగానే ఆమెతోనే సినిమాలు చెయ్యడం..వాళ్ళకి విసుగొచ్చి బాంబేనో, చెన్నయ్యో, కేరళో పారిపోతే..సినిమా ఆపి కోటి పైగా ఇచ్చి ఆ పర భాషాకాంత ని తెచ్చి చెయ్యడం ఫాషన్ అయిపోయింది...జాతీయ అవార్డు అందుకున్న నటి చేస్తున్న చిత్రం అంటూ వచ్చిన ఒక సినిమాలో (అవార్డు వచ్చిన సినిమా కాదు) ఆమె కు నటించాల్సిన అవసరం లేని పాత్ర..ఒకట్రెండు పాటలు..ప్రేమ, ఇతరత్రా విషయాలు//మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా మీకెలాంటి పాత్రలు ఇష్టం అంటే అన్నీ అలాంటి పవిత్రమైన పాత్రలు పరుత్తివీరన్ పాత్రలే వస్తున్నాయి...నాకు బబ్లీగా ఉండే పత్రలిష్టం ఎక్ష్పోసింగు అవసరమైనంత మేరకు చేస్తాను (ఎవరికి అవసరమైనంత వరకో మరి ??) అంటూ ప్రియంగా చెప్పింది ఒక భామా మణి.....
ఇంకా నేను తూనీగ పిల్లనే అనుకుంటున్నారు నేను "పెద్ద" దాన్నాయాను..గుర్తించండి..కావాలంటే ఎక్ష్పోసింగ్ చేస్తా(అప్పటికైనా గుర్తిస్తారనేమో) అని ఈనాడు ఒక బాల వర్ధమాన యువ నటి సెలవిచ్చింది///నేను మాటలు చెప్పను అంతా చేతలే అంటూ 'నయనా' నికి ఆనందం కలిగించే 'తార ', ఇటీవల 'విసాలా హ్రుదయం కల ఒక హీరోకి పోటీగా తన 'కండలని-గుండెలని ' ప్రదర్శించింది....ఆమె స్ఫూర్తికి "సెల్యూట్ " . యోగాభ్యాసం నుంచి హీరోయిన్ యోగం పట్టిన మరో చిన్నది కూడా వీలైనంత చిన్న దుస్తులే వేసుకుంటూ ఇటీవల పెంచిన తన పారితోషికానికి న్యాయం చేస్తూ..కనీసం కాస్ట్యూంస్ విషయంలోనైనా నిర్మాత కి నాలుగు డబ్బులు మిగులుస్తోంది....
ఇక రాబోయే సినిమాల్లో ఎలా వుంటారో..ఏమో? ఈ మదయ ఒక జోక్ చదివా ఆ సినిమాలో నగ్నంగా ఎలా నటించారు అని ఒక విలేఖరి హీరోయిన్ ని అడిగితే..ఏం చెయ్యను హీరో అలా కల గన్నాడు మరి అంటూ అమాయకంగా జవాబిచ్చిందిట..కధ డిమాండ్ చేసింది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు..కానీ నాకు అర్ధంకాని విషయం ఒకటుంది...కధకి మాటలొచ్చా అని..రైటర్ అనుకున్నది తెర మీదకి వస్తుందా అని..మధ్యలో ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో ఇలా తలా ఒక చెయ్యి వేస్తారుకదా....హీరోయిన్ మీద కాదండీ కధ మీద...
ఇక రాబోయే సినిమాల టైటిల్సు ఇలా వుంటాయేమో?
వె ధ వ - వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు
శ్రీ రాముడు - ఈయనకి ఇద్దరు పెళ్ళాలు/ ఇద్దరు పెళ్ళాల ముదుల మొగుడు
లేచిపోదాం రా...కట్నాలు మిగులుద్దాం, కళ్యానం చేసుకుందాం
సిక్స్ పాక్ వీరుడు- సెక్సీ లుక్ చిన్నది

బుధవారం, సెప్టెంబర్ 17, 2008

హోమం లో మిడతలం మనం

హోమం లో మిడతలం మనం


ప్రేక్షకుల్ని సమిధల్ని చేసి, నిర్మాత పైసల్ని ఆజ్యంగా పోసి తీసిన ఒక సినిమా ఇటీవల వచ్చింది...ఫైటింగు, టేకింగు మాత్రమే కాదు మాత్రు దేవత అదే అమ్మ సెంటిమెంటు కూడా వుంది అంటూ ఆడ ఫాలోయింగు ఉన్న హీరోగారు ..అవును అమ్మ మీద వొట్టు చాలా కష్టపడి తీసాను అంటూ డైరెక్టర్ కం హీరో కం విలన్ గారు నొక్కి వక్కాణించారు, నిజమే నీ అక్క పిసికి చంపుతా అంటూ ఓ స్త్రీ మూర్తి పాడే సాంగు లో కూడా వుంది అక్క సెంటిమెంటు గురించి మర్చిపోయినట్టున్నారు వాళ్ళు, మంచి మహిళా చిత్రం అంటున్నారు..


చాలా కాలం క్రితం ' కత్తుల రత్తయ్య ' అనే సినిమా వచ్చింది..ఎస్ వీ ఆర్ ఖూనీలు చేసే రౌడీ అయితే, సీ. ఐ. డీ. బాలయ్య పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు...తీరా చూస్తే బాలయ్య డాన్, ఎస్ వీ ఆర్ పోలీస్ అని తెలుస్తుంది..అలానే ప్రభాకర్ రెడ్డి పోలీస్ గా చెలామణి అయి క్రిష్ణ ని డాన్ గా చూపించే బాండ్ సినిమాలు వాచ్చాయి..

చాలా కాలం తరువాత నైజాం దాదాలని, రాయలసీమ రుస్తుం లని, గూండాలని, చితకతన్ని 'స్టేట్ రౌడీ' గా అవతరించింది పోలీసు ఇన్స్పెక్టర్ అని మెగా మూవీ కూడా వచ్చింది....ఆ తర్వాత 'పోకిరి'లా కనిపిస్తూ , కనిపించిన వాడినల్లా తంతూ, డాన్ లని వణికించే పండుగాడు వాళ్ళతోనే వుంటూ వాళ్లకి గుండెనొప్పి తెప్పించి 75 ఏళ్ళ సినీ రికార్డులు తిరగరాసింది క్రిష్ణమనోహర్ ఐ పీ ఎస్ అని ఒకటి, అదే 'ఖతర్నాక్' ఐడియాతో ఒక ఇడియట్ లాంటి వాణ్ణి చదివించి పోలీసుల్లో చేర్చి మరో డైరెక్టరూ చేసింది ...ఇప్పుడు మళ్ళీ అదే కొత్త పాయింటు చుట్టు కధ అల్లి హోమం ఎందుకు చేస్తారో అర్ధం కావట్లేదు...
కొసమెరుపు : మమైత్ లేని బాధ మమ(మై)త మోహన్ దాస్ తీర్చింది, ఇక ఐటం సాంగు కు సాక్షి ఎక్స్ట్రా...

శనివారం, సెప్టెంబర్ 13, 2008

ఎందరో బ్లాగానుభావులు అందరకీ 'వంద' నములు...



ఎందరో బ్లాగానుభావులు అందరకీ 'వంద' నములు...

తొంబైతొమ్మిదో రన్ దగ్గర బాట్స్ మెన్ లా నా వందవ పోస్టు దగ్గర నేనూ చాలా టైము తీసుకున్నా..అసలు నేనేనా 100 వ్రాసింది ? అని డౌటు కూడా వస్తోంది..అఫ్ కోర్స్ అందులో కొన్ని పండగ శుభాకాంక్షల్లాంటి ఎక్స్ ట్రా రన్నులు కూడా ఉన్నా అవీ ఈ ఖాతాలోకి చేరి వంద పూర్తి అయ్యాయి..
నా బ్లాగోగులు చూస్తున్న వారందరికీ పేర్లు తెలీక పోయినా క్రుతగ్న్యతలు.. బాగున్నాయంటూ ప్రోత్సహించిన వారికి, ప్రతిస్పందించక పోయినా చూసినవ్వుకున్న వారికీ, నచ్చక పోయినా చెప్పని వారికి, ఎందరో బ్లాగానుభావులు అందరకీ వందనములు...
అసలు బ్లాగంటే తెలీదు, కనీసం ఈమైలు కూడా తెరవడం కాదుకదా...క్రియేట్ చేసుకోవడం కూడా రాని నేను..బ్లాగడం అంటే ఈనాడు చలవే,,నాలో ఏవో కదిలే కొన్ని విషయాలు..ఎవరికి పంపినా ప్రచురుణ కావట్లేదు..ఎలా అనుకుంటుంటే ఈనాడులో బ్లాగుల గురించి చదివా...మా ఆఫీసులో ఒకాయన ఆయనా ఫణే..ఆయన బ్లాగులు..విధములు, విధి విధానాలు., ఖాత తెరుచుట, కథలు వ్రాయుట, మొదలైన విషయాల గురించి బ్లాగ్న్యానోదయం కావించారు..
అలా మొదలైన నా ఫన్ కౌంటరు.లో ఎన్నో విషయాలు చర్చించాను....నచ్చితే నలుగురికి చెప్పమన్నాను, నచ్చకపోతే నాకు చెప్పమన్నా..కూడలి, తేనెగూడు, జల్లెడ లాంటి వారు దత్తత తీసుకుని మాలాంటి పిల్లబ్లాగుల్ని పోషిస్తున్నందుకు, పిత్రువాత్సల్యం చూపిస్తున్నందుకు, వారికి, పుట్టుకనిచ్చినందుకు..గూగుల్ తల్లికి, చదివరులకు, బ్లాగుమిత్రులకు, అందరికీ ధన్యవాదాలు....మీ ఆశీర్వాదం ఉంటే ధన్యుణ్ణి....
ఏమిటోయ్ వీడి గోల అనుకోకండి మొదటి సారి వందమార్కులు తెచ్చుకున్న స్కూలు పిల్లాడిలా, వంద రన్నులు చేసిన క్రికెట్ ఆటగాడిలా, వంద బంగారుపతకాలు సాధించిన వాడిలా, వందరోజులు ఆడిన సినిమా నిర్మాతలా, వంద రాంకు వచ్చిన ఎంసెట్ విద్యార్ధిలా, ఇలా వంద ఉపమానాలు రాయాలని వుంది కానీ మాటలు రాద్దామంటే మీటలు నొక్క బడట్లేదు.,,.

గురువారం, సెప్టెంబర్ 04, 2008

గన్ పతి - 2



పరమ శివుడు ఇచ్చిన గన్ను..పార్వతీ దేవి ఇచ్చిన దన్ను కొండంత అండగా....తన వాహనమైన మూషికం మీద భూలోకం బయలుదేరాడు వినాయకుడు...



మూషికా ..ఇంకా భూలోక విషయాలు ఏమిటి?



ఏమి చెప్పమందువు స్వామీ...పూర్వం ప్రతి ఇంట కొలువై..బియ్యం పప్పులు,,ఏవి దొరికితే అవి తిని హాయిగా ఉండేవాళ్ళం..ఇప్పుడు పెరిగిన సాంకేతిక నైపుణ్యాల వల్ల.మా కొరకు బోనులని,,,పిల్లులుని, ఏకంగా రక రకాల విష పదార్ధాలని తయారు చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నారు..కొన్ని చోట్ల ఐతే మాకోసం తయారు చేసిన విష పదార్ధాలను..ఋణ బాధలు భరించలేని రైతన్నలు ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.. ఆ పాపం మాకు తగులుతుందేమోనని భయంతో ప్రాణ రూపం వదిలి..ప్రాణం లేని వస్తు రూపం పొంది..ప్రతి ఇంటా బయటా కంప్యూటర్ అనే యంత్రం మునే మీరుగా భావించి..మౌస్ రూపంలో బతుకీడుస్తున్నాము.....తండ్రీ....



మూషికా బాధ పడకు..అదంతా కలి ప్రభావము... అదిగో భూలోకం దగ్గరకొచ్చింది...అదిఓ భాగ్యనగరం..మాకు అత్యంత ప్రియమైన నగరం..



అవును స్వామీ ప్రస్తుతం భాగ్యనగరం చాలా 'ప్రియమైన ' నగరం..!



అదేమి మూషికా..నీ భావం ,మాకర్ధం కాలేదు..స్వామీ భాగ్యనగరం ప్రస్తుతం మహానగరం గా గుర్తింపు పొదింది..అందుకే అక్కడ ప్రతీ దానీ ధరలు పెరిగి ప్రస్తుతం ప్రియమైననగరంగా గుర్తింపు తెచ్చుకుంది..అంతర్జాతీయ విమానాశ్రయాలూ, ఇంకా వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాక వల్ల భూమి విలువ పెరిగి బాగ ప్రియమైంది స్వామీ భాగ్యనగరం.



మరి బాగా సంపాదిస్తున్నారుగా ప్రజలు హాయిగా ఉన్నారా ? మా మీద భక్తి ప్రపత్తులు పెరిగాయా....
ఎక్కడ స్వామీ..వారికి అంత తీరికేదీ ? వూరు చివర ఉద్యోగాలు..దారి అంతా ట్రాఫిక్ జాములు, కాలుష్యం, రేషన్ కోసం పడిగాపులు, నీటికోసం ఎదురుచూపులు, పిల్లల చదువు కొనుగోలూ, ఇలా బాధలు అధికమై తీరిక ఏదీ మీ గురించి పట్టించుకోవడానికీ ?అదిగో స్వామీ భాగ్యనగరం వచ్చేసాం..జాగ్రత్త స్వామి?



ఇంతలో రవీంద్రభారతి కూడలి దగ్గర పోలీసు ఆపాడు స్వామిని..



ఎమయ్యా ! ఆగాగు.. ఏమిటి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నావ్..ఏమిటి అంత స్పీడు ? హెల్మెట్ట్ ఏది ?
హెల్మెట్టా ? అనగా నేమి..



శిరస్త్రాణం .స్వామీ (ఎలుక చెప్పింది)ఇదిగో ఉందిగా...కిరీటం చూపించి అమాయకంగా చెప్పడు స్వామి.



పోలీసు : అన్నట్టు సీట్ బెల్ట్ ఏది ?



గణపతి : అది ఎందులకు



పోలీసు.: నువ్వు వెళ్తుంది ఫోర్ వీలర్ మీద..అంటే ఇదిగో నాలుగు కాళ్ళున్నాయిగా అందుకు..అంటూ ఎలుక నాలుగు కాళ్ళు చూపించాడు



గణపతి: వీడి అసాధ్యం కూలా.ఇప్పుడేమి దారి మూషికామూషికుడు : స్వామి తమ జంధ్యం చూపండి నాగులే కాబట్టి నల్లగా ఉండి బెల్ట్ అనుకుంటాడు అన్నట్టు మీ బెల్ట్ కూడా నాగులే కదా దెబ్బకి వొదులుతుంది వాడి తిక్క..



గణపతి చూపించిన జంధ్యం చూసి పోలీసు మూర్చిల్లగా...."బతుకు దేవుడా" అనుకుంటూ బయట పడ్డారు..మూషిక, వినాయకులు...



లకడీ కపూల్ మీదుగా ఖైరతా బాదులోని తన భారీ విగ్రహం చూద్దమని వెళ్తున్న స్వామికి అక్కడి ట్రాఫిక్ జాం చూసి మూర్చ వచ్చినంత పనైంది...చిన్న సందు దొరికితే ఇరికించేసే ఆటోలూ, అదే పనిగా హారన్ కొడుతూ రొద చేశే కార్లు...విపరీతమైన జనంతో నిండు గర్భిణిలా తెగ పొగ వుదులుతూ..ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆర్టీచీ బస్సులు, ఆంబులెన్స్ కి కూడా సైడు ఇవ్వకుండా..ఆగిన ట్రాఫిక్ లో ఇరుక్కున్న స్వామికి రెండున్నర గంటల తరువాత కానీ ఖైరతాబాదు జేరలేక పోయాడు... హు మానవుడికి పాప్ పరిహారం కోసం మళ్ళీ నరకం అవసరం లేదనుకుంటా..ఆ యముడు పెట్టే బాధల కన్నా ఈ బాధలు తక్కువేమీ కాదు..మరణించిన తరువాత కంటే మరణానికి ముందే అన్ని శిక్షలు ఇక్కడే అనుభవిస్తున్నాడు పాపం మానవుడు..



స్వామి భావం పసిగట్టిన మూషికం ..మరీ అల ఫిక్స్ ఐపోకండి స్వామీ..ఇంకా చాలా చూడాలి తమరు ఈ పది రోజుల్లో..అంటుండంగానే రైలు గేటు పడింది...మరలా ఆగింది మూషికం..



రైలు కోసం ఆగిన కొన్ని చిన్న వాహనాలు..గేటు కింద నుంచీ దాటుకుని వెళ్తున్నారు..కనుచూపు మేరలోనే రైలున్నా ఒక్క నిమిషంలో నే అది వెళ్ళిపోతుందని తెలిసినా వాళ్ళు చేసే ఆ పని చూసి స్వామ్మికే భయం వేసింది.



ఇంతలో కాలిమీద ఏదో తడి..చూస్తే తన పారాణికన్నా ఎర్రగా మరో డిజైను...అది ఏమా అనుకుంటుండగా..సారీ బాస్ చూసుకోలేదు......అంటూ మరికొంచెం పక్కగా ఊసాడు తన నోట్లోని పాను పరాగ్ ని తన సరాగానికి మురిసిపోతూ... oka maanavuDu



హా! హతవిధీ !! అనుకుంటుండగా ముక్కులదిరే వాసన...అది ఏమి వాసనో స్వామి పొడవాటి ముక్కు కూ అర్ధం కాలేదు..అన్ని వైపులా ఆ వాసన తప్పీంచుకోవడానికి తన తొండాన్ని తిప్పే ప్రయత్నం చేశారు స్వామి....ఎటు తిప్పినా ఏదో ఒకీ వాసన తొండాన్ని తాకుతోంది..మొదటి సారిగా తొండం అంత పొడవుగా ఉన్నందుకు బాధ కలిగింది స్వామికి.....మూషికుడు ఇది పసిగట్టి ..స్వామీ అది ఆ పక్కనుంచి వస్తున్న మూత్ర శాల వాసన..ఈటుపక్కనుంచీ వస్తున్న చైనీసు నూడుల్స్ మసాలా ఘాటు..ఇటు ఆ కోడి మాంసపు దుకాణపు వాసన...అదిగో అక్కడ పొంగి పొర్లుతున్న డ్రైనేజీవనది నుంచి వచ్చే వసన..ఆ పక్కన ఉన్న కుళ్ళిన పళ్ళ వాసనతో కలిసి వస్తున్న కంపు స్వామీ మనం ఈ ప్రాంతం దాటినా ఆ వాసన మనల్ని వదలదు స్వామీ అన్నాడు...
ఆ వాసనలకి కళ్ళు బైర్లు కమ్మిన స్వామి ..మూషికా చీమూ- రక్తం కలిసిన వైతరిణి దాటడం అయినా సులభమేమో కానీ..ఈ భాగ్ య(మ)నగరం లో రహదారి దాటడం చాలా కష్టం,....ఏదో నవరాత్రులు పూజ చేసినారన్న ఆనందంలో కాలుష్య మయమైన టాంకు బండులో ముంచినా భరిస్తున్నా కానీ ఈ భాగ్యమ నగరంలో జీవించడం మనుష్యుల వల్లే కానీ ఇ దేవతల వల్ల కాదు..పద మన భారీ విగ్రహం దగ్గర జనాలని ఆసీర్వదించి మనమూ టాంకు బండు వద్ద వేచి వుందాం ఎలాగు నిమజ్జనం రోజున భక్తజనం వస్తారు కాబట్టి అక్కడనే ఆ ఆనందం పొందుదాం...అంటూ ముందుకు కదిలాడు స్వామి..

బుధవారం, సెప్టెంబర్ 03, 2008

'గన్'పతి

వినాయక చవితి శుభాకాంక్షలతో



'గన్'పతి



అది కైలాసం....శివుడి మెళ్ళో పాము ఆకలిగా ఉండి ప్రసాదం కోసం చూస్తోంది..ఈలోగా వచ్చిన వినాయకుడి ఎలుక...ఏం మామా భోజనం అయిందా అంటూ పలకరించింది...ఇంకా లేదు...స్వామి తిన్నాకే నాకు..ఆయనకి భోజనం అదీ అక్కర్లేదు...నీ భోజనం అయిందా అంది...దానికి ఎలుక మా స్వామి దగ్గర ఆ ప్రాబ్లం లేదు..ఆయన కి ఆహారం ఇష్టం. అందుకే నాకు ఫుడ్డు కి కొదవ లేదు...అదిగో మాటల్లోనే మా స్వామి వస్తున్నాడు అంది వినాయకుడు రావడం చూసి,,,,,
వినాయకుడు వస్తూనే..తల్లికి, తండ్రికి నమస్కరించి..అమ్మా వినాయక చవితి వస్తోంది..నేను అలా భూలోకం వెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తానమ్మా..అన్నాడు..దానికి పతి సేవలో ఉన్న ఆ పార్వతి ఉలిక్కి పడి..నాయనా వినాయకా..ప్రతి సంవత్సరం వెళ్తూనే వున్నావు కద నాయనా..ఈసారికి వద్దులే...నీ పుట్టిన రోజు ఇక్కడే కైలాసంలో జరుపుకుందాం..నువ్వు ఎక్కడికీ వెళ్ళకు అని కంటనీరు పెట్టుకుంది...
దానికి పశుపతి ..అదేమి పార్వతీ అలా అంటావు...విఘ్నేశ్వరుడు ప్రతి సంవత్సరమూ..తన జన్మదినము భూలోకమునే కదా జరుపుకుంటాడు...మరి ఈ సారి వద్దనెదవేమి.? మరీ అంత దిగులుగా ఉంటే మనమూ వెళ్ళివద్దాం...అన్నాడు శివుడు....
తల్లి ప్రేమ మీకేమి అర్ధం అవుతుంది లేండి...నా కుమారుడు ఏమన్నా రాక్షసులతో యుద్ధానికి వెళతానన్నాడా..లేక తపస్సుకు వెళతానన్నాడు... వెంటనే పంపడానికి..వెళ్ళేది భూలోకానికి..అందుకే నా దిగులు...అంది పార్వతి...
అదేమి పార్వతీ అంత మాట అంటివి..భూలోకమున అందరూ మన భక్తులేగా...పైగా ప్రతి సంవత్సరం మన కుమారుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఊరూరా.... వాడ వాడల జరుపుకుంటారు కూడాను...తిరుపతి లడ్డు వలే మన కుమారుడు ధరించిన లడ్డుకు వేలం పెట్టి - వెల కట్టి మరీ వైభోగాలు జరుపుతారు....
ఏమి చెప్పను స్వామీ..మనవాడి పుట్టిన రోజు జరుపుతామని బలవంతంగా డబ్బులు లాగుతారు కొందరు...ఆ డబ్బుతో అడ్డమైన పనులూ చేస్తారు...కొందరైతే పందిరి వేసి మన కుమారుడి విగ్రహం పెట్టి పూజలు చేసి...అక్కడే సాం'స్క్రుతక' కార్యక్రమాలు జరుపుతారు...అవి ఎంత క్రుతకంగా ఉంటాయో..మనకి అంతుపట్టదు....'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' లు పోయి... అ అంటే అమలా పురం..ఆ అంటే ఆహా పురం అని, ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అర్ధం లేని పాటలు..అర్ధనగ్నపు ఆటలు ఆడతారు,,,,ఇవే కాక రాత్రి కాపలా అని చేసే కార్యకలాపాల చిట్టా నేను చెప్పలేను...చతుర్ముఖ పారాయణం..తీర్ధం....ప్రసాదం పేరుతో పేకాట..మందు..ఇంకా సర్వ పాపాలకూ ఒడిగడతారు...నిజంగా నిష్టగా చేసేవారూ లేకపోలేదు..కానీ ఇలాంటి వారు చేసే పాపం మన వాడికి తగులుతుందేమోనని నా భయం..
దేవీ మానవులు చేసే పాప పుణ్యాలకు - మనకు సంబంధం లేదు...వారి పాపం వారికే తగులుతుంది..నువ్వు భయపడనవసరంలేదు..అని వూరడించాడు పరమేశ్వరుడు...
స్వామీ నా అసలు భయం అది కాదు..స్వామీ....భూలోకమున తీవ్రవాదుల భయం ఎక్కువ అయింది...ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు...అహార స్థలాలు..విహార స్థలాలు ..అని లేకుండా ఎక్కడపడితే అక్కడ బాంబులు పేలుస్తున్నారు..అంతే కాదు ప్రతిసారి విగ్రహ నిమజ్జనం లో ఏదో జరుగుతుందని వినడం రివాజుగా మారింది....ఆ హుస్సేను సాగరంలో నీరు ఇప్పటికే విషతుల్యం అయింది....ఇలా చాలా భయాలున్నాయి స్వామీ...అంది పార్వతి
పార్వతీ ఎందుకు నీకు భయము?...ఆ తీవ్ర వాదులు పూర్వ జన్మలో రావణ..దుర్యోధనాది రాక్షసుల బంటులు..వారి వారి కర్మ ననుసరించి ఇలా జన్మించి పూర్వ జన్మ వాసనల వల్ల 'కలి' ప్రేరేపితులై అలా ప్రవర్తించుచున్నారు...వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి పాపం 'వారిని' కూడా బాంబు రూపమునో, ఎన్ కౌంటర్ రూపమునో వారిని దహించివేస్తుంది..ఇక మన కుమారుడి విషయం అంటావా..అతను పుట్టుకతోనే మ్రుత్యుంజయుడు..నా చేతిలో మరణించి..తిరిగి జన్మ పొందినవాడు...అంతే కాదు చంద్రుడి ద్రుష్టి తగిలి ఉదరం పగిలినా తిరిగి మామూలుగా అయిన మన బిడ్డడు...మూషికాసురుడిని ఒక దంతంతో అణిచి వాహనం చేసుకున్నవాడు...గణాధిపత్యం వహిస్తూ విఘ్నాలకు నాయకుడైనవాడు..అట్టి కుమారుడి గూర్చి ఎట్టి చింతా వలదు..
స్వామీ నా భయము మన కుమారుడి గూర్చి కాదు స్వామి! వినాయకుడి పూజ కోసం తాపత్రయ పడే భక్త జనం గూర్చి...కుమారుడి పట్ల భక్తి పారవస్యం లో, ఆ తీవ్రవాదుల పన్నిన కుట్రకు గురి అవుదురేమో అని నా భయం స్వామీ....అమాయకులైన ఆ ప్రజలు మన వల్ల ఇక్కట్లకు గురికాకూడదు అని నా అభిప్రాయం ప్రభూ..
ఆహా దేవీ నిజం గా .'జగజ్జనని' అనిపించావు...ముల్లోకాలకూ తల్లివైనందుకు నీ పిల్లల గురించిన బాధ్యతకు ముగ్ధుడినైనాను..ఇంత కాలం రాక్షసులు మాత్రమే శత్రువులు అనుకున్నాను......ఇప్పుడు అర్ధమైనది...అసలు పాపాత్ములెవరో...వారి భరతం పట్టుటకు మన పుత్రునికి ఇదిగో అత్యంత ఆధునికమైన ఆయుధం ఇది. దీనిని 'గన్' అందురు ఒలంపిక్ మహాయజ్ఞమున అబినవ 'బింద్రా' కు బంగారు పతకము సాధించిన 'గన్' ఇది. దీనిని ఒక్క సారి మీట నొక్కిన వేలాది గుళ్ళు వర్షంలా కురిసి తీవ్రవాదులు అంతమౌదురు..దీనిని ధరించి భూలోకమునకు వెళ్ళి తన పుట్టిన రోజు ఆనందముగా జరుపుకుని, లోక కళ్యాణము చేకూర్చి తిరిగి వచ్చును మన కుమారుడు...
'గన్' ధరించు వాడు కాబట్టి ఇకనుంచి మన కుమారుడు 'గన్'పతి అని పిలువబడతాడు...సర్వేజనా సుఖినోభవంతు....

ఆదివారం, ఆగస్టు 31, 2008

సెల్ మోహన రంగా




కొత్తగా ఉద్యోగంలో జేరాను..చాలా హాపీగా ఉంది……ఆఫీసు దూరమైనా ఇష్టపడే రంగం అవడంతో …మంచి జీతం కూడా కావడంతో ఎగిరి గంతేసి మరీ చేరిపోయా..జేరిన రెండు రోజులకే అఫీసు వాళ్ళు ఒక ఫోను కూడా ‘ప్రెజెంటు ” చేశారు..(అది నా ఫ్యూచరు తో ఆడుకుంటుందని నాకు తెలీదు).
మనలో మనం మాట్లాడుకోడానికి ఫ్రీ.. అన్నారు..ఆహా కత్తి..మనకి తిరుగు లేదు అనుకున్నా…సిమ్ము మాత్రమే మేమిస్తాం ఫోను మీరు కొనుక్కోవాలి అన్నారు …ఇదెక్కడి అన్యాయం అందామనుకున్నా సిమ్ము కూడా లాక్కుంటారని వూరుకున్నా….సరే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని ఒక వెయ్యి రూపాయలతో ఒక అద్భుతమైన ఫోను కొందామని రోజూ టీవీల్లో కనిపించే అన్ని రకాల ఫోఅనులూ అవి పట్టుకున్న అమ్మాయిల్ని తలుచుకుంటూ బాజారుకు బయలుదేరా…వీధికొక టి వెలిసిన మొబైలు షాపులన్నీ తిరిగా..కలరు మొబైలు..కెమేరా..బ్లూటూతు…నా బొంద టూతు లాంటి ఫీచర్లు చాలా నాకు అర్ధం కానివన్నీ చూపించారు..ఏది ఎందుకు పనికొస్తుందో అసలు అవి ఎందుకు వాడతారో అర్ధం కాలే..ఇంక మొబైలు ని మొబైలుగానే వాడే నా అమాయకత్వానికి ముసి ముసి నవ్వులు నవ్వుతూ రోజులు మారాయి సార్..మీ దగ్గరున్న వెయ్యికి మెమరీ కార్డు మాత్రం వస్తుంది…లేదా మెళ్ళో వేసుకునే మొబైలు గొలుసు..బెల్టుకు పెట్టుకునే పౌచు వస్తాయి….ఎలాగూ కంపెనీ సిమ్మే కద సార్ మొబైల్ మంచిది కొనుక్కోండి…ఆఫీసులో నలుగురిలో దర్జాగా తిర్గండి…అంటూ శ్రీ క్రుష్ణుడి లెవల్లో సెల్లోపదేసం చేశారు….
సెల్లు దాని విశిష్టత…అందులోని ఉప ‘యోగాలూ లాంటి పద్దెనిమిది అధ్యాయలు కల పుస్తకం ఒకటి ఇస్తామనీ అందులో సకల విషయాలూ ఉంటాయనీ..దానికి పెద్దగా బుర్ర ఉండక్కర్లేదనీ..మోటుగా మోటివేషన్ చేసి…నన్నూ ఒక సెల్లు ఓనర్ని చేసేందుకు ఉద్యుక్తుణ్ని చేశారు..
ఎన్ని చెప్పినా నా దగ్గర ఉన్నది వెయ్యి రూపాయలే అన్నా….దానికి మళ్ళీ నామీద తెగ జాలిపడిపోయి..క్రెడిట్ కార్డుమీదైనా ఇచ్చేస్తాం సార్..మీరు మాకు బాగా నచ్చారు…ఈ విషయం ఎవరికి చెప్పకండి మీకు మాత్రమే మేమిస్తున్న అద్భుత అవకాశం…కాక పోతే ఈ పది వేలకి మీరు మరో 3 వేలు ఎక్కువ కట్టాలి అది కూడ వాయిదల పద్ధతిలో….2 ఏళ్ళ పాటు కట్టుకోవచ్చు అని రాయితీలు ప్రకటించి నేను చార్మి ఫొటోలు మరో ఆంగ్లవనిత ఫొటోలు చూసే లోపల నా కార్డుని గీసేసి రసీదులు తెచ్చేసి నా ఆటోగ్రాఫులు తేసేసుకుని..మీరు చాలా అద్రుష్టవంతులు సార్…మీ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే పంపండి అంటూ పళ్ళికిలిస్తూ సాగనంపారు….
అదేంటో సిమ్ము పెట్టగానే నేను ఇంకా నా నంబరు ఏంToa తెలుసుకోలేదు…ఎవరికీ ఇవ్వనూ లేదు.కానీ మొగింది కళ్యాణ వీణ అన్నట్టు ట్రింగు మంటూ మోగింది…సరే ….ఒక వేళ షాపు వాడమైనా చేశాడేమో…వాడికి తెలివి ఎక్కువ కదా,,ఫోను వాడిది కదా…నంబరు తెలిసి పోతుందేమో వాళ్లకి కంగ్రాట్స్ చెబుదామని చేసుంటాడనుకుంటూ హలో అన్నా….నా హలో మొదలవకుండానే …..ఏరా ఎన్నాళ్ళు దాక్కుంటావురా..ఫోను ఆపేస్తే నాలుగుసార్లు ట్రై చేసి వదిలేస్తాననుకున్నావా ? నేనెవరో తెలిసినట్లు లేదు నీ….అంటూ తిట్ల దండకం మొదలైంది….కంగారుగా ఎవరండీ అది నేను ఎవరో తెలుసా…మీకెవరు కావాలి అని అడిగా…ఏర కొత్త నాటకమా…గొంతు మారిస్తే గుర్తు పట్టలేననుకున్నావా……నీ…….మల్లీ సరికొత్త బూతులు…ఏవండోయ్ ఇది ఆఫీసు నంబరు నాపేరు అది కాదు… ఇవ్వాళ్ళే కొత్తగా ఇచ్చారు మీరడిగిన మనిషి ప్రస్తుతం మాదగ్గర పనిచేయడంలేదు….అని గడ గడ (వణుకుతూ) చెప్పేసా ……
మర్నాడు ఉదయమే ఆఫీసులో ఆ సిమ్ము ఇచ్చేసి కొత్తది నేనే కొనుక్కుంటా అని చెప్పేసి మళ్ళీ కొట్టుకొచ్చా ….సార్ బాగున్నారా ఎలా ఉంది కొత్త సెల్లు….కత్తి కదూఉ..అంటూ చిన్నపటినుంచీ పరిచయమైన వాణ్ణి అడిగినట్లు అడిగిన ఆ సేల్స్మాన్ కి జరిగినదంతా (బూతులు మినహాయించి) చెప్పేసా..సహాయం చెయ్యమని అడిగా,,,వెంటనే.. ఆ సేల్సు మాను తిరిగి తన విశ్వ రూపం చూపించి మొదలెట్టాడు….
అర్జునా(ప్రస్తుతానికి నేనే)
కాల్ చేసే దెవరూ. .కాల్ రిసీవ్ చేసుకునేదెవరు అంతా సాటిలైటులో కే వెళ్తుంది..
అన్ని కాల్సు నాలోనే ఇమిడి ఉంటాయి…చాతుర్వర్ణం మయా స్రుష్టం ..నాలుగు ఫోనులూఈ ఎయిర్ టెల్, ఐడియా. వోడా ఫోనూ..రిలయన్సు..టాటా అన్నీ నారూపాలే….యదా యాదాహి కాలస్య తదాత్మానం బిల్లామ్యహంనువ్వు చేసే కాల్ ని బట్టి బిల్లు ఉంటుంది…
ఎప్పుడైతె పుణ్యం లా బాలన్సు ఇపోతుందో అప్పుడు లైఫ్ లా ఫోను కట్ అయిపోతుంది…కాబట్టి కొంచెమైనా నెలకోసారి పుణ్యం రీచారుజు చేసుకుంటూ వుండాలి..
ఎప్పుడూ నాగొంతు వినిపించడానికి రింగుటోనులు,,హెలో ట్యూనులూ ఉంటాయి …
ఇలాంటివి చాలా ఉన్నాయి కమాన్ అర్జునా లే తీసుకో సెల్లు ని స్థాపించు సిమ్ముని సంధించు కాలుని అంటూ కర్తవ్య బోధ చేశాడు…అక్కడ మొదలెట్టిన పరుగుని ఇంటిదాకా ఆపలేదు..బాబోయ్ సెల్లు…

బుధవారం, ఆగస్టు 27, 2008

విత్తు ముందా చెట్టు ముందా..

విత్తు ముందా చెట్టు ముందా..గుడ్డు ముందా పక్షి ముందా...పతకం ముందా పధకం ముందా...అన్నది నాకు తెలియటంలేదు...పక్షి గూడు స్టడియంలో...దేశ దేశాలు పతకాలూ..పతాకాలూ మోసుకుని బై బై చెప్తుంటే మనవాళ్ళు..అందరూ కలసి ముచ్చటగా మూడు పతకాలని మోసుకుని వచ్చారు...చిన్న దేశాలనుంచీ చైనా దేశం దాకా అందరూ పతకం కోసం పోరాడారు...మన వాళ్ళు ఒకా పతకం సాధిస్తే 100 పతకాలు సాధించినట్టు...మనదగ్గర చాలా భాషలు భాషాలూ కదా...

ఒక మెడలు గెలిస్తే మెడలు వంగిపోయేలా సన్మానాలూ, సత్కారాలూ, బిరుదులు,,,మెడలు పెట్టుకోవడానికి మేడలు...స్థలాలూ,ప్రమోషనులు,,యాడ్లూ,,,రాష్ట్రపతులతో విందులు..ఇక తరువాతి ఒలంపిక్సు గురించి ఆలోచించడానికి కానీ. తమ విజయ రహస్యం పంచుకోవడానికి టైము కానీ...మరికొందరికి స్ఫూర్తినిచ్చేఅ తీరిక కానీ ఎక్కడుంటుంది..మనోళ్ళకి....

పోరాడి ఓడిన వాళ్ళు కొందరు...అసలు ఎందుకెళ్ళారో తెలీని వాళ్ళూ కొందరు...ఈ ఆటగాళ్ళ వెనకాల అంత మంది పటాలం ఎందుకో...ఏదో కోచు, ఫిజియో, ట్రైనరు...నలుగురో ఐదుగురో సిబ్బంది..వెళ్తే చాలు కదా సంబంధం లేని సిబ్బంది....మంత్రులు...వాళ్ళ సిబ్బంది....ఇలా ఎందరో మహానుభావులు....ఎందుకీ దండగ కదా...

మనవాళ్ళు ఇక్కడ ఏదో మైలు రాయి సాధించగానే వాళ్ళని ఎంపిక చేస్తారు..కానీ అది అంతర్జాతీయంగా..ముఖ్యంగా ఒలంపిక్స్ స్థాయిలో ఎంత దగ్గరలో ఉన్నారో ఆలోచించరు...ఒక సారి విక్రమం చూపితే ఇక రాబోయే తరాలవరకూ వారే హీరోలు...రాజీవ్ ఖేల్ రత్నలు...ఇంకా చాలాలూ.....

అసలు ఒలంపిక్స్ కి నాలుగేళ్ల ముందు నుంచీ లేదా అవసరమైతే ఎనిమిదేళ్ళ ముందు నుంచీ తర్ఫీదు ఇచ్చి కేవలం పతకమే ధ్యేయంగా అకుంఠిత దీక్షతో రెడీ అయితే గానీ పోటీలకు వెళ్ళడం వేస్టు...

గెలిచాక ఇచ్చే ఈ నజరానాలు..సన్మానాల కోసం చేసే ఖర్చు..అధికారుల విజిట్ కయ్యే ఖర్చులు....వగైరాలన్ని సరైన శిక్షణ నిచ్చే స్పోర్ట్ సెంటర్లపై పెట్టి మంచి పౌష్టికాహారం ఇచ్చి..మంచి శిక్షకులతో శిక్షణ ఇప్పిస్తే 100 కోట్ల భారత్ లో షెల్స్లు..తయారుకారా...చిరిగిన బూట్ల తో పరుగులు...అతుకుల బొంతల మీద కుస్తీలు...బురద ట్రాకుల మీద జంపులు....బయలు దేరేదాక జేరని కిట్లు....అందజేసి..పతకాలు రమ్మంటే ఎక్కడనుంచి వస్తాయీ....స్టదియాలకి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి వుండే ఇంట్రెస్టు...ఆటగాళ్ళ పేర్లు గుర్తుంచుకుని..వాళ్లకి వెళ్లవలసిన సదుపాయాలు చేరుతున్నాయా లేదా అని చూడ్డం చేతగాని వాళ్ళున్నంతవరకూ..పరిస్థితి ఇంతే....

ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ సంఘం మనది క్రికెట్ మీద వచ్చే డబ్బు ని వేరే క్రీడలకి ఉపయోగించకూడదా...ఎంత సేపూ ధోనీకి అవార్డు..స్థలం..సానియాకి స్పాన్సర్షిప్పు......అని తప్ప కుస్తీ యోధుడికి పిస్తా పప్పు....రన్నింగు సోభకి జాగింగు షూస్....అంజూ జార్జికి ట్రాక్ సూట్...వైట్లు ఎత్తే వాళ్ళకి కావలసిన సదుపాయాలు.....ఎప్పటికి వస్తాయో... ఏమిటో....

ఏది ఏమైనా త్రివర్ణ పతాకం పట్టుకుని వెళ్ళిన ప్రతీ వాళ్ళూ స్వర్ణపతకం తో తిరిగి రావాలని కోరుకునే ఓ సగటు పిచ్చి క్రీడా అభిమాని....

మంగళవారం, ఆగస్టు 26, 2008

సినిమా రెడీ

సినిమా రెడీ
టైటిలు బ్యానరు ఓకే ఐపోయాయి..జెండా..ఎజెండా కూడా రెడీ...టైటిల్ సాంగ్ కూడా అయిపోయింది..ప్రెస్ మీట్లో హీరో కం డైరెక్టరు ఎనౌన్స్ మెంట్ ఐపోయింది...
ఇక వేర్వేరు లొకేషన్లలో ఔట్ డోర్ మిగిలింది...ఎలాగూ అన్ని జిల్లాల నుంచి డిస్టిబ్యూటర్లు వచ్చి హక్కులు తీసుకుంటారు..
కాకపోతే వోపెనింగు డైలాగుల్లో పంచు కొంచెం తక్కువైందేమో అనిపించింది..కాకపోతే అన్నయ్య మీద అభిమానం కొద్దీ ఇంట్రడక్షను ఓకే ఐపోయింది...ముందు వేసిన న్యూస్ రీల్ లాంటి ప్రోగ్రాం కూడా 'మనో' టనస్ అయిపోయింది...మనో తో ప్రగతి ని సాధించే కన్నా అన్నయ్య సినిమా క్లిప్పులు...రక్తదానం..నేత్రదానం లాంటివి ఏవి వేసిన కాస్త స్ఫూర్తి దాయకంగా ఉండేవేమో...పేజీల కొద్ది కష్టాలను చదివెయ్యకుండా...స్వయంక్రుషి తో చెప్తే ఇంకా బాగుండేది.....తమ్ముళ్ళ ఉత్సాహం .....ప్రోత్సాహం అన్నయ్యకి కొండంత అండ...ఏడుకొండల మధ్య ...మొదలైన ఈ సినిమా గొప్పగా ఆడాలని ...అభిమానుల ఆకాంక్ష....`

సోమవారం, ఆగస్టు 25, 2008

చిరుపతి

చిరుపతి
ఆగస్ట్ 26 తిరుపతి - చిరుపతి గా మారుతోంది..ఇలా అనకూడేఅమో కానీ ఏర్పాట్లూ, అభిమానుల ఉత్సాహం చూస్తోంటే అలా అనాలనిపిస్తోంది.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల గుండెల్లో 'రైళ్ళు ' పరిగెత్తే రీతిలో తిరుపతి స్టేషన్ రెడీ అవుతోంది.. మెగా రైలు కద్లడమే తరువాయి.. చిరు మనసులోది ఏదైనా ఇట్టే 'అల్లు ' కు పోయే బావ మరిది 'అర ' విందు (పూర్తి విందు చేసే టైము లేదు ఆయనకి) దగరుండి ప్లాట్ఫాం పనులు చేయిస్తున్నారు..సి సి టీ వీ లు, పబ్లిక్ అడ్రెస్ సిస్టంలు వగైరాలన్నీ తయారౌతున్నాయి.. ఇలాంటి పనుల్లో పని ' రాక్షసులు ' విజ్ క్రాఫ్ట్ ' విలేజ్ క్రాఫ్ట్ మొత్తం చూసుకుంటోంది..చిరు - అల్లు కాంబినేషన్ క్రుష్ణుడు - అర్జునుడు లా దేనినైనా ఎదుర్కునేలా రెడీగా ఉన్నారు.. టెస్ట్ రన్ మొన్నే అయినా అసలు ప్రయాణం 26న 'పచ్చ ' జెందా ఊపుతున్నారు.. (కాషాయం, త్రివర్ణం, పసుపు, ఎరుపు, వూదా, క్రుష్ణ నీలం, పింకు తలా ఒకళ్ళు పంచుకున్నారు కాబట్టి మిగిలింది ఇక ఆకు పచ్చే అని నా అభిప్రాయం ). గార్డు విగిలేయగానే ప్రయాణం స్టార్టు.. 10 కోట్ల మందినీ ఎక్కమంటున్నా టికెట్టు ఎంతమందికి దొరుకుతుందో తెలీదు..సీనియర్ సిటీజనుల ' కి (ఓయర్)బర్తు ఖాయం..యూత్ స్టాండింగ్లో అయినా రెడీ గా ఉన్నారు.. out standing యూత్ కి పెద్ద పీట వేసే అవకాశం ఉంది..అన్ని పార్టీల్లోనూ wait list లో వున్న వాళ్ళు 'ఎనౌన్స్ మెంట్ ' కోసం వైట్ చేస్తున్నారు..ఉన్న పార్టీ లో రెజర్వేషన్ కాన్సిల్ చేసుకుని R A C లో మెగా రైలెక్కడానికి చాలామందే రెడీ గా ఉన్నారు...
యూ ఆర్ ఎటెన్షన్ ప్లేజ్ తిరుపతి To అసెంబ్లీ వెళ్ళే చిరు ఎక్స్ ప్రెస్ 26-8-08 న బయలుదేరడానికి సిద్ధం గా ఉంది....

సోమవారం, ఆగస్టు 18, 2008

కొత్త చిరంజీవి(తం)



కొత్త చిరంజీవి(తం)
(నేనేమీ చిరంజీవి ఫానుని కాను అత్లా అని ఇంకెవరికో కాను..ఎలాగూ వచ్చేశాడు కదా అని
ఇలా...)



మొత్తానికి ...చిరంజీవికి కొత్త జీవితం మొదలైంది..చిరంజీవి కొత్త పార్టీ మొదలైంది...ఆంధ్రా
అంతటా కూడా పార్టీలు మొదలయ్యాయి..కొందరు ఆనందం తో, కొందరు టెన్షన్ తో..కొందరు
ఇంకో కారణం తో...
సినీ రంగం లో ఎలాంటి "పునాది రాళ్ళు" లేక పోయినా "స్వయం క్రుషి " తో సినీ రంగంలో
'జగదేక వీరుడు ' అనిపించుక్కున్నాడు..
రాజకీయాలలో 'ప్రాణం ఖరీదు" చాలా తక్కువ..'ఊరికిచ్చిన మాట ' కోసం అభిమానులు
మోస్తున్న 'మంచుపల్లకీ'లో వస్తున్నా..ఈ 'యుద్ధ భూమి ' లో ..'మంచి దొంగ ' లు
ఉండరు..అంతా..
'రాక్షసులూ,'గూండాలూ, 'కిరాతకులూ, 'యమకింకరులూ
''మరణ మ్రుదంగం' , 'రుద్ర వీణ'లు
వాయించే ఈ రాజకీయాలలో 'చంటబ్బాయి' ఎలా
నెట్టుకొస్తాడో ఏమిటో ? చూడాలని ఉంది
'ఆపద్బాంధవుడి' లా రక్త దానాలతో ఎంతో మంది 'పసివాడి ప్రాణా 'లు కాపాడి , ఎప్పటికీ
'చిరంజీవి' గా ఉండేలా నేత్ర దానాలు చేయించి, అందరి ఆశీస్సులు మోస్తున్న ఈ
'ముఠా
మేస్త్రీ',
ఎన్నికలలో గెలిచి 'విజేత' కావాలంటే..రిగ్గింగులు చేసే..'స్టేట్ రౌడీ'లని,
పోలీసు మామల తో దోస్తీలుండే 'రౌడీ అల్లుళ్ళ'నీ కూడా ఒక కంట కనిపెట్టాలి...పని పట్టాలి..
తమ్ముళ్ళని జాగ్రత్తగా హాండిల్ చెయ్యడం ఒక 'చాలెంజ్'. మెగా అభిమానం తో వాళ్ళు చేసే కొన్ని
పనులు కొంచెం శ్రుతి మించినా ప్రాబ్లమే! అందుకు, 'అన్నయ్య ' 'హిట్లర్ ' లా
ఉండాలి..మరి దానికి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో ?
చంద్రబాబు, రాజశేఖరుడు, చంద్రశేఖరుడు అనే 'ముగ్గురు మొనగాళ్ళని ' ఎదుర్కొనాలంటే
తమ్ముళ్ళు చాలా గట్టిగా పనిచెయాలి..'బావగారు బాగున్నారు ' కాబట్టి కొన్ని టెన్షన్లు ఆయన
తీసుకుంటాడు..ఈయన 'మంత్రిగారి వియ్యంకుడూ..అక్కడ వదిలేసి ఇక్కడకు వచ్చాడు
అంటూ వచ్చే 'మహానగరంలో మాయగాళ్ళు ' కూడా చాలా మందే వుంటారు..జాగ్రత్తగా
ఉండాలి..
'మనవూరి పాండవులు '..నాగేంద్రబాబు, 'తమ్ముడు ' కళ్యాణ్,అల్లు,మిత్రా తో
కలిసి,,ఆలోచించినా , ఇన్నాళ్ళ 'సంఘర్షణ ' ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి అభిమానుల 'అభిలాష ' తీర్చి 'ఇది కధ కాదు ' అని నిరూపించి ' మగమహరాజు ' గా నిలవాలి 'అందరివాడు ' గా నిలబడాలి అంటే ఈ 'గాంగ్ లీడర్ ' కి ఆ 'మంజునాధుడూ, 'త్రినేత్రుడూ',అంశ ఐన ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉండాలని
కోరుతూ.....

శుక్రవారం, ఆగస్టు 15, 2008

మేరా భారత్ మహాన్


భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.....

కానీ ఎందులోనూ స్వతంత్ర్యం కనబడటంలేదు..ఆ మహనీయులు ఎంతో కష్టపడి తెచ్చిన స్వతంత్ర్యాన్ని మనం సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నామా? ఏదైనా సాధించి వాళ్ళ శ్రమ కు ఫలితం చూపించామా?

గాంధీ గారిని నాటు తుపాకి తో..ఇందిరా గాంధీ ని మిషిన్ గన్ను తో...రాజీవ్ గాంధీని బెల్టు బాంబుతో ఇలా ప్రగతిని విధ్వన్సకర బాటలో తప్ప సరైన దిశగా ఉపయోగించలేమా?

భారతీయ మేధో సంపద పక్క డేశాలకు వలస వెళ్ళిపోతుంటే విమానాశ్రయంలో టా టా చెబుతున్నామే కానీ.. అక్కడ పొందే గెలుపులు..నోబెల్ బహుమతులు..రోదసీ యాత్రికులు..వైద్య నారాయణులు చివరకు ఆయా దేశాల సిటిజనులుగా గుర్తించబడుతున్నందుకు ఆనందపడాలా ..బాధ పడాలా?

రేషన్ కార్డు కోసం చూసే వాళ్ళకన్నా..కన్న వాళ్ళను వదిలేసి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసే
e-జెనరేషన్ అబ్రాడ్ మైండు పిల్లలని అలా పెంచిన ఈ జెనరేషన్ "మమ్మీ"-డాడీల కి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా?

పబ్బులెంబడి తిరిగి...తాగి వూగి వాగి తన్నులు తిని ఇంటికొచ్చే మగ పిల్లలు....నిన్న రాత్రి జరిగిన పొరపాటుకి వాంటింగులు (వాంతులు)వద్దనుకునే అన్ వాంటెడ్ 72 ఆడపిల్లలు....రేపటి గురించి ఆలోచిస్తున్నారా?

డిగ్రీ అవగానే కాంపస్ ఇంటర్వ్యూలో సెలక్టైపోయి హై టెక్కు సిటీ లో ఐ టీ కంపనీలలో వెళా పాళా లేని ఉద్యోగాలలో వేల రూపాయల జీతాలకి జేరి ......ఆరోగ్యం చేజారి....పక్క సీటు వారితో ప్రేమలోకి జారి ...మొహం మొత్తాక ఐతే సారీ..లేక పోతే షాదీ...యేడాది తిరగకుండానే ఉద్యోగం తో పాటు .....భార్య భర్తలు కూడా తలో దారి...ఎన్నాళ్ళీ వైఖరి?

ఏమో..60 ఏళ్ళ స్వతంత్ర్యం..మనకేమిచ్చిందో...మనం ఎటుపోతున్నామో...

ఏది ఏమైనా మేరా భారత్ మహాన్

ధనానికి దాసోహం
ఆడదానిపై వ్యామోహం
అవసరానికి మాత్రమే స్నేహం
తానే గొప్ప అనే అహం
ఇక్కడి జీవ జనుల లక్షణం
జాగ్రత్త మాట మార్చగలరు తక్షణం

మేరా భారత్ మహాన్

JAI HIND

మంగళవారం, ఆగస్టు 12, 2008

జలతారు రోడ్డు..జంట నరకాలు

జలతారు రోడ్డు..జంట నరకాలు
జలతారు అన్న పదానికి,,పదార్ధానికి మన తెలుగు సంస్క్రుతిలో ఒక ప్రత్యేకత ఉంది...అయితే..ప్రస్తుతం ఆ మాట మన రాజధాని నగరంలోని రోడ్లకు సరిగ్గా సరిపోతుందనుకుంటా...కానీ కొత్త భాష్యం చెప్పాలి ఆ మాటకి..
జలతారు..అంటే మెరిసేదనో...ఇంకోటో అసలు అర్ధం ఎలా ఉన్నా..జలం వస్తే కొట్టుకుపోయే తారు అని చెప్పచ్చు..మన రోడ్లని చూసి....
ఎంత రోడ్డుకి ఎంత మెటీరీల్ వాడాలి...ఎంత తారు..ఎంత సిమెంటు..ఎంత కంకర..ఎంత ఇసుక కలపాలి అన్నది రోడ్డు.దానిపై ట్రాఫిక్కు..వంటిపై కాక..సదరు కాంట్రాక్టరుకి లభించిన టెండరు ..సమర్పించుకున్న ఆమ్యాయాలూ..వగైరాపై ఆధారపడడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతుండచ్చు...కాకపోతే నష్టం అల్లా పాపం నగర జీవికే కాని...కాంట్రాక్టరుకి కాదు..కదా..
అసలే నిత్య వైతరిణి...డ్రైనేజీవనదులతో సతమతమయ్యే నగరజీవికి....వర్షానికి కొట్టుకుపోయే రోడ్లూ,,,విరిగిపడే ట్రాన్స్ఫార్మర్లు....కూలిపోయే వంతెనలు...తెరిచి వుండే మాణోళ్ళు....నరకం అనేది పైనెక్కడోలేదు..మహా నగరం గా ఇటీవల ఎన్నికైన మన నగరానికొస్తే చాలు..ప్రత్యక్షంగా చూడొచ్చు..
ప్రతీ కూడలిదగ్గర..నుంచొని..హెల్మెట్ లేదు..ఇంకోటిలేదు అంటూ పదో పరకో బాదే ట్రాఫిక్కోళ్ళు..జాం అయినప్పుడు పాపం ఎక్కడో ఇరుక్కుపోతారు...కొన్ని గంటల నరకం తరవాత ఏ చానెల్లోనో చూపిస్తుంటే ప్రత్యక్ష్యం అవుతారు...
మొన్న పడిన వర్షానికి పడవల్లో తిరగాల్సి వొచ్చిందంటే అర్ధం అవుతోంది..మన ప్లానింగు..అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఐర్పోర్టులు...అంతర్జాతీయ సమావేసాలూ..మహానగరం హోదాలు కాదు సామాన్యుడికి సరైన ఫుడ్డు..గూడు..రోడ్డు...అని ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిది,,,ఎంతసేపూ ఈ రకం గా జరగడానికి ప్రస్తుత పాలనే కారణం అని ప్రతిపక్షం....అసలు పాత ప్రభుత్వ నిర్వాకమే ఈ దారుణానికి సిసలు కరణం అంటూ ఒకరినొకరు తిట్టుకోకపోతే అసలు ఇలా కాకుండా వుండడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తే బగుంటుందేమో...అత్యవసరమైతే తప్ప బయటకి రాకండి అని చెప్పకపోతే..ఆ పరిస్థితి రాకుండా చూస్తే మంచిది....

శనివారం, ఆగస్టు 09, 2008

ఒలంపిక్స్

ఒలంపిక్స్
ఒలంపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అందరూ ' బీజింగ్ ' అంటారేమో..కానీ అసలు ఒలంపిక్స్ జరుగుతున్నది మాత్రం మన ఆంధ్రా లో..ఔను నిజం ఆంధ్రాలోనే..08-08-08 అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే..ఆంధ్రా ప్రజానీకం మాత్రం కొత్త రైలు కోసం ఎదురుచూసింది...కానీ ఎందుకో చిరు రైలు లేటైంది...ఏం ? ఎందుకు ? అంటే చిరు మందహాసమే సమాధానం,,,,అందుకే ఆ టాపిక్ వదిలేసి..ఒలంపిక్స్ వైపుకొచ్చా....

మన క్రీడలు..
జిమ్నాస్టిక్స్ : ఈ ఆటకి ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్..అధికారం లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాం అని నిరూపించుకోవడానికి ఆరోగ్యశ్రీ .. రెండు రూపాయల కిలో బియ్యం మంచినీటి పధకం అని రకరకాల విన్యాసాలు చేసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..ఈ విన్యాసాలు అప్పుడప్పుడు సోనియాని ఆకట్టుకోవడానికి కూడా చేసి చేసి బాగ ప్రాక్టీసులో వున్నారు...
హాకీ : తెలంగాణాకి వ్యతిరేకం కాదు..మాది ఎప్పటికీ సమైక్యవాదమే...అవసరమైతే తెలంగాణా ఇస్తాం..కలిసి వుంటే కలదు సుఖం...అంటూ తెలంగాణా వాదం తో డ్రిబ్లింగ్ చేస్తూ ముందుకు వెళ్తోంది తె దే పా..
పోల్ వాల్ట్ : పరిగెత్తుకుంటూ వచ్చి ప్రత్యేక తెలంగాణా అనే కర్రతో సడంగా ఎగిరి నవతెలంగాణా లో దూకిన దేవేందర్ పతకం గెలుస్తాడో లేదో pole తోనే తెలుస్తుంది
కో కో : కాసేపు సోనియాతో భేటీ..తరువాత కో చెప్పి చంద్రబాబు తో మంతనాలు..ఆ తరువాత చిరంజీవితో కబుర్లు..మొత్తానికి తెలంగాణా తెస్తాం అంటూ కో కో ఆట ఆడుతున్నారు తె రా స
రన్నింగు : ఎన్ని పార్టీలున్నా ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా బంగారు పతకం - బంగారం లాంటి పాలన మాదే అంటూ రిలే "పరుగు " పందెం లో ముందుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి..
స్విమ్మింగు : ఏతకొలనులో ఎటువైపు వెళ్ళాలో తెలీక నాలుగువైపుల ఉన్న అన్ని పార్టీల వైపు ఏదేప్రయత్నం లో వున్న కమ్యునిస్టులు ఈసారి ఎవరివైపు ఈది ఎవరిని గెలిపిస్తారో చూడాలి..
వైట్ లిఫ్టింగు : హిందుత్వ - రామాలయం అనే బరువులు మోస్తూ ఎప్పటికైనా ఫస్టు మేమే వస్తాం అప్పటిదాక wait చేస్తాం అంటూ వైట్లిఫ్టింగ్ చేస్తున్నారు..భా జా పా..
బీచ్ వాలీబాలు : ఆడేది బీచ్ వాలీబాలు లాంటి రాజకీయం అనే ఆట ఐనా మేము మొత్తం డ్రస్సు వేసుకునే ఆడతాం నైతిక విలువలు నిలుపుకోవడానికి వలువలు వేసుకునే పోరాడతాం..నిజాయితీగా ఆడతాం మా సత్తా చూపుతాం అంటూ నిత్యం రక రకాల డోపింగులు తీసుకునే వాళ్ళతో పోటీ పడుతున్నారు లోక్ సత్త వాళ్ళు..
మనమూ చూద్దాం ఈ పొలిటికల్ ఒలంపిక్స్ లో ఎవరు గెలుస్తారో .........

ఆదివారం, ఆగస్టు 03, 2008

టీవీ మాయ

టీవీ మాయ
సెకండ్ ఎపిసోడ్... ఇది టీవీ మాయ..
ఒక అత్త ఒక కోడలు,,ఒక పనికిరాని మొగుడు...ఒక పనిలేని మావగారు ...అనే నాలుగు కారక్టర్లు నాలుగు సంవత్సారాల కన్నీటి ధారవాహికల మధ్య పోరాటాలు..టీవీ స్పెషల్..పాపం ఆ హీరోయిన్ కి కష్టాలు ఎప్పటికీ తీరవు...ఒక భర్తకి ఇద్దరు భార్యలు....కుళ్లుకునే తోటికోడలు..చిచ్చులుపెట్టే ఆడపడుచు..అవమానించే అత్తగారు..హింసించే మొగుడు...మావగారు మాత్రం సపోర్టుంటాడు..ఇన్ని కష్టాలు భరిస్తూ...ఇంటి మొత్తాన్ని ఉద్ధరిస్తూ ఉంటుంది ఆ కోడలు..ఒక కష్టం తీరిన వెంటనే తలుపు దగ్గర వైట్ చేస్తుంటుంది మరో కష్టం...ఇలా కొన సా ఆ ఆ ఆ ఆ ఆ అగుతూ పోతుంటాయి ఆ సీరియళ్ళు...అందులో వొదినా మరుదులుగా వేసిన వాళ్ళూ అకా తమ్ముళ్ళు గా వేసిన వాళ్ళు నిజ జీవితంలో ప్రేమించేసుకుని పెళ్ళి చేసుకునే అవకాశం కూడా వుంది...
ఇక లైవ్ ప్రఒగ్రాములు...మీరు అడుక్కోండి మేమేస్తాం అని ఫోన్ చేసి అడుక్కునే ప్రోగ్రాములు...వేళ్ళు నెప్పులు పుట్టేల నెల ట్రైచేస్తే....వాళ్ళకు నచ్చిన పాటలు వేస్తారు...
ఇక ఆట పాటల పోటీలు...
వీటికి ఏ ప్రాతిపదికన సెలక్టు చేస్తారో ఆ భగవంతునికే తెలియాలి..మధ్యలో ఏడుపులు..ఆత్మ హత్యా ప్రయత్నాలు..లేచిపోవడాలు..కొట్టుకోవడాలు..ప్రేమలు..యుద్ధాలు....అలకలు..నిందలు...నిష్టూరాలు..ఎస్ ఎం ఎస్ స్కాములు.....పక్షపాతాలు..ప్రాంతీయ తత్వాలు....సెంటిమెంటులు...యాక్సిడెంటులు.....సింపథీలు....జడ్జీల ఇగోలు...యాంఖరు పైత్యాలు...అబ్బో బోల్డంత మసాలా...ప్రేక్షకులతో ఆడుకునే ఇలాంటి ఆటలో ఎప్పుడూ గెలుపు వాళ్ళదే...కాలు జారి కిందపడ్డ ఆ అమ్మాయి మళ్ళీ ఆడిందా లేదా వొచ్చే వారం చూడండి...అంటూ ఉత్ఖంట రేకెత్తించి మధ్య మధ్యలో నేను చచ్చిపోతా అంటూ ఆమె ఏడ్చే సన్నివేశాలతో..యాడ్లు వేసి తరువాత వారం వరకు ప్రేక్షకుల్ని పట్టివుంచే ఎన్నో ట్రిక్కులు...అన్నీ మన ఆనందం కోసమే...ఇక పిల్లల మధ్యలో పోటీ ...వాళ్ళ కెరీర్లు ఏమౌతాయఓ తెలీదు...ప్రతీ పోటీలో ఒక్కరే విజేత...కానీ యాబహి రెండు వారాల వాళ్ళ ఆటలో వోడితే అన్నిరోజుల శ్రమ ఏమౌతుంది...చదువు ? హైదరాబాదులో జరిగే పోటీల కోసం వూర్ల నుంచి వచ్చి ఉండిపోయి చివరకు గెలవక ....బాధపడే ఎందరో అమాయకులకు సానుభూతితో ఈ పోస్టింగు...అంకితం

సినీమాయ

సినీ మాయలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది...ఒక్కొక్కరిది ఒక్కో మాయ..మొత్తానికి ఇంటిపట్టున వున్న ప్రేక్షకుణ్ణి ధియేటరుకి రప్పించే ప్రయత్నాలు...మా సినిమాలో హీరోయిన్ ఎన్ని చీరలు కట్టిందో లెక్క పెట్టి చెప్పండి...ఆ చీరలు మీకిచ్చేస్తాం అని ఒకప్పుడు అనేవాళ్ళు/..\ ఈ మధ్య ఒక పెద్ద రేడియోలో కూడా అలాంటి మాటే విన్నా..కధానయకుడులో ఆ హీరో వాడిన చొక్కాలు పాంట్లూ ఇస్తాం దీనికి సమాధానం చెప్పండి అంటు...ఒక రేడియో జోకరు...ఏవో దిక్కుమాలిన ప్రశ్నలు వేశాడు...పాపం అమాయక ప్రాణులు కొన్ని ఆ తిక్క ప్రశ్నలకు సమాధానాలు వెతికి పట్టుకుని...చెప్పారు...మరి వాళ్ళు గెలుచుకున్నవి నిజంగా ఆ సదరు హీరోగారు విడిచిన బట్టలేనా లేక? అవి వందసార్లు వేసుకుంటే ఒక్కసారైనా వుతుకుతారో లేదో మరి.....
ఇక సినిమా కోసం కావాలని కాంట్రవర్సీలు తయారు చేసి మరీ..ప్రజల మీదకి తోస్తున్నారు కొంతమంది తెలివైన వారు...ఫలానా సినిమాలో హీరోయిన్ బికినీ వేసుకుందట..ఆ సినిమాలో హీరోయిన్ ఐటం సాంగు చేసిందట..హీరో సిక్స్ ప్యాకుట.... బాలివుడ్డులో ఐతే ఇంకో స్టెప్పు ముందుకేసి...ఆ హీరో హీరోయిన్ పెళ్ళి చేసుకుంటునారు...పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు...ఆ ప్రేమ అంతా తెరమీద వొలకపోసారు మీరు తరించండి అంటూ ఊదరకొడుతున్నారు...సందిట్లో సడేమియా అంటూ ఆ జంట కూడా వీలైనంతగా కలిసి తిరిగుతూ అన్ని చోట్లా కన్నుల పండగ చేస్తుంటారు...ఒక వేళ ఎంత ప్రేమించుకున్నా..చివరకి పెళ్ళి చేసుకున్నా..తెరమీద మొత్తం చూపించలేరుగా....ప్రజల అమాయాకత్వాన్ని సొమ్ముచేసుకుంటున్న నిర్మాతల తెలివి అమోఘం....దీపిక పదుకునే-రణ్బీర్, సయీఫ్ కరీనా...ఇలా చాలా పేర్లు జంటగా వినిపిస్తుంటాయి...మనకి..అసలు మోసపోవద్దు.. అవన్నీ పబ్లిసిటీ కోసం అంతే...
ఇటీవల రాం గోపల (దెయ్యాల) వర్మ... దమ్ముంటే నా సినిమా ఒంటరిగా చూడండి బోల్డంత డబ్బిస్తాను అని చాలెంజ్ చేశాడు...అలా అయినా ఆయన సినిమాకి జనం వస్తారనేమొ ఈ ఎత్తుగడ..ఎందుకంటే ఆయన సినిమాలకి వెళ్ళి సినిమా చూసి భయపడడం ఎలా వున్నా ఆయన సినిమాకి వెళ్ళాలంటే భయపడే స్థితిలో ఉన్నారు జనాలు....హాయిగా శివ..గోవిందా గోవిందా లాంటి సినిమాలు...రంగీలా లాంటివి తీసుకోక ఎందుకు నాయనా ఈ దెయ్యాలు భూతాలు.

సోమవారం, జులై 28, 2008

లోకల్ నాయకుడా

లోకల్ నాయకుడా


కొందరు రాజకీయ నాయకులని చూస్తే ఆస్చర్యమేస్తోంది..లోకల్ నాయకులైనా లోకనాయకులులా ఫీల్ అవుతుంటారు వీళ్ళు..మొన్న ఆబిడ్స్ లో ఏదో గందరగోళం..ఇళ్ళు పడగొడుతున్నారని..రాస్తా రోకో..బైఠాయింపు...జరిగాయి....గాలిలోకి కాల్పులు కూడా జరిగింది అయితే అది పోలీసులు చేసింది కాదు సదరు లోక నాయకుడు గారు చేసిందే....
లాఠీ చార్జీ జరిగింది...అదీ పోలీసులు చేసింది కాదు...ఆ లోక నాయకుడి సిబ్బంది చేసిందే...ఆ సిబ్బంది చితక్కొట్టింది మరెవరినో కాదు...సాక్షాత్తు బల్దియా అంటుంటారే ఆ మునిసిపాలిటీ సిబ్బందిని...ఆనాయకుని నమ్ముకున్నాయన్ని ఇబ్బంది పెట్టినందుకు...లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చి ఇరగదీసాడు ఆ లోక నాయకుడు..పోలీసులు కూడా లోపల కూచోబెట్టి మర్యాదగా మాట్లాడి విచారణ జరిపిస్తామన్నారు....తలలు పగిలిన వాళ్ళ పట్ల విచారం వ్యక్తం చేసారు కూడాను....
గాలిలో కాల్పులు జరిపిన ఆ నాయకుడి కి అలాంటి పరిస్థితి ఎందుకు కలిగిందో....ఎందుకు ఆయన కాల్పులు జరిపాడో.. అసలు అంగ రక్షకులు అప్పుడు ఏమి చేస్తున్నారో (సిబ్బందిని చితక్కొట్టే పనిలో ఉన్నట్టు సమాచారం)...తెలుసుకుని చెబుతారు త్వరలోనే ఒక పది పన్నెండేళ్ళలో//./

నయన తార


ఒకావిడ హీరోయిన్, ఒకావిడ హీరోయిన్ కం ఐటం సుందరి, ఇంకొక ఆవిడ ఐటం సంగ్ స్పెషలిస్టు...
తేడా అల్లా ఒకటే....హీరోయిన్ అని అన్నావిడకి కోటి దాకా పారితోషికం...ప్లస్ సకల సదుపాయాలు...ఎందుకంటే ఆవిడ కధానాయకురాలు కాబట్టి...నయనానికి అందంగా ఉంది కదా అని అనుకుంటుండంగానే ....కను విందు చేయడనికి నేను రెడీ అని బిల్లా కట్టుకుని మరి చెప్తోందీ పిల్ల...చంద్రముఖిలో గాలిపటాలెగరేసింది ఈ పిల్లేనా అని ఒకసారి డౌట్ వొస్తుంటుంది నాకు...బాగా తొందరగానే నేర్చేసుకుంది సినీ నాడిని....

నిషా కనులతో నుంచున్న మరో నాయిక బాలివుడ్డు లో ఒక్క మగాడు ' రాం ' అస్థానంలో ప్రదర్శనలిస్తూ ఉంటుంది .......తెలుగులోనూ ఒక్క మగాడుతో జత కట్టినా..అంతగా కలిసి రాక తన సామ్రాజ్యం ఎక్కడుందో వెతుక్కుంటోంది.....పారితోషికమూ మధ్యస్థంగా ఉంటుంది

ఇక ఎప్పటికీ 16 యేళ్ళ వయసే అని చెప్పే ఈ పచ్చబొట్ట్ల సుందరి..మ మత్తుఖాను..ఐటం సాంగు గర్లు గా వచ్చినా త్వరలోనే తెలుగు జనాల విశాల హ్రుదయం వల్ల ఇక్కడే ఒక గూడు వెతుక్కుంటూ..ఒక మంగతాయారు టిఫిన్ సెంటరు పెట్టి (కను) విందు చేస్తోంది..పారితోషికం మాత్రం పై ఇద్దరితో పోలిస్తే తక్కువే....

నాకు అర్ధం కానిదల్లా వాళ్ళ (అందాల) ప్రదర్శనలో తేడా ఏమీలేదు////దుస్తుల విషయంలోనూ పెద్ద తేడా యేమీ లేదు...వళ్ళు దాచుకోకుండా కష్టపడడంలోనూ టేడా లేదు....మరి పారితోషికం విషయంలోనూ...మర్యాద విషయంలోనూ ఆ టేడా యెందుకు అని?

LinkWithin

Related Posts with Thumbnails