Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, డిసెంబర్ 31, 2007

HAPPY NEW YEAR


ప్రపంచం లోని తెలుగు
మిత్రులకు
ఆంగ్ల సంవత్సరాది మరియు సంక్రాంతి
శుభాకాంక్షలు


 NEWYEAR GREETINGS
HAPPY NEW YEAR 2008
ప్రపంచం లోని తెలుగు వారందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

శుక్రవారం, డిసెంబర్ 28, 2007

పాత సంవత్సరం

2007 లో ఏమి సాధించామని చూసుకుంటే ఏమీ లేదనిపించింది

మామూలుగానే
రాజకీయపు అరుపులు, గోలలతో ముగిసిన అసెంబ్లీ...
ప్రజా సమస్యల పై పోరాడే వేళ తిట్టారని పాపం నిద్ర పట్టక
ఉపక్రమించి రాబోయె ఎన్నికల గురించి కలలు గన్న ప్రతిపక్ష నేత నిద్రించిన అసెంబ్లీ..

కాళ్ళు నెప్పుట్టేలా తిరిగి తిరిగి సంపాదించిన అధికారం
నోళ్ళు నెప్ప్ట్టేలా తిడతాం పడండి అనే రాజసం చవి చూసిన అసెంబ్లీ..

బాంబు దాడితో రక్త సిక్తమైన శాంతి కి చిహ్నంగా పేరు సంపాదించిన
బుద్ధుడు కొలువైన సాగర తీర లుంబిని

ప్రజా స్వామ్యం కోసం పుట్టో
ోరాడి అసువులు బాసిన ముసల్మాను దేశాల చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా చరిత్ర స్రుష్తించిన బుట్ట


తలుచుకుంటే కడుపు తరుక్కు పోతోంది...

సాధించిన విజయాలు 20-20 ఐతే పోగొట్టుకుంది 80-80 అనుకోవచ్చేమో..

సినీ నటుల రాజకీయ రంగప్రవేశం గురించిన పుకార్లు...
లేచిపోయిన వాళ్ళని సెలెబ్రిటిఎలుగా చేసిన ఛానళ్ళు....
రోదసి నుంచి తిరిగొచ్చిన సునీతా విలియంస్ సాహసాలు,..
ప్రపంచ రెకార్డులు తిరగ రాసిన భారతీయ వీరులు...


ఏమి సాధించామో తెలుసుకునే లోపల సంవత్సరం గడిచిపోయింది.. రాబోయే సంవత్సరమైనా మంచి చేకూర్చాలని కోరుకుందాం....
2007 లో ఏమి సాధించామని వెనక్కి చూసుకుంటే ఏమీ లేదనిపించింది
మామూలుగానే రాజకీయపు అరుపులు గోలలతో ముగిసిన అసెంబ్లీ....

ప్రజా సమస్యలు చర్చించే సమయంలో తిట్టారని పాపం నిద్రపట్టక అసెంబ్లీలోనే నిద్ర పోయిన ప్రతిపక్షనేత రాబొయే ఎన్నికల గురించి కలలు కన్న అసెంబ్లీ...

మంగళవారం, డిసెంబర్ 04, 2007

పాలిటిక్స్ లో చిరంగేట్రం' అను కొత్త సినిమా దర్శకత్వం మీడియా





స్టార్ట్ యాక్షన్ కెమేరా అంటూ మీడియా పెద్ద సినిమా మొదలెట్టేసింది కాకపోతే హీరో గారు మాత్రం ఆ సీనులో లేరు ...ఆల్రేడీ సగం సినిమా తీసేసారు హీరో లేకుండానే..టైటిల్సు, పోస్టర్సు, బాణాసంచా అంతా రెడీ..ఇక హీరో ఎంట్రీనే ...ఒక రకంగా చెప్పాలంటే




పాపం చిరంజీవి కి రెస్ట్ లేకుండా చేస్తున్నారీ మీడియా వాళ్ళు...
ఆయన పార్టీ పెడతారో లేదో కానీ,,,,,వీళ్ళకి మాత్రం ఆయన టాపిక్స్ తో రోజూ పార్టీ చేసుకుంటున్నారు...
పార్టీ కి పేర్లు వెతికే పన్లో కొందరుంటే...జెండా లో ఏముండాలో రీసెర్చ్ చేసేది కొందరు.... పార్టీ గుర్తు గురించి కసరర్రు లో కొందరు... చిరనజీవి పార్టీ ---- అని కొందరు ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు.. ఈ విషయంలో ఇంకా ఆయన మాత్రం ఏమీ చెప్పట్లేదు కనీసం చీ పా.. అని కూడా అనలేదు...
ముఖ్యమంత్రి ఐతే తెలంగాణా గురించి ముందే మాట ఇవ్వాలని కొందరు....అబ్బ అసలు చిరంజీవి మనసులో ఏముందో మరి ఎవరికి తెలుసు....
సో ఓ మీడియా ....ఆయన్ని కాస్త ఆలోచించుకోనీయండి....
ఆయన తలచుకుంటే చెప్పే చేస్తారు...మీకు చెప్పాకే చేస్తారు.....




బుధవారం, నవంబర్ 28, 2007

కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ మీడియాకి అనర్హం

కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ మీడియాకి అనర్హం

రైతుల సమస్యల కన్నా లేచిపొయిన లేవదీసుకు పోయిన వాళ్ళని సెలెబ్రిటీలను చేసే పనే వీళ్ళకి యెక్కువ..ముగ్గులోంచా,, ముగ్గులోకా అంటూ టైటిళ్ళు..

మొన్న ఒక సూమో కథ...నిన్న ఒక ఆటో కథ.....రోడ్డు పై ధర్నాకు సప్పోర్టు గంట గంట కీ రెఫోర్టు...
ప్రస్తుతం జరిగింది అర్ధం కాకపోతే వాళ్ళకి అర్థం అయిందే మనకి చెప్తారు ఒకటికి 99 సార్లు.......
వీలైతే ఆ అమ్మాయి తిరిగొస్తుందా రాదా ఎస్ ఎం ఎస్ చేయండి అంటూ ఒక సర్వే.....

అసలే పరువు పోయి పాపం బాధ పడుతుంటే...వాళ్ళింటి దగ్గర ఒక కెమేరా టీముని పెట్టి
మరింత తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి టీ వీ 99 మెరుగైన సమాజం కోసం దిగజారిన సమాచారం....

బుధవారం, నవంబర్ 21, 2007

వస్త్ర సన్యాసం


వస్త్ర సన్యాసం




వందనా బ్రదర్స్, ఏ బి బ్రదర్స్, ఎక్స్ వై బ్రదర్స్, లాంటి బట్టల కొట్లు ఎన్ని వోపెనింగులు చేసినా...పట్టు చీరలతో యాడ్లలో నటించినా ...పాపం కొంత మంది హీరోఇన్లకు సినిమాలలో మాత్రం అవే కరువు....

మడి కట్టుకు కూర్చుంటే చాన్సులు రావని పాపం వస్త్ర సన్యాసం చేసి మరీ కొట్టేస్తున్నారు చాన్సులు.....

తెలుగమ్మాయిలా సీతమ్మ లా వుంటే లాభం లేదనుకుని బాలివూడ్ లో చాన్సు కోసం వస్త్ర సన్యాసం చేసిన మరో తెలుగింటమ్మాయి పాపం ఒక తెలుగు సినిమాలో పెద్దాయన పేరున్న చిన్నాయనగా పేరున్న పెద్ద హీరొ తో అంటే ఎగిరి గంతేసింది తీరా చూస్తే ఒక పాట లో మాత్రమే ఆ గెంతులు అది కూడా దేవతా వస్త్రాలతో అని తెలిసి చేసేది యేమీ లేక షంగు షకాల చింగు చికాల అంటూ గెంతి బాలివూడ్లో పాడ్డది ఆ పడతి...

రచ్చ గెలిచి ప్రస్తుతం ఇంటి వైపు చూస్తోంది...

ఆమె ఆ"వేద"న అర్ధం చేసుకుని త్వరలోనే ఎవరో ఒకరు వరం ఇవ్వక పోరు...వస్త్ర సన్యాసం ఫలించక పోదు.......

సోమవారం, నవంబర్ 19, 2007

హస్త సాముద్రిక ఫలాలు




ప్రస్తుతం కాంగీ రేసులో ఉన్న వారికి జాతక ఫలాలు..చేయవలసిన పూజలూ ఇతరాలు

గ్రామ గ్రామాన ఇందిరమ్మ విగ్రహ ప్రతిష్ట చేయడం

రాజీవ్ బాటలెంబడి ప్రదక్షిణలు చేయడం

సోఅనియా మాతకు ప్రత్యేక పూజలు

"రాహు" ల్ జపం ఒక లక్ష ప్రతి రోజూ

చేతికి ప్రియాంక ఫొటో తో కూడిన ఉంగరం ధరించడం

పైన పేర్కొన్న విధానాలు పాటిస్తే చక్కటి ఫలితాలు కలిగి సోనియా "కరుణామయ" ధ్రుక్కుల వల్ల మంచి పొజిషన్ లభిస్తుంది..లాభిస్తుంది..

ఆంధ్ర నేతలు పై వాటితో పాటుగా ప్రతీ ఆదివారం నంబరు 10 జన్ పధ్ ఆలయ దర్శనం చేయడం వల్ల పి సి సి అధ్యక్ష్య స్థానాన్ని అన్ని గ్రహాలూ చూస్తుండడం వల్ల లగ్నాధిపతి వీరప్ప మొయిలీ కి ప్రత్యేక పూజలు చేయడం లాభించ వచ్చు

గురువారం, నవంబర్ 15, 2007

ఒకటికి మూడు ఫ్రీ (ధారావాహికం 2 )



మాస్ మన్మధుడి తో సంతోషంగా బాసూ


' మన్మధుడిలా ' అందంగా ఉండే మరో హీరో గారి సినిమా విషాయల కొస్తే, ఈయన గారికి అమ్మాయిలంటే అసలు పడదు.. (బల్ల కింద ) ' కొంచెం ' దూరం గానే ఉంటుంటాడు . అయినా అమ్మాయిలు మాత్రం ఈ మాస్ హీరో గారి వెంట పడుతుంటారు.. ఆయన ప్రమేయం లేకుండా ' సంతోషం ' గా పాటలు పాడుకుంటారు...ఒక రోజు ఈ సారు తనకి ఆల్రేడీ పెళ్ళో ఎంగేజ్మెంటో ఐపోయిందనీ....ఆ అమ్మాయి సునామీ లోనో, యాక్సిడెంట్లోనో చచ్చిపోయిందనీ..ఆ అమ్మాయి తో పాడుకున్న రెండు మూడు పాటలతో సహా చెబుతాడు.. దాంతో మరింత జాలి పడిన ఈ అమ్మాయి గారు పిల్లలున్నా సరే ఈ ' బాసు ' వెంట పడి మరీ ప్రేమ వొలక పోస్తారు..ఇలాంటి కొత్త కధ తో డిఫరెంటుగా చేస్తుంటారు ఈయన.. .. మనం చూస్తుంటాము అంతే......

మీకు ఏవైనా రెండో మూడో సినిమాలు గుర్తొస్తే తప్పు నా(గ్) ది కాదు.......

శనివారం, నవంబర్ 10, 2007

యాం 'ఖరులు'

మిత్రుడు క్రిష్ణ ఇచ్చిన స్ఫూర్తితో ఎఫ్ ఎం పేరుతో బాదుతూ బాధిస్తున్న యాం ఖరుల గోల.....


ఒకరి కార్యక్రామాలు వంటికి 'కారం' రాసుకునంట్టుంటాయని వాళ్ళే బాహాటంగా చెప్పుకుంటున్నారు...పైగా వేడి కబుర్లు అంటూ నోటికొచ్చిన సొల్లు చెప్పేందుకు యెల్లప్పుడూ సిద్ధం

ఇక ఒక 'పెద్ద' ఎఫ్ ఎం లో ఐతే ఆ క్రిష్ణుల వారికి ఏది తోస్తే అది తోసేస్తారు జనం మీదకి.....దీపావళి నాడు పట్టులంగాలు వేసుకున్నా రాత్రికి మాత్రం హీరోయిన్ల లా పొట్టి గౌనులేసుకుంటే బాగుంటుందిట (ఎవరికో ) అది సేఫ్టీ కోసమే అని ఒక కొసమెరుపు....వాళ్ళకి సేఫ్టీ గానీ నాయనా ఎదురుగా ఉండే అబ్బాయిల గుండెలకి మాత్రం అసలు సేఫ్టీ కాదు.......అందులోని మరో యాంఖరు ఈమధ్య ఏదొ పుస్తకం లోకెక్కడానికి రాత్రింబవళ్ళు కేక లు పెట్టి ప్రస్తుతం ఎవరైనా అమ్మాయిలు ఫోన్ చేస్తే చాలు యెలా ఉన్నావ్ యేం చేస్తున్నవ్ అంటూ అందరినీ సొంత మరదళ్ళలా చూసుకుంటాదు పాపం ఈ మధ్య ఒకామె ఫోన్ చేస్తే హాయ్ పద్మ పద్దు యెలా ఉన్నావ్ యేమి చేస్తున్నావ్ అంటే ఆమె ఖంగారుగా బాగున్న అంటూ కేక పెట్టింది..మీరు మారీడా అంటె అవునన్న ఆమెకి నెక్ష్ట్ ప్రశ్న నీకు పిల్లలా అని దానికి ఆమె అవును పెద్దబ్బయి అమెరికాలో ఎం ఎస్ చేస్తున్నాడు అమ్మాయి ఇంజినీరింగ్ ఫైనల్ అంటూ ఏకరువు పెట్టింది....కెవ్వు కేక
మరో రాజుగారైతే గురూ వారాంతం కదా సరదాగా మందు కొట్టండి కాకపోతే లిమిట్ లో ఉండండి అంటూ ఫ్రీ సలహా ఒకటి ప్రసాదిస్తారు

ఇక ఉల్లాసంగా ఉచ్చాహంగా అంటూ వత్తులు లేకుండా ఆడో మగో అర్ధం కాకుండా ఆసాంతం అరిచే యాంఖరాలు మరో ఇస్ చానెల్లొ....ఇక సితిలో ఉన్న మరో చానెల్ అది తెలుగో మరాఠివొ మరోటో అర్ధం కాదు.....మధ్యఒలో గాంధీ బందరు పోరు యెందుకు ? యెందుకంటే ఆయన పుట్టిందీ పోరు బందరు అందుకే ఆయన మూడు బందర్ (అంటే కోతిట) గురించి చెప్పారు అంటూ తమ అతి తెలివి ప్రదర్సించి ఆ తిక్క ప్రశ్నలకి చెత్త సమాధానాలిచ్చిన వాళ్ళకి అమ్ముడుపోని సీడీలో.........ఆడని సినిమాటిక్కెట్టో ఇచ్చి మరీ సత్కరిస్తారు/...అమ్మా అయ్యా మీ కార్యక్రమాలకోసం దయచేసి తెలుగు తో ఆడుకోకండి.....ఎఫ్ ఎం రేడియో జాకీల్లారా తెలుగు నేర్చుకోండి...తెలుగు బతికించండి.......

బుధవారం, నవంబర్ 07, 2007

ఒకటికి మూడు ఫ్రీ

పండగ సీజన్ వచ్చింది కదా...మూడు కొంటే ఒకటి ఫ్రీ రోజులు పోయి ఒకటి కొంటే మూడు ఫ్రీ రోజులొచ్చాయి...తెలుగు సినిమాలు కూడా అంతే..ఒకటి కి మూడు ఫ్రీ కాన్సెప్ట్ తో వస్తున్నాయి..కావాలంటే ఈ ధారావాహిక ఫాలో అవండి..

ఫాక్షన్ సినిమాలు..




గ్రా మ సిం హం



హీరో కాశీ లోనో, కేరళ లోనో, కన్యాకుమారి లోనో అంట్లు తోముతూనో, కార్లు కడుగుతూనో, ఉంటాడు..బాగా కడుగుతున్నాడని, యెదురుగా ఉన్న ఒక హీరోయిన్ ప్రేమిస్తుంది...అడుక్కుతింటున్నా హీరో కాబట్టి అమెరికాలో పాటలు పాడుకుని...పెళ్ళి మంటపం దాకా వస్తారు....అప్పుడు 40 టాటా సూమోలు వచ్చి ఆగుతాయి మంటపం ముందు.. అందులోంచి 80 జతల మగ కాళ్ళూ, ఒక జత ఆడ కాళ్ళూ దిగుతాయి.. ఆ పెళ్ళీ ఆపి అతను హోటల్ లో క్లీనర్ కాదని, కడపలో లీడర్ అని చెప్పి అందరినీ కడప రైలు యెక్కిస్తారు..అక్కడ ఈలోపల ఈ పాప తో ఫ్లాష్ బాక్ లో పాటలు, ప్రేమలు.. అయిపోయి.....క్లైమాక్స్ లో కొత్త రకం ఆయుధం పట్టి విలన్లు అందరి పని పట్టి ....చంపడం పాపం నరకడం ఘోరం అన్న సూక్తి తో సినిమా సమాప్తమౌతుంది.....
ఇందులో హీరో గారికి విలన్ ని చంపడానికి కత్తులక్కర్లేదు..కంటి చూపు చాలు....గొడ్డళ్ళక్కర్లేదు--గోళ్ళు చాలు...ఉరి తాడు అక్కర్లేదు....మొలతాడు చాలు.....

మనకి ఆయన చంపక్కర్లేదు--సినిమా చూస్తే మనమే పోతాం....
(మీకు 3 సినిమాలు గుర్తుకు వస్తే బాధ్యత నాది కాదు....చిన్ని క్రిష్నుడిది )

ఇది ఒకటికి మూడు ఫ్రీ లో ప్రధమ భాగం...ఇంకా అనేకం ఉన్నాయి...

ప్రస్తుతానికి

ధన త్రయోదశి..నరక చతుర్దశి.....దీపావళి శుభాకాంక్షలు.....మీ ఫణి మాధవ్...,..

చాల్లే నోర్ముయ్


కాళ్ళు నొప్పుట్టేలాగా తిరిగి తిరిగి సంపాదించిన అధికారం ఇది....నోళ్ళు నొప్పుట్టేదాక తిడతాం పడంది.....అని ఇందిరా మానస పుత్రుడు..పంచెకట్టుతో పచ్చచొక్కా ఆయన్ని తిడుతుంటే....పేరుకు స్పీకర్ ఐనా కూచోండి తప్ప వేరే యేమీ మాట్లాడని స్పీకర్ ...ఇతర ప్రతిపక్షాలూ ముందర ఇంతటి అవమానం జరిగిందంటూ వాపోతున్న బాబూ .........లేశమాత్రం గూడా యేమీ జరగలేదు... అంతా ఉట్టిదే అంటున్న పెద్దాయన రోశయ్య మాటల గారడీ చూసి పాపం అసెంబ్లీ ముందున్న గాంధీ యెందుకు నాయనా నన్నిక్కడ కూచోపెట్టారు అని బాధ పడుతున్నట్టుంది.....పైగా ఆయన ముందు మన వాళ్ళు మౌన వ్రతం.....

సోమవారం, నవంబర్ 05, 2007

"ఆటో" గ్రాఫ్ డిజిటల్ మెమొరీస్



హైదరాబాడ్ ఆటో వాళ్ళతో ఇబ్బంది పడని వాళ్ళెవరూ లేరేమో.. ఆటో అటొస్తావా అంటే ఇటు వెళ్తాననే ఆటో సుల్తానులే యెక్కువ.... మీటరు మీద యెక్కువ అడగని వాడు పాపాత్ముడు.. లీటరు పెట్రోలు రేటు పెరిగింది అని ..డాలరు రేటు పడిపోయిందని ....కారణం యేదైనా దారుణం గా రేట్లు పెంచే ఆటోమేటిక్ జీవులు.... .... ప్రస్తుతం డిజిటల్ మీటర్లు పెట్తుకోమంటే పెట్టుకోమంటున్నారు...అది వారి జీవితంలోని చాలా నంబర్లు తారుమారు చేస్తుందట....ఖర్చు కూడా భరించలేమంటున్నారు పాపం పేద ఆటోవాలాలు....ఇన్నాళ్ళూ మిమ్మల్ని మేము భరించలేదు..హాఫ్ రిటన్లు.....మీటర్ మీద ఎగస్ట్రాలు.. .ఇప్పుడు మీ దాకా వచ్చాక తెలిసినట్టుంది.........ఆర్టీసీ ని నమ్మలేని వాళ్లు ..ముఖ్యంగా ముసలి వాళ్ళూ ...ఆడ పిల్లలు....చిన్న పిల్లలూ అధార పడేది ఆటోల మీదే జాలీ నాలీ లేకుండా ఆడుకున్న అన్నలారా డిజిటల్ మాటర్ త్వరగా తేల్చి.......,మీటర్ ఉన్న మీ ఇమేజ్ ని కిలో మీటర్ పెంచుకోండి.....ఆటోమాటిచ్ గా హీరోలైపోండి ...........

శనివారం, నవంబర్ 03, 2007

జీతాల రోజు




నెల రోజుల పని తనానికి గుర్తుగా సంబరంగా అందుకునే రోజు ....కాక పోతే ఆ రోజు మాత్రమే మన దగ్గర ఉండే ఆ డబ్బు మర్నాటెకే మరొకరికి ఇచ్చేయాలని గురుతుకు రాక ఇలానే ఆనందిస్తాం

ఒకటో తారీఖుకే జీతం మొత్తం అప్పులోడి సొంతం
పప్పు ఊప్పు పాలవాడి ఖాతా అంటూ ఇల్లాలి రాద్ధాంతం


నిండా మునిగాక చలేంటి అని మన సిద్ధాంతం

చలో విలువల్లేని వలువ్వల్లో వళ్ళు దాచుకుని మళ్ళీ అప్పు కి సిద్ధం

బుధవారం, అక్టోబర్ 24, 2007

న(వ)ంబర్ " 1 "


నవంబరు ఒకటి ఆంధ్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు మిత్రులందరికీ శుభాకాంక్షలు ....నవంబరు ఒకటిన ఆవిర్భవించిన మన రాష్ట్రం నంబరు " ఒకటి " గా నిలవాలి..మనమందరమూ ఒకటిగా మెలగాలీ అని కోరుకుందాం.విడగొట్టే ఆలోచనలు మాని కలసివుంటే కలదు సుఖం అని తెలియచేద్దాం...

మంగళవారం, అక్టోబర్ 23, 2007

ప ' గన్ ' కళ్యాణం

ప ' గన్ ' కళ్యాణం

నీ కళ్యాణానికి మాకేమీ అభ్యంతరం లేదు...మీ మీద పగ లేదు .........నాదగ్గర గన్ లేదు........మీ కేమీ ప్రాణ భయం లేదు.....అభిమానులకు మాత్రమే నచ్చలేదు..అంతే..అంటున్న బాబాయ్ పవన్ కళ్యాణ్... కోటి తో కామన్ మాన్ కోసం ఒక ట్రస్టు కూడా ప్రారంభించిన పవన్, కోర్టుకెందుకు? మా ఇంటికి రమ్మంటున్నారు..శ్రీజా! డాడీ ని అపార్ధం చేసుకోకు....అమ్మకీ బాగాలేదు....నువ్వు చేసిందీ బాగాలేదు...

సోమవారం, అక్టోబర్ 22, 2007

హాపీడేస్

గెస్ట్ - ది అతిధి లో స్పెషాలిటీ యేమిటీ అని ' జుట్ట్లు ' పీక్కుంటుంటే " జుట్టే " అని తేల్చారు. ఔను ' నిజం ' ...రోజు కి 8 వేలు పోసి పోషించిన జుట్టు కే అర కోటి చమురు వదిలిందిట. కధ లో కొత్తదనం ఎలాగూ ఉండదు కాబట్టి గెటప్ లో కొత్త ఢనం చూఇంచారు మన వాళ్ళు.. సరే యేదో ఒకటి అని సినిమా చూడ్డానికి వెళ్తే ' అతడే ' అతిధి అని తెలిసి ' జుట్టు ' పీక్కోవటం ఇక మన వంతు...


ఇక ' వేప ' గొప్పదనం గురించి మాట్లాడుకుంటే ఇది సరి కొట్ట ? కధ.. అందులో హీరోయి 'నయిన తార ' స్లిమ్మయిందట! అందుకని ద్రాక్ష గుత్తుల మధ్య ఆ అందాలు కరువు తీరా చూసి తరించాల్సిందేనని ఏ టీ వీ లో చూసినా ఏకరువు పెడుతున్నారు...నిజమే! ఫాక్షన్ ( ఇంద్ర ) + ఫారిన్ లో ప్రేమ (జయం మనదేరా) + పిల్లాడితో సహా విడిపోవడం ( యువ రాజు ) + పిల్లాడికి జబ్బు (చూడాలని వుంది ) ఇలాంటి విభిన్నమైన పాయింట్స్ అన్ని కలిపి వచ్చిన ఏకైక చిత్ర రాజం... ఒకరికి నలుగురు విలన్లు + మన భరతం పట్టే హీరో గారి ' వి ' న్యాసాలు చూడాలంటే తప్పక చూడండి ' కరి ' వేప మీ అభిమాన ధియేటర్లలో....తినగ తినగ వేప తియ్య 'గుండు 'ను


చిరంగేట్రం చిత్రం కహోనా ప్యార్ హై రేంజ్ లో దీవిలో ప్రేమ...జైలుకెళ్ళొచ్చిన వాడు విదేశీ గైడుగా చూపిస్తే చిరు అభిమానం తో కళ్ళప్పగించి చూసొస్తున్నాం.......పాపం తిట్లతో సినిమాలు తీసుకునే ' పోకిరి ' డైరెక్టరు పాజిటివ్ టైటిల్ తో సినిమా తియ్యడానికి నాన్నా కష్టాలు పడుంటాదు పాపం...


డాలర్ డ్రీంస్ లా కమ్ముకొచ్చిన శేఖర్ కమ్ముల మంచి కాఫీ లాంటి సినిమాలందించడలో దిట్ట అని తేలింది...కానీ వేసవిని చల్లగా ఉంచడానికి చేసిన ' గోదావరి ' యాత్ర మాత్రం మంచి కాపీ లాంటి సినిమాగా అందాల రాముడిని గుర్తు చేసింది....ఆయన లేటెస్ట్ సినిమా కా ' లేజి ' హాపీడేస్ గుర్తుకు తెస్తున్నా ప్రస్తుతం టీనేజి లవ్వులిస్తున్న ' మెగా ' షాక్ లకు స్ఫూర్తినిస్తుందేమో....


ఎప్పటికైనా తెలుగు సినిమాకు హాపీడేస్ రావాలని కొరుకుందాం ....దసరా శుభాకాంక్షలు.....

శుక్రవారం, అక్టోబర్ 19, 2007

కెవ్వు-కేక

దసరా సరదా
సరదాగ దసరా జరుపుకుందామనుకుంటే శలవు ఇవ్వలేదు, కష్టపడి శలవు సంపాదించి ఊరు వెళదామనుకుంటే బస్సులు లేవు, పోనీ ఇక్కడే తిరుగుదామంటే రక్షణ లేదు, ఊరంతా పోలీసులు..3 తనిఖీలు - 6 ట్రాఫిక్ జాములు.. సినిమాకెళదామంటే... అభిమానమనే మూర్ఖత్వం వల్ల 40 రూపాయల టికెట్టు 400 రూపాయలు..పెట్టి కొనాల్సిన పరిస్థితి ..తీరా లోపలకెళ్ళాక చూస్తే బయట కెవ్వు-కేక అన్న ఆ అతడే "అతిధి" అని, తెలుసుకుని మళ్ళీ "తులసి" తీర్ధం పోసుకుని బలం తెచ్చుకుని పాత బంగారమే అని తెలిసి మనం పెట్టిన ఖర్చు గుర్తొచ్చి మనం నిజం గానే కెవ్వు అని కేక పెట్టి రేపు పొద్దున్న మామూలుగానే ఆఫీసు కి.....ఇది ఈ సారి దసరా సరదా..

దసరా శుభాకాంక్షలు


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ


దసరా శుభాకాంక్షలు

గురువారం, అక్టోబర్ 18, 2007

atidhi - amrutham






పెళ్ళైంది..కానీ.......

' చిరు ' కి చిన్న కూతురు ఇచ్చిన ' మెగా షాక్ ' ..బహుశా ఐ మాక్స్ లోనే క్లైమాక్స్ కి జేరిందేమో ...
బేగం పేటలో పెళ్ళితో పూర్తైంది...ఇది సినిమాల ప్రభావమేనా..పాపం చిరు కోలుకోడానికి కొంచెం టైం పడుతుందనుకుంటా..గాంధీగిరి సహనం ఇప్పుడు అవసరం .. ఆయనకు చిరుత అందించిన ఆ అనందం...ఇంకా పూర్తిగా ఎంజాయ్ చెయ్యకుండానే తొందరగా శ్రీజ శ్రీమతి అయింది... పాపం సెలబ్రిటీలకి ప్రైవేట్ లైఫ్ లేకుండా చేసే టీ వీ 99 సార్లు చూపించి,చూపించి చంపుకు తింటున్నారు..

బుధవారం, అక్టోబర్ 17, 2007

జన్మదినం - జయంతి

83 వ పుట్టినరోజు సందర్భంగా మన గవర్నర్ కి మన సర్కార్ చేసిన నిర్వాకం.
పేపర్లలో ఇచ్చిన ప్రకటనలలో జన్మదినం అనాల్సిన చోట ఎన్.డి. తివారి జయంతి అని రాసి మహా సన్మానం చేసారు...మన వాళ్ళు....
పైగా ఆ సభకు ఆయనే ప్రారంభకులు..హతవిధీ !!

గురువారం, అక్టోబర్ 11, 2007

క్రికెట్ పిచ్చి - పిచ్చి క్రికెట్

ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కాదు... బాగా బ్యాటింగ్ చేయాలి అన్న విషయం మర్చిపోయి,
మనవాళ్ళు సెంటి 'మెంటల్ ' గా బ్యాటింగ్ ఎంచుకున్నారు.
కాని ఆస్ట్రే 'లీ 'యన్స్ - మన బెంగాల్ టైగర్స్ ని, గోడ - ది వాల్ ని, ధనా ధన్ ధోనీని,సిక్సర్ల యువరాజుని
తమ 'భౌ'లింగ్ తో ఆట పట్టించి - పెవిలియన్ దారి పట్టించారు.
ఈ రోజు కాస్త నిలదొక్కుకోవడానికి 400 మ్యాచుల అనుభవం కూడా తడబడింది.
ఐనా మాచ్ ఐపోయాక అలవాటుగా భుజాలెగరేస్తూ ఈ రోజు ఆటలో వాళ్ళు బాగ ఆడారు ( ఆడ కూడదు కాబోలు !! )
అదంతా గతం - రాబోయే మ్యాచుల్లో మా తడాఖా చూపిస్తాం (అవునా?)
గెలుపోటములు క్రికెట్ లో సహజం, అంటూ రొటీన్ గా చెప్పేసి దులిపేసుకుని వెళ్ళిపోయె కెప్టెన్ ను చూసి
నిజమే కాబోలు అని అమాయకంగా మరో 'పిచ్చి క్రికెట్ మ్యాచ్ ' కోసం
ఎదురు చూసే మనది 'క్రికెట్ పిచ్చి ' అనొచ్చేమో ?

సోమవారం, అక్టోబర్ 08, 2007

మేరాభారత్ మహాన్

మేరాభారత్ మహాన్


ధనానికి దాసోహం
ఆడదానిపై వ్యామోహం
తానే గొప్పనే అహం
అవసరానికి మాత్రమే స్నేహం
ఇక్కడి జీవజనుల లక్షణం
జాగ్రత్త మాట మార్చగలరు తక్షణం
మేరాభారత్ మహాన్

ఆదివారం, అక్టోబర్ 07, 2007

Leaders are born in INDIA

Leaders are not born they are made..............
ఇది ప్రపంచ వ్యాప్తoగా తెలిసిన సూక్తి..కాని "మేరా భారత్ మహాన్"
ఇక్కడ మాత్రం, "Leaders are born !! ".....
వారసత్వంగా నాయకత్వ లక్షణాలు వచ్చినా రాకున్నా నాయకత్వం మాత్రం "లక్షణo" గా వచ్చేస్తుంది ..వంశపారంపర్యంగా!!

జాతీయ స్థాయిలో చూసినా రాష్త్ర స్థాయిలొ చూసినా ఆయా నాయకుల పిల్లలు వాళ్ళ పిల్లలే రాజ్యమేలుతున్నారు..మంత్రాంగం నడిపిస్తునారు ..మరి ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాజరికమా?

నిజంగా ఇప్పుడొస్తున్న యువ నాయకులకు వారసత్వం కాకుండా మరేదైనా క్వాలిఫికేషన్ ఉందా..వాళ్ళు ఆ నాయకుల పిల్లలు కాకపోతే, ఆ వంశాలకు చెందకపోతే కూడా ఆ పదవులు దొరుకుతాయా...
ప్రస్తుతం దేశం పరిస్థితి :
భారతీయత లేని నాయకత్వం..
నాయకత్వం లేని భారత్ ?

బుధవారం, అక్టోబర్ 03, 2007

నాది నీకు-- నీది నాకు


నా 2 రూపాయల కిలో బియ్యం పధకం నువ్వు తీసుకుంటే నీ ఉచిత విద్యుత్ పధకం నేను లాక్కుంటా. నా ఎన్ టీ ఆర్ నువ్వు లాక్కుంటే నీ ఇందిరమ్మ నాది

మనిద్దరం ఒక అండుర్స్టాండింగ్ కి రాకపోతే 'చిరూత లా ఇంకోళ్ళు పంజా విసిరే ప్రమాదం ఉంది. కాబట్టి నీ అధికారం నాకివ్వు.. నా ప్రతిపక్ష హోదా నీకిస్తా...

సోమవారం, అక్టోబర్ 01, 2007

మందు జాగ్రత్త



అక్టోబర్ 2., గాంధీ జయంతి....




ఇది అందరికీ తెలుసు..ముఖ్యంగా మందుబాబులకి..పాపం ఆరోజు మందు దొరకదని.. ముందుగానే మందు కొని దాచుకుని తాగుతారు..అసలు మామూలు రోజుల్లో ఐతే తాగరేమో.. గాంధీ జయంతి కాబట్టి దొరకదని ముందే తెలుసు కాబట్టి ఈ ప్రాబ్లెం అంతా... అదే అక్టోబర్ 2 మామూలు రోజైనా తాగుతారా...డౌటే.. గాంధీజీ నువ్వంటే ఎంత గౌరవం నీ పుట్టిన రోజునాడు కొని తాగరు... ముందే కొని తాగుతారు...నీ భారతీయులు... నువ్వెమి చెప్పినా వినరు, చూడరు, అనరు......


హే రాం

శనివారం, సెప్టెంబర్ 29, 2007

chiru'tha















Don't follow foot steps make your own (S)mile stones!!!!!!!!

కళ్ళ కలకా? కళ్ళు లేకా?





పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుందిట......
మనకు తెలియంది...లేదు అనుకునే "పిల్లి మెదడు"కి ఏమి చెప్పి ఏం లాభం.......
కళ్ళజోడు తీసి కళ్ళెట్టుకు చూడు...రాముడు..రామసేతు రెండూ కనిపిస్తాయి .....









మంగళవారం, సెప్టెంబర్ 25, 2007

ప్రపంచ కప్ సాధించిన యువ భారత్ !!!!






సమిష్టి విజయానికి నిలువెత్తు నిదర్శనం యువభారత కిశోరాల వీర విహారం......
బాంబులతో భయపెట్టే వాళ్ళకి
బాలుతో-బాటుతో సమాధానమిచ్చి...హ్రుదయాలు గెలిచారు మన ఆటగాళ్ళు.




వీరేంద్రుని మెరుపులు-గంభీరమైన బాటింగ్-ఏ తప్పూ లేని ఉత్తప్ప టైమింగ్-యువ రాజసమైన సిక్సులు-ధనాధన్ ధొని బాధ్యత గల నేత్రుత్వం-ఒక పట్టాన ఓడని పఠాను-లయ తప్పని రుద్ర ప్రతాపం-గింగిరాలు తిప్పిన టర్భజన్-వికెట్ లేక శాంతించని శ్రీశాంత్-కొత్త రోహిట్టెరు శర్మ-విజయోగీంద్ర శర్మ- అందించిన ఈ విజయం న భూతో న భవిష్యతి

సోమవారం, సెప్టెంబర్ 24, 2007

రామ రామ....................













భారత దేశం లో ప్రజలకి యెంతో సహనం ఎక్కువ.....







మనం రోజూ పూజించే రాముడు లేడు అని ఒకడంటే....


ఉన్నాడు కాకపోతె అసలు మంచివాడు కాదు పచ్చితాగుబోతు...


.పెళ్ళాం అంటే ప్రేమ లేదు అడవి లో వదిలేశాడు.....




అసలు రామయణమే లేదు.. రామసేతు లేదు.. అంటు వాగినా




రామ రామ అనుకుంటున్నమే కాని రాముణ్ణి కాదంటున్న వాళ్ళని ఏమీ అనటాంలేదు..


పాపం మళ్ళి వానర సేన వచ్చి కాపాడుకోవలసిందే రామసేతుని......


కనీసం ఉడుత పాటి కూడా అలోచించలేమా.....




రామచిలుక పాటి మాట కూడా అనలేమా....




raama raama

bhaarata kaalamaanam

http://teluguvelugu.org mee kosam

తెలుగు వారి కోసం తెలుగు సైట్ మన గురించి కొందరు కళాకారుల గురించి.....

ఆదివారం, సెప్టెంబర్ 02, 2007

nidaaname pradhaanam

లేదు కాదు రాదు ఇదేలే గవర్నమెంట్ ఆఫీసులో రెడీమేడ్ సమాధానం
ఏ ఫైల్ ఎక్కడుందో చెప్పడం ఓ పెద్ద అవధానం
సంతకానికీ పంపకానికీ మధ్య ఓ సంవత్సరమే వ్యవధానం
వాళ్ళు నిత్యం పాటించే సూక్తి "నిదానమే ప్రధానం"

ఆదివారం, ఆగస్టు 19, 2007

Leaders are born in INDIA

Leaders are not born they are made..............

ఇది ప్రపంచ వ్యాప్తoగా తెలిసిన సూక్తి..
కాని "మేరా భారత్ మహాన్"

ఇక్కడ మాత్రం,

"Leaders are born !! ".....


వారసత్వంగా నాయకత్వ లక్షణాలు వచ్చినా రాకున్నా నాయకత్వం మాత్రం "లక్షణo" గా వచ్చేస్తుంది ..వంశపారంపర్యంగా!!

జాతీయ స్థాయిలో చూసినా రాష్త్ర స్థాయిలొ చూసినా ఆయా నాయకుల పిల్లలు వాళ్ళ పిల్లలే రాజ్యమేలుతున్నారు..
మంత్రాంగం నడిపిస్తునారు
..

మరి ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాజరికమా?


శనివారం, ఆగస్టు 18, 2007

mera bharat mahaan


మేరా భారత్ మహాన్

ధనానికి దాసోహం
ఆడదానిపై వ్యామోహం
తానె గొప్పనే అహం
అవసరానికి మాత్రమె స్నేహం
ఇక్కడి జీవ జనుల లక్షణం
జాగ్రత్త మాట మార్చగలరు తక్షణం

मेरा भारत महान

LinkWithin

Related Posts with Thumbnails